పరబ్రహ్మము స్వసంవేద్యము - ఆ నిర్గుణబ్రహ్మమందు మాయా విద్యలు రెండున్నూ పుట్టెను. వివర్త రూపమైన మాయ అవిద్యలనెడి రెండు దర్పణాలు - ఆ దర్పణాలయందు బ్రహ్మం ప్రతిబింబించగా ఈశ్వరుడు అనిన్నీ, జీవుండు అనిన్నీ కలిగెను.
“సత్వ శుద్ధ్యవిశుద్ధిభ్యాం మాయావిద్య ద్విథానుత” - ఈ అర్థమందు “మాయాబింబ్వో వశీకృత్య తాం స్యాత్సర్వజ్ఞ ఈశ్వరః అవిద్యావశగస్త్వన్యః తద్వెచిత్ర్యాదనేకధా ||”.
“ఘటమఠ సం యుక్తమైన నిరాలంబానకు ఘటాకాశ మఠాకాశమని యేలాగు గలిగెనో, అటువలెనే వస్తువులలోనను బింబప్రతిబింబమనినామధేయం గలిగెను. ఎక్కడెక్కడ ఈ వాసన స్పురించునో అక్కడక్కడ బ్రహ్మమధిష్టించి యుండును. కాబట్టి మాయ అవిద్యలను అధిష్టించియున్నదే ప్రతిబింబమనబడెను - బింబస్థానమైన బ్రహ్మమే ఉపమానమనవలసెను, ప్రతిబింబమే జీవ ఈశ్వరులనంబడెను - అది బింబ ప్రతిబింబ న్యాయాభిప్రాయము”.
parabrahmamu svasaṃvēdyamu - ā nirguṇabrahmamaṃdu māyā vidyalu reṃḍunnū puṭṭenu. vivarta rūpamaina māya avidyalaneḍi reṃḍu darpaṇālu - ā darpaṇālayaṃdu brahmaṃ pratibiṃbiṃcagā īśvaruḍu aninnī, jīvuṃḍu aninnī kaligenu.
“satva śuddhyaviśuddhibhyāṃ māyāvidya dvithānuta” - ī arthamaṃdu “māyābiṃbvō vaśīkṛtya tāṃ syātsarvajña īśvaraḥ avidyāvaśagastvanyaḥ tadvecitryādanēkadhā ||”.
“ghaṭamaṭha saṃ yuktamaina nirālaṃbānaku ghaṭākāśa maṭhākāśamani yēlāgu galigenō, aṭuvalenē vastuvulalōnanu biṃbapratibiṃbamanināmadhēyaṃ galigenu. ekkaḍekkaḍa ī vāsana spuriṃcunō akkaḍakkaḍa brahmamadhiṣṭiṃci yuṃḍunu. kābaṭṭi māya avidyalanu adhiṣṭiṃciyunnadē pratibiṃbamanabaḍenu - biṃbasthānamaina brahmamē upamānamanavalasenu, pratibiṃbamē jīva īśvarulanaṃbaḍenu - adi biṃba pratibiṃba nyāyābhiprāyamu”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.