వృత్తి, పరిణామ, ఆరంభక వివర్తంబులకు కార్యోదయ చతుర్విధంబులు - అందులకు పట కుటీభావ, క్షీర దధ్యాకార, తంతు పటన్యాయ, రజ్జు సర్పంబులనియెడివి క్రమంబున దృష్టాంత చతుషయంబులు, మఱియు రజ్జు, సర్ప, స్థాణు, చోర, స్వప్నేంద్రజాల, గంధర్వ నగర, శుక్తికారజత, నీలం నభః, మరీచికా జలంబనియెడునవి మొదలుగా గలయవి సద్రూప వస్తువందలి మిధ్యా వస్తు కల్పనల్కకు దృష్టాంత సమూహంబులు. (వివేకచింతామణి - పరమానందతీర్థ).
నాలుగు విధములగు వస్తువులలో బ్రహ్మపదార్థము పరమార్థ సద్వస్తువుగాన ఏ కాలమునందును బాధనొందదు. శూన్యములకు కూడ నేవేళలందు భాదనొంద తగవు - మిగిలిన రెండు వస్తువులు, అనగా శుక్తిరజత, రజ్జు సర్పాదులు అను ప్రాతి భాసిక సద్వస్తువులు కలలో గన్న వస్తువులు కూడానుమఱియు వ్యవహారిక సద్వస్తువులైన ఘటపటాదులు ఒకప్పుడు కనబడుట, ఒకప్పుడు కనబడకపోవుట వలననూ యీ రెండు తెగల వస్తువులునూ. అనగాం ప్రాతిభాసిక సద్వస్తువులు, వ్యవహారిక సద్వస్తువులు మిథ్యా వస్తువులు - ఇవి యదార్థ జ్ఞానముచే తొలగింపబడును - పాము కాదు రజ్జువు అనునది యదార్థజ్ఞానము కలుగగానే పాము అనే మిథ్యాజ్ఞానము తొలగును - ఇవి ఘటపటాదులు కావు, ప్రపంచముకాని పరబ్రహ్మము యొక్క వైవర్తమే అనే పరమార్థ జ్ఞానము కలుగగానే ఇది ప్రపంచము అనే మిథ్యాజ్ఞానము తొలగును.
vṛtti, pariṇāma, āraṃbhaka vivartaṃbulaku kāryōdaya caturvidhaṃbulu - aṃdulaku paṭa kuṭībhāva, kṣīra dadhyākāra, taṃtu paṭanyāya, rajju sarpaṃbulaniyeḍivi kramaṃbuna dṛṣṭāṃta catuṣayaṃbulu, maṟiyu rajju, sarpa, sthāṇu, cōra, svapnēṃdrajāla, gaṃdharva nagara, śuktikārajata, nīlaṃ nabhaḥ, marīcikā jalaṃbaniyeḍunavi modalugā galayavi sadrūpa vastuvaṃdali midhyā vastu kalpanalkaku dṛṣṭāṃta samūhaṃbulu. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha).
nālugu vidhamulagu vastuvulalō brahmapadārthamu paramārtha sadvastuvugāna ē kālamunaṃdunu bādhanoṃdadu. śūnyamulaku kūḍa nēvēḷalaṃdu bhādanoṃda tagavu - migilina reṃḍu vastuvulu, anagā śuktirajata, rajju sarpādulu anu prāti bhāsika sadvastuvulu kalalō ganna vastuvulu kūḍānumaṟiyu vyavahārika sadvastuvulaina ghaṭapaṭādulu okappuḍu kanabaḍuṭa, okappuḍu kanabaḍakapōvuṭa valananū yī reṃḍu tegala vastuvulunū. anagāṃ prātibhāsika sadvastuvulu, vyavahārika sadvastuvulu mithyā vastuvulu - ivi yadārtha jñānamucē tolagiṃpabaḍunu - pāmu kādu rajjuvu anunadi yadārthajñānamu kalugagānē pāmu anē mithyājñānamu tolagunu - ivi ghaṭapaṭādulu kāvu, prapaṃcamukāni parabrahmamu yokka vaivartamē anē paramārtha jñānamu kalugagānē idi prapaṃcamu anē mithyājñānamu tolagunu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.