← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మిధ్యాచారః midhyācāraḥ

Original — తెలుగు
  1. అన్యథా సంకల్ప్య, అన్యథా చరతీతి సమధ్యాచారః ఉచ్యతే.

(ఒక విధముగా సంకల్పించి ఇంకొక విధమూఅచరించువాడు మిథ్యాచారుడు).

  1. “కర్మేంద్రియాణి సం యమ్య య ఆస్తే మనసా స్మరన్ |

ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 6)

“రాగాద్యాక్రాంత చిత్తాస్తు యో(అ)కుర్వన్ బహిరింద్రియైః |

కర్మాణి మనసా రాగద్వేషాది ప్రేరితే న చ |

శబ్దాన్ సంస్మరన్నిత్యం కర్మత్యక్తైవ తిష్టతి |

స సత్వ శుద్ధ్యభావేన పాపాచారః స కథ్యతే |

త్వం పదార్థ వివేకాయ సన్యాసః సర్వ లర్మణాం |

శృత్వా విధీయతే యస్మాదనథా పతితో భవేత్ ||“. (గీతాభావప్రకాశము - 3 - 55 to 57)

(బాహ్యేంద్రియములచేత ఏ పనిని చేయకున్నను, రాగాదులతో కూడిన మనస్సు కలవాడై రాగాదులచేత ప్రేరేపింపబడినవాడై, నిత్యము శబ్దము మొదలగు విషయములను స్మరించుచు కర్మలను చేయకయున్నను, సత్వ శుద్ధి లేకపోవుటచేత అట్టివాడు మిథ్యాచారుడే - పాపాచారుడే - అగును. అనగా, బాహ్యేంద్రియములను జయించినను మనో నిగ్రహములేక మనసులో అన్ని విధములగు విషయ సుఖముల గుఱించి ఆలోచించు చుండువాడు మిథ్యా చారడు - పైకి కనబడుట ఒకవిధముగాను, లోన - మనస్సులో - ఇంకొక విధముగను నుండువాడు - పైకి ఏ విషయములు అక్కర్లేనట్లుండి మనసులో అవి అన్నియు కావలెనని చింతించువాడు).

  1. విమూఢాంతః కరిణో మృషా చారః.

(మూఢాంతఃకరణము కలవాడు మిథ్యాచారుడు).

  1. “మృషాచారః పాపాచారః -” (శ్రీశంకరః)

(మృషాచారుడు, పాపములనాచరించువాడు, కపటమైన ఆచారముకలవాడు).

  1. “మనసా రాగాది ప్రేరితేన ఇంద్రియార్థాన్ శబ్దాదీన్, న తు ఆత్మ తత్వం, స్మరనాస్తే; కృత సన్యాసః అహం ఇత్యభిమానేన కర్మ శూన్యః తిష్టతి, సః మిథ్యాచారః - సత్వ శుద్ధ్యభావేన ఫలా యోగ్యత్వాత్ పాపా చారః ఉచ్యతే”. (మధుసూదనీ వ్యాఖ్యా)

(ఇంద్రియముల అర్థములైన శబ్దస్పర్శరూప రస గంధములయందు అనురాగము కలిగిన మనస్సుతో వాటిని స్మరించువాడు, భగవంతుని స్మరించనివాడు - సన్యసించి, అహం = నేను, అను అభిమానము (అహంకారము) కలిగి ఏ పనియు చేయకయుండువాడు నిధ్యాచారుడు - సత్వశుద్ధిలేకపోవుటచేత, ఫలములేనందువలన).

  1. అన్యథా భావః ఏవహి అంతతః సర్వత్ర మిధ్యాత్వం, తత్రాపి సంకల్పిత జ్ఞానయోగ విపరీతాచారతయా జ్ఞానయోగాభిమతః తస్యాచారో మిధ్యా ఇత్యుక్తం భవతి.

(అన్నింటి యందును మనసులో అన్యధా భావము కలిగియుండుటయే మిధ్యాత్వము - అందులోను, జ్ఞానయోగమునకు విపరీతముగా సంకల్పించిన జ్ఞానయోగ భావన కలిగియుండుట మిధ్యాచారము).

Transliteration
  1. anyathā saṃkalpya, anyathā caratīti samadhyācāraḥ ucyatē.

(oka vidhamugā saṃkalpiṃci iṃkoka vidhamūacariṃcuvāḍu mithyācāruḍu).

  1. “karmēṃdriyāṇi saṃ yamya ya āstē manasā smaran |

iṃdriyārthān vimūḍhātmā mithyācāraḥ sa ucyatē ||“. (śrīmadbhagavadgīta - 3 - 6)

“rāgādyākrāṃta cittāstu yō(a)kurvan bahiriṃdriyaiḥ |

karmāṇi manasā rāgadvēṣādi prēritē na ca |

śabdān saṃsmarannityaṃ karmatyaktaiva tiṣṭati |

sa satva śuddhyabhāvēna pāpācāraḥ sa kathyatē |

tvaṃ padārtha vivēkāya sanyāsaḥ sarva larmaṇāṃ |

śṛtvā vidhīyatē yasmādanathā patitō bhavēt ||“. (gītābhāvaprakāśamu - 3 - 55 to 57)

(bāhyēṃdriyamulacēta ē panini cēyakunnanu, rāgādulatō kūḍina manassu kalavāḍai rāgādulacēta prērēpiṃpabaḍinavāḍai, nityamu śabdamu modalagu viṣayamulanu smariṃcucu karmalanu cēyakayunnanu, satva śuddhi lēkapōvuṭacēta aṭṭivāḍu mithyācāruḍē - pāpācāruḍē - agunu. anagā, bāhyēṃdriyamulanu jayiṃcinanu manō nigrahamulēka manasulō anni vidhamulagu viṣaya sukhamula guṟiṃci ālōciṃcu cuṃḍuvāḍu mithyā cāraḍu - paiki kanabaḍuṭa okavidhamugānu, lōna - manassulō - iṃkoka vidhamuganu nuṃḍuvāḍu - paiki ē viṣayamulu akkarlēnaṭluṃḍi manasulō avi anniyu kāvalenani ciṃtiṃcuvāḍu).

  1. vimūḍhāṃtaḥ kariṇō mṛṣā cāraḥ.

(mūḍhāṃtaḥkaraṇamu kalavāḍu mithyācāruḍu).

  1. “mṛṣācāraḥ pāpācāraḥ -” (śrīśaṃkaraḥ)

(mṛṣācāruḍu, pāpamulanācariṃcuvāḍu, kapaṭamaina ācāramukalavāḍu).

  1. “manasā rāgādi prēritēna iṃdriyārthān śabdādīn, na tu ātma tatvaṃ, smaranāstē; kṛta sanyāsaḥ ahaṃ ityabhimānēna karma śūnyaḥ tiṣṭati, saḥ mithyācāraḥ - satva śuddhyabhāvēna phalā yōgyatvāt pāpā cāraḥ ucyatē”. (madhusūdanī vyākhyā)

(iṃdriyamula arthamulaina śabdasparśarūpa rasa gaṃdhamulayaṃdu anurāgamu kaligina manassutō vāṭini smariṃcuvāḍu, bhagavaṃtuni smariṃcanivāḍu - sanyasiṃci, ahaṃ = nēnu, anu abhimānamu (ahaṃkāramu) kaligi ē paniyu cēyakayuṃḍuvāḍu nidhyācāruḍu - satvaśuddhilēkapōvuṭacēta, phalamulēnaṃduvalana).

  1. anyathā bhāvaḥ ēvahi aṃtataḥ sarvatra midhyātvaṃ, tatrāpi saṃkalpita jñānayōga viparītācāratayā jñānayōgābhimataḥ tasyācārō midhyā ityuktaṃ bhavati.

(anniṃṭi yaṃdunu manasulō anyadhā bhāvamu kaligiyuṃḍuṭayē midhyātvamu - aṃdulōnu, jñānayōgamunaku viparītamugā saṃkalpiṃcina jñānayōga bhāvana kaligiyuṃḍuṭa midhyācāramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.