← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మీమాంస mīmāṃsa

Original — తెలుగు
  1. “మానేర్జిజ్ఞాసాయాం” ఇతి విచారార్థే నిష్పన్నో మీమాంస శబ్దః -

(మానము అనగా జిజ్ఞాస - జ్ఞాతు మిచ్చా జిజ్ఞాసా - తెలుసుకొనుట - విచారించుట). చర్చించునది, విచారము.

  1. సర్వదా వేదార్థ విచార ఏవ మీమాంసా -

(వేదములలోని అర్థములను అన్నివిధముల విచారించుట మీమాంస).

  1. పురాణ ధర్మ శాస్త్ర విశదీకృతార్థ లాభోవేదేభ్యః కథం భవతీతి తద్విచారే కర్తవ్యే సేయం మీమాంసా భవతి.

(పురాణములలోను, ధర్మశాస్త్రములలోను విశదముగా (స్పష్టముచేసి) చెప్పబడిన అర్థములు - విషయములు వేదములెట్లు చెప్పినవి అని విచారించునది మీమాంస.)

  1. “వేదములలోగల బ్రాహ్మణములు, అర్థ తాత్పర్యములు, వాని నిబంధనలు, యజ్ఞయాగాదికర్మలతాత్పర్యము వాటి ప్రాశస్త్యము మున్నగు వాటిని తెలియచేయు శాస్త్రము” -
Transliteration
  1. “mānērjijñāsāyāṃ” iti vicārārthē niṣpannō mīmāṃsa śabdaḥ -

(mānamu anagā jijñāsa - jñātu miccā jijñāsā - telusukonuṭa - vicāriṃcuṭa). carciṃcunadi, vicāramu.

  1. sarvadā vēdārtha vicāra ēva mīmāṃsā -

(vēdamulalōni arthamulanu annividhamula vicāriṃcuṭa mīmāṃsa).

  1. purāṇa dharma śāstra viśadīkṛtārtha lābhōvēdēbhyaḥ kathaṃ bhavatīti tadvicārē kartavyē sēyaṃ mīmāṃsā bhavati.

(purāṇamulalōnu, dharmaśāstramulalōnu viśadamugā (spaṣṭamucēsi) ceppabaḍina arthamulu - viṣayamulu vēdamuleṭlu ceppinavi ani vicāriṃcunadi mīmāṃsa.)

  1. “vēdamulalōgala brāhmaṇamulu, artha tātparyamulu, vāni nibaṃdhanalu, yajñayāgādikarmalatātparyamu vāṭi prāśastyamu munnagu vāṭini teliyacēyu śāstramu” -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.