← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మీమాంసకులు mīmāṃsakulu

Original — తెలుగు

కర్మద్వారా జీవ ఏవ సృష్ట్యాది హేతుః ఇతి మన్యంతే తే మీమాంసకాః - మీమాంసాం జానంతీతి మీమాంసకాః -

(మీమాంస తెలిసినవారు మీమాంసకులు - కర్మచేయువాడుకనుక జీవుడే సృష్టిమొదలగువాటికి - సృష్టి స్థితి లయములకు - కారణము - అని తలచువారు మీమాంసకులు. చేవ్సిన కర్మ ఫలమీయకమానదు, ఫలముననుభవింపోచేసి తీరును - ఆ కర్మ ఫలముగనే పుట్టుట, పెరుగుట, కష్టసుఖములననుభవించుట, చనిపోవుట జరుగును. అందుచేత కర్మయే సృష్టి స్థితిలయములకు కారణము - అని తలంచువారు మీమాంసకులు –

“క. కర్మమున పుట్టు జంతువు,

కర్మమునను వృద్ధిపొందు, కర్మమున చెడున్

కర్మమె కారణమంతకు

కర్మమె సుఖదుఃఖములకు కారణమనఘా||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

Transliteration

karmadvārā jīva ēva sṛṣṭyādi hētuḥ iti manyaṃtē tē mīmāṃsakāḥ - mīmāṃsāṃ jānaṃtīti mīmāṃsakāḥ -

(mīmāṃsa telisinavāru mīmāṃsakulu - karmacēyuvāḍukanuka jīvuḍē sṛṣṭimodalaguvāṭiki - sṛṣṭi sthiti layamulaku - kāraṇamu - ani talacuvāru mīmāṃsakulu. cēvsina karma phalamīyakamānadu, phalamunanubhaviṃpōcēsi tīrunu - ā karma phalamuganē puṭṭuṭa, peruguṭa, kaṣṭasukhamulananubhaviṃcuṭa, canipōvuṭa jarugunu. aṃducēta karmayē sṛṣṭi sthitilayamulaku kāraṇamu - ani talaṃcuvāru mīmāṃsakulu –

“ka. karmamuna puṭṭu jaṃtuvu,

karmamunanu vṛddhipoṃdu, karmamuna ceḍun

karmame kāraṇamaṃtaku

karmame sukhaduḥkhamulaku kāraṇamanaghā||“. (śrīmadāṃdhramahābhāgavatamu -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.