← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మితాహారము mitāhāramu

Original — తెలుగు
  1. “అల్ప మృష్టాశనాభ్యాంచ చతుర్దాం శావశేషకం |

తస్మాద్యోగానుగుణ్యేన భోజనం మితభోజనం ||:. (దర్శనోపనిషత్)

(అల్పమైనను ఇష్టమైన భోజనము కడుపులో 3 వంతులు నిండినట్లు చేసి, మిగిలినవంతు కాళీగా వదలివేసినయడల అట్టి భోజనము యోగముఇనకు అనుగుణ్యముగానుండి, మితభోజనము, మితాహారమనిపించుకొనును).

  1. “ద్వే భాగౌ పూరయేదన్నైః తోయేనైకం ప్రపూరయేత్ |

మారుతస్య ప్రచారార్థం చతుర్థ మవశేషయేత్ |”

ఇతిరీత్యా అల్పాహారః -

(కడుపులోని నాలుగు భాగములలో రెండుభాగములు (1/2) అన్నముతో నింపి, ఒకభాగము (1/4) నీటితో నింపి మిగిలిన ఒకభాగము 1/4) వాయువు సంచరించుటకు కాళీగా నుంచివేయవలయును - ఇట్లు తినిన ఆహారము అల్పాహారము లేక మితాహారము).

  1. “నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంత మనశ్నితః ||”. (శ్రీమద్భగవద్గీత - 6 - 16)

“యొగాభ్యాసైక నిష్టస్య ప్రత్యాహారాది సం యమం |

భుక్తం సజ్జీర్యతి స్వస్య యదన్నం దేహధారణం |

తదాత్మ సం మితం జ్ఞేయం తదతిక్రమ్య లోభతః |

అధికం చాశ్నతోనాస్తి యోగో అజీర్ణాది దోషతః |

త్యల్పాహారతో నాస్తి నాస్త్య నాహారతః స చ |

అధవా యోగ శాస్త్రోక మాహారం నైవలంఘ యేత్ |

పూరయే దశనేనార్థం తృతీయముదకేన తు |

వాయోః సంచరణార్థం తు చతుర్థమవశేష యేత్ ||“. (గీతాభావప్రకాశము - 6 - 74 to 78)

(మితిమీరి అన్నము తినినయడల యోగము కుదరదు అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు. గీనికివ్యాఖ్యానము ఈ క్రింద విధముగ నున్నది - యోగాభ్యాసము ఒక నిష్టగా చేయువాని ఆహార నియమము శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు. అది ఎట్లంటే - దేహ ధారణకు - దేహమును ధరించియుండుటకు, బ్రతికి యుండుటకు) కావలిసినంతమాత్రము రుచికరమైన, ఇష్టమైన అన్నము తినిన అది జీర్ణమగును. లోభమువలన - జిహ్వచాపల్యమువలన - ఈ నియమమునతిక్రమించి హెచ్చు ఆహారము తినిన యడల అది జీర్ణముకాక యోగాభ్యాసమునకు పనికిరాదు - యోగము కుదరదు - అట్లని, మిక్కిలి తక్కువ ఆహారమును తినకూడదు, నీరసించుట సంభవించును. అసలు, ఆహారమనునదే తినకుండనుండకూడదు. శరీరములోని జఠరాగ్ని శరీరమును దహించును. యోగశాస్త్రములో ఈ పైన చెప్పిన ప్రకారముగా కాక నియమము నుల్లంఘించకూడదు - కడుపును సగము అన్నముతో నింపవలయును, 1/4 వ వంతు నీటితో నింపవలయును - వాయువు సంచరించుటకు మిగిలిన 1/4 వ వంతు నింపకుండనుంచవలెను).

Transliteration
  1. “alpa mṛṣṭāśanābhyāṃca caturdāṃ śāvaśēṣakaṃ |

tasmādyōgānuguṇyēna bhōjanaṃ mitabhōjanaṃ ||:. (darśanōpaniṣat)

(alpamainanu iṣṭamaina bhōjanamu kaḍupulō 3 vaṃtulu niṃḍinaṭlu cēsi, migilinavaṃtu kāḷīgā vadalivēsinayaḍala aṭṭi bhōjanamu yōgamuinaku anuguṇyamugānuṃḍi, mitabhōjanamu, mitāhāramanipiṃcukonunu).

  1. “dvē bhāgau pūrayēdannaiḥ tōyēnaikaṃ prapūrayēt |

mārutasya pracārārthaṃ caturtha mavaśēṣayēt |”

itirītyā alpāhāraḥ -

(kaḍupulōni nālugu bhāgamulalō reṃḍubhāgamulu (1/2) annamutō niṃpi, okabhāgamu (1/4) nīṭitō niṃpi migilina okabhāgamu 1/4) vāyuvu saṃcariṃcuṭaku kāḷīgā nuṃcivēyavalayunu - iṭlu tinina āhāramu alpāhāramu lēka mitāhāramu).

  1. “nātyaśnatastu yōgōsti na caikāṃta manaśnitaḥ ||”. (śrīmadbhagavadgīta - 6 - 16)

“yogābhyāsaika niṣṭasya pratyāhārādi saṃ yamaṃ |

bhuktaṃ sajjīryati svasya yadannaṃ dēhadhāraṇaṃ |

tadātma saṃ mitaṃ jñēyaṃ tadatikramya lōbhataḥ |

adhikaṃ cāśnatōnāsti yōgō ajīrṇādi dōṣataḥ |

tyalpāhāratō nāsti nāstya nāhārataḥ sa ca |

adhavā yōga śāstrōka māhāraṃ naivalaṃgha yēt |

pūrayē daśanēnārthaṃ tṛtīyamudakēna tu |

vāyōḥ saṃcaraṇārthaṃ tu caturthamavaśēṣa yēt ||“. (gītābhāvaprakāśamu - 6 - 74 to 78)

(mitimīri annamu tininayaḍala yōgamu kudaradu ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu. gīnikivyākhyānamu ī kriṃda vidhamuga nunnadi - yōgābhyāsamu oka niṣṭagā cēyuvāni āhāra niyamamu śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu. adi eṭlaṃṭē - dēha dhāraṇaku - dēhamunu dhariṃciyuṃḍuṭaku, bratiki yuṃḍuṭaku) kāvalisinaṃtamātramu rucikaramaina, iṣṭamaina annamu tinina adi jīrṇamagunu. lōbhamuvalana - jihvacāpalyamuvalana - ī niyamamunatikramiṃci heccu āhāramu tinina yaḍala adi jīrṇamukāka yōgābhyāsamunaku panikirādu - yōgamu kudaradu - aṭlani, mikkili takkuva āhāramunu tinakūḍadu, nīrasiṃcuṭa saṃbhaviṃcunu. asalu, āhāramanunadē tinakuṃḍanuṃḍakūḍadu. śarīramulōni jaṭharāgni śarīramunu dahiṃcunu. yōgaśāstramulō ī paina ceppina prakāramugā kāka niyamamu nullaṃghiṃcakūḍadu - kaḍupunu sagamu annamutō niṃpavalayunu, 1/4 va vaṃtu nīṭitō niṃpavalayunu - vāyuvu saṃcariṃcuṭaku migilina 1/4 va vaṃtu niṃpakuṃḍanuṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.