తద్వత్సత్యమపి విజ్ఞాయ జగత్పశ్యతి మాఢ ధీః |
రజ్జు ఖండే పరిజ్ఞాతే సర్పరూపం న తిష్ఠతి |
అధిష్ఠానే తథాజ్ఞాతే ప్రపంచే శూన్యతాం గతే |
దేహస్యాపి ప్రపంచత్వాత్ ప్రారబ్దావ స్థితిః కుతః ||“. (నాద బిందూపనిషత్)
(చీకటిలో త్రాడును చూచి భ్రమచేత అది పాము అని అనుకొనును - అది త్రాడు అని తెలియగానే పాము అను భ్రాంతి పోవును - ఆ ప్రకారముగానే సత్యమగు ఆత్మను తెలుసుకొనగానే - ఇదంతయు ఆత్మయే, ప్రపంచమనునది వేరే లేదు - అని తెలుసుకొనగనే ప్రపంచము అను భావము పోవును - అందుచేత ప్రపంచము మిధ్య).
(చీకటిలో - మాయవలన - పామువలె కనబడు త్రాడు - యాధాత్మ్యజ్ఞానము కలిగిన తర్వాత - దాని నిజ స్వరూపము తెలిసిన తర్వాతను, అంతకుముందు కూడా అది త్రాడేకాని ఎన్నడూ పాము కానేరదు - ఈ ప్రకారము గానే పరమశివుడు (పరమాత్మ) కూడ అవిద్యా ప్రభావము వలన మొదట ప్రపంచరూపముతో ఉన్నట్లు అగపడిమప్పటికీ, తన నిజ స్వరూపజ్ఞానము కలిగిన తర్వాతను, అంతకు ముందు కూడ, ఈ ప్రపంచము నిజానికి పరమాత్మయే కాని ప్రపంచమని వేరేమియు లేదని తెలియబడును - అందుచేత ప్రపంచము ఇది వఱకు లేదు, ఇప్పుడులేదు, ఇకముందుఇకూడ ఉండదు - అనగా, భూత భవిష్యత్వర్తమానకాలములందుండని దని నిషేధింపబడుటచేత ప్రపంచము, మిథ్య యనియే తేలినది).
మాయయా బద్ధః కరోతి వివిథాస్తమాః |
న చై తైవం సంసరతి, న చ సంసారయేత్పరః |
న కర్తా, నైవ భోక్తాచ న చ ప్రకృతి పురుషౌ |
న మాయా నైవచ ప్రాణః చైతన్యం పరమార్థతః |
తస్మాద జ్ఞాన మూలోహి సంసారః సర్వ దేహినాం |
నిత్యః సర్వగతోహ్యాత్మా కూటస్థో దోష వర్జితః |
ఏకః స భిద్యతే శక్త్యా మాయయా న స్వభావతః |
తస్మా దద్వైతమేవాహుః మునయః పరమార్థతః |
జ్ఞాన స్వరూపమేవాహుర్మునయః జగదేతద్విచక్షణాః |
అర్థ స్వరూప మజ్ఞానాత్ పశ్యంత్యన్యే కు దుష్టయః |
కూటస్థో నిర్గుణో వ్యాపీ చైతన్యాత్మా స్వభావతః |
దృశ్యతే హర్థ రూపేణ పురుషైః భ్రాంత దృష్టిభిః |
యదా పశ్యతి చాత్మానం కేవలం పరమార్థతః |
మాయా మాత్రమిదం ద్వైతం తథా భవతి సర్వతః |
తస్మా ద్విజ్ఞానమేవాస్తి న ప్రపంచో న సంస్కృతిః |
ఏవం శృత్యాదినా నామాది కారణోపన్యాసః |
ముఖేన స్వరూపేణ చ బాధితత్వాత్ ప్రంచస్య మిథ్యాత్వ మవగమ్యతే |
అస్థూలాది లక్షణస్య బ్రహ్మణః తద్విపరీత స్థూలాకారో మిథ్యా భవితు మర్హతి –
యదైకస్య చంద్రమసః తద్విపరీత ద్వితీయాకారః, తద్వత్.” (శ్రీశంకరః)
(ఈ ప్రపంచము దేనిలోనుండి పుట్టినదో, దేనిలో లయమై పోవునో అదియే మాయ. మాయచేత బద్ధుడై పరమాత్మ అనేక విధములైన శరీరములను చేయుచున్నాడు - ఇది మాయాకార్యము కనుక భగవంతునికి సంసారములేదు, కర్త యనువాడు లేడు, భోక్తలేడు, ప్రకృతి లేదు, పురుషుడు లేడు, మాయలేదు, ప్రాణము లేదు - అంతా నిజానికి - పరమార్థదృష్టిలో - చైతన్యమే - భగవంతుని చిచ్ఛక్తియే - తన చిచ్ఛక్తి రూపములో అంతా భగవంతుడే - అందుచేత సమస్త దేహుల యొక్క - ప్రాణుల యొక్క - సంసారమనునది అజ్ఞానమూలము - భగవత్ జ్ఞానము - ఇదంతా భగవంతుడే యను జ్ఞానము - లేనందువలన కలిగినదే. ఆత్మ నిత్యుడు. (మూడు కాలములందుండువాడు) సర్వగతుడు (అన్నింటిలోను ప్రవేశించియుండువాడు), కూటస్థుడు (తటస్థుడుగానుండువాడు), ఏ దోషము లేనివాడు, ఒక్కడే (ఉన్నదంతా అతను ఒక్కడే). అతను మాయ యను తన శక్తిచేత అనేక రూపములుగా కనబడు చున్నాడు - స్వభావమువలన కాదు - అనగా, ప్రపంచము ఇన్ని రూపములతో ఇన్ని వస్తువులుగా కనుపించుట మాయా కార్యము, యథార్థముగా నివి అన్నియు భగవంతుడే. ఉన్నదంతయు భగవంతుడే కనుక మునులు పరమార్థ దృష్టిలో ఉన్నదంతా ఒక్కడే భగవంతుడు కాక రెండవ వస్తువు లేదు -, భగవంతుడు అద్వయుడు, అని చెప్పిరి. ఈ ప్రపంచమంతయు జ్ఞానస్వరూపమే - చైతన్యరూపమే - అని విచక్షుణులైన మునులు చెప్పుదురు - మిగిలినవారు - ఇతరులు - భేద దృష్టికలవారు - ఇదంతయు అర్థస్వరూపమే (అర్థములతో కూడిన ప్రపంచమే) యని చూతురు - కూటస్థుడు, నిర్గుణుడు, వ్యాపి - అంతటను, అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండువాడు, చైతన్యమే శరీరముగా, లేక రూపముగా కలవాడు - అయిన పరమాత్మయే - పైన చెప్పిన కుదృష్టి కలవారికి భ్రాంతివలన దృశ్య ప్రపంచముగా కనబడుచున్నాడు - అర్థములతోనిండి ప్రపంచముగా కనబడుచున్నడు. కేవలుడు అయిన ఆత్మను పరమార్థ దృష్టితో ఎవరు చూతురో వారు అప్పుడు ఈ జగత్తు మాయామాత్రమని తెలియుదురు - అందుచేత ఉన్నదంతయు విజ్ఞాన మాత్రమే - చైతన్య మాత్రమే, చైతన్య రూపములో భగవంతుడే. ప్రపంచముగాని, సంసారమనునదికాని లేదు - పైన చెప్పిన ప్రకారము ప్రపంచమనునది స్వరూపముచే స్వరూపముచేత బాధితమైనది - ప్రపంచములేదు - ఉన్నదంతా భగవంతుడే యని చెప్పుటవలన - ప్రపంచము మిథ్య యని తెలియ వచ్చు చున్నది. పరబ్రహ్మ రూపము అస్థూలము - (స్థూలశరీరము లేనివాడు) (కంటికి కనబడనివాడు; అనణువు (అణువు కానివాడు - అన్నింటికంటె చిన్నవాడుకాడు), అన్నింటికంటె పెద్దవాడుకాడు - అను మొదలగు మాటలతో పరబ్రహ్మ గుఱించి చెప్పబడియున్నది. దానికి విపరీతమైన స్థూలాకారము (రెండవ ఆకారము) మిథ్య - చంద్రుడు ఒకడే అయినను భ్రమ చెందినవానికి ఇద్దరు చంద్రులు కనబడినట్లే, అవి అట్లే భ్రమ లేక మిథ్య). -
“అధకిం బహినోక్తేన శివాదన్యన్న విద్యతే |
శివస్వరూప మేవాహురిదం సర్వం విచక్షణాః |”
ఇత్థ మద్వితీయ పరి శివస్వరూపే యస్య జగతః ఆరోపాత్ అన్యత్ర అభావ ఉక్తః తస్య తత్రాపి
“శివాదన్య న్న విద్యతే ఇత్యాపాదిత్వాత్ సర్వస్య జగతః మిథ్యాత్వం ఉక్తం భవతి”.
(విస్తరించి చెప్పుట అనవసరము - ఒక్క మాటలో చెప్పవలెననగా - శివస్వరూపము కానిది (పరమాత్మ స్వరూపము కానిది) ఏ వస్తువును లేదు - భవంతుడుకాక వస్తువులన్నవేవియు లేవు అని శ్రుతి వచనము. అట్లయిన యడల ఈ కనబడుచున్న ప్రపంచము మాటేమిటి ? అనగా, అది శివస్వరూపమే అని పైన చెప్పబడినది. విచక్షుణులైనవారు ఈ ప్రపంచమంతయు శివస్వరూపమే యని చెప్పియున్నారు - అద్వితీయుడైన పరమశివుని రూపమందు - పరబ్రహ్మ రూపమందు ప్రపంచము ఆరోపించబడినది. అందుచేత ప్రపంచము మిథ్య యని చెప్పబడినది).
“సత్తైన ప్రకృతివలన నుత్పన్నంబైన యీ జగత్తు సత్తుగావలయు నది యెట్లనినం గగనోత్పన్నంబులైన భూషణంబులు కనక మయంబులయి కానంబడు చందంబున నని సాంఖ్యుండు పలికిన విని యద్వైతవాది యిట్లనెను - నెయ్యది యుత్పన్నంబుగాదది సత్తును గాదను వ్యతిరేకవ్యాప్తి నియమంబు నిత్య సత్యంబయిన బ్రహ్మంబునందు దర్కహతంబగు - గావునం బ్రపంచంబు మిధ్యయని నిరూపించిన నా ప్రపంచంబు బ్రహ్మ విశేషణంబయి మిధ్యగానేరదా ప్రపంచంబునకు కార్యకారణావస్థలు నిత్యంబులుగావు ననవస్తాద్వయ యుక్తంబయిన ప్రపంచంబు నిత్యంబనిన, వెండియు న ద్వైతి యిట్లను - బహు గ్రంధ ప్రతిపాదితంబయిన జగన్మిధ్యాత్వంబులేమి యెట్లనిన నవియునుం గర్మవశులైన జడుల నవిద్యా ప్రతిపాదకంబులు కుతర్క సమేతంబైన భారతి యంధ పరంపా వ్యవహారంబునం జేసి భ్రమియించి” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 ఉ.భా. - 1230)
“నేహ నానాస్తి కించన” (ఈ బ్రహ్మమునందు ఏ విధమైన భేదము లేదు (అది అంతా బ్రహ్మ మాత్రమే) అని చెప్పబడియుండుటవలన ఈ ప్రపంచము సద్రూపముకాదు. బ్రహ్మవలె మూడుకాలములం దుండునదికాదు - కుందేటి కొమ్ము అనునది అసత్ - లేనిది, దానివలె కనబడకుండనుండునదికాదు - అందుచేత అసత్తుకాదు. సదసద్రూపము అనుటకు వీలుకానిది - ఎందుచేతననగా, సత్తు అసత్తు అను రెండును పరస్పర విరుద్ధములు. ఒక్క దానిలో రెండు లక్షణములుండవు. అయితే ‘సత్’ అవవలెను, లేనియడల ‘అసత్’ అవవలెను. అంతేకాని ఈ రెండు లక్షణములు కలదికాదు - (సదసత్తుకాదు). ఇందుచేత ఈ ప్రపంచము ఇట్టిదని చెప్పుటకు వీలుకాదు - అనిర్వచనీయము - కనుక ఇంద్రజాలమువలన నిర్మించబడిన వస్తువు వలె మిథ్య).
“వాచారంభణం వికారో నామధేయం, మృత్తికేత్యేవ సత్యం”.
(కుండ, మూకుడు అని పేర్లతో చెప్పబడు వస్తువులన్నియు వ్యావహారికమునకు ఆ పేర్లతో చెప్పబడుచున్నవికాని అవి మట్టితో చేయబడుటచేత నిజానికి అవి మట్టియే - మట్టి యొక్క వికారములే, మార్పులే. కుండకు, మూకుడునకు కారణవస్తువగు మట్టియే సత్యమైనట్లు ఈ ప్రపంచమునకు కారణమైన పరబ్రహ్మమే సత్యము - కార్య వస్తువైన ప్రపంచము మిథ్యయే).
(బ్రహ్మవిద్యాసుధార్ణవము -)
తత్వం విచారిస్తే సత్యము నిజాంశమే మిధ్య జగజ్జీవాకారమై అది తన అంకురమే - తానే ఆనందకందం, అది బీజం సమస్తానుకున్నూ; అక్కడనుండి ప్రపంచం విస్తారమాయెను. “సర్వస్య గాత్రస్య శిరః ప్రథానం : అని అందా నకు ప్రథానం శిరస్సు - అందుగల కేశాలున్నూ తక్కిన అంగానగల నఖ కేశాలున్నూ అచేతనాలు. అలాగే సకలమున్నూ చైతన్యానకు వ్యతిరిక్తకాదు. అటైతే”సర్వం ఖిల్విదం బ్రహ్మ” అనెడి శ్రుతిని బట్టి విషయ సంగమముననుండి భవసాగరంలో మునింగేవారెవ్వరంటే అది అధికారభేదం. అద్వైత జ్ఞానం లేని జీవునకు విషయసంగం వల్ల సంసార బంధనం నిశ్చయమే. తన్నుంబాసి మాయలేదు, మాయంచేసి జగత్తులేదు - వివర్తం ద్రోసి నిలిస్తే శుద్ధ నిర్గుణ నిరాలంబ నిర్వికల్ప నిర్మల స్వయం జ్యోతి. (బ్రహ్మవిద్యా సుధార్ణవము)
“మృత్తిక యొక్కటియే నామ రూపంబులవలన ఘటాదులు బహు విధంబులైన తెఱుగున, సువర్ణంబొక్కటియే వాచారంభణంబు వలన కటక మకుటాది బహు భూషణంబులైన కైవడి, జలంబొక్కటియే వాయు వంశంబున ఫేన తరంగాది సముదాయంబగు విధంబున, దీపంబొక్కటియే బహు రంధ్రంబులవలన బహు విధ దీపంబులై తోచు చందంబున - - - చిత్తొక్కటి యందు జీవేశ్వరాది భేద వ్యచహారంబుల వలన గలిగినవి యెల్లను దృగ్వివేకంబూనంబడును.” (వివేకచింతామణి -1)
tadvatsatyamapi vijñāya jagatpaśyati māḍha dhīḥ |
rajju khaṃḍē parijñātē sarparūpaṃ na tiṣṭhati |
adhiṣṭhānē tathājñātē prapaṃcē śūnyatāṃ gatē |
dēhasyāpi prapaṃcatvāt prārabdāva sthitiḥ kutaḥ ||“. (nāda biṃdūpaniṣat)
(cīkaṭilō trāḍunu cūci bhramacēta adi pāmu ani anukonunu - adi trāḍu ani teliyagānē pāmu anu bhrāṃti pōvunu - ā prakāramugānē satyamagu ātmanu telusukonagānē - idaṃtayu ātmayē, prapaṃcamanunadi vērē lēdu - ani telusukonaganē prapaṃcamu anu bhāvamu pōvunu - aṃducēta prapaṃcamu midhya).
(cīkaṭilō - māyavalana - pāmuvale kanabaḍu trāḍu - yādhātmyajñānamu kaligina tarvāta - dāni nija svarūpamu telisina tarvātanu, aṃtakumuṃdu kūḍā adi trāḍēkāni ennaḍū pāmu kānēradu - ī prakāramu gānē paramaśivuḍu (paramātma) kūḍa avidyā prabhāvamu valana modaṭa prapaṃcarūpamutō unnaṭlu agapaḍimappaṭikī, tana nija svarūpajñānamu kaligina tarvātanu, aṃtaku muṃdu kūḍa, ī prapaṃcamu nijāniki paramātmayē kāni prapaṃcamani vērēmiyu lēdani teliyabaḍunu - aṃducēta prapaṃcamu idi vaṟaku lēdu, ippuḍulēdu, ikamuṃduikūḍa uṃḍadu - anagā, bhūta bhaviṣyatvartamānakālamulaṃduṃḍani dani niṣēdhiṃpabaḍuṭacēta prapaṃcamu, mithya yaniyē tēlinadi).
māyayā baddhaḥ karōti vivithāstamāḥ |
na cai taivaṃ saṃsarati, na ca saṃsārayētparaḥ |
na kartā, naiva bhōktāca na ca prakṛti puruṣau |
na māyā naivaca prāṇaḥ caitanyaṃ paramārthataḥ |
tasmāda jñāna mūlōhi saṃsāraḥ sarva dēhināṃ |
nityaḥ sarvagatōhyātmā kūṭasthō dōṣa varjitaḥ |
ēkaḥ sa bhidyatē śaktyā māyayā na svabhāvataḥ |
tasmā dadvaitamēvāhuḥ munayaḥ paramārthataḥ |
jñāna svarūpamēvāhurmunayaḥ jagadētadvicakṣaṇāḥ |
artha svarūpa majñānāt paśyaṃtyanyē ku duṣṭayaḥ |
kūṭasthō nirguṇō vyāpī caitanyātmā svabhāvataḥ |
dṛśyatē hartha rūpēṇa puruṣaiḥ bhrāṃta dṛṣṭibhiḥ |
yadā paśyati cātmānaṃ kēvalaṃ paramārthataḥ |
māyā mātramidaṃ dvaitaṃ tathā bhavati sarvataḥ |
tasmā dvijñānamēvāsti na prapaṃcō na saṃskṛtiḥ |
ēvaṃ śṛtyādinā nāmādi kāraṇōpanyāsaḥ |
mukhēna svarūpēṇa ca bādhitatvāt praṃcasya mithyātva mavagamyatē |
asthūlādi lakṣaṇasya brahmaṇaḥ tadviparīta sthūlākārō mithyā bhavitu marhati –
yadaikasya caṃdramasaḥ tadviparīta dvitīyākāraḥ, tadvat.” (śrīśaṃkaraḥ)
(ī prapaṃcamu dēnilōnuṃḍi puṭṭinadō, dēnilō layamai pōvunō adiyē māya. māyacēta baddhuḍai paramātma anēka vidhamulaina śarīramulanu cēyucunnāḍu - idi māyākāryamu kanuka bhagavaṃtuniki saṃsāramulēdu, karta yanuvāḍu lēḍu, bhōktalēḍu, prakṛti lēdu, puruṣuḍu lēḍu, māyalēdu, prāṇamu lēdu - aṃtā nijāniki - paramārthadṛṣṭilō - caitanyamē - bhagavaṃtuni cicchaktiyē - tana cicchakti rūpamulō aṃtā bhagavaṃtuḍē - aṃducēta samasta dēhula yokka - prāṇula yokka - saṃsāramanunadi ajñānamūlamu - bhagavat jñānamu - idaṃtā bhagavaṃtuḍē yanu jñānamu - lēnaṃduvalana kaliginadē. ātma nityuḍu. (mūḍu kālamulaṃduṃḍuvāḍu) sarvagatuḍu (anniṃṭilōnu pravēśiṃciyuṃḍuvāḍu), kūṭasthuḍu (taṭasthuḍugānuṃḍuvāḍu), ē dōṣamu lēnivāḍu, okkaḍē (unnadaṃtā atanu okkaḍē). atanu māya yanu tana śakticēta anēka rūpamulugā kanabaḍu cunnāḍu - svabhāvamuvalana kādu - anagā, prapaṃcamu inni rūpamulatō inni vastuvulugā kanupiṃcuṭa māyā kāryamu, yathārthamugā nivi anniyu bhagavaṃtuḍē. unnadaṃtayu bhagavaṃtuḍē kanuka munulu paramārtha dṛṣṭilō unnadaṃtā okkaḍē bhagavaṃtuḍu kāka reṃḍava vastuvu lēdu -, bhagavaṃtuḍu advayuḍu, ani ceppiri. ī prapaṃcamaṃtayu jñānasvarūpamē - caitanyarūpamē - ani vicakṣuṇulaina munulu ceppuduru - migilinavāru - itarulu - bhēda dṛṣṭikalavāru - idaṃtayu arthasvarūpamē (arthamulatō kūḍina prapaṃcamē) yani cūturu - kūṭasthuḍu, nirguṇuḍu, vyāpi - aṃtaṭanu, anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu, caitanyamē śarīramugā, lēka rūpamugā kalavāḍu - ayina paramātmayē - paina ceppina kudṛṣṭi kalavāriki bhrāṃtivalana dṛśya prapaṃcamugā kanabaḍucunnāḍu - arthamulatōniṃḍi prapaṃcamugā kanabaḍucunnaḍu. kēvaluḍu ayina ātmanu paramārtha dṛṣṭitō evaru cūturō vāru appuḍu ī jagattu māyāmātramani teliyuduru - aṃducēta unnadaṃtayu vijñāna mātramē - caitanya mātramē, caitanya rūpamulō bhagavaṃtuḍē. prapaṃcamugāni, saṃsāramanunadikāni lēdu - paina ceppina prakāramu prapaṃcamanunadi svarūpamucē svarūpamucēta bādhitamainadi - prapaṃcamulēdu - unnadaṃtā bhagavaṃtuḍē yani ceppuṭavalana - prapaṃcamu mithya yani teliya vaccu cunnadi. parabrahma rūpamu asthūlamu - (sthūlaśarīramu lēnivāḍu) (kaṃṭiki kanabaḍanivāḍu; anaṇuvu (aṇuvu kānivāḍu - anniṃṭikaṃṭe cinnavāḍukāḍu), anniṃṭikaṃṭe peddavāḍukāḍu - anu modalagu māṭalatō parabrahma guṟiṃci ceppabaḍiyunnadi. dāniki viparītamaina sthūlākāramu (reṃḍava ākāramu) mithya - caṃdruḍu okaḍē ayinanu bhrama ceṃdinavāniki iddaru caṃdrulu kanabaḍinaṭlē, avi aṭlē bhrama lēka mithya). -
“adhakiṃ bahinōktēna śivādanyanna vidyatē |
śivasvarūpa mēvāhuridaṃ sarvaṃ vicakṣaṇāḥ |”
ittha madvitīya pari śivasvarūpē yasya jagataḥ ārōpāt anyatra abhāva uktaḥ tasya tatrāpi
“śivādanya nna vidyatē ityāpāditvāt sarvasya jagataḥ mithyātvaṃ uktaṃ bhavati”.
(vistariṃci ceppuṭa anavasaramu - okka māṭalō ceppavalenanagā - śivasvarūpamu kānidi (paramātma svarūpamu kānidi) ē vastuvunu lēdu - bhavaṃtuḍukāka vastuvulannavēviyu lēvu ani śruti vacanamu. aṭlayina yaḍala ī kanabaḍucunna prapaṃcamu māṭēmiṭi ? anagā, adi śivasvarūpamē ani paina ceppabaḍinadi. vicakṣuṇulainavāru ī prapaṃcamaṃtayu śivasvarūpamē yani ceppiyunnāru - advitīyuḍaina paramaśivuni rūpamaṃdu - parabrahma rūpamaṃdu prapaṃcamu ārōpiṃcabaḍinadi. aṃducēta prapaṃcamu mithya yani ceppabaḍinadi).
“sattaina prakṛtivalana nutpannaṃbaina yī jagattu sattugāvalayu nadi yeṭlaninaṃ gaganōtpannaṃbulaina bhūṣaṇaṃbulu kanaka mayaṃbulayi kānaṃbaḍu caṃdaṃbuna nani sāṃkhyuṃḍu palikina vini yadvaitavādi yiṭlanenu - neyyadi yutpannaṃbugādadi sattunu gādanu vyatirēkavyāpti niyamaṃbu nitya satyaṃbayina brahmaṃbunaṃdu darkahataṃbagu - gāvunaṃ brapaṃcaṃbu midhyayani nirūpiṃcina nā prapaṃcaṃbu brahma viśēṣaṇaṃbayi midhyagānēradā prapaṃcaṃbunaku kāryakāraṇāvasthalu nityaṃbulugāvu nanavastādvaya yuktaṃbayina prapaṃcaṃbu nityaṃbanina, veṃḍiyu na dvaiti yiṭlanu - bahu graṃdha pratipāditaṃbayina jaganmidhyātvaṃbulēmi yeṭlanina naviyunuṃ garmavaśulaina jaḍula navidyā pratipādakaṃbulu kutarka samētaṃbaina bhārati yaṃdha paraṃpā vyavahāraṃbunaṃ jēsi bhramiyiṃci” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 u.bhā. - 1230)
“nēha nānāsti kiṃcana” (ī brahmamunaṃdu ē vidhamaina bhēdamu lēdu (adi aṃtā brahma mātramē) ani ceppabaḍiyuṃḍuṭavalana ī prapaṃcamu sadrūpamukādu. brahmavale mūḍukālamulaṃ duṃḍunadikādu - kuṃdēṭi kommu anunadi asat - lēnidi, dānivale kanabaḍakuṃḍanuṃḍunadikādu - aṃducēta asattukādu. sadasadrūpamu anuṭaku vīlukānidi - eṃducētananagā, sattu asattu anu reṃḍunu paraspara viruddhamulu. okka dānilō reṃḍu lakṣaṇamuluṃḍavu. ayitē ‘sat’ avavalenu, lēniyaḍala ‘asat’ avavalenu. aṃtēkāni ī reṃḍu lakṣaṇamulu kaladikādu - (sadasattukādu). iṃducēta ī prapaṃcamu iṭṭidani ceppuṭaku vīlukādu - anirvacanīyamu - kanuka iṃdrajālamuvalana nirmiṃcabaḍina vastuvu vale mithya).
“vācāraṃbhaṇaṃ vikārō nāmadhēyaṃ, mṛttikētyēva satyaṃ”.
(kuṃḍa, mūkuḍu ani pērlatō ceppabaḍu vastuvulanniyu vyāvahārikamunaku ā pērlatō ceppabaḍucunnavikāni avi maṭṭitō cēyabaḍuṭacēta nijāniki avi maṭṭiyē - maṭṭi yokka vikāramulē, mārpulē. kuṃḍaku, mūkuḍunaku kāraṇavastuvagu maṭṭiyē satyamainaṭlu ī prapaṃcamunaku kāraṇamaina parabrahmamē satyamu - kārya vastuvaina prapaṃcamu mithyayē).
(brahmavidyāsudhārṇavamu -)
tatvaṃ vicāristē satyamu nijāṃśamē midhya jagajjīvākāramai adi tana aṃkuramē - tānē ānaṃdakaṃdaṃ, adi bījaṃ samastānukunnū; akkaḍanuṃḍi prapaṃcaṃ vistāramāyenu. “sarvasya gātrasya śiraḥ prathānaṃ : ani aṃdā naku prathānaṃ śirassu - aṃdugala kēśālunnū takkina aṃgānagala nakha kēśālunnū acētanālu. alāgē sakalamunnū caitanyānaku vyatiriktakādu. aṭaitē”sarvaṃ khilvidaṃ brahma” aneḍi śrutini baṭṭi viṣaya saṃgamamunanuṃḍi bhavasāgaraṃlō muniṃgēvārevvaraṃṭē adi adhikārabhēdaṃ. advaita jñānaṃ lēni jīvunaku viṣayasaṃgaṃ valla saṃsāra baṃdhanaṃ niścayamē. tannuṃbāsi māyalēdu, māyaṃcēsi jagattulēdu - vivartaṃ drōsi nilistē śuddha nirguṇa nirālaṃba nirvikalpa nirmala svayaṃ jyōti. (brahmavidyā sudhārṇavamu)
“mṛttika yokkaṭiyē nāma rūpaṃbulavalana ghaṭādulu bahu vidhaṃbulaina teṟuguna, suvarṇaṃbokkaṭiyē vācāraṃbhaṇaṃbu valana kaṭaka makuṭādi bahu bhūṣaṇaṃbulaina kaivaḍi, jalaṃbokkaṭiyē vāyu vaṃśaṃbuna phēna taraṃgādi samudāyaṃbagu vidhaṃbuna, dīpaṃbokkaṭiyē bahu raṃdhraṃbulavalana bahu vidha dīpaṃbulai tōcu caṃdaṃbuna - - - cittokkaṭi yaṃdu jīvēśvarādi bhēda vyacahāraṃbula valana galiginavi yellanu dṛgvivēkaṃbūnaṃbaḍunu.” (vivēkaciṃtāmaṇi -1)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.