← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మిథ్యాజ్ఞానం mithyājñānaṃ

Original — తెలుగు
  1. మిథ్యాచ తద జ్ఞానంచ మిథ్యాజ్ఞానం.

(మిథ్య, అజ్ఞానము - అను రెండునూ అయినది)

  1. భ్రాంతి జ్ఞానం, యద్వా మిథ్యా భూతమజ్ఞానం, జ్ఞాన నివర్త్యత్వాయ మిథ్యా శబ్దః -

(భ్రాంతివలన కలిగిన జ్ఞానము, లేక మిధ్యా అయిన జ్ఞానము - ఈ భ్రాంతిజ్ఞానము, లేక అజ్ఞానము జ్ఞానము కలుగగనే - బ్రహ్మజ్ఞానము కలుగగనే - నివర్తించును. కనుక ఇది మిథ్యాజ్ఞానమని చెప్పబడినది)

  1. “శోకమోహాది కారణం మమా హ మిత్య విద్యాఖ్యం మిధ్యాజ్ఞానం - -” (గీతాభావప్రకాశము - 1 - 44, 45)

(శోకము, మోహము మొదలగువాటికి కారణమైనదిన్నీ, నాది, నేను అను అవిద్య యను పేరుగల జ్ఞానము మిథ్యాజ్ఞానము).

  1. “నహి స్థాణౌ ఏకస్మిన్”స్థాణుర్వా పురుషో (అ)న్యో వా” ఇతి తత్వజ్ఞానం భవతి. తత్ర పురుషోవా (అ)న్యోవా ఇతి మిథ్యాజ్ఞానం, స్థాణురేవ ఇతి తత్వజ్ఞానం.

(స్థాణువును చూచి - చెట్టు మొరడును చూచి - ఇది స్థాణువా, పురుషుడా ? అని కలిగినది తత్వజ్ఞానము, ఇది పురుషుడా ఇతరమా అను కలిగినది మిధ్యాజ్ఞానము - ఇది పురుషుడు కాదు స్థాణువే అనునది తత్వజ్ఞానము దాని తత్వము - యథార్థము - తెలియుటవల కలిగిన జ్ఞానము).

  1. “శరీరేంద్రియ మనో బుద్ధిష్వనాత్మసు ఆత్మేతి నిస్సంధి బంధనం - అజ్ఞానం”. (నైష్కర్మ్యసిద్ధి)

(ఆత్మకాని వస్తువులైన శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి - వీటియందు ‘ఇవి ఆత్మ’ యను జ్ఞానము మిథ్యాజ్ఞానము - అత్మకాని వస్తువులు అనేకములున్నవి. ఇట్లు అనేకములుగా నున్న వస్తువులను చూచి అవి అన్నియు ఒకటే అయిన నేను అను జ్ఞానము మిథ్యాజ్ఞానము).

  1. ఒక వస్తువునందు ఇంకొక వస్తువు అను జ్ఞానము కలుగుట మిథ్యాజ్ఞానము - చీకటిలో త్రాడును చూచి ఇది పాము అను జ్ఞానమున్నూ, ఎందమావులను చూచి అది జలము అనుకొను జ్ఞానమున్నూ, ముత్యపు చిప్పను చూచి ఇది వెండి యను జ్ఞానమున్నూ - భ్రాంతివలన కలిగినవి, కనుక మిథ్యాజ్ఞానము - ఇది పాము కాదు, త్రాడు, ఇది జలముకాదు ఎండమావులు, ఇది వెండికాదు ముత్యపుచిప్ప అను యదార్థజ్ఞానము కలిగినమీదట ఈ మిథ్యాజ్ఞానము నశించును.
Transliteration
  1. mithyāca tada jñānaṃca mithyājñānaṃ.

(mithya, ajñānamu - anu reṃḍunū ayinadi)

  1. bhrāṃti jñānaṃ, yadvā mithyā bhūtamajñānaṃ, jñāna nivartyatvāya mithyā śabdaḥ -

(bhrāṃtivalana kaligina jñānamu, lēka midhyā ayina jñānamu - ī bhrāṃtijñānamu, lēka ajñānamu jñānamu kalugaganē - brahmajñānamu kalugaganē - nivartiṃcunu. kanuka idi mithyājñānamani ceppabaḍinadi)

  1. “śōkamōhādi kāraṇaṃ mamā ha mitya vidyākhyaṃ midhyājñānaṃ - -” (gītābhāvaprakāśamu - 1 - 44, 45)

(śōkamu, mōhamu modalaguvāṭiki kāraṇamainadinnī, nādi, nēnu anu avidya yanu pērugala jñānamu mithyājñānamu).

  1. “nahi sthāṇau ēkasmin”sthāṇurvā puruṣō (a)nyō vā” iti tatvajñānaṃ bhavati. tatra puruṣōvā (a)nyōvā iti mithyājñānaṃ, sthāṇurēva iti tatvajñānaṃ.

(sthāṇuvunu cūci - ceṭṭu moraḍunu cūci - idi sthāṇuvā, puruṣuḍā ? ani kaliginadi tatvajñānamu, idi puruṣuḍā itaramā anu kaliginadi midhyājñānamu - idi puruṣuḍu kādu sthāṇuvē anunadi tatvajñānamu dāni tatvamu - yathārthamu - teliyuṭavala kaligina jñānamu).

  1. “śarīrēṃdriya manō buddhiṣvanātmasu ātmēti nissaṃdhi baṃdhanaṃ - ajñānaṃ”. (naiṣkarmyasiddhi)

(ātmakāni vastuvulaina śarīramu, iṃdriyamulu, manassu, buddhi - vīṭiyaṃdu ‘ivi ātma’ yanu jñānamu mithyājñānamu - atmakāni vastuvulu anēkamulunnavi. iṭlu anēkamulugā nunna vastuvulanu cūci avi anniyu okaṭē ayina nēnu anu jñānamu mithyājñānamu).

  1. oka vastuvunaṃdu iṃkoka vastuvu anu jñānamu kaluguṭa mithyājñānamu - cīkaṭilō trāḍunu cūci idi pāmu anu jñānamunnū, eṃdamāvulanu cūci adi jalamu anukonu jñānamunnū, mutyapu cippanu cūci idi veṃḍi yanu jñānamunnū - bhrāṃtivalana kaliginavi, kanuka mithyājñānamu - idi pāmu kādu, trāḍu, idi jalamukādu eṃḍamāvulu, idi veṃḍikādu mutyapucippa anu yadārthajñānamu kaliginamīdaṭa ī mithyājñānamu naśiṃcunu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.