(కనబడుచున్న ప్రపంచము యొక్క యధార్థరూపము నివర్తించుట - అది బ్రహ్మ రూపమే అయినను వేరే ప్రపంచముగా కనబడుట - త్రాడును చూచి అది పాము అని కల్పించుకొనుట. చిన్మాత్రుడైన పరబ్రహ్మమందు ఈ కనబడు దేవతిర్యమఙ్మనుష్య స్థావరాది భేదములలోనుండు సమస్త జగత్తు కల్పితము -అది బ్రహ్మ స్వరూపమే అని తెలిసిన తోడనే ఆ మిథ్యాత్వము పోవును. దీనికి కారణము స్వస్వరూపమును కప్పి పుచ్చునది వివిధ విచిత్ర విక్షేపకారి, ఉన్నదా, లేదా అని చెప్పుటకు వీలు లేనిది అయిన అనాది అవిద్య).
(“అతిక్రమించుటకు వీలుగాని నా మాయ” అని శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నాడు - “ఆదిలేని మాయచేత నిద్రచెందిన జీవుడు మేలుకొనునట్లు జీవుని జ్ఞానము - స్వరూపజ్ఞానము - మాయచే కప్పబడియుండి బ్రహ్మజ్ఞానముచే మేలుకొలుపబడినవానివలె నుండును” అనిన్ని చెప్పబడి యుండుటచేత, నిర్విశేషుడు, చైతన్యమాత్రుడు అయిన బ్రహ్మమే, సత్తుకానిది, అసత్తుకానిది, ఉన్నదియా, లేనిదియా అని నిర్ణయించుటకు వీలులేనిది అయిన అనాది అవిద్య (మాయ)చేత తన స్వరూపజ్ఞానమును పోగొట్టుకొనినవాడై తనలోనున్న నానా రూపములతో నిండియున్న ప్రపంచముగా జీవుడు చూచుచున్నాడు - ఇదియే మిథ్యాత్వము).
(ప్రపంచము సత్యముకానిది, నిజముగ లేనిది - అని చెప్పుట).
(kanabaḍucunna prapaṃcamu yokka yadhārtharūpamu nivartiṃcuṭa - adi brahma rūpamē ayinanu vērē prapaṃcamugā kanabaḍuṭa - trāḍunu cūci adi pāmu ani kalpiṃcukonuṭa. cinmātruḍaina parabrahmamaṃdu ī kanabaḍu dēvatiryamaṅmanuṣya sthāvarādi bhēdamulalōnuṃḍu samasta jagattu kalpitamu -adi brahma svarūpamē ani telisina tōḍanē ā mithyātvamu pōvunu. dīniki kāraṇamu svasvarūpamunu kappi puccunadi vividha vicitra vikṣēpakāri, unnadā, lēdā ani ceppuṭaku vīlu lēnidi ayina anādi avidya).
(“atikramiṃcuṭaku vīlugāni nā māya” ani śrīkṛṣṇabhagavānuḍu śrīmadbhagavadgītalō ceppiyunnāḍu - “ādilēni māyacēta nidraceṃdina jīvuḍu mēlukonunaṭlu jīvuni jñānamu - svarūpajñānamu - māyacē kappabaḍiyuṃḍi brahmajñānamucē mēlukolupabaḍinavānivale nuṃḍunu” aninni ceppabaḍi yuṃḍuṭacēta, nirviśēṣuḍu, caitanyamātruḍu ayina brahmamē, sattukānidi, asattukānidi, unnadiyā, lēnidiyā ani nirṇayiṃcuṭaku vīlulēnidi ayina anādi avidya (māya)cēta tana svarūpajñānamunu pōgoṭṭukoninavāḍai tanalōnunna nānā rūpamulatō niṃḍiyunna prapaṃcamugā jīvuḍu cūcucunnāḍu - idiyē mithyātvamu).
(prapaṃcamu satyamukānidi, nijamuga lēnidi - ani ceppuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.