విడుదల, జననమరణరూపమైన సంసారమునుండి విడుదల; సంసారము లేకుండుట; మోక్షము.
అపవర్గము -
యస్యజ్ఞానమంతః కరణే జాయతే తస్యాంతః కరణ పరిణామాజ్ఞానాంశ నాశో ముక్తిః.
(ఎవనికి అంతఃకరణమందు బ్రహ్మజ్ఞానము ఎప్పుడు కలుగునో అప్పుడు కలుగు అజ్ఞాన నాశనమే ముక్తి).
(అన్యథా రూపమును - తన స్వస్వరూపము కాని దానిని - విడిచిపెట్టి తన స్వస్వరూపముతో (కేవలమైన బ్రహ్మరూపముతో) నుండుట ముక్తి).
“అన్యథ రూపం అవిద్యయా అధ్యస్తం, కర్తృత్వాది హిత్వా స్వస్వరూపేణ బ్రహ్మతయా వ్యవస్థితిః”
(అన్యథా రూపమును - అనగా, అవిద్యచేత, అజ్ఞానముచేత - అథ్యస్తమైన కర్తృత్వముమొదలగు లక్షణములుగల రూపమును - (జీవరూపమును) వదలి, తానే బ్రహ్మయని తెలుసుకొని బ్రహ్మరూపముతో నుండుట)
“త్వమేవం విదిత్వా అతి మృత్యుమేతి” ఇతి జ్ఞానాదేవముక్తిః -” (భగవంతుని తెలుసుకొనిన ముక్తిని పొందును)
“అన్యథా రూపం హిత్వా స్వరూపేణ వ్యవస్థితిః” ముక్తిః “నిత్యస్య జ్ఞానానందామలాత్మనః జీవస్యాన్యథా రూపం కర్మ కల్పితం - దేవమనుష్యాదిరూపం హిత్వా పునః స్వస్వరూపేణ జ్ఞానానందా మలత్వాది రూపేణ అవస్థానం ముక్తి శబ్దార్థః”
(జీవుడు నిత్యుడు, భగవంతుని శుద్ధ చైతన్యమే జీవుని రూపము. భగవంతుని చైతన్యశక్తి భగవంతుని కంటె వేఱుకాక భగవంతునివలె నిత్యముగా నుండునది. భగవంతుడు జ్ఞానానందమయుడు, ఎ విధమైన దోషములు లేనివాడు. తనకు ఇది నిజరూపము - స్వస్వరూపము - జీవునకు కర్మచేత కలిగినది జీవశరీరరూపము. ఇది జీవునకు అన్యథా రూపము - ఇతర విధముగా కలిగిన రూపము. ఈ అన్యథారూపమును జీవుడు వదలి తిరిగి స్వస్వరూపమైన - తన నిజస్వరూపమైన, తన మొదటిరూపమైన - జ్ఞానందమయమైన రూపముతో - “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ”, “సచ్చిదానందం బ్రహ్మ” అను రూపముతో నుండుటయే ముక్తియను మాటకు అర్థము).
సచా సంకల్ప మాత్రేణ సిద్ధో భవతి వై మునే ||“.
(అవిద్య ఇచ్చామాత్రము - అది నశించుటయే మోక్షమని చెప్పబడినది. ఏ విధమైన సంకల్పము లేనియడల అది తప్పక సిద్ధించును).
బ్రహ్మైవ హి ముక్త్యవస్థా; న చి బ్రహ్మణః అనేకాకార యోగోస్తి, ఏకలింగత్వావ ధారణాత్ - “అస్థూల మనణు”; “స ఏషనేతి నేత్యాత్మా”; “యత్ర నాన్యతో పశ్యతి”, “బ్రహ్మై వేదమమృతం | పురస్తాత్”, “ఇదం సర్వం యద యమాత్మా”; “సవా ఏష మహానజః ఆత్మా అజరో అమరో అమృతో అభయో బ్రహ్మత్వస్య సర్వమాత్మైవా భూత్”; “తత్కేన కం పశ్యేత్” ఇత్యాది శ్రుతిభ్యః
(శ్రీశంకరః)
(వేదాంతములన్నింటిలోను ముక్తి ఒక్కవిధముగనే చెప్పబడినది. ముక్తి అనగా బ్రహ్మమే - బ్రహ్మముగా నగుట. బ్రహ్మకు అనేకాకారములు లేవు. అతని లక్షణములు అన్ని ఉపనిషత్తులలోను ఒకరీతిగానే చెప్పబడినది - “స్ర్హూలము కానిది; చిన్నది కానిది;”; “బ్రహ్మ అనగా ఈ కనుపించువస్తువులు ఏవియు కావు” “ఎచ్చట ఇతరమేమియు కనబడదో - లేదో”; “ఇదంతయు బ్రహ్మమే”; “ఇదంతయు ఆత్మయే”; “ఆత్మ జరామరణములు లేనివాడు”; ఈ మొదలగు శ్రుతి వాక్యములవలన ముక్తి యనగా బ్రహ్మవలె, బ్రహ్మగా అగుటయే).
(“అవయవములులేని - ఆకారము - లేని - బ్రహ్మరూపమే ముక్తి”; “బ్రహ్మను తెలుసుకొనినవాడు - బ్రహ్మజ్ఞానము కలవాడు - బ్రహ్మమే యగును” అని శ్రుతులన్నియు చెప్పుచున్నవి. బ్రహ్మజ్ఞానము కలిగినపుడే ముక్తి. అది నిరతిశయమైన (అంతకుమించినటువంటి) ఆనంద బ్రహ్మరూపముననుండుటయే).
(అన్నపూర్ణోపనిషత్ - 2 - 23)
(ముక్తి యనునది ఆకాశముకావలగాని, పాతాలమున గాని, భూమి మీద కాని లేదు - సమస్తమైన ఆశలు నశించిన చిత్తము నశించుటయే మోక్షము అని చెప్పబడినది).
జన్మాను చరిత దృశ్యములైన యజ్జరామరణంబులాత్మ ధర్మంబు లయిన
ఘన పుణ్య పాప నికాయ నిర్మోచనస్థితి నొప్పి పూర్వ సంచితములైన
యపహత పాప్మవత్మాదృష్ట తద్గుణవంతుడై తగ భగవచ్ఛరీర
తే. భూతుడై పార తంత్ర్యాత్మ బుద్ధి నొప్పి
దివ్య మాల్యాను లేపన భవ్య గంధ
కలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టు
డగుచు హరిరూపమందుటే, యనఘ, ముక్తి“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 267)
(అవిద్య మొదలగువాటివలన విడుదల కలుగుటే ముక్తి).
సత్యం జ్ఞానమనంతం యదానందం బ్రహ్మ కేవలం ||“.
(‘సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం’ అను లక్షణములుగల కేవలుడైన ఏ పరబ్రహ్మ కలడో అట్టి బ్రహ్మస్వరూపముతో (ఆత్మస్వరూపముతో) నుండుటే ముక్తియని చెప్పబడినది).
“అహం బ్రహ్మాస్మి” (నేనే బ్రహ్మను అను అనుభవము కలుగుటే ముక్తి).
“స్వ మాత్రావస్థాన లక్షణ కైవల్యం”.
(ప్రకృతికి సంబంధించిన ఏ విధమైన ఉపాధితోను కలిసి యుండక ఆత్మ మాత్రముగానే యుండు స్థితి అయిన కైవల్యమే మోక్షము).
“శుద్ధ చైతన్యము అజ్ఞానముతో కలిసి యున్నపుడు అనగా దానితో తాదాత్మ్యమును పొందినపుడు ఆనందమయకోశమనియు, బుద్ధితో కలిసి తాదాత్మ్యమును పొందినపుడు విజ్ఞానమయకోశమని, మనసుతో కలిసి తాదాత్మ్యమును పొందినపుడు మనోమయకోశమని, ముఖ్యప్రాణముతో కలిసి తాదాత్మ్యమును పొందినపుడు ప్రాణమయకోశమని, అన్నము తినినందున ఏర్పడిన శరీరముతో కలిసి తాదాత్మ్యమును పొందినపుడు అన్నమయకోశమని చెప్ప బడుచున్నది. దీనిని నిరసించుటయే జీవునికి జీవత్వమునుండి విడుదల - జననమరణములనుండి విడుదల - అట్లు వాటితో తాదాత్మ్యమునుండి విడుదల యగుటయే ముక్తి”.
సంసారమనునది జననమరణములను, సుఖదుఃఖములను కలుగచేయునది. దీనికి కారణము అజ్ఞానము. కారణము నశించనదే కార్యమైన సంసారము నశించదు - కావున సంసారమునకు బంధహేతువు అజ్ఞానము - జ్ఞానము లేకపోవుట. అజ్ఞానము, జ్ఞానమువలన నశించును - కావున అజ్ఞాన నాశనమే ముక్తి - సంసారము నుండి విడుదల.
viḍudala, jananamaraṇarūpamaina saṃsāramunuṃḍi viḍudala; saṃsāramu lēkuṃḍuṭa; mōkṣamu.
apavargamu -
yasyajñānamaṃtaḥ karaṇē jāyatē tasyāṃtaḥ karaṇa pariṇāmājñānāṃśa nāśō muktiḥ.
(evaniki aṃtaḥkaraṇamaṃdu brahmajñānamu eppuḍu kalugunō appuḍu kalugu ajñāna nāśanamē mukti).
(anyathā rūpamunu - tana svasvarūpamu kāni dānini - viḍicipeṭṭi tana svasvarūpamutō (kēvalamaina brahmarūpamutō) nuṃḍuṭa mukti).
“anyatha rūpaṃ avidyayā adhyastaṃ, kartṛtvādi hitvā svasvarūpēṇa brahmatayā vyavasthitiḥ”
(anyathā rūpamunu - anagā, avidyacēta, ajñānamucēta - athyastamaina kartṛtvamumodalagu lakṣaṇamulugala rūpamunu - (jīvarūpamunu) vadali, tānē brahmayani telusukoni brahmarūpamutō nuṃḍuṭa)
“tvamēvaṃ viditvā ati mṛtyumēti” iti jñānādēvamuktiḥ -” (bhagavaṃtuni telusukonina muktini poṃdunu)
“anyathā rūpaṃ hitvā svarūpēṇa vyavasthitiḥ” muktiḥ “nityasya jñānānaṃdāmalātmanaḥ jīvasyānyathā rūpaṃ karma kalpitaṃ - dēvamanuṣyādirūpaṃ hitvā punaḥ svasvarūpēṇa jñānānaṃdā malatvādi rūpēṇa avasthānaṃ mukti śabdārthaḥ”
(jīvuḍu nityuḍu, bhagavaṃtuni śuddha caitanyamē jīvuni rūpamu. bhagavaṃtuni caitanyaśakti bhagavaṃtuni kaṃṭe vēṟukāka bhagavaṃtunivale nityamugā nuṃḍunadi. bhagavaṃtuḍu jñānānaṃdamayuḍu, e vidhamaina dōṣamulu lēnivāḍu. tanaku idi nijarūpamu - svasvarūpamu - jīvunaku karmacēta kaliginadi jīvaśarīrarūpamu. idi jīvunaku anyathā rūpamu - itara vidhamugā kaligina rūpamu. ī anyathārūpamunu jīvuḍu vadali tirigi svasvarūpamaina - tana nijasvarūpamaina, tana modaṭirūpamaina - jñānaṃdamayamaina rūpamutō - “satyaṃ jñānamanaṃtaṃ brahma”, “saccidānaṃdaṃ brahma” anu rūpamutō nuṃḍuṭayē muktiyanu māṭaku arthamu).
sacā saṃkalpa mātrēṇa siddhō bhavati vai munē ||“.
(avidya iccāmātramu - adi naśiṃcuṭayē mōkṣamani ceppabaḍinadi. ē vidhamaina saṃkalpamu lēniyaḍala adi tappaka siddhiṃcunu).
brahmaiva hi muktyavasthā; na ci brahmaṇaḥ anēkākāra yōgōsti, ēkaliṃgatvāva dhāraṇāt - “asthūla manaṇu”; “sa ēṣanēti nētyātmā”; “yatra nānyatō paśyati”, “brahmai vēdamamṛtaṃ | purastāt”, “idaṃ sarvaṃ yada yamātmā”; “savā ēṣa mahānajaḥ ātmā ajarō amarō amṛtō abhayō brahmatvasya sarvamātmaivā bhūt”; “tatkēna kaṃ paśyēt” ityādi śrutibhyaḥ
(śrīśaṃkaraḥ)
(vēdāṃtamulanniṃṭilōnu mukti okkavidhamuganē ceppabaḍinadi. mukti anagā brahmamē - brahmamugā naguṭa. brahmaku anēkākāramulu lēvu. atani lakṣaṇamulu anni upaniṣattulalōnu okarītigānē ceppabaḍinadi - “srhūlamu kānidi; cinnadi kānidi;”; “brahma anagā ī kanupiṃcuvastuvulu ēviyu kāvu” “eccaṭa itaramēmiyu kanabaḍadō - lēdō”; “idaṃtayu brahmamē”; “idaṃtayu ātmayē”; “ātma jarāmaraṇamulu lēnivāḍu”; ī modalagu śruti vākyamulavalana mukti yanagā brahmavale, brahmagā aguṭayē).
(“avayavamululēni - ākāramu - lēni - brahmarūpamē mukti”; “brahmanu telusukoninavāḍu - brahmajñānamu kalavāḍu - brahmamē yagunu” ani śrutulanniyu ceppucunnavi. brahmajñānamu kaliginapuḍē mukti. adi niratiśayamaina (aṃtakumiṃcinaṭuvaṃṭi) ānaṃda brahmarūpamunanuṃḍuṭayē).
(annapūrṇōpaniṣat - 2 - 23)
(mukti yanunadi ākāśamukāvalagāni, pātālamuna gāni, bhūmi mīda kāni lēdu - samastamaina āśalu naśiṃcina cittamu naśiṃcuṭayē mōkṣamu ani ceppabaḍinadi).
janmānu carita dṛśyamulaina yajjarāmaraṇaṃbulātma dharmaṃbu layina
ghana puṇya pāpa nikāya nirmōcanasthiti noppi pūrva saṃcitamulaina
yapahata pāpmavatmādṛṣṭa tadguṇavaṃtuḍai taga bhagavaccharīra
tē. bhūtuḍai pāra taṃtryātma buddhi noppi
divya mālyānu lēpana bhavya gaṃdha
kalita maṃgaḷa divya vigraha viśiṣṭu
ḍagucu harirūpamaṃduṭē, yanagha, mukti”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 267)
(avidya modalaguvāṭivalana viḍudala kaluguṭē mukti).
satyaṃ jñānamanaṃtaṃ yadānaṃdaṃ brahma kēvalaṃ ||“.
(‘satyaṃ, jñānaṃ, anaṃtaṃ, ānaṃdaṃ’ anu lakṣaṇamulugala kēvaluḍaina ē parabrahma kalaḍō aṭṭi brahmasvarūpamutō (ātmasvarūpamutō) nuṃḍuṭē muktiyani ceppabaḍinadi).
“ahaṃ brahmāsmi” (nēnē brahmanu anu anubhavamu kaluguṭē mukti).
“sva mātrāvasthāna lakṣaṇa kaivalyaṃ”.
(prakṛtiki saṃbaṃdhiṃcina ē vidhamaina upādhitōnu kalisi yuṃḍaka ātma mātramugānē yuṃḍu sthiti ayina kaivalyamē mōkṣamu).
“śuddha caitanyamu ajñānamutō kalisi yunnapuḍu anagā dānitō tādātmyamunu poṃdinapuḍu ānaṃdamayakōśamaniyu, buddhitō kalisi tādātmyamunu poṃdinapuḍu vijñānamayakōśamani, manasutō kalisi tādātmyamunu poṃdinapuḍu manōmayakōśamani, mukhyaprāṇamutō kalisi tādātmyamunu poṃdinapuḍu prāṇamayakōśamani, annamu tininaṃduna ērpaḍina śarīramutō kalisi tādātmyamunu poṃdinapuḍu annamayakōśamani ceppa baḍucunnadi. dīnini nirasiṃcuṭayē jīvuniki jīvatvamunuṃḍi viḍudala - jananamaraṇamulanuṃḍi viḍudala - aṭlu vāṭitō tādātmyamunuṃḍi viḍudala yaguṭayē mukti”.
saṃsāramanunadi jananamaraṇamulanu, sukhaduḥkhamulanu kalugacēyunadi. dīniki kāraṇamu ajñānamu. kāraṇamu naśiṃcanadē kāryamaina saṃsāramu naśiṃcadu - kāvuna saṃsāramunaku baṃdhahētuvu ajñānamu - jñānamu lēkapōvuṭa. ajñānamu, jñānamuvalana naśiṃcunu - kāvuna ajñāna nāśanamē mukti - saṃsāramu nuṃḍi viḍudala.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.