ఉపయోగము; ప్రయోజనము; కర్మఫలితము - జ్ఞానమునకు ఫలము (బ్రహ్మజ్ఞానమునకు ఫలము), మోక్షము..
"ఫల్గుతయా లయం అదర్శనం గచ్ఛతి ఇతి నిర్వచనం” (శ్రీశంకరః)
(సూక్ష్మమగుటచేత కనబడకుండ - తెలియకుండ - జరుగునది - పని చేయునది).
ఏ దైన పని - కర్మ - చేయుటవలన కలుగునది. (Every action has a reaction).
"అపవర్గ పర్యంతంబయిన (మోక్షమువరకు గల) పరధర్మంబునకు దృష్ట శ్రుత ప్రపంచా ర్థంబు (చూడబడునది వినబడునది యగు ప్రాపంచక విషయములు) ఫలంబుగాదు. ధర్మంబునందు అవ్యభిచారియైన యర్థంబునకు గామంబు ఫలంబు గాదు. విషయ భోగంబైన కామంబునకు యింద్రియప్రీతి ఫలంబు గాదు. ఎంత తడవుజీవించు నంతియ కామంబునకు ఫలంబు. తత్వ జిజ్ఞాససగల జీవునకు గర్మంబుచేత నెయ్యది సుప్రసిద్ధంబది నిరర్థకంబు". (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
"కృతయుగే తపసా ఫలసిద్ధి రభిదాతా, త్రేతాయాంతు జ్ఞానేన ఫలసిద్ధిరుక్తా, ద్వాపరే యజ్ఞాదినా ఫలసిద్ధిర్నిశ్చితా భవతి, కలౌతు సర్వేషామపి మనుజానాం దానే నైవ ఫలసిద్ధిర్భవతి".
(కృతయుగమందు తపస్సుచే ఫలము సిద్ధించునని చెప్పబడినది. త్రేతాయుగమందు జ్ఞానమువలన, ద్వాపరయుగమందు యజ్ఞము మొదలగు వాటిచేత ఫలము సిద్ధించునని చెప్పబడినది. కలియుగమున దానము చేతనే ఫలసిద్ధి యగును).
upayōgamu; prayōjanamu; karmaphalitamu - jñānamunaku phalamu (brahmajñānamunaku phalamu), mōkṣamu..
"phalgutayā layaṃ adarśanaṃ gacchati iti nirvacanaṃ” (śrīśaṃkaraḥ)
(sūkṣmamaguṭacēta kanabaḍakuṃḍa - teliyakuṃḍa - jarugunadi - pani cēyunadi).
ē daina pani - karma - cēyuṭavalana kalugunadi. (Every action has a reaction).
"apavarga paryaṃtaṃbayina (mōkṣamuvaraku gala) paradharmaṃbunaku dṛṣṭa śruta prapaṃcā rthaṃbu (cūḍabaḍunadi vinabaḍunadi yagu prāpaṃcaka viṣayamulu) phalaṃbugādu. dharmaṃbunaṃdu avyabhicāriyaina yarthaṃbunaku gāmaṃbu phalaṃbu gādu. viṣaya bhōgaṃbaina kāmaṃbunaku yiṃdriyaprīti phalaṃbu gādu. eṃta taḍavujīviṃcu naṃtiya kāmaṃbunaku phalaṃbu. tatva jijñāsasagala jīvunaku garmaṃbucēta neyyadi suprasiddhaṃbadi nirarthakaṃbu". (śrīmadāṃdhramahābhāgavatamu -)
"kṛtayugē tapasā phalasiddhi rabhidātā, trētāyāṃtu jñānēna phalasiddhiruktā, dvāparē yajñādinā phalasiddhirniścitā bhavati, kalautu sarvēṣāmapi manujānāṃ dānē naiva phalasiddhirbhavati".
(kṛtayugamaṃdu tapassucē phalamu siddhiṃcunani ceppabaḍinadi. trētāyugamaṃdu jñānamuvalana, dvāparayugamaṃdu yajñamu modalagu vāṭicēta phalamu siddhiṃcunani ceppabaḍinadi. kaliyugamuna dānamu cētanē phalasiddhi yagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.