(పండితుడు; బుద్ధిమంతుడు; సర్వమును తెలిసినవాడు; వివేకము గలవాడు).
తజ్జః; తత్ + జ్ఞః - తత్ = భగవంతుడు; జ్ఞః = తెలిసినవాడు - బ్రహ్మజ్ఞానము కలవాడు).
యధార్ధతయా మాహాత్మ్యం అభిజ్ఞాః. (యదార్ధముగా మాహాత్మ్యమును తెలిసినవాడు).
“కిం ను మేస్యాదిదం కృత్వా, కిం ను మేస్యాదకుర్వతః |
ఇతి సంచింత్య మనసా ప్రాజ్ఞః కుర్వతవా నవా ||“. (భోజరాజ చరిత్రము)
(ఈ పనిచేసిన నాకేమగును; ఇది చేయకపోయిన నేమగును - అని మనసులో చింతించి చేయుటయో మానుటయో చేయువాడు).
(సమస్త చరాచర జగత్తుయొక్క వ్యవహారమును - సృష్టి స్థితి లయములను గుఱించి ఉత్కృష్టమైన జ్ఞానముకలవాడు; సర్వజ్ఞుడు, పరమేశ్వరుడు).
(జరిగిన విషయమును గుఱించి, జరుగబోవు విషయమును గుఱించి, ఇప్పుడు జరుగుచున్న విషయములన్నింటిని గుఱించి తెలిసినవాడు - దనిని ఉత్కృష్టమైన రీతిని తెలిసినవాడు ప్రజ్ఞుడు - ప్రజ్ఞగలవాడే ప్రాజ్ఞుడు).
(శ్రీశంకరః)
(జరిగినది, జరుగబోవునది తెలిసియుండుట సమస్త విషయములను తెలిసియుండుట కలవాడు కనుక ప్రాజ్ఞుడు - సుషుప్తిలోనున్నవాడైనను భూతముల పుట్టు పూర్వములు తెలిసినవాడు కనుక ప్రాజ్ఞుడని చెప్పబడుచున్నాడు. లేక, - జ్ఞానమాత్రమే రూపమైనవాడు ప్రాజ్ఞుడు. ఇతరులకంటె విశిష్టమైన జ్ఞానము కలవాడు కనుక ప్రాజ్ఞుడు - పరమాత్మయొక్క నాలుగు పాదములలో మూడవపాదము).
(మాయ ఉపాధిగా గలిగి స్వప్రకాశుడు అయి అవ్యక్తముతో కూడియున్న (పరమేశ్వరుడు) జీవుడు వ్యష్టి కారణ శరీరమును ప్రవేశించి ప్రాజ్ఞు డని చెప్పబడుచున్నాడు - ప్రాజ్ఞుడు అవిచ్ఛిన్నుడు, పారమార్థి కుడు, సుషుప్త్యభిమానీ అని ప్రాజ్ఞుని పేర్లు. సుషుప్తి యందు జీవునికి ఆత్మానందము, అజ్ఞానము కలిసియుండుటవలన సుషుప్త్యభిమానము గల ప్రాజ్ఞుడని చెప్పబడుచున్నాడు. జీవునికి సుషుప్తిలో దేహము ఇంద్రియములు మొదలగువాటి గుఱించి జ్ఞాపకము, బాహ్యాభ్యంతర వ్యవహారములు, లేక, చేష్టలు లేక నిద్రలో నున్నట్లుండు అవస్థ సుషుప్త్యవస్థ యని చెప్పబడును).
(స్పష్టముకాని ఉపాధి కలిగియుండుట చేతను బాగా ప్రకాశించుటకు అవకాశములేనివాడై యుండుటచేతను జీవుడు ప్రాజ్ఞుడని చెప్ప బడుచున్నాడు).
(వ్యష్టి కారణ దేహమును అభిమానించువాడు). దానిలోనున్న పరమాత్మ చైతన్యము.
(సుషుప్తికాలమందు స్వయంప్రకాశత్వమును ఆత్మానందమును అజ్ఞానముచేత కప్పబడిన సత్వము కలిగి యుండుటచేత సుషుప్త్యభిమాని యైన జీవుడు ప్రాజ్ఞుడనిచెప్పబడుచున్నాడు. అందుచేతనే ‘ప్ర + అజ్ఞః’ ప్రకర్షేణ అజ్ఞః - గొప్ప అజ్ఞాని యని చెప్పబడుచున్నాడు).
(స్వప్నావస్థలో ఏ కోరిక లేకుండుట, ఏ కలయు కనక యుండుట - ఇదియే సుషుప్తి అటువంటి స్వప్నావస్థ సుషుప్తి. అట్టి సుషుప్తి స్థానముతో ఏకమై ప్రజ్ఞానఘనుడు, ఆనందమయుడు, ఆనందము ననుభవించువాడు ప్రాజ్ఞుడు - ఆత్మ యొక్క మూడవపాదము, లేక మూడవ రూపము).
“ఓంకారస్య తృతీయ మాత్రా ఆత్మనః తృతీయాంశః - పాదః రూపం వా - మకారః-”. (శ్రీకూరనారాయణః)
(సుషుప్త్యవస్థ యందుండు వాడు ప్రాజ్ఞుడు; అ, ఉ, మ అను మూడు మాత్రలు కల ‘ఓం’ కారములోని మూడవమాత్ర మూడవపాదము).
(సంకర్షణుడు అను పేరుగల ఆత్మ యొక్క మూడవపాదము ప్రాజ్ఞుడు - మొదటి రెండుపాదములు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు - వాసుదేవుడే ఆత్మ).
(ఏమియు జ్ఞాపకము లేనివాడు ప్రాజ్ఞుడు - జీవరూపమునకు అతీతమైనది; బాహ్యము కాని, స్వప్నమునకు సంబంధించినదికాని, కొంచెమైనను తెలియనివాడు - జ్ఞాపకమునకు తెచ్చుకో లేనివాడు ఆత్మ యొక్క మూడవ పాదము - మూడవరూపము).
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞః ఏక ఏవ త్రిథాస్మృతః ||“. (గౌడపాదకారికా)
“దక్షిణాక్షి ముఖే నిశ్వో మనస్యంతస్తు తైజసః |
ఆకాశే చ హృది ప్రాజ్ఞ స్త్రిదేహ దేహే వ్యవస్థితః ||”
(ఆత్మ యొక్క పాదములు, లేక రూపములు మూడు. విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. విశ్వుడు బహిః ప్రజ్ఞ కలవాడు, అంతః ప్రజ్ఞ (సూక్ష్మరూపము) కలవాడు తైజసుడు. ప్రజ్ఞానఘనుడు ప్రాజ్ఞుడు అని ఈ మూడు విధములుగా ఒక్కడే చెప్పబడుచున్నాడు. కుడి కంటి యందుండువాడు విశ్వుడు, మనస్సులో నుండువాడు తైజసుడు, హృదయాకాశమునందుండువాడు ప్రాజ్ఞుడు - అని మూడు విధములుగా ఒకడే చెప్పబడుచున్నాడు. శరీరములోనున్న ఒకటే చైతన్యము వేఱు వేఱు జ్ఞానసాధకములను బట్టి వేఱు వేఱు నామములతో తెలియబడుచున్నాడు).
(ప్రజ్ఞానమే బ్రహ్మ - బ్రహ్మ జ్ఞానస్వరూపుడు - అందుచేత బ్రహ్మను తెలిసినవాడు ప్రాజ్ఞుడు).
(paṃḍituḍu; buddhimaṃtuḍu; sarvamunu telisinavāḍu; vivēkamu galavāḍu).
tajjaḥ; tat + jñaḥ - tat = bhagavaṃtuḍu; jñaḥ = telisinavāḍu - brahmajñānamu kalavāḍu).
yadhārdhatayā māhātmyaṃ abhijñāḥ. (yadārdhamugā māhātmyamunu telisinavāḍu).
“kiṃ nu mēsyādidaṃ kṛtvā, kiṃ nu mēsyādakurvataḥ |
iti saṃciṃtya manasā prājñaḥ kurvatavā navā ||“. (bhōjarāja caritramu)
(ī panicēsina nākēmagunu; idi cēyakapōyina nēmagunu - ani manasulō ciṃtiṃci cēyuṭayō mānuṭayō cēyuvāḍu).
(samasta carācara jagattuyokka vyavahāramunu - sṛṣṭi sthiti layamulanu guṟiṃci utkṛṣṭamaina jñānamukalavāḍu; sarvajñuḍu, paramēśvaruḍu).
(jarigina viṣayamunu guṟiṃci, jarugabōvu viṣayamunu guṟiṃci, ippuḍu jarugucunna viṣayamulanniṃṭini guṟiṃci telisinavāḍu - danini utkṛṣṭamaina rītini telisinavāḍu prajñuḍu - prajñagalavāḍē prājñuḍu).
(śrīśaṃkaraḥ)
(jariginadi, jarugabōvunadi telisiyuṃḍuṭa samasta viṣayamulanu telisiyuṃḍuṭa kalavāḍu kanuka prājñuḍu - suṣuptilōnunnavāḍainanu bhūtamula puṭṭu pūrvamulu telisinavāḍu kanuka prājñuḍani ceppabaḍucunnāḍu. lēka, - jñānamātramē rūpamainavāḍu prājñuḍu. itarulakaṃṭe viśiṣṭamaina jñānamu kalavāḍu kanuka prājñuḍu - paramātmayokka nālugu pādamulalō mūḍavapādamu).
(māya upādhigā galigi svaprakāśuḍu ayi avyaktamutō kūḍiyunna (paramēśvaruḍu) jīvuḍu vyaṣṭi kāraṇa śarīramunu pravēśiṃci prājñu ḍani ceppabaḍucunnāḍu - prājñuḍu avicchinnuḍu, pāramārthi kuḍu, suṣuptyabhimānī ani prājñuni pērlu. suṣupti yaṃdu jīvuniki ātmānaṃdamu, ajñānamu kalisiyuṃḍuṭavalana suṣuptyabhimānamu gala prājñuḍani ceppabaḍucunnāḍu. jīvuniki suṣuptilō dēhamu iṃdriyamulu modalaguvāṭi guṟiṃci jñāpakamu, bāhyābhyaṃtara vyavahāramulu, lēka, cēṣṭalu lēka nidralō nunnaṭluṃḍu avastha suṣuptyavastha yani ceppabaḍunu).
(spaṣṭamukāni upādhi kaligiyuṃḍuṭa cētanu bāgā prakāśiṃcuṭaku avakāśamulēnivāḍai yuṃḍuṭacētanu jīvuḍu prājñuḍani ceppa baḍucunnāḍu).
(vyaṣṭi kāraṇa dēhamunu abhimāniṃcuvāḍu). dānilōnunna paramātma caitanyamu.
(suṣuptikālamaṃdu svayaṃprakāśatvamunu ātmānaṃdamunu ajñānamucēta kappabaḍina satvamu kaligi yuṃḍuṭacēta suṣuptyabhimāni yaina jīvuḍu prājñuḍaniceppabaḍucunnāḍu. aṃducētanē ‘pra + ajñaḥ’ prakarṣēṇa ajñaḥ - goppa ajñāni yani ceppabaḍucunnāḍu).
(svapnāvasthalō ē kōrika lēkuṃḍuṭa, ē kalayu kanaka yuṃḍuṭa - idiyē suṣupti aṭuvaṃṭi svapnāvastha suṣupti. aṭṭi suṣupti sthānamutō ēkamai prajñānaghanuḍu, ānaṃdamayuḍu, ānaṃdamu nanubhaviṃcuvāḍu prājñuḍu - ātma yokka mūḍavapādamu, lēka mūḍava rūpamu).
“ōṃkārasya tṛtīya mātrā ātmanaḥ tṛtīyāṃśaḥ - pādaḥ rūpaṃ vā - makāraḥ-”. (śrīkūranārāyaṇaḥ)
(suṣuptyavastha yaṃduṃḍu vāḍu prājñuḍu; a, u, ma anu mūḍu mātralu kala ‘ōṃ’ kāramulōni mūḍavamātra mūḍavapādamu).
(saṃkarṣaṇuḍu anu pērugala ātma yokka mūḍavapādamu prājñuḍu - modaṭi reṃḍupādamulu pradyumnuḍu, aniruddhuḍu - vāsudēvuḍē ātma).
(ēmiyu jñāpakamu lēnivāḍu prājñuḍu - jīvarūpamunaku atītamainadi; bāhyamu kāni, svapnamunaku saṃbaṃdhiṃcinadikāni, koṃcemainanu teliyanivāḍu - jñāpakamunaku teccukō lēnivāḍu ātma yokka mūḍava pādamu - mūḍavarūpamu).
ghana prajñastathā prājñaḥ ēka ēva trithāsmṛtaḥ ||“. (gauḍapādakārikā)
“dakṣiṇākṣi mukhē niśvō manasyaṃtastu taijasaḥ |
ākāśē ca hṛdi prājña stridēha dēhē vyavasthitaḥ ||”
(ātma yokka pādamulu, lēka rūpamulu mūḍu. viśvuḍu, taijasuḍu, prājñuḍu. viśvuḍu bahiḥ prajña kalavāḍu, aṃtaḥ prajña (sūkṣmarūpamu) kalavāḍu taijasuḍu. prajñānaghanuḍu prājñuḍu ani ī mūḍu vidhamulugā okkaḍē ceppabaḍucunnāḍu. kuḍi kaṃṭi yaṃduṃḍuvāḍu viśvuḍu, manassulō nuṃḍuvāḍu taijasuḍu, hṛdayākāśamunaṃduṃḍuvāḍu prājñuḍu - ani mūḍu vidhamulugā okaḍē ceppabaḍucunnāḍu. śarīramulōnunna okaṭē caitanyamu vēṟu vēṟu jñānasādhakamulanu baṭṭi vēṟu vēṟu nāmamulatō teliyabaḍucunnāḍu).
(prajñānamē brahma - brahma jñānasvarūpuḍu - aṃducēta brahmanu telisinavāḍu prājñuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.