← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాకృతప్రలయము prākṛtapralayamu

Original — తెలుగు
  1. “విధాత సమస్త లోకంబులం దనయాత్మయందు నిలిపి శయనింపం ప్రకృతి వినష్టంబయిన నది ప్రాకృత ప్రలయంబని చెప్పంబడు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 4 - 22)

  1. “కాలవిపర్యంబయి పురుషావ్యక్తులు విలీనంబగు, నది ప్రాకృత ప్రళయంబనం బరగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 4 -24)

  2. ప్రాకృత ప్రలయస్తు కార్యబ్రహ్మ వినాశ నిమిత్తకః సకల కార్య నాశకః (సకలకార్య వినాశః ప్రకృతో లయః) ఏవం సర్వలోకవాసిభిః సహ కర్యే బ్రహ్మణి ముచ్యమానే తదధిష్టిత బ్రహ్మాండ తదంతర్వర్తి నిఖిలలోక తదంతర్వర్తి స్థావరాదీనాం భౌతికాదీనాం, భూతానాంచ ప్రకృతౌ మాయాయాంచ లయః, నతు బ్రహ్మణి బాధరూప వినాశస్యైవ బ్రహ్మనిష్టత్వాత్, అతః ప్రకృతః ఇత్యుచ్యతే. (వేదాంతపరిబాషా - ధర్మరాజేంద్రప్రణీతః).

(కార్యబ్రహ్మ నశించుటవలన కలిగిన సకలకార్యవస్తువులనాశము ప్రాకృత ప్రలయము. సకల కార్య వస్తువులు - చాతుర్ముఖ బ్రహ్మలోనుండి పుట్టినవన్నియు - నశించుటే - లయము పొందుటే - ప్రాకృత ప్రలయము. లోకములన్నింటిలోను నివసించువారితోకూడ కార్య బ్రహ్మమందు లీనమైపోగా కార్యబ్రహ్మ అధిష్టించియుండు బ్రహ్మాండము, దానిలోనుండు సకల లోకులు, వాటిలోనుండు స్థావరములు. భూతములు, భౌతికములు (భూతములలోనుండి పుట్టినవి) మాయయను ప్రకృతియందు లయమగుట).

  1. “నియతకాలపరిపాకానాం కర్మణాం మధ్యే పరిపక్వానాం ఉపయోగేన క్షయాత్ ఇతరేషాం చ అపరిపక్వానాం భోగాసం భవేన తదర్థాయాః సృష్టేరనుపయోగాత్ ప్రాకృతః ప్రలయో భవతి. తస్మిన్ ప్రలయే సర్వం జగత్ బీజరూపేణ మాయాయాం లీనం భవతి మాయాచ గ్రస్త సమస్త ప్రపంచా బ్రహ్మాచేదేన తిష్టతి. తదా నిస్తరంగ సముద్ర కల్పం బ్రహ్మనిరీహం తధైవ తిష్టతి యదధికృత్య ఉచ్యతే -”నాసత్ - - -” ఇత్యాది పరిపక్వేషు తు కర్మసు తత్తత్కాలకర్మవత్ క్షేత్రస్థం బీజం యథా ఉచ్ఛూనం భవతి, తథా ఏవ అద్వైతం నిరీహం బ్రహ్మాపి కాలకర్మవశాత్ ఉచ్ఛూనం భవతి. పశ్చాదంకురం, తతః శాఖాః తాభ్యః పత్రాణి, తతః పుష్పం, తతః ఫలం, ఏవం క్షేత్ర బీజవత్ అత్రాపి మాయాబీజాత్ అంకురాదికం జాయతే. స చ ఉచ్ఛునతాది పరిణామో మాయాయాః ఎవ నబ్రహ్మణః తస్య నిరవయవత్వాత్ పరిణామే పాదయ వస్తు న ఏవాపేక్షణాత్ చిదాత్మస్యేవ ప్రకృతిః లీనా తదభేదేనైవ తిష్టతి తత్ర తస్మిన్ కాలే సలయః ప్రాకృతః ఇత్యుచ్యతే, ప్రకృతేరపి బ్రహ్మణి లీనత్వాత్ –”

(కాలపరిమితి నియమమును బట్టి పరిపక్వమగు కర్మలలో పరిపక్వమైన కర్మలు అనుభవముచే క్షీణించుట వలననూ, పరిపక్వముగాని ఇతర కర్మలవలన ఫలము అనుభవించుట అసంభవమగుటవలనను, ఆ కర్మల ఫలమనుభవింప చేయుటకు తిరిగి సృష్టిచేయుటవలన ఉపయోగము లేకుండుటవలనను ప్రాకృత ప్రలయము కలుగుచున్నది. అట్టి ప్రలయమందు ఈ జగత్తంతయు బీజ రూపములో మాయ యందు లీనమగుచున్నది. మాయప్రపంచ మంతయు తనలో లీనమవగా బ్రహ్మతో భేదములేని స్థితిలో నుండును - అప్పుడు కెరటములు లేని సముద్రమువలె బ్రహ్మ సృష్టిని చేయు కోరిక లేకయుండును - భువిలో వేసిన బీజము (విత్తనము) ఏ ప్రకారముగా మొలక పెట్టునో ఆ ప్రకారముగానే, ఆయా కాలము కర్మననుసరించి పరిపక్వమైన కర్మ - ఫలము నిచ్చుటకు సిద్ధమైన - కర్మల విషయములో బ్రహ్మ అద్వయుడైనను, కామము లేనివాడైనను, సృష్టి చేయుటకు మొదలు పెట్టును. ఆ తర్వాత బీజములోనుండి అంకురము (మొలక), కొమ్మలు, వాటినుండి ఆకులు, పువ్వులు, ఫలములు కలిగించు క్షేత్రములో వేసిన బీజము వలె మాయ యను బీజమునుండి మొలక మొదలగునవి పుట్టుచుండును - ఈ ప్రకారముగా మొలకెత్తుటయను బీజమునకు కలుగు మార్పు (పరిణామము) మాయవలన కలిగినదే - మాయలోనే ఈ మొలకెత్తుట జరుగును, బ్రహ్మవలనకాదు - బ్రహ్మ నిరవయము (అవయవములు లేనివాడు) కనుక అతను మొలకెత్తుట ఉండదు. మాయ అవయవములు కలది. అవయవములు కలదియే పరిణామమును చెందును - మార్పు చెందును).

(చిదాత్మ అయిన పరబ్రహ్మయందు ప్రకృతి లీనమై బ్రహ్మతో భేదములేని స్థితిలో నుండును, అట్లు బ్రహ్మలో ప్రకృతి లీనమై యుండుట ప్రాకృత ప్రలయమని చెప్పబడినది - ప్రకృతి పరబ్రహ్మలో లయమగుట ప్రాకృత ప్రలయము).

Transliteration
  1. “vidhāta samasta lōkaṃbulaṃ danayātmayaṃdu nilipi śayaniṃpaṃ prakṛti vinaṣṭaṃbayina nadi prākṛta pralayaṃbani ceppaṃbaḍu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 4 - 22)

  1. “kālaviparyaṃbayi puruṣāvyaktulu vilīnaṃbagu, nadi prākṛta praḷayaṃbanaṃ baragu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 4 -24)

  2. prākṛta pralayastu kāryabrahma vināśa nimittakaḥ sakala kārya nāśakaḥ (sakalakārya vināśaḥ prakṛtō layaḥ) ēvaṃ sarvalōkavāsibhiḥ saha karyē brahmaṇi mucyamānē tadadhiṣṭita brahmāṃḍa tadaṃtarvarti nikhilalōka tadaṃtarvarti sthāvarādīnāṃ bhautikādīnāṃ, bhūtānāṃca prakṛtau māyāyāṃca layaḥ, natu brahmaṇi bādharūpa vināśasyaiva brahmaniṣṭatvāt, ataḥ prakṛtaḥ ityucyatē. (vēdāṃtaparibāṣā - dharmarājēṃdrapraṇītaḥ).

(kāryabrahma naśiṃcuṭavalana kaligina sakalakāryavastuvulanāśamu prākṛta pralayamu. sakala kārya vastuvulu - cāturmukha brahmalōnuṃḍi puṭṭinavanniyu - naśiṃcuṭē - layamu poṃduṭē - prākṛta pralayamu. lōkamulanniṃṭilōnu nivasiṃcuvāritōkūḍa kārya brahmamaṃdu līnamaipōgā kāryabrahma adhiṣṭiṃciyuṃḍu brahmāṃḍamu, dānilōnuṃḍu sakala lōkulu, vāṭilōnuṃḍu sthāvaramulu. bhūtamulu, bhautikamulu (bhūtamulalōnuṃḍi puṭṭinavi) māyayanu prakṛtiyaṃdu layamaguṭa).

  1. “niyatakālaparipākānāṃ karmaṇāṃ madhyē paripakvānāṃ upayōgēna kṣayāt itarēṣāṃ ca aparipakvānāṃ bhōgāsaṃ bhavēna tadarthāyāḥ sṛṣṭēranupayōgāt prākṛtaḥ pralayō bhavati. tasmin pralayē sarvaṃ jagat bījarūpēṇa māyāyāṃ līnaṃ bhavati māyāca grasta samasta prapaṃcā brahmācēdēna tiṣṭati. tadā nistaraṃga samudra kalpaṃ brahmanirīhaṃ tadhaiva tiṣṭati yadadhikṛtya ucyatē -”nāsat - - -” ityādi paripakvēṣu tu karmasu tattatkālakarmavat kṣētrasthaṃ bījaṃ yathā ucchūnaṃ bhavati, tathā ēva advaitaṃ nirīhaṃ brahmāpi kālakarmavaśāt ucchūnaṃ bhavati. paścādaṃkuraṃ, tataḥ śākhāḥ tābhyaḥ patrāṇi, tataḥ puṣpaṃ, tataḥ phalaṃ, ēvaṃ kṣētra bījavat atrāpi māyābījāt aṃkurādikaṃ jāyatē. sa ca ucchunatādi pariṇāmō māyāyāḥ eva nabrahmaṇaḥ tasya niravayavatvāt pariṇāmē pādaya vastu na ēvāpēkṣaṇāt cidātmasyēva prakṛtiḥ līnā tadabhēdēnaiva tiṣṭati tatra tasmin kālē salayaḥ prākṛtaḥ ityucyatē, prakṛtērapi brahmaṇi līnatvāt –”

(kālaparimiti niyamamunu baṭṭi paripakvamagu karmalalō paripakvamaina karmalu anubhavamucē kṣīṇiṃcuṭa valananū, paripakvamugāni itara karmalavalana phalamu anubhaviṃcuṭa asaṃbhavamaguṭavalananu, ā karmala phalamanubhaviṃpa cēyuṭaku tirigi sṛṣṭicēyuṭavalana upayōgamu lēkuṃḍuṭavalananu prākṛta pralayamu kalugucunnadi. aṭṭi pralayamaṃdu ī jagattaṃtayu bīja rūpamulō māya yaṃdu līnamagucunnadi. māyaprapaṃca maṃtayu tanalō līnamavagā brahmatō bhēdamulēni sthitilō nuṃḍunu - appuḍu keraṭamulu lēni samudramuvale brahma sṛṣṭini cēyu kōrika lēkayuṃḍunu - bhuvilō vēsina bījamu (vittanamu) ē prakāramugā molaka peṭṭunō ā prakāramugānē, āyā kālamu karmananusariṃci paripakvamaina karma - phalamu niccuṭaku siddhamaina - karmala viṣayamulō brahma advayuḍainanu, kāmamu lēnivāḍainanu, sṛṣṭi cēyuṭaku modalu peṭṭunu. ā tarvāta bījamulōnuṃḍi aṃkuramu (molaka), kommalu, vāṭinuṃḍi ākulu, puvvulu, phalamulu kaligiṃcu kṣētramulō vēsina bījamu vale māya yanu bījamunuṃḍi molaka modalagunavi puṭṭucuṃḍunu - ī prakāramugā molakettuṭayanu bījamunaku kalugu mārpu (pariṇāmamu) māyavalana kaliginadē - māyalōnē ī molakettuṭa jarugunu, brahmavalanakādu - brahma niravayamu (avayavamulu lēnivāḍu) kanuka atanu molakettuṭa uṃḍadu. māya avayavamulu kaladi. avayavamulu kaladiyē pariṇāmamunu ceṃdunu - mārpu ceṃdunu).

(cidātma ayina parabrahmayaṃdu prakṛti līnamai brahmatō bhēdamulēni sthitilō nuṃḍunu, aṭlu brahmalō prakṛti līnamai yuṃḍuṭa prākṛta pralayamani ceppabaḍinadi - prakṛti parabrahmalō layamaguṭa prākṛta pralayamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.