← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణజయం prāṇajayaṃ

Original — తెలుగు
  1. ప్రాణవాయోః స్వవశీకరణం -

(ప్రాణవాయువును తనవశములో నుంచుకొనుట).

  1. “తర్కైర్జల్పై శ్శాస్త్ర జాలైర్యుక్తి భిర్మంత్ర భేషజైః |

నవశో జాయతే ప్రాణః సిద్ధ్యుపాయం, వినా విధే! |

తస్మాద్యోగం తమే వాదౌ నాధకో నిత్యమభ్యసేత్ ||“. (యోగశిఖోపనిషత్)

(తర్కముచేతగాని, జల్పముచేతగాని, శాస్త్రములచేతగాని, యుక్తులచేతగాని, మంత్రములచేతగాని, మందులచేతగాని ప్రాణమును వశములో నుంచుకొన లేరు - సిద్ధిని పొందు నుపాయము లేనిదే - అనగా యోగసిద్ధిని పొందక - పైన చెప్పినవాటి వలన ప్రాణము స్వాధీనములో నుండదు. అందుచేత సాధకుడగువాడు మొదట యోగము నభ్యసించవలెను).

  1. “సీ. ప్రకృతి రూపిణి యైన పాప పూబోడికి మహదాది వికృతులు మలకలేడు

మొగము విచ్చి సుషుమ్న మూల రంధ్రముగప్పి వంశాస్థి సంబంధి వలన లీల

నది మీదుప్రాకి మధ్యమనాడితో గూడి ద్రుహిణ రంధ్రము గప్పు తోక చివర

జక్క జాయ చరింప సమకూరకుండుట విడ బింగళను కాలి యెక్కు డిగ్గు

గెలని వాకిళ్ళు రెండు వేగిరము మూసి

నడిమి వాకిలి దెఱవ నెన్నండు నేర్చు

సాధకుడు నాడుకాని వశ్యంబుగాదు

పవన విజయంబు దానికి, పద్మనయన ||“. (శ్రీనాధుడు - కాశీఖండము - అధ్యాయము - 2)

Transliteration
  1. prāṇavāyōḥ svavaśīkaraṇaṃ -

(prāṇavāyuvunu tanavaśamulō nuṃcukonuṭa).

  1. “tarkairjalpai śśāstra jālairyukti bhirmaṃtra bhēṣajaiḥ |

navaśō jāyatē prāṇaḥ siddhyupāyaṃ, vinā vidhē! |

tasmādyōgaṃ tamē vādau nādhakō nityamabhyasēt ||“. (yōgaśikhōpaniṣat)

(tarkamucētagāni, jalpamucētagāni, śāstramulacētagāni, yuktulacētagāni, maṃtramulacētagāni, maṃdulacētagāni prāṇamunu vaśamulō nuṃcukona lēru - siddhini poṃdu nupāyamu lēnidē - anagā yōgasiddhini poṃdaka - paina ceppinavāṭi valana prāṇamu svādhīnamulō nuṃḍadu. aṃducēta sādhakuḍaguvāḍu modaṭa yōgamu nabhyasiṃcavalenu).

  1. “sī. prakṛti rūpiṇi yaina pāpa pūbōḍiki mahadādi vikṛtulu malakalēḍu

mogamu vicci suṣumna mūla raṃdhramugappi vaṃśāsthi saṃbaṃdhi valana līla

nadi mīduprāki madhyamanāḍitō gūḍi druhiṇa raṃdhramu gappu tōka civara

jakka jāya cariṃpa samakūrakuṃḍuṭa viḍa biṃgaḷanu kāli yekku ḍiggu

gelani vākiḷḷu reṃḍu vēgiramu mūsi

naḍimi vākili deṟava nennaṃḍu nērcu

sādhakuḍu nāḍukāni vaśyaṃbugādu

pavana vijayaṃbu dāniki, padmanayana ||“. (śrīnādhuḍu - kāśīkhaṃḍamu - adhyāyamu - 2)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.