← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణము prāṇamu

Original — తెలుగు
  1. “యః ప్రాణః స వాయుః” (ప్రాణమనగా వాయువు) (ప్రాణవాయువు - చలనశక్తి గల వాయువు).

  2. ప్రాణితి జగత్ అనేన ఇతి ప్రాణః -

(జగత్తునకు చలనము - చేష్ట - కలిగించునది).

  1. ప్రేరకం సత్తాస్ఫూర్తి ప్రదం.

(ప్రేరేపించునది - చలనము (activity) కలుగచేయునది - చలనమునకు కారణమైనది, సత్తాస్ఫూర్తి నిచ్చునది. (Energy కలుగచేయునది).

  1. ఇంద్రియాణి యం ప్రాణంతం చేష్టాం కుర్వంతం అనుపశ్చాత్ ప్రాణంతి, చేష్టాం కుర్వంతి.

(ఇంద్రియములకు వాటి వాటి చేష్టలను - వృత్తులను చేయునట్లు శక్తి కలిగించునది).

  1. వ్యాపక శక్తిః, పక్వానాం భూతానాం సూక్ష్మో రససారః ప్రాణః -

(వ్యాపించు శక్తి, పక్వమైన భూతములకు - స్థూలరూపమును పొందుటకు సిద్ధముగానున్న సూక్ష్మ భూతములలోనున్న సూక్ష్మమైన రస సారము).

  1. శరీరావచ్ఛేదేన ప్రాణాపానాది సంజ్ఞాం ఉపగతో వాయుః -

(శరీరావచ్ఛేదము వలన ప్రాణము, అపానము అను మొదలగు పేర్లతో నుండు వాయువు).

  1. “ముఖ నాసికా సంచార్యా హృదయ వృత్తిః ప్రణయనాత్ ప్రాణః” (శ్రీశంకరః)

(ముఖమందు ముక్కొలో సంచరించు హృదయ వృత్తిని చాలనము చేయుట చేత ప్రాణము అని చెప్పబడినది).

  1. “సంచరణార్హ హృదయ సంబంధినీ యా వాయు వృత్తిః - ప్రణయనాత్ పురతో నిస్సరణాత్ ఇతి యావత్”. (ఆనందగిరి టీక)

(శరీరమంతటను సంచరించునదిన్నీ, హృదయమునకు సంబంధించినదీ అయిన వాయు వృత్తి - ముందుకు సంచరింపచేయుట వలన జీవింపచేయుట వలన ప్రాణము అని చెప్పబడినది).

  1. “యదిదం కించ జగత్సర్వం ప్రాణ ఏ జతి నిః సృతం” ఇతి శ్రుతిః.

(ఈ జగత్తు అంతటినీ చలింపచేయునది, శక్తి వంతముగా చేయునది ప్రాణము అని శ్రుతి వాక్యము).

  1. ప్రాణో నామ ప్రాగ్గమనవాన్, నాసాగ్రస్థానవర్తీ.

(ఊర్థ్వముగా - మీదికి - పోవునది, ముందుకు పోవునది. ముక్కు చివరనుండి పనిచేయునది)

(“ప్రాణః హృదయే”) అని శ్రుతి చెప్పుచున్నది. (ప్రాణము హృదయమందుండును అని చెప్పుచున్నది) కాని మన అనుభవములో ప్రాణ వాయువు నాసిక చివరను వ్యవహరించుచున్నట్లు అనుభవమగుచున్నను దాని వ్యత్తి హృదయమునందే ప్రారంభమగుచున్నది). (“హృదిప్రాణో” ప్రాణము హృదయమందుండును).

  1. ప్రకృష్టానంద రూపత్వాత్ ప్రాణః.

(ప్రకృష్టమైన ఆనందరూపమగుట వలన ప్రాణము అని చెప్పబడినది).

  1. “ఏజృ కంపనే ఇతి ధాతోః కంపనార్థకత్వాత్ సర్వ జగత్కంపన హేతుః ప్రాణః ప్రతీయతే”.

(ప్రాణము అనుమాట ‘ఏజృ’ అను ధాతువు (root word) లోనుండి పుట్టినది. దాని అర్థము కంపనము - చలనము చేయుట, చలింప చేయుట (activate). అందుచేత సమస్తమైన జగత్తును చలింప చేయునది).

  1. నాసాది స్థానవర్తీ -“వాయుః ప్రాణో భూత్వా నాశికే ప్రావిశత్” (తైత్తరీయోపనిషత్ - 2 - 4)

(నాసాది = నాసికా పర్యంతాని, స్థానాని ఆది పదార్థః).

(“వాయువు ప్రాణముగా మారి నాశికయందు ప్రవేశించెను” అని తైత్తరీయోపనిషద్వాక్యము - ఇందువలన ప్రాణము నాసిక పర్యంతముగల స్థానములనందు సంచరించునది అని తెలియవచ్చును - వాయువు సూర్యరశ్మివలన తేజస్సుతో కలిసి చిచ్ఛక్తి రూపమై ప్రాణరూపముగా మారెను).

  1. చేష్టాం కరోతి శ్వసన రూపేణ.

(శ్వాసరూపములో చేష్ట కలిగించువాడు - చేతనత్వము కలిగించువాడు - భగవంతుడు).

  1. ప్రాణితి క్షేత్రజ్ఞరూపేణ, ప్రాణాత్మనా చేష్టయన్ వా ప్రాణః.

(క్షేత్రజ్ఞ రూపములో క్షేత్రమను శరీరములోనుండి శరీరమునకు - దాని అవయవములకు, చేష్ట (చలనము) (activity) కలిగించువాడు) (భగవంతుడు).

  1. సూత్రాత్మనా ప్రజాః ప్రాణయతీతి ప్రాణః -

(సూత్రాత్మ రూపములో అన్ని జీవులలో నుండి వాటిని ప్రాణము గలవాటినిగా - జీవించియుండునట్లుగా - చేయువాడు (పరమాత్మ) - సూత్రాత్మ = క్రియా శక్తిః).

  1. “స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మానం దో, అజరో అమృతః” -

(ఈ ప్రాణమే ప్రజ్ఞాత్మా, ఆనందమయుడు, అజరామరుడు).

  1. సర్వస్య సవాయుకస్య చ జగతః జీవనాది చేష్టా హేతుత్వాత్ ప్రాణశబ్ద వాచ్యః పరమాత్మా.

(వాయువుతో సహితముగా సమస్త జగత్తునకు జీవనము (జీవింపచేయుట మొదలగు చేష్టలకు కారణమైనవాడు కనుక ప్రాణమనగా పరమాత్మ).

  1. ప్రాణం వాయ్వాత్మానం ప్రాణన శక్తిమంతం.

(శరీరమును ప్రాణనశక్తి గలదానినిగా చేయు వాయువు - జీవించి యుండు శక్తి నిచ్చునది).

  1. దేవ మనుష్య పశవః ప్రాణం అను ప్రాణం తి, ప్రాణాధీన జీవనాః ఇత్యర్థః.

(దేవతలు, మనుష్యులు, పశువులు జీవించియుండుటకు ప్రాణము మీద ఆధారపడియున్నారు).

  1. “ప్రాణోహి భూతానామాయః, తస్మాత్ సర్వాయుష ముచ్యతే”. (తైత్తరీయోపనిషత్)

“యస్మాత్ భూతానాం ప్రాణినాం ప్రాణ ఏవ ఆయుః జీవనం, తస్మాత్ సర్వేషాం ఆయురేవ సర్వాయుష ముచ్యతే -” “యావత్ హి అస్మిన్ శరీరే ప్రాణోవసతి తావదాయుః” ఇతి శ్రుతేః ప్రాణాపగమే మరణ ప్రసిద్దేః ప్రసిద్ధం లోకే.

(భూతములకు ప్రాణము ఆయువు. అందుచేత ప్రాణము అందఱికి ఆయువు అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడినది. ప్రాణముగల భూతములకు ప్రాణమే ఆయువు, జీవింపచేయునది - అందుచేత అందఱికి ఆయువు కనుక ప్రాణము సర్వాయువని చెప్పబడినది - “ఈ శరీరములో ఎంతవఱకు ప్రాణముండునో అంతవఱకే ఆయుర్దాయము -” అని శ్రుతి చెప్పుచున్నది - ప్రాణము పోవుటే మరణము అని లోకములో ప్రసిద్ధియే కదా).

“సర్వేషాం భూతానాం యావత్ శరీరే ప్రాణోవసతి, తావధాయుః” ఇతి ప్రాణస్య ఉచ్ఛ్వాస నిశ్వాసనాది లక్షణ సర్వభూతాయుర్హేతుత్వం.

(సమస్త భూతములకు శరీరములో ఎంతవఱకు ప్రాణముండునో అంతవఱకు ఆయుర్దాయము అని చెప్పుటవలన ప్రాణము యొక్క ఉచ్ఛ్వాసము మొదలగు లక్షణములు ఆయువునకు కారణము).

  1. ప్రాణో బ్రహ్మేత్యవ జానాత్ “.

(ప్రాణమే బ్రహ్మ అని తెలుసుకొనుము).

  1. ప్రాణినః ప్రాణవంతః -

(ప్రాణముగలవారు - ప్రాణులు).

  1. “ఆపోమయం ప్రాణః” ప్రాణవా ఆపః.

(ప్రాణము జలమయము - జలములో పూర్తిగా నిండియున్నది. (Hydrogen + Oxygen = Water). నీటిలో ప్రాణమున్నది (ప్రాణవాయువున్నది). అందుచేతనే నీటిలోనున్న జీవులకు గాలిలోనున్న ప్రాణవాయువు అవసరములేదు - అందుచేతనే వాటికి జలము జీవనంబని చెప్పబడినది –

“ఆ. జీవనంబు తనకు జీవనంబై యుంట

నలవు బలమునంతకంతకెక్కి

మకరమెప్పి - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - గజేంద్రమోక్షము - 8 - 4 - 61)

జీవనము = జీవింపచేయునది - జీవనము = నీరు).

“అభ్యోకించ ప్రాణః” (ప్రాణము పుట్టుటకు కారణము నీరు - నీటిలో ప్రాణవాయువున్నదని యర్థము).

  1. “న ప్రాణేన, నా పానేన మర్త్యో జీవతి కశ్చన |

ఇతరేణతు జీవంతి యస్మిన్నేతా వుపాశ్రితౌ ||“. (కఠోపనిషత్)

(మర్త్యుడు - మనుష్యుడు మరణించు స్వభావము కలవాడు - ప్రాణవాయువుచేతగాని, అపానవాయువుచేతగాని జీవించియుండుట లేదు - ప్రాణవాయువునకు, అపానవాయువునకు ఆశ్రయమైనదే భగవంతుడు. అతని వలననే జీవించియున్నాడు. భగవంతుడు తన చిచ్ఛక్తిని - సత్తాస్ఫూర్తిని వాయువునకిచ్చి దానిచేత ఈ ప్రాణాపానవాయువుల వృత్తులను చేయించు చున్నాడు - అందుచేత భగవంతుని శక్తి వలననే మనుష్యుడు - ప్రతి జీవి - జీవించియున్నాడు. “యస్మిన్నేతౌ ప్రేర్యత్వేన స్థితౌ తేన ఇతరేణ బ్రహ్మణా సర్వే ప్రాణాది వ్యాపారం కుర్వంతీత్యర్థః”.

(ప్రాణాపానములు రెండును ప్రేరేపణ చేయుటకు దేని నాశ్రయించి యున్నవో - దేనిమీద ఆధారపడియున్నవో - ఆ బ్రహ్మ వలననే ఇవి వాటి వాటి వ్యాపారములు చేయుచున్నవి).

(ప్రాణాపానములు రెండును ప్రేరేపణ చేయుటకు దేని నాశ్రయించి యున్నవో - దేనిమీద ఆధారపడియున్నవో - ఆ బ్రహ్మ వలననే ఇవి వాటి వాటి వ్యాపారములు చేయుచున్నవి).

  1. “నీవ ప్రాణమరయ నిఖిలమునకు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 7 - 222)

  2. “కృతే అస్థి స్థితా ప్రాణా స్త్రేతాయాం మజ్జమాంసయోః |

ద్వాపరే త్వగ్గతాః ప్రోక్తాః కలే రక్తగతాః స్మృతాః ||“. (చికిత్సాసార సంగ్రహము)

(ప్రాణములు కృతయుగమందు అస్థిగతమై యుండెను, త్రేతాయుగమందు మజ్జ మాంసముల నాశ్రయించి యుండెను -ద్వాపర యుగమందు చర్మము నాశ్రయించి యుండెను - కలియుగమందు రక్తమునాశ్రయించియుండును. అందుచేత - రక్తము శరీరమంతటను వ్యాపించియుండును. కనుక ప్రాణముకూడ శరీరమంతటను వ్యాపించియుండును. శరీరములోని అణువు అణువులోను వ్యాపించియుండును - గుండెలోనో, ఊపిరితిత్తులలోనో, శిరస్సులోనో ఉండునని కాదు - life exists not only in the heart, in the lungs or in the brain but in every infinitismal part of the body. శరీరములో యే అంశలోనైన ప్రాణము లేనిచో అది పక్షవాతము - partial paralyses - అనిపించుకొనును - దాని వృత్తి అది చేయుట ఉండదు - not functioning).

  1. ప్రాణాది భేదః పవనో దేహమాశ్రిత్య తిష్టతి |

తస్యధామాని గతయః కర్మాణి చ పృధక్ పృధక్ |

సర్వభేదేష్వపి స ప్రాణో బలీమార్థ్నిసమాశ్రితః |

తత్రస్థోపి సహృత్ కంఠమురశ్చ న విముంచతి |

శేషాణామప్యపానాది వాతానాం బలమేధయన్ |

విశేషాత్సర్వ నాడీషు ప్రాణో వహతి సర్వదా |

తస్మిన్ బలహీనేచ వికలః ప్రయాతే (అ)స్మిన్ ప్రయాతి చ |

ఆయుర్బలం స్మృతిర్మేథా సర్వ వర్ణేంద్రియాగ్నయః |

ప్రాణస్య భేదమాసాద్య వర్తయం తీవ కృశ్నశః |

సోపి దేహం సమాసాద్య శుభాశుభ నిబంధనం |

ఆత్మనో(అ)ధిక మల్పందా మధ్యవా ఆయుః కరోతిచ |

తస్మాద్దానదయా ధర్మ బ్రహ్మ చర్య రసాయనైః |

యత్నం ప్రాణస్థితౌ కుర్యాత్ త్రివర్గస్తన్నిబంధనః ||“. (చికిత్సాసారసంగ్రహము -)

(ప్రాణము, అపానము అను మొదలగు భేదములతో వాయువు - గాలి - దేహము నాశ్రయించియున్నది. అది యుండుస్థలములు, దాని గతులు (సంచారము), కర్మలు (అవి చేయుపనులు). వేఱు వేఱుగనుండును. వేఱు వేఱు భేదములతోనున్నను వాయువు శిరస్సునందు బలముగా నుండును. శిరస్సునందున్నప్పటికీ హృదయమును,కంఠమును, వక్షస్థలమును వదలి ఉండదు. అపానము మొదలగు నితరప్రాణములకు కూడ బలమునిచ్చును - అన్ని నాడులయందును ప్రాణము బలమును ప్రసరింపచేయును - ప్రాణము బలము గలిగియున్న యడల నూరు సంవత్సరముల ఆయుర్దాయముండును, అది బలహీనమైన యడల ఆయుర్దాయము క్షీణించును. ఆయుర్దాయమును బలము, స్మృతి, మేథా, స్వరము, వర్ణము, ఇంద్రియముల అగ్నులు - ఇవన్నియు ప్రాణ భేదమును బట్టియే ప్రవర్తించుచుండును - కలుగుచుండును. ప్రాణము దేహము నాశ్రయించి శుభా శుభములను కలుగచేయుచున్నది. దానిని బట్టియేఆయుర్దాయము అధికాయుర్దాయమనియు, అల్పాయుర్దాయమనియు, మధ్యమాయుర్దాయమనియు కలుగుచుండును - అందుచేతనే దానము, ధర్మము, దయ, బ్రహ్మచర్యము, రసాయనములు (ఔషధములు) మొదలగు వాటితో ప్రాణము శరీరములో బలముగా నిలబడియున్నట్లు చేయవలయును).

  1. “రేతస్సేవ ప్రాణం దథాతి”.

(రేతస్సే ప్రాణమును ధరించియున్నది - రేతస్సులో ప్రాణము - ప్రాణ శక్తి యున్నది).

  1. ప్రాణము యొక్క సృష్టి యీ క్రింద విధముగా చెప్పబడినది : -

    1. “అపంచీకృత మహాభూత రజోంశభాగత్రయ సమష్టితః ప్రాణమసృజత్”.

(పంచీకరణముగాని పంచభూతముల యొక్క మిశ్ర రజోగుణాంశము వలన ప్రాణమును భగవంతుడు సృష్టించెను); (రజోగుణము విక్షేప స్వభావముగలదికనుక రజోగుణము వలన పుట్టుటచేత ప్రాణమునకు విక్షేపశక్తి కలిగెను).

  1. “స (బ్రహ్మ) పంచభూతానాం రజోంశాంశ్చతుర్ధా కృత్వా భాగత్రయాత్ పంచవృత్యాత్మకం ప్రాణమసృజత్” (పైంగలోపనిషత్)

(బ్రహ్మ పంచభూతముల యొక్క రజోగుణాంశమును నాలుగు భాగములుగా చేసి, మూడుభాగములతో అయిదు విధముల వృత్తులుగల ప్రాణమును సృజించెను).

  1. ఆత్మనః ఏష ప్రాణో జాయతే (ప్రశ్నోపనిషత్)

(ఆత్మవలన ప్రాణము పుట్టుచున్నది).

  1. “ఏతస్మాదాత్మనః సర్వే ప్రాణాః యథాయతనం విప్రతిష్ఠంతే” (కౌశీతకీ బ్రాహ్మణము)

(ఈ ఆత్మనుండియే ప్రాణములన్నియు పుట్టుచున్నవి).

  1. “తైజసంబయిన రాజసాహంకారంబువలన - - - క్రియా జనకాంతఃకరణాఇక భాగంబయిన ప్రాణంబునుం గలిగె” -

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)

  1. “వాయువునకు బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబునను రెండుగుణంబులు గలిగి యుండు. అది దేహంబులందుండుటం జేసి ప్రాణరూపంబై ఇంద్రియ మనశ్శరీర పాటవంబైన యోజస్సహో బలంబులకు హేతువై వర్తించు -”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)

  1. “ప్రాణము అయిదు విధములు : -.

    1. ప్రాణాపాన వ్యానోదాన సమానో నః - ఇత్యేవం సర్వప్రాణ ఏవ” “ప్రాణ ఏవ ప్రాణినా పానన వ్యాననో దానన సమాన నాఖ్య వ్యాపారైః ప్రాణాపానవ్యానో దాన సమాన నామకస్సన్, తద్వృత్తిద్వారా ఉపకారకః; అన ఇతి సామాన్య నామ కశ్చేతి యావత్”.

(శ్రీరంగ రామానుజః)

“అనః ఇతి ఏషాం వృత్తి విశేషాణాం సామాన్య భూతా సామాన్య దేహ చేష్టా సంబంధినీ వృత్తిః -”.

(ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి అయిదున్నూ ప్రాణమే. ఇవి చేయు వృత్తులబట్టి ప్రాణమునకే యీ పేర్లు వచ్చినవి. ఈ పేర్లతో ప్రాణమే ఆ పనులు చేయుచున్నది).

  1. “ప్రాణాపానాది వృత్తి భేదాత్ ప్రాణః ఏవ పంచథావ్యపిదిశ్యతే - యథా ఏకమేవ మనః కామాది వృత్తి భేదేన తైః శబ్దైః అభిధీయతే ఇతి - శ్రుతిః ఆహ : -”కామః సంకల్పః” ఇత్యారభ్య “హ్రీర్థీర్భీః” ఇత్యేతత్సర్వం మనః ఏవ ” ఇతి. అపానాది సమాన పర్యంతం వ్యపదిశ్య - “ఏ తత్సర్వం ప్రాణ ఏవ” ఇతి వ్యపదేశాత్ ప్రాణ ఏవ పంచవృత్తిః ఇత్యవగమ్యతే“.

(ప్రాణవృత్తి, అపానవృత్తి అను మొదలగు వృత్తుల భేదమువలన ఒక్క ప్రాణమే అయిదు విధములుగా చెప్పబడినది. “కామము, సంకల్పము” అని చెప్పుట మొదలుపెట్టి “హ్రీః, ధీః, భీః” వరకు గలవన్నియు మనస్సేయని శ్రుతి చెప్పినట్లు అపానము మొదలు సమానము వఱకు యీ అయిదు ప్రాణములు చెప్పి ఇవన్నియు ప్రాణమేయని చెప్పబడినది. ఇట్లనుట వలన ప్రాణమే యీ అయిదు విధములగు వృత్తులను చేయుచున్నది అని తెలుసుకొనవలెను).

  1. ప్రాణాపానవ్యానోదానాః ప్రాణవృత్తయః; వచనాదినా గమనానంద విసర్గాః తద్విషయాః -

(ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన ప్రాణ వృత్తులు - వచన, ఆదాన, అగమన, ఆనంద విసర్గములు వాటివిషయములు).

  1. “వాచ్యపాన రూపా తనుః ప్రతిష్టితా, శ్రోత్రే. వ్యానరూపా, చక్షుషి ప్రాణరూపా, మనసి సమానరూపా -.” స ప్రాణః, తచ్చక్షుషః, సవ్యానః తచ్ఛ్రోత్రం, సాపాన స్సవాక్, స సమానస్తన్మనకః.” ఇతి శ్రుతేః“.

(అపానవాయువు శరీరమంతటను నుండును - శ్రోత్రమందు వ్యానవాయువుగాను, కంటియందు ప్రాణవాయువుగాను, మనస్సులో సమానవాయువుగను పని చేయును - కంటిలో ప్రాణవాయువుగను, చెవియందు వ్యానవాయువుగను, వాక్కులో అపానవాయుగను, సమానవాయువుగా మనస్సులో అపానవాయువుగను పనిచేయును).

  1. పాయూపస్థే(అ)పానం, చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణః ప్రతిష్టతే; మధ్యేతు సమానః |

ఏషహ్యే తద్ధృత మన్నం సమం నయతి, తస్యాదేతాః సప్తార్బిషో భవంతి ” (ప్రశ్నోపనిషత్ - 3- 5 -)

(వాయువు, ఉపస్థు - వీటిలో అపానముండి వాటి పనులు చేయించును, కండ్లు, చెవులు, నోరు, ముక్కు వీటిలో ప్రాణము సంచరించుచు వాటిచేత పనులు చేయించును - శరీరమధ్యమందు సమానవాయువు సంచరించుచు శరీరమంత టను సమానముగా ఆహారమును పంచి పెట్టుచుండును).

  1. “యథా సామ్రా దేవాధి కృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ ఏతాన్ గ్రామాన్ అధిష్టస్వ”, ఏవం ఏష ప్రాణం ఇత్రాన్ ప్రాణాన్ పృథక్ పృథగేవ స నిధత్తే” (ప్రశ్నోపనిషత్ - 3 - 4)

(రాజు తన క్రిందనున్న అధికారులను “నీవు ఈ గ్రామములోనుండి అధికారము చేయుము” అని ఒక్కొక్కరిని నియమించినట్లు ముఖ్యప్రాణము ఇతర ప్రాణములను - అపానము మొదలగు వాటిని - శరీరములోని వేరు వేరు భాగములలోనుండి వృత్తిని - మీ వ్యాపారమును చేయుచుండుడు అని నియమించెను).

  1. “అధ ఖలుప్రాణ ఏవ ప్రజ్ఞాత్మా ఇదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతి” ఇతి శరీరధారణం చ ముఖ్యస్య ప్రాణస్య ధర్మః.-

(“ప్రాణమే ప్రజ్ఞాత్మా ఈ శరీరము గ్రహించి లేవనెత్తుచున్నది” అని చెప్పబడియుండుటచేత శరీరధారణమే - శరీరమును ధరించియుండుటయే, జీవింపచేసియుండుటయే - ముఖ్య ప్రాణము యొక్క ధర్మము - వృత్తి. - పంచప్రాణములలో మొదటిది ముఖ్యప్రాణము).

  1. జీవుడు ప్రస్తుత దేహమును విడిచి మఱియొక దేహమునకు పోవునపుడు అతనితో ప్రాణముకూడా పోవును అని చెప్పబడినది - - (చనిపోయినప్పుడు - “ప్రాణముపోయినది” యని చెప్పుట వాడుకలోనున్నదేకదా ! -

    1. “బింబజీవుండు శరీరంబవలన

వెలువడి చన, జీవి పెనుకొని ప్రాణముల్ చనుచునుండు, నిజనాధు ననుసరించు

భటుల చందంబున - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 -)

  1. ప్రాణా నాంచ దేహాంతర ప్రతిపత్తౌ గతి శ్రావ్యతే : -

“తముత్క్రామాంతం ప్రాణో అనుత్క్రామతి, ప్రాణమనుత్క్రామంతం సర్వే ప్రాణాః అనుత్క్రామంతి” - ఇతి శ్రుతిః -

(జీవుడు - జీవాత్మ - ఒకదేహమును విడిచి యింకొక దేహమునకు పోవునపుడు ప్రాణముకూడా (పంచప్రాణములలో మొదటిది) అతనితో పోవును. అట్లు పోవునపుడు ముఖ్యప్రాణముననుసరించి మిగిలిన ప్రాణములు కూడ పోవును).

  1. “ప్రాణసంవాదాదిషుః” అధహ ప్రాణ అహం హి శ్రేయసే వ్యూదిరే “ఇత్యుపక్రమ్య” యస్మిన్ న ఉత్క్రాంత ఇదం శరీరం పాపిష్టి తరమివ దృశ్యతే స వ శ్శ్రేష్ట ఇతి చోపన్యస్య ప్రత్యేకం వాదా ద్యుపక్రమేణ న తద్వృత్తిమాత్ర హీనం యథా పూర్వం జీవనం ముఖ్యప్రాణస్య వైశేషికం కార్యం దర్శయిత్వాప్రాణోచ్చిక్రమిషా యాం వాగాది శైధిల్యాపత్తిం శరీరపాత ప్రసంగం చ దర్శయంతి శ్రుతిః. ప్రాణ నిమిత్తాం శరీరేంద్రియ స్థితిం దర్శయితి. : - “తాన్వరిష్టః ప్రాణ ఉవాచ -” మా మోహమాపద్యథా హమే వైతత్పంచథాత్మానం ప్రవిభజ్యై తద్బాణ మనష్టభ్య విధారయామీతి “చ - ఏతమేవార్థం శ్రుతిరాహ -” ప్రాణేన రక్షన్నవరం కులాయం“ఇతిచ”. (బృహదారణ్యకం - 4 - 3 - 12)

రక్షాం దర్శయతి - యస్మాత్కస్మాచ్చాంగాత్ ప్రాణ ఉత్క్రామతి తదేవ తచ్ఛుష్యతి, తేన యదశ్నాతి, యత్పి బతి తేనేత రాన్ప్రాణాన తీతి చ ప్రాణ నిమిత్తం శరీరేంద్రియ పుష్టిం దర్శయతి - కస్మిన్ వా వాముత్క్రాంతే ఉత్క్రాంతో భవిష్యామి, కస్మిన్ వా ప్రతిష్టితే (అ)హం ప్రతిష్టాస్యామీతి స ప్రాణమసృజత “ఇతి ప్రాణ నిమిత్త ఏవ జీవస్యోత్క్రాంతి ప్రతిష్టే దర్శయితి”.

(శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 2 - 4 - 11)

(ఇంద్రియములు ప్రాణము వాదించుకొనిన విషయము గుఱించి యీ విధముగా చెప్పబడినది : -

“సర్వే వాగాదయః ప్రాణాః అహమహం శ్రేష్ట ఇతి వివదమానాః ప్రజాపతి ముప జగ్ముః. స చ తానునా చ -”యస్మిన్ముత్క్రాంతే శరీరం పాపిష్టితరం భూత్వా పతిష్యతి. సః వః శ్రేష్తః ఇతి తథా క్రమేణ వాగాదిషూత్క్రాంతే ష్వపిమూకాది భావేన శరీరం స్వస్థమాస్థాత్, ముఖ్యప్రాణస్య తూచ్చిక్రమిష్యాయాం, సర్వేషాం వ్యాకులత్వాత్ అసౌ తన్వాదీన్ వరిష్టః ప్రాణ ఉవాచ - “యాయం మా మోహమపవ్యథ, యతో (అ)హమే వైతత్కరోమి కిం తత్? పంచథా ప్రాణాపాన భావేన ఆత్మానం విభాజ్యైతద్బాణముదష్టభ్య విధారయామి” ఇతి.

(శరీరములో ఏది అన్నింటికన్న శ్రేష్టమైనది అను ప్రశ్నరాగా ప్రాణములు ఇంద్రియములు “నేను శ్శ్రేష్టుడను, నేను శ్రేష్టుడను” అని ఒక్కొక్కరు చెప్పుచు వాదించుకొని ప్రజాపతి వద్దకు వెళ్ళి ఈ సమస్య పరిష్కరించవలసినదని కోరిరి. ప్రజాపతి వాటితో నిట్లు చెప్పెను - “మీలో ఎవరు శరీరమును విడిచి వెళ్ళిపోయిన ఈ శరీరము పాపిష్టిదై పడిపోవునో (నిర్జీవమగునో) వాడు మీలో శ్రేష్టుడు. అట్లు బ్రహ్మ చెప్పినమీదట వరుసగా వాక్కు మొదలగు ఇంద్రియములు ఒకటి తర్వాత నొకటిగా విడిచి వెళ్ళి చూచినవి. వాక్కు వెళ్ళిపోగా శరీరము మూగది అయినదేగాని మిగతా చేష్టలుకలది అయి యుండెను - ఈ ప్రకారము ఏ ఇంద్రియము శరీరమునుండి విడిచి వెళ్ళిపోయిన దాని వృత్తి శరీరమునకు లేకపోయెనుగాని శరీరము పడిపోలేదు - నిర్జీవము కాలేదు. కాని ముఖ్య ప్రాణులు శరీరమును వదలిపోగా అన్నియు వ్యాకులత చెందెను - ఏ ఇంద్రియమైనను పనిచేయలేదు - అప్పుడు ఈ ఇంద్రియములతో ముఖ్యప్రాణమిట్లనెను -”మీరు భయపడవలదు. నేను అయిదు విధములుగమారి (ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానముగా మారి) ఈ శరీరములో ప్రవేశించి దీనిని ధరించెదను - పడిపోకుండ చేసెదను“” అని. ఈ ప్రకారముగా వాక్కు మొదలగు ఇంద్రియములు శరీరములో వాటి వృత్తులు మాని వేసినను - శరీరమునుండి అవి వెడలినను శరీరము పడిపోదని, ప్రాణము శరీరమును వదలివేసిన శరీరము పడి పోవునని చెప్పి, ప్రాణమున్ననే శరీరము నిలబడునని నిర్ధారణ చేయుటకు శ్రుతి పైన చెప్పిన ప్రాణేంద్రియముల వాదము చెప్పియున్నది).

(పై దానినిబట్టి తెలియునదేమనగా శరీరము జీవించియుండుటకు, ఇంద్రియములు వాటి వాటి పనులు చేయుటకు ప్రాణము కారణము - ఇదియే అన్నింటికీ - ఇంద్రియములన్నింటికీ - చైతన్య శక్తి యిచ్చునది. దాని ద్వారా చైతన్య శక్తి శరీరములోని అన్ని భాగములకు ప్రసరించును. అదియే భగవంతుని శక్తి, లేక, తన శక్తి రూపములో భగవంతుడే).

Transliteration
  1. “yaḥ prāṇaḥ sa vāyuḥ” (prāṇamanagā vāyuvu) (prāṇavāyuvu - calanaśakti gala vāyuvu).

  2. prāṇiti jagat anēna iti prāṇaḥ -

(jagattunaku calanamu - cēṣṭa - kaligiṃcunadi).

  1. prērakaṃ sattāsphūrti pradaṃ.

(prērēpiṃcunadi - calanamu (activity) kalugacēyunadi - calanamunaku kāraṇamainadi, sattāsphūrti niccunadi. (Energy kalugacēyunadi).

  1. iṃdriyāṇi yaṃ prāṇaṃtaṃ cēṣṭāṃ kurvaṃtaṃ anupaścāt prāṇaṃti, cēṣṭāṃ kurvaṃti.

(iṃdriyamulaku vāṭi vāṭi cēṣṭalanu - vṛttulanu cēyunaṭlu śakti kaligiṃcunadi).

  1. vyāpaka śaktiḥ, pakvānāṃ bhūtānāṃ sūkṣmō rasasāraḥ prāṇaḥ -

(vyāpiṃcu śakti, pakvamaina bhūtamulaku - sthūlarūpamunu poṃduṭaku siddhamugānunna sūkṣma bhūtamulalōnunna sūkṣmamaina rasa sāramu).

  1. śarīrāvacchēdēna prāṇāpānādi saṃjñāṃ upagatō vāyuḥ -

(śarīrāvacchēdamu valana prāṇamu, apānamu anu modalagu pērlatō nuṃḍu vāyuvu).

  1. “mukha nāsikā saṃcāryā hṛdaya vṛttiḥ praṇayanāt prāṇaḥ” (śrīśaṃkaraḥ)

(mukhamaṃdu mukkolō saṃcariṃcu hṛdaya vṛttini cālanamu cēyuṭa cēta prāṇamu ani ceppabaḍinadi).

  1. “saṃcaraṇārha hṛdaya saṃbaṃdhinī yā vāyu vṛttiḥ - praṇayanāt puratō nissaraṇāt iti yāvat”. (ānaṃdagiri ṭīka)

(śarīramaṃtaṭanu saṃcariṃcunadinnī, hṛdayamunaku saṃbaṃdhiṃcinadī ayina vāyu vṛtti - muṃduku saṃcariṃpacēyuṭa valana jīviṃpacēyuṭa valana prāṇamu ani ceppabaḍinadi).

  1. “yadidaṃ kiṃca jagatsarvaṃ prāṇa ē jati niḥ sṛtaṃ” iti śrutiḥ.

(ī jagattu aṃtaṭinī caliṃpacēyunadi, śakti vaṃtamugā cēyunadi prāṇamu ani śruti vākyamu).

  1. prāṇō nāma prāggamanavān, nāsāgrasthānavartī.

(ūrthvamugā - mīdiki - pōvunadi, muṃduku pōvunadi. mukku civaranuṃḍi panicēyunadi)

(“prāṇaḥ hṛdayē”) ani śruti ceppucunnadi. (prāṇamu hṛdayamaṃduṃḍunu ani ceppucunnadi) kāni mana anubhavamulō prāṇa vāyuvu nāsika civaranu vyavahariṃcucunnaṭlu anubhavamagucunnanu dāni vyatti hṛdayamunaṃdē prāraṃbhamagucunnadi). (“hṛdiprāṇō” prāṇamu hṛdayamaṃduṃḍunu).

  1. prakṛṣṭānaṃda rūpatvāt prāṇaḥ.

(prakṛṣṭamaina ānaṃdarūpamaguṭa valana prāṇamu ani ceppabaḍinadi).

  1. “ējṛ kaṃpanē iti dhātōḥ kaṃpanārthakatvāt sarva jagatkaṃpana hētuḥ prāṇaḥ pratīyatē”.

(prāṇamu anumāṭa ‘ējṛ’ anu dhātuvu (root word) lōnuṃḍi puṭṭinadi. dāni arthamu kaṃpanamu - calanamu cēyuṭa, caliṃpa cēyuṭa (activate). aṃducēta samastamaina jagattunu caliṃpa cēyunadi).

  1. nāsādi sthānavartī -“vāyuḥ prāṇō bhūtvā nāśikē prāviśat” (taittarīyōpaniṣat - 2 - 4)

(nāsādi = nāsikā paryaṃtāni, sthānāni ādi padārthaḥ).

(“vāyuvu prāṇamugā māri nāśikayaṃdu pravēśiṃcenu” ani taittarīyōpaniṣadvākyamu - iṃduvalana prāṇamu nāsika paryaṃtamugala sthānamulanaṃdu saṃcariṃcunadi ani teliyavaccunu - vāyuvu sūryaraśmivalana tējassutō kalisi cicchakti rūpamai prāṇarūpamugā mārenu).

  1. cēṣṭāṃ karōti śvasana rūpēṇa.

(śvāsarūpamulō cēṣṭa kaligiṃcuvāḍu - cētanatvamu kaligiṃcuvāḍu - bhagavaṃtuḍu).

  1. prāṇiti kṣētrajñarūpēṇa, prāṇātmanā cēṣṭayan vā prāṇaḥ.

(kṣētrajña rūpamulō kṣētramanu śarīramulōnuṃḍi śarīramunaku - dāni avayavamulaku, cēṣṭa (calanamu) (activity) kaligiṃcuvāḍu) (bhagavaṃtuḍu).

  1. sūtrātmanā prajāḥ prāṇayatīti prāṇaḥ -

(sūtrātma rūpamulō anni jīvulalō nuṃḍi vāṭini prāṇamu galavāṭinigā - jīviṃciyuṃḍunaṭlugā - cēyuvāḍu (paramātma) - sūtrātma = kriyā śaktiḥ).

  1. “sa ēṣa prāṇa ēva prajñātmānaṃ dō, ajarō amṛtaḥ” -

(ī prāṇamē prajñātmā, ānaṃdamayuḍu, ajarāmaruḍu).

  1. sarvasya savāyukasya ca jagataḥ jīvanādi cēṣṭā hētutvāt prāṇaśabda vācyaḥ paramātmā.

(vāyuvutō sahitamugā samasta jagattunaku jīvanamu (jīviṃpacēyuṭa modalagu cēṣṭalaku kāraṇamainavāḍu kanuka prāṇamanagā paramātma).

  1. prāṇaṃ vāyvātmānaṃ prāṇana śaktimaṃtaṃ.

(śarīramunu prāṇanaśakti galadāninigā cēyu vāyuvu - jīviṃci yuṃḍu śakti niccunadi).

  1. dēva manuṣya paśavaḥ prāṇaṃ anu prāṇaṃ ti, prāṇādhīna jīvanāḥ ityarthaḥ.

(dēvatalu, manuṣyulu, paśuvulu jīviṃciyuṃḍuṭaku prāṇamu mīda ādhārapaḍiyunnāru).

  1. “prāṇōhi bhūtānāmāyaḥ, tasmāt sarvāyuṣa mucyatē”. (taittarīyōpaniṣat)

“yasmāt bhūtānāṃ prāṇināṃ prāṇa ēva āyuḥ jīvanaṃ, tasmāt sarvēṣāṃ āyurēva sarvāyuṣa mucyatē -” “yāvat hi asmin śarīrē prāṇōvasati tāvadāyuḥ” iti śrutēḥ prāṇāpagamē maraṇa prasiddēḥ prasiddhaṃ lōkē.

(bhūtamulaku prāṇamu āyuvu. aṃducēta prāṇamu aṃdaṟiki āyuvu ani taittarīyōpaniṣattulō ceppabaḍinadi. prāṇamugala bhūtamulaku prāṇamē āyuvu, jīviṃpacēyunadi - aṃducēta aṃdaṟiki āyuvu kanuka prāṇamu sarvāyuvani ceppabaḍinadi - “ī śarīramulō eṃtavaṟaku prāṇamuṃḍunō aṃtavaṟakē āyurdāyamu -” ani śruti ceppucunnadi - prāṇamu pōvuṭē maraṇamu ani lōkamulō prasiddhiyē kadā).

“sarvēṣāṃ bhūtānāṃ yāvat śarīrē prāṇōvasati, tāvadhāyuḥ” iti prāṇasya ucchvāsa niśvāsanādi lakṣaṇa sarvabhūtāyurhētutvaṃ.

(samasta bhūtamulaku śarīramulō eṃtavaṟaku prāṇamuṃḍunō aṃtavaṟaku āyurdāyamu ani ceppuṭavalana prāṇamu yokka ucchvāsamu modalagu lakṣaṇamulu āyuvunaku kāraṇamu).

  1. prāṇō brahmētyava jānāt “.

(prāṇamē brahma ani telusukonumu).

  1. prāṇinaḥ prāṇavaṃtaḥ -

(prāṇamugalavāru - prāṇulu).

  1. “āpōmayaṃ prāṇaḥ” prāṇavā āpaḥ.

(prāṇamu jalamayamu - jalamulō pūrtigā niṃḍiyunnadi. (Hydrogen + Oxygen = Water). nīṭilō prāṇamunnadi (prāṇavāyuvunnadi). aṃducētanē nīṭilōnunna jīvulaku gālilōnunna prāṇavāyuvu avasaramulēdu - aṃducētanē vāṭiki jalamu jīvanaṃbani ceppabaḍinadi –

“ā. jīvanaṃbu tanaku jīvanaṃbai yuṃṭa

nalavu balamunaṃtakaṃtakekki

makarameppi - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - gajēṃdramōkṣamu - 8 - 4 - 61)

jīvanamu = jīviṃpacēyunadi - jīvanamu = nīru).

“abhyōkiṃca prāṇaḥ” (prāṇamu puṭṭuṭaku kāraṇamu nīru - nīṭilō prāṇavāyuvunnadani yarthamu).

  1. “na prāṇēna, nā pānēna martyō jīvati kaścana |

itarēṇatu jīvaṃti yasminnētā vupāśritau ||“. (kaṭhōpaniṣat)

(martyuḍu - manuṣyuḍu maraṇiṃcu svabhāvamu kalavāḍu - prāṇavāyuvucētagāni, apānavāyuvucētagāni jīviṃciyuṃḍuṭa lēdu - prāṇavāyuvunaku, apānavāyuvunaku āśrayamainadē bhagavaṃtuḍu. atani valananē jīviṃciyunnāḍu. bhagavaṃtuḍu tana cicchaktini - sattāsphūrtini vāyuvunakicci dānicēta ī prāṇāpānavāyuvula vṛttulanu cēyiṃcu cunnāḍu - aṃducēta bhagavaṃtuni śakti valananē manuṣyuḍu - prati jīvi - jīviṃciyunnāḍu. “yasminnētau prēryatvēna sthitau tēna itarēṇa brahmaṇā sarvē prāṇādi vyāpāraṃ kurvaṃtītyarthaḥ”.

(prāṇāpānamulu reṃḍunu prērēpaṇa cēyuṭaku dēni nāśrayiṃci yunnavō - dēnimīda ādhārapaḍiyunnavō - ā brahma valananē ivi vāṭi vāṭi vyāpāramulu cēyucunnavi).

(prāṇāpānamulu reṃḍunu prērēpaṇa cēyuṭaku dēni nāśrayiṃci yunnavō - dēnimīda ādhārapaḍiyunnavō - ā brahma valananē ivi vāṭi vāṭi vyāpāramulu cēyucunnavi).

  1. “nīva prāṇamaraya nikhilamunaku” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 7 - 222)

  2. “kṛtē asthi sthitā prāṇā strētāyāṃ majjamāṃsayōḥ |

dvāparē tvaggatāḥ prōktāḥ kalē raktagatāḥ smṛtāḥ ||“. (cikitsāsāra saṃgrahamu)

(prāṇamulu kṛtayugamaṃdu asthigatamai yuṃḍenu, trētāyugamaṃdu majja māṃsamula nāśrayiṃci yuṃḍenu -dvāpara yugamaṃdu carmamu nāśrayiṃci yuṃḍenu - kaliyugamaṃdu raktamunāśrayiṃciyuṃḍunu. aṃducēta - raktamu śarīramaṃtaṭanu vyāpiṃciyuṃḍunu. kanuka prāṇamukūḍa śarīramaṃtaṭanu vyāpiṃciyuṃḍunu. śarīramulōni aṇuvu aṇuvulōnu vyāpiṃciyuṃḍunu - guṃḍelōnō, ūpiritittulalōnō, śirassulōnō uṃḍunani kādu - life exists not only in the heart, in the lungs or in the brain but in every infinitismal part of the body. śarīramulō yē aṃśalōnaina prāṇamu lēnicō adi pakṣavātamu - partial paralyses - anipiṃcukonunu - dāni vṛtti adi cēyuṭa uṃḍadu - not functioning).

  1. prāṇādi bhēdaḥ pavanō dēhamāśritya tiṣṭati |

tasyadhāmāni gatayaḥ karmāṇi ca pṛdhak pṛdhak |

sarvabhēdēṣvapi sa prāṇō balīmārthnisamāśritaḥ |

tatrasthōpi sahṛt kaṃṭhamuraśca na vimuṃcati |

śēṣāṇāmapyapānādi vātānāṃ balamēdhayan |

viśēṣātsarva nāḍīṣu prāṇō vahati sarvadā |

tasmin balahīnēca vikalaḥ prayātē (a)smin prayāti ca |

āyurbalaṃ smṛtirmēthā sarva varṇēṃdriyāgnayaḥ |

prāṇasya bhēdamāsādya vartayaṃ tīva kṛśnaśaḥ |

sōpi dēhaṃ samāsādya śubhāśubha nibaṃdhanaṃ |

ātmanō(a)dhika malpaṃdā madhyavā āyuḥ karōtica |

tasmāddānadayā dharma brahma carya rasāyanaiḥ |

yatnaṃ prāṇasthitau kuryāt trivargastannibaṃdhanaḥ ||“. (cikitsāsārasaṃgrahamu -)

(prāṇamu, apānamu anu modalagu bhēdamulatō vāyuvu - gāli - dēhamu nāśrayiṃciyunnadi. adi yuṃḍusthalamulu, dāni gatulu (saṃcāramu), karmalu (avi cēyupanulu). vēṟu vēṟuganuṃḍunu. vēṟu vēṟu bhēdamulatōnunnanu vāyuvu śirassunaṃdu balamugā nuṃḍunu. śirassunaṃdunnappaṭikī hṛdayamunu,kaṃṭhamunu, vakṣasthalamunu vadali uṃḍadu. apānamu modalagu nitaraprāṇamulaku kūḍa balamuniccunu - anni nāḍulayaṃdunu prāṇamu balamunu prasariṃpacēyunu - prāṇamu balamu galigiyunna yaḍala nūru saṃvatsaramula āyurdāyamuṃḍunu, adi balahīnamaina yaḍala āyurdāyamu kṣīṇiṃcunu. āyurdāyamunu balamu, smṛti, mēthā, svaramu, varṇamu, iṃdriyamula agnulu - ivanniyu prāṇa bhēdamunu baṭṭiyē pravartiṃcucuṃḍunu - kalugucuṃḍunu. prāṇamu dēhamu nāśrayiṃci śubhā śubhamulanu kalugacēyucunnadi. dānini baṭṭiyēāyurdāyamu adhikāyurdāyamaniyu, alpāyurdāyamaniyu, madhyamāyurdāyamaniyu kalugucuṃḍunu - aṃducētanē dānamu, dharmamu, daya, brahmacaryamu, rasāyanamulu (auṣadhamulu) modalagu vāṭitō prāṇamu śarīramulō balamugā nilabaḍiyunnaṭlu cēyavalayunu).

  1. “rētassēva prāṇaṃ dathāti”.

(rētassē prāṇamunu dhariṃciyunnadi - rētassulō prāṇamu - prāṇa śakti yunnadi).

  1. prāṇamu yokka sṛṣṭi yī kriṃda vidhamugā ceppabaḍinadi : -

    1. “apaṃcīkṛta mahābhūta rajōṃśabhāgatraya samaṣṭitaḥ prāṇamasṛjat”.

(paṃcīkaraṇamugāni paṃcabhūtamula yokka miśra rajōguṇāṃśamu valana prāṇamunu bhagavaṃtuḍu sṛṣṭiṃcenu); (rajōguṇamu vikṣēpa svabhāvamugaladikanuka rajōguṇamu valana puṭṭuṭacēta prāṇamunaku vikṣēpaśakti kaligenu).

  1. “sa (brahma) paṃcabhūtānāṃ rajōṃśāṃścaturdhā kṛtvā bhāgatrayāt paṃcavṛtyātmakaṃ prāṇamasṛjat” (paiṃgalōpaniṣat)

(brahma paṃcabhūtamula yokka rajōguṇāṃśamunu nālugu bhāgamulugā cēsi, mūḍubhāgamulatō ayidu vidhamula vṛttulugala prāṇamunu sṛjiṃcenu).

  1. ātmanaḥ ēṣa prāṇō jāyatē (praśnōpaniṣat)

(ātmavalana prāṇamu puṭṭucunnadi).

  1. “ētasmādātmanaḥ sarvē prāṇāḥ yathāyatanaṃ vipratiṣṭhaṃtē” (kauśītakī brāhmaṇamu)

(ī ātmanuṃḍiyē prāṇamulanniyu puṭṭucunnavi).

  1. “taijasaṃbayina rājasāhaṃkāraṃbuvalana - - - kriyā janakāṃtaḥkaraṇāika bhāgaṃbayina prāṇaṃbunuṃ galige” -

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)

  1. “vāyuvunaku barānvayaṃbuna śabdaṃbu sparśaṃbunanu reṃḍuguṇaṃbulu galigi yuṃḍu. adi dēhaṃbulaṃduṃḍuṭaṃ jēsi prāṇarūpaṃbai iṃdriya manaśśarīra pāṭavaṃbaina yōjassahō balaṃbulaku hētuvai vartiṃcu -”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)

  1. “prāṇamu ayidu vidhamulu : -.

    1. prāṇāpāna vyānōdāna samānō naḥ - ityēvaṃ sarvaprāṇa ēva” “prāṇa ēva prāṇinā pānana vyānanō dānana samāna nākhya vyāpāraiḥ prāṇāpānavyānō dāna samāna nāmakassan, tadvṛttidvārā upakārakaḥ; ana iti sāmānya nāma kaścēti yāvat”.

(śrīraṃga rāmānujaḥ)

“anaḥ iti ēṣāṃ vṛtti viśēṣāṇāṃ sāmānya bhūtā sāmānya dēha cēṣṭā saṃbaṃdhinī vṛttiḥ -”.

(prāṇamu, apānamu, vyānamu, udānamu, samānamu anunavi ayidunnū prāṇamē. ivi cēyu vṛttulabaṭṭi prāṇamunakē yī pērlu vaccinavi. ī pērlatō prāṇamē ā panulu cēyucunnadi).

  1. “prāṇāpānādi vṛtti bhēdāt prāṇaḥ ēva paṃcathāvyapidiśyatē - yathā ēkamēva manaḥ kāmādi vṛtti bhēdēna taiḥ śabdaiḥ abhidhīyatē iti - śrutiḥ āha : -”kāmaḥ saṃkalpaḥ” ityārabhya “hrīrthīrbhīḥ” ityētatsarvaṃ manaḥ ēva ” iti. apānādi samāna paryaṃtaṃ vyapadiśya - “ē tatsarvaṃ prāṇa ēva” iti vyapadēśāt prāṇa ēva paṃcavṛttiḥ ityavagamyatē”.

(prāṇavṛtti, apānavṛtti anu modalagu vṛttula bhēdamuvalana okka prāṇamē ayidu vidhamulugā ceppabaḍinadi. “kāmamu, saṃkalpamu” ani ceppuṭa modalupeṭṭi “hrīḥ, dhīḥ, bhīḥ” varaku galavanniyu manassēyani śruti ceppinaṭlu apānamu modalu samānamu vaṟaku yī ayidu prāṇamulu ceppi ivanniyu prāṇamēyani ceppabaḍinadi. iṭlanuṭa valana prāṇamē yī ayidu vidhamulagu vṛttulanu cēyucunnadi ani telusukonavalenu).

  1. prāṇāpānavyānōdānāḥ prāṇavṛttayaḥ; vacanādinā gamanānaṃda visargāḥ tadviṣayāḥ -

(prāṇa, apāna, vyāna, udāna prāṇa vṛttulu - vacana, ādāna, agamana, ānaṃda visargamulu vāṭiviṣayamulu).

  1. “vācyapāna rūpā tanuḥ pratiṣṭitā, śrōtrē. vyānarūpā, cakṣuṣi prāṇarūpā, manasi samānarūpā -.” sa prāṇaḥ, taccakṣuṣaḥ, savyānaḥ tacchrōtraṃ, sāpāna ssavāk, sa samānastanmanakaḥ.” iti śrutēḥ”.

(apānavāyuvu śarīramaṃtaṭanu nuṃḍunu - śrōtramaṃdu vyānavāyuvugānu, kaṃṭiyaṃdu prāṇavāyuvugānu, manassulō samānavāyuvuganu pani cēyunu - kaṃṭilō prāṇavāyuvuganu, ceviyaṃdu vyānavāyuvuganu, vākkulō apānavāyuganu, samānavāyuvugā manassulō apānavāyuvuganu panicēyunu).

  1. pāyūpasthē(a)pānaṃ, cakṣuśrōtrē mukhanāsikābhyāṃ prāṇaḥ pratiṣṭatē; madhyētu samānaḥ |

ēṣahyē taddhṛta mannaṃ samaṃ nayati, tasyādētāḥ saptārbiṣō bhavaṃti ” (praśnōpaniṣat - 3- 5 -)

(vāyuvu, upasthu - vīṭilō apānamuṃḍi vāṭi panulu cēyiṃcunu, kaṃḍlu, cevulu, nōru, mukku vīṭilō prāṇamu saṃcariṃcucu vāṭicēta panulu cēyiṃcunu - śarīramadhyamaṃdu samānavāyuvu saṃcariṃcucu śarīramaṃta ṭanu samānamugā āhāramunu paṃci peṭṭucuṃḍunu).

  1. “yathā sāmrā dēvādhi kṛtān viniyuṃktē ētān grāmān ētān grāmān adhiṣṭasva”, ēvaṃ ēṣa prāṇaṃ itrān prāṇān pṛthak pṛthagēva sa nidhattē” (praśnōpaniṣat - 3 - 4)

(rāju tana kriṃdanunna adhikārulanu “nīvu ī grāmamulōnuṃḍi adhikāramu cēyumu” ani okkokkarini niyamiṃcinaṭlu mukhyaprāṇamu itara prāṇamulanu - apānamu modalagu vāṭini - śarīramulōni vēru vēru bhāgamulalōnuṃḍi vṛttini - mī vyāpāramunu cēyucuṃḍuḍu ani niyamiṃcenu).

  1. “adha khaluprāṇa ēva prajñātmā idaṃ śarīraṃ parigṛhya utthāpayati” iti śarīradhāraṇaṃ ca mukhyasya prāṇasya dharmaḥ.-

(“prāṇamē prajñātmā ī śarīramu grahiṃci lēvanettucunnadi” ani ceppabaḍiyuṃḍuṭacēta śarīradhāraṇamē - śarīramunu dhariṃciyuṃḍuṭayē, jīviṃpacēsiyuṃḍuṭayē - mukhya prāṇamu yokka dharmamu - vṛtti. - paṃcaprāṇamulalō modaṭidi mukhyaprāṇamu).

  1. jīvuḍu prastuta dēhamunu viḍici maṟiyoka dēhamunaku pōvunapuḍu atanitō prāṇamukūḍā pōvunu ani ceppabaḍinadi - - (canipōyinappuḍu - “prāṇamupōyinadi” yani ceppuṭa vāḍukalōnunnadēkadā ! -

    1. “biṃbajīvuṃḍu śarīraṃbavalana

veluvaḍi cana, jīvi penukoni prāṇamul canucunuṃḍu, nijanādhu nanusariṃcu

bhaṭula caṃdaṃbuna - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 -)

  1. prāṇā nāṃca dēhāṃtara pratipattau gati śrāvyatē : -

“tamutkrāmāṃtaṃ prāṇō anutkrāmati, prāṇamanutkrāmaṃtaṃ sarvē prāṇāḥ anutkrāmaṃti” - iti śrutiḥ -

(jīvuḍu - jīvātma - okadēhamunu viḍici yiṃkoka dēhamunaku pōvunapuḍu prāṇamukūḍā (paṃcaprāṇamulalō modaṭidi) atanitō pōvunu. aṭlu pōvunapuḍu mukhyaprāṇamunanusariṃci migilina prāṇamulu kūḍa pōvunu).

  1. “prāṇasaṃvādādiṣuḥ” adhaha prāṇa ahaṃ hi śrēyasē vyūdirē “ityupakramya” yasmin na utkrāṃta idaṃ śarīraṃ pāpiṣṭi taramiva dṛśyatē sa va śśrēṣṭa iti cōpanyasya pratyēkaṃ vādā dyupakramēṇa na tadvṛttimātra hīnaṃ yathā pūrvaṃ jīvanaṃ mukhyaprāṇasya vaiśēṣikaṃ kāryaṃ darśayitvāprāṇōccikramiṣā yāṃ vāgādi śaidhilyāpattiṃ śarīrapāta prasaṃgaṃ ca darśayaṃti śrutiḥ. prāṇa nimittāṃ śarīrēṃdriya sthitiṃ darśayiti. : - “tānvariṣṭaḥ prāṇa uvāca -” mā mōhamāpadyathā hamē vaitatpaṃcathātmānaṃ pravibhajyai tadbāṇa manaṣṭabhya vidhārayāmīti “ca - ētamēvārthaṃ śrutirāha -” prāṇēna rakṣannavaraṃ kulāyaṃ”itica”. (bṛhadāraṇyakaṃ - 4 - 3 - 12)

rakṣāṃ darśayati - yasmātkasmāccāṃgāt prāṇa utkrāmati tadēva tacchuṣyati, tēna yadaśnāti, yatpi bati tēnēta rānprāṇāna tīti ca prāṇa nimittaṃ śarīrēṃdriya puṣṭiṃ darśayati - kasmin vā vāmutkrāṃtē utkrāṃtō bhaviṣyāmi, kasmin vā pratiṣṭitē (a)haṃ pratiṣṭāsyāmīti sa prāṇamasṛjata “iti prāṇa nimitta ēva jīvasyōtkrāṃti pratiṣṭē darśayiti”.

(śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 2 - 4 - 11)

(iṃdriyamulu prāṇamu vādiṃcukonina viṣayamu guṟiṃci yī vidhamugā ceppabaḍinadi : -

“sarvē vāgādayaḥ prāṇāḥ ahamahaṃ śrēṣṭa iti vivadamānāḥ prajāpati mupa jagmuḥ. sa ca tānunā ca -”yasminmutkrāṃtē śarīraṃ pāpiṣṭitaraṃ bhūtvā patiṣyati. saḥ vaḥ śrēṣtaḥ iti tathā kramēṇa vāgādiṣūtkrāṃtē ṣvapimūkādi bhāvēna śarīraṃ svasthamāsthāt, mukhyaprāṇasya tūccikramiṣyāyāṃ, sarvēṣāṃ vyākulatvāt asau tanvādīn variṣṭaḥ prāṇa uvāca - “yāyaṃ mā mōhamapavyatha, yatō (a)hamē vaitatkarōmi kiṃ tat? paṃcathā prāṇāpāna bhāvēna ātmānaṃ vibhājyaitadbāṇamudaṣṭabhya vidhārayāmi” iti.

(śarīramulō ēdi anniṃṭikanna śrēṣṭamainadi anu praśnarāgā prāṇamulu iṃdriyamulu “nēnu śśrēṣṭuḍanu, nēnu śrēṣṭuḍanu” ani okkokkaru ceppucu vādiṃcukoni prajāpati vaddaku veḷḷi ī samasya pariṣkariṃcavalasinadani kōriri. prajāpati vāṭitō niṭlu ceppenu - “mīlō evaru śarīramunu viḍici veḷḷipōyina ī śarīramu pāpiṣṭidai paḍipōvunō (nirjīvamagunō) vāḍu mīlō śrēṣṭuḍu. aṭlu brahma ceppinamīdaṭa varusagā vākku modalagu iṃdriyamulu okaṭi tarvāta nokaṭigā viḍici veḷḷi cūcinavi. vākku veḷḷipōgā śarīramu mūgadi ayinadēgāni migatā cēṣṭalukaladi ayi yuṃḍenu - ī prakāramu ē iṃdriyamu śarīramunuṃḍi viḍici veḷḷipōyina dāni vṛtti śarīramunaku lēkapōyenugāni śarīramu paḍipōlēdu - nirjīvamu kālēdu. kāni mukhya prāṇulu śarīramunu vadalipōgā anniyu vyākulata ceṃdenu - ē iṃdriyamainanu panicēyalēdu - appuḍu ī iṃdriyamulatō mukhyaprāṇamiṭlanenu -”mīru bhayapaḍavaladu. nēnu ayidu vidhamulugamāri (prāṇamu, apānamu, vyānamu, samānamu, udānamugā māri) ī śarīramulō pravēśiṃci dīnini dhariṃcedanu - paḍipōkuṃḍa cēsedanu”” ani. ī prakāramugā vākku modalagu iṃdriyamulu śarīramulō vāṭi vṛttulu māni vēsinanu - śarīramunuṃḍi avi veḍalinanu śarīramu paḍipōdani, prāṇamu śarīramunu vadalivēsina śarīramu paḍi pōvunani ceppi, prāṇamunnanē śarīramu nilabaḍunani nirdhāraṇa cēyuṭaku śruti paina ceppina prāṇēṃdriyamula vādamu ceppiyunnadi).

(pai dāninibaṭṭi teliyunadēmanagā śarīramu jīviṃciyuṃḍuṭaku, iṃdriyamulu vāṭi vāṭi panulu cēyuṭaku prāṇamu kāraṇamu - idiyē anniṃṭikī - iṃdriyamulanniṃṭikī - caitanya śakti yiccunadi. dāni dvārā caitanya śakti śarīramulōni anni bhāgamulaku prasariṃcunu. adiyē bhagavaṃtuni śakti, lēka, tana śakti rūpamulō bhagavaṃtuḍē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.