← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణాత్మవాదము prāṇātmavādamu

Original — తెలుగు

హిరణ్యగర్భోపాసకులు ప్రాణను ఆత్మయందురు. ప్రాణమేమాత్రమున్నను జీవమున్నట్లే - జీవించి యున్నట్లే. ప్రాణ శేషమేమియు లేదన్న మృతుడందురు - నేత్రము లేకున్న అంధుడందురు, - చెవి పనిచేయకపోయిన చెవిటివాడందురు, వాక్కు లేకున్న మూగవాడందురు. ఏ యింద్రియములేకపోయిన - పని చేయకపోయినను,మిగిలిన ఇంద్రియములు పనిచేయును - శరీరము కాంతివంతకుగనే యుండును. కాని ప్రానము పోయిన శరీరము కాంతిని కోల్పోయి ప్రేతకళ కలిగి, అమంగళమై భయమును కలిగించును - సుషుప్తియందు ఇంద్రియవ్యాపారముండదు. కాని ప్రాణముండుటవలన జీవించియుండును - శరీరము పతనముకాదు. జననమరణములు - జీవించియుండుట, మరణించుట ఇన్రియముల వశములో లేనివి. స్థూల శరీరమునకు ప్రాణముతో వియోగము మరణము - కాని జీవన మరణములు ప్రాణాధీనములు. అందుచేత ప్రాణమే ఆత్మయని హిరణ్యగర్భుల వాదము - కాని ఈ వాదము ఖండింపబడినది - ప్రాణము పైకి పోవుటవలన మరణముకాదు - లోని జఠరాగ్ని పైకి పోవుటవలన మరణమగును - జఠరాగ్ని దేహములో నుండుటచేతనే శరీరము ఉష్ణత కలిగి యుండును - (body temperature) - ఈ జఠరాగ్నియే వైశ్యానరుడను పేరుతోనున్న పరబ్రహ్మ –

“అహం వైశ్యానరో భూత్వా - ప్రాణినాం దేహమాశ్రితః | పచామ్యన్నం చతుర్విధం ||”. (శ్రీమద్భగవద్గీత - 15 - 14)

అందుచేత ప్రాణము ఆత్మకాదు - దానిలోనున్న పరబ్రహ్మ యొక్క తేజస్సు - దానిలో తేజోరూపములోనున్న పరమాత్మ - సూర్య రస్మిలోని పరబ్రహ్మ తేజస్సు వాయువుతో కలిసి శరీరములో ప్రవేశించి పరమాత్మ యొక్క చిచ్ఛక్తి, లేక, చైతన్య శక్తి)..

Transliteration

hiraṇyagarbhōpāsakulu prāṇanu ātmayaṃduru. prāṇamēmātramunnanu jīvamunnaṭlē - jīviṃci yunnaṭlē. prāṇa śēṣamēmiyu lēdanna mṛtuḍaṃduru - nētramu lēkunna aṃdhuḍaṃduru, - cevi panicēyakapōyina ceviṭivāḍaṃduru, vākku lēkunna mūgavāḍaṃduru. ē yiṃdriyamulēkapōyina - pani cēyakapōyinanu,migilina iṃdriyamulu panicēyunu - śarīramu kāṃtivaṃtakuganē yuṃḍunu. kāni prānamu pōyina śarīramu kāṃtini kōlpōyi prētakaḷa kaligi, amaṃgaḷamai bhayamunu kaligiṃcunu - suṣuptiyaṃdu iṃdriyavyāpāramuṃḍadu. kāni prāṇamuṃḍuṭavalana jīviṃciyuṃḍunu - śarīramu patanamukādu. jananamaraṇamulu - jīviṃciyuṃḍuṭa, maraṇiṃcuṭa inriyamula vaśamulō lēnivi. sthūla śarīramunaku prāṇamutō viyōgamu maraṇamu - kāni jīvana maraṇamulu prāṇādhīnamulu. aṃducēta prāṇamē ātmayani hiraṇyagarbhula vādamu - kāni ī vādamu khaṃḍiṃpabaḍinadi - prāṇamu paiki pōvuṭavalana maraṇamukādu - lōni jaṭharāgni paiki pōvuṭavalana maraṇamagunu - jaṭharāgni dēhamulō nuṃḍuṭacētanē śarīramu uṣṇata kaligi yuṃḍunu - (body temperature) - ī jaṭharāgniyē vaiśyānaruḍanu pērutōnunna parabrahma –

“ahaṃ vaiśyānarō bhūtvā - prāṇināṃ dēhamāśritaḥ | pacāmyannaṃ caturvidhaṃ ||”. (śrīmadbhagavadgīta - 15 - 14)

aṃducēta prāṇamu ātmakādu - dānilōnunna parabrahma yokka tējassu - dānilō tējōrūpamulōnunna paramātma - sūrya rasmilōni parabrahma tējassu vāyuvutō kalisi śarīramulō pravēśiṃci paramātma yokka cicchakti, lēka, caitanya śakti)..

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.