ప్రాణవాయును నిరోధించుట.
రేచక పూరక కుంభక లక్షణాః ప్రాణనిగ్రహోపాయాః ప్రాణాయామాః
(రేచకము, పూరకము, కుంభకము అను లక్షణములు గల ప్రాణ నిగ్రహణోపాయములు - ప్రాణమును తనవశములోనుంచుకొనుటకు ఉపాయములు - ప్రాణాయామములు).
(ప్రాణవాయువు, అపానవాయువు, సమముగా కలియుట ప్రాణాయామము)
శ్వాస ప్రశ్వాసల గతి నిరోధము - నాసిక ముఖముల యందు సంచరించెడు వాయువును మంత్ర పూర్వకముగా నిరోధించుట.
“శ్లో||. చిత్తాది సర్వభావేషు బ్రహ్మ త్వేనైవ భావనాత్ |
నిరోధిః సర్వవృత్తీనాం ప్రాణాయామః స ఉచ్యతే ||“.
(చిత్తమునందు దానికి సంబంధించిన సర్వభావములందు అంతయు బ్రహ్మమే యని నమ్మి, సమస్త వృత్తులను - మనోవృత్తులను, ఇంద్రియవృత్తులను - నిరోధించుట ప్రాణాయామము).
(స్థిరమైన, సుఖమైన ఆసనములోనుండి శ్వాస ప్రశ్వాసగతులను నిరోధించుట).
(పద్మాసనము, వీరాసనము, భద్రాసనము మొదలగు ఆసనములలో ఏదో ఒకటి వేసుకొని నిశ్వాస ప్రశ్వాసములగతిని - ఊపిరి లోనికి పీల్చుట, పైకి వదలుట ప్రాణగతిని నిరోధించుట ప్రాణాయామము - ఆసనములోనుండి పైనున్న వాయువును లోపలికి పీల్చుట నిశ్వాసము. శరీరములోనున్న వాయువును పైకి వదలుట ప్రశ్వాసము. ఈ రెండింటిగతిని ఆపుచేయుట - జరగకుండ చేయుట - ప్రాణాయామము).
త్రిం పరే దాయత ప్రాణః ప్రాణాయామస్స ఉచ్యతే ||“. (అమృతనాదోపనిషత్తు)
(ఓంకారముతో కలిపిన గాయత్రీమంత్రమును శిరోమంత్రముతో జపించుచు మూడు పర్యాయములు ప్రాణమును పీల్చవలెను. ఇది ప్రాణాయామము).
(ప్రాణాయామము చేయునపుడు ఓంకారమును సప్తవ్యాహృతులతో నుచ్చరించుచు లోపలికి గాలిని పీల్చవలెను - ఓంకారములతో గాయత్రి శిరస్సును (ఆపోజ్యోతి రసోమృతం) ఉచ్చరించునంతకాలము గాలిని పీల్చవలెను).
(మొదట నాడీ శుద్ధి చేసుకొనవలెను. ఆ తర్వాతనే ప్రాణాయామము నకు అధికారి యగును. నాడీ శుద్ధి కలవాడే ప్రాణాయామము చేయ నర్హుడు. ముక్కు కుడి రంధ్రమును బొటనవ్రేలుతో మూసి ఎడమ రంధ్రముతో వాయువును శక్తి కొలది లోనికి పీల్చవలెను - తరువాత కుడి రంధ్రములోనుండి పైకి విడిచిపెట్టవలెను - తరువాత కుడి రంధ్రముతో వాయువును పీల్చి ఎడమ రంధ్రముగుండా పైకి వదలివేయవలెను).
ప్రాణాయామం తతో గార్గి జితాసన గతో(అ)భ్యసేత్ |
మృద్వాసనే కుశాన్ సమ్యక్ ఆస్తీర్యాజిన మేవచ |
లంబోదరం చ సం పూజ్య ఫలమోదక భక్షణైః |
తదాసనే సుఖాసీనః సవ్యేన్యస్యేతరంకం |
సమగ్రీవ శిరాస్సమ్యక్ సమ్హృతాస్యస్సు నిశ్చలః |
ప్రాఙ్ముఖోదం ఙ్ముఖోవాపి నాసాగ్రన్యస్త లోచనః |
అతి భుక్త మభుక్తం చ వర్జయిత్వా ప్రయత్నతః |
నాడీ సంశోధనం కుర్యాత్ ఉక్తమార్గేణ యత్నతః |
వృథా క్లేశో భవేత్తస్య తచ్ఛోదనయ కుర్వతః |
నాసాగ్రే శశభృద్బీజం చంద్రావ వితాసితం |
సప్త మస్యతు వర్గస్య చతుర్థం బిందు సం యుతం |
విశ్వమధ్యస్థ మాలోక్య నాసాగ్రే చక్షుషీ ఉభే |
ఇడయా పూర యేత్ వాయుం బాహ్యం ద్వాదశమాత్ర కైః |
తతోగ్నిం పూర్వవత్ ధ్యాయేత్ స్ఫురజ్వాలావలీయుతం |
రుషష్టం (రేఫం చ) బిందు సం యుక్తం శిఖిమండల సంస్థితం |
ధ్యాయేద్వా రేచయేత్ వాయుం మందా పింగళాయా పునఃపునః |
పింగళాయా పూర్య ఘ్రాణం దక్షితః సుధీః |
తద్వద్వి రేచయే ద్వాయు మిడయాతు శనైః శనైః |.
(తనకిష్టమైన ఆసనములను విధిప్రకారమభ్యసించి ఆసన జయము పొందిన తర్వాత - ఒకే ఆసనమందు ఎంతకాలమైనను కూర్చునుటకు అలవాటు పడిన తర్వాతనే - ప్రాణాయామము నభ్యసించవలెను - ఫలములతోను ఉండ్రాళ్ళతోను పూజించవలెను. తర్వాత ఆసనములో కూర్చుని, శిరస్సు, మెడ ఓకేలాగున నిలిపి, కదలకయుండి, నాసాగ్రమును చూచుచు, ఆహారమును అమితముగా సేవించక, అట్లని తినక యుండక అలవాటు చేసుకోవలెను. ఇట్లు చేసిన నాడులు శుద్ధియగును. నాడులు శుద్ధిగానిచో వాని ప్రయత్నము వ్యర్థమే. ఇడానాడితో వాయువును పన్నెండుమాత్రల కాలము పూరించవలెను. తర్వాత పింగళనాడితో వాయువును రేచించవలెను. ఈ ప్రకారముగా ఇటునుండి అటు, అటునుండి ఇటు చేయుచుండవలెను).
వర్ణ త్రయాత్మకాః ప్రోక్తాః రేచ పూరక కుంభకాః |
స ఏష ప్రణవః ప్రోక్తః ప్రాణాయామస్తు తన్మయః |
ఇడయా వాయు మాకృష్య పూరయిత్వోదర స్థితం |
శనై ష్షోడశభిర్మాత్రైః అకారం తత్ర సంస్మరేత్ |
పూరితం ధారయత్ పశ్చాత్ చాతుష్షష్టా తు మాత్రాయా |
ఉకారమూర్తి మత్రాపి సంస్మరన్ ప్రణవం జపేత్ |
యావద్వా శక్యతే తావత్ ధారయే జ్జపవత్పరః |
పూరితం రేచయేత్ పశ్చాత్ మకారేణానిలం బుధః |
శనైః పింగళయాతత్ర ద్వాత్రింశన్మాత్రయా పునః |
ప్రాణాయామో భవదేషః తతశ్చైవం సమభ్యసేత్ |
పునః పింగళయా పూర్యమాత్రైః షోడశభిస్తథా |
అకారమూర్తి మాత్రాపి స్మపాదేకాగ్ర మానసః |
ధారయేత్ పూరితం విద్వాన్ - ప్రణవం సంజపన్ వశీ |
ఉకారమూర్తిం సంధ్యాయన్ చతుష్టష్ట్యా త మాత్రయా |
మకారం తు స్మరన్ పశ్చాత్ రేచయే దిడయా నిలం |
ఏవమేవ పునః కుర్యాత్ ఇడయా పూర్వ బుద్ధిమాన్ |
ఏవం సమభ్యాసన్నిత్యం ప్రాణాయామం మునీశ్వర |
- - - ప్రస్వేద జనకో యస్తు ప్రాణాయామేషు సో(అ)థమః |
కంపనం మధ్యమం విద్యాత్ ఉత్తానం చోత్తమం విదుః ||“. - (దర్శనోపనిషత్)
(రేచక పూరక కుంభకములు చేయుట ప్రాణాయామమని చెప్పబడినది. రేచక పూరక కుంభకములు ఓంకారములోని ‘అ, ఉ, మ’ అను మూడక్షరములు - ప్రాణాయామము ఓంకారమయము. వాయువును ఇడానాడిచే నాకర్షించి పదియారు ఓంకారమాత్రలకాలము లోపల పూరించి ఓంకారములోని ‘అ’ కారమును స్మరించవలెను. పూరించబడిన (లోనికి ఆకర్షించబడిన) వాయువును చతుష్షష్టి మాత్రలకాలము లోన ధరించి యుంచి ‘ఉ’ కారమూర్తిని స్మరించుచు ప్రణవమును జపించవలెను. అట్లు వాయువును శక్తి కొలది లోపల ధరించవలెను. అట్లు పూరించిన వాయువును పింగళనాడి ద్వారా ద్వాత్రింశన్మాత్రల కాలము మకారమును స్మరించుచు మెల్లిగా రేచించవలెను - పైకి వదలివేయవలెను. ఇదియే ప్రాణాయామము - ఈ ప్రకారము దీనిని అభ్యాసము చేయవలయును. తిరిగి పింగళనాడి ద్వారా పైవాయువును పదియారు మాత్రలకాలము అకారమూర్తిని స్మరించుచు లోనికి పీల్చవలెను - ఈ ప్రకారము పూరించిన వాయువును ప్రణవమును జపించుచు ‘ఉ’ కారమూర్తిని ధ్యానించుచు చతుష్షష్టి మాత్రలకాలము లోన ధరించి యుంచవలెను. తర్వాత ‘మ’ కారమూర్తిని ధ్యానించుచు ఇడానాడి ద్వారా వాయువును పైకి వదలివేయ వలెను.- రేచించవలెను - ఈ ప్రకారముగా ఇడానాడి ద్వారా మరల వాయువును పూరించ వలెను. ఈ ప్రకారముగా ఇడానాడి ద్వారా వాయువు పీల్చి నియతకాలములో స్తంభించియుంచి పింగళనాడి ద్వారా పైకి వదలుచూ చేయుట - అటునుండి ఇటు - ఇటునుండి అటు ఎల్లపుడు చేయుట అభ్యాసము చేసుకోవలయును. ఇట్లు ఈ ప్రాణాయామము నభ్యాసము చేసుకొనుటలో చెమట పట్టుట ఇట్లు ఈ ప్రాణాయామము నభ్యాసము చేసుకొనుటలో చెమట పట్టుటకలిగిన యడల అది అధమమనియు, కంపనము కలిగిన యడల అది మధ్యమమనియు, పైకి లేప కలిగిన యడల అది ఉత్తమ ప్రాణాయామమనియు తెలియవలెను).
గాయత్రీం శిరసాసార్థం స తుర్యపద సం యుతాం |
దక్షిణే రేచయే ద్వాయుం వామేన పూరితోదరం |
కుంభేన ధారయే న్నిత్యం ప్రాణాయామం విదుర్బుధాః |
పీడయే ద్దక్షిణాం నాడీం అంగుష్టే తధోత్తరాం |
కనిష్టా నామికాభ్యాం తు మధ్యమాం తర్జనీం త్యజేత్ |
రేచకః పూరకశ్చైవ ప్రాణాయామో ధ కుంభకః |
ప్రోచ్యతే సర్వ శాస్త్రేషు యోగిభిర్యతమానసైః |
రేజకస్సృజతే వాయుం పూరకః పూరయే త్తుతం |
సామ్యేన సంస్థ తిర్యస్తత్కుంభకం పరికీర్తితః |
నీలోత్పలదళ శ్యామం నాభి మధ్యే ప్రతిష్టితం |
చతుర్భుజం మహాత్మానం పూరకే చింతయేత్ హరిం |
కుంభకేతు హృదిస్థానే ధ్యాయేత్తు కమలాసనం |
ప్రజా పతిం జగన్నాధం చతుర్వక్త్రం పితామహం |
రేచకే శంకరం ధ్యాయేత్ లలాటస్థం మహేశ్వరం |
శుద్ధ స్ఫటిక సంకాశం నిర్మలం పాపనాశనం |
పూరకే విష్ణు సాయుజ్యం కుంభకే బ్రహ్మణో గతిం |
రేచకేన తృతీయం తు ప్రాప్నుయాత్ ఈశ్వరం పరం ||“. (డేవీ భాగవతం)
(ప్రణవమును స్మరించుచు ప్రాణాయామము చేయవలెను - ముక్కు ఎడమ రంధ్రములోనుండు నాడు ద్వారా లోనికి వాయువును పీల్చి కుడినాడితో పైకి వదలిపెట్టవలెను - పీల్చిన గాలిని లోపల స్తంభించవలెను. ఇదియే ప్రాణాయామము. వాయువును పూరించునపుడు నీలోత్పలదళము వలె శ్యామవర్ణము గలవాడున్నూ, నాలుగు భుజములుగలవాడూ అయిన శ్రీమహావిష్ణువును చింతించవలెను. కమలాసనుడు, ప్రజాపతి హృదయమందుండునట్టి చతుర్ముఖ బ్రహ్మను కుంభకము చేయునపుడు హృదయమందు ధ్యానించవలెను - శుద్ధస్ఫటికవలె తెల్లనైనవాడు, నిర్మలుడు పాపములను పోగొట్టువాడు, లలాటమందుండువాడు, మహేశ్వరుడు అయిన శివుని రేచకమందు ధ్యానించవలెను. ఇట్లు చేసిన పూరకమున విష్ణు సాయుజ్యమును, కుంభకమువలన బ్రహ్మ సాయుజ్యము., రేచకమువలన శివసాయుజ్యమును పొందును).
ధారయేత్ పూరితం యోగీ చతుష్షష్ట్యాతు మాత్రయా |
సుషుమ్నా మధ్యగం సమ్యక్ ద్వాత్రింశన్మాత్మయా శనైః |
నాఢ్యా పింగళయాచైవ రేచయేత్ యోగవిత్తమః |
ప్రాణాయామ మిమం ప్రాహుః యోగశాస్త్ర విశారదాః |
భూయో భూయః క్రమాత్తస్య బాహ్య మేవం సమాచరేత్ |
మాత్రా వృద్ధిః క్రమే చైవ సమ్యక్ ద్వాదశ షోడశ ||“. (శ్రీ దేవీ భాగవతం)
(షోడశమాత్రయా = షోడశ ప్రణవోచ్ఛారణేన బాహ్యం వాయుం ఆకర్షయ - చతుష్షష్తిసంఖ్య ప్రణవోచ్చారణ పర్యంతం కుంభకం కుర్యాత్. పునః ద్వా త్రింశత్ప్రణవోచ్చారణేన దక్షిణ నాసా పుటేన విరేచయేత్ ఇత్యర్థః. భూయో భూయో పునః పునః తస్య ఇడాపింగళా దేః - పునః ఇడా పింగళాదేః పునః పింగళేడాదేః క్రమాత్ బాహ్యం వాయుః ఏవం సమాచరేత్, గృహ్ణీయాత్, త్యజేత్ చ ఇత్యర్థః. మాత్రాణాం ప్రణవసంఖ్యానాం అపి ఉత్తరోత్తరం వృద్ధిః కర్తవ్యా. తథా ప్రాణాయామానామపి ప్రథమతః ద్వాదశ, తదుత్తరం కతి చిత్కాలా నంతరం, షోడశ ఇత్యేవం క్రమేణ వృద్ధిం కర్తవ్యా ఇత్యర్థః).
(పైన ఉన్న గాలిని ఇడానాడిద్వారా పదియారుమాత్రల పర్యంతము ఆకర్షించవలెను - అనగా, పదియారు మార్లు ప్రణవమునుచ్చరించుచు, లోనికి గాలిని పీల్చవలెను - చతుష్షష్టి మాత్రలనగా అన్ని పర్యాయములు ప్రణవమునుచ్చారణ చేయునంతకాలము కుంభకము చేయవలెను - ద్వాత్రింశన్మాత్రలకాలము అనగా అన్ని మార్లు ప్రణవమును నుచ్చరించు నంతకాలము కుడి ముక్కు రంధ్రముద్వారా పైకి వదలివేయవలయును - ఈ ప్రకారముగా ఒకనాడుద్వారా వాయువును పీల్చి యింకొక నాడిద్వారా పైకి వదలివేయుచు, ఇటునుండు అటు, అటునుండి ఇటు మార్చుచు చేయవలయును - మాత్రలు, అనగా ప్రణవమునుచ్చరించుసంఖ్య క్రమముగా వృద్ధి చేయవలెను. మాత్రలు ద్వాదశమాత్రలునుండి షోడశమాత్రలవరకు ఎచ్చించవచ్చును).
ప్రాణాయామము అనేక విధములుగా చెప్పబడినది -
స ఏవ ద్వివిధో ప్రోక్తః సహితః కేవలస్సదా |
యావత్కేవల సిద్ధిస్యాత్ తావత్స హితమభ్యసేత్ ||“. (యోగకుండల్యుపనిషత్)
(ప్రాణమనగా దేహములోనుండు వాయువు, ఆయామమనగా దానిని కుంభించి యుంచుట - పట్టి యుంచుట. ప్రాణ + ఆయామము = ప్రాణాయామము. ప్రాణాయామము రెండు విధములు -కేవల ప్రాణాయామము, కుంభకముతో కూడిన ప్రాణాయామము - ప్రాణము తనవశములో నుంచుకొనగలిగినంతవరకు కుంభకముతో ప్రాణాయామము నభ్యసించవలెను).
(ఆముక్తమాల్యద - అశ్వా -2)
(ప్రాణాయామము చేయునపుడు మొదట చెమట పట్టును. అది అధమ ప్రాణాయామము, కంపము కలుగునపుడు మధ్యమ ప్రాణాయామము, భూమిత్యాగము కలుగచేయునది ఉత్తమ ప్రాణాయామమని చెప్పబడును - భూమిని వదలి ఆసనము మీదనే (గాలిలో) ఉండుట భూమిత్యాగప్రాణా యామము అని సాంప్రదాయము).
(సగర్భ ప్రాణాయాము, విగర్భప్రాణాయామము అని ప్రాణాయామము రెండు విధములు - కుంభకముతో కలిసినది, కుంభకము లేనిది అని రెండు విధములు (చూడుము - 13 -1)
(1). స్వభావసిద్ధముగ - అప్రయత్నముగా - చేయునది ప్రాకృతము.
(2). ప్రయత్నము వలన చేయునది వైకృతము - ప్రాణవాయువులను ఒకదానితో నొకటి లయము చేయుట.
(3). బలాత్కారముగా వాయువును స్తంభించుట కేవల కుంభకము -.
(1) నాసికాయాః నామ ఛిద్రస్త ఇడాఖ్య నాడీద్వారా వాయోరంతర పూరణం కార్యం తదేవ పూరకం ఇత్యుచ్యతే (“అహం బ్రహ్మస్మి” ఇతి భావనా పూరకం)
(2) దక్షిణ నాసికాస్థ పింగళాఖ్యనాడీ ద్వారా వాయోః బహిః నిస్సరణం కార్యం, తదేవ రేచకం ఇత్యుచ్యతే (అనాత్మ ప్రపంచ నిషేధో రేచకః)
(3) సుషుమ్నా ద్వారా వాయోర్నిరోధనం కార్యం, తదేవ కుంభకం ఇత్యుచ్యతే. (అఖండాకార వృత్యా చలతా కుంభకః) ఇత్థం క్రియామాణానాం పూరక రేచక కుంభకానాం సముదాయః ప్రాణాయామః ఇత్యుచ్యతే.
(ప్రాణాయామము అనేక విధములుగా నున్నది - అయినను దాని లక్షణము సంగ్రహముగా చెప్పబడినది : -
(1) ముక్కులోని ఎడమ రంధ్రములోనుండు ఇడా అను పేరుగల నాడిద్వారా వాయువును లోపలికి పీల్చుట – పూరించుట (‘నేను ఆ బ్రహ్మను అయితిని’) అని భావించుట పూరకము.
(2). ముక్కు యొక్క కుడి రంధ్రములోనుండు పింగళయను పేరుగలనాడి ద్వారా వాయువును పైకి వదలివేయుట. ఇది రేచకమని చెప్పబడుచున్నది. (ఆత్మ కాని ప్రపంచమును నిషేధించుట రేచకము
(3). సుషుమ్నానాడి ద్వారా వాయువును నిరోధించుట కుంభకము. ఈ రీతిగ పూరక రేచకకుంభకములను చేయుచుండుట ప్రాణాయామమని చెప్పబడుచున్నది).
(ప్రాణాయామము, ఉత్తమప్రాణాయామమని మొదలగు ఆరు భేదములు గలది : - ప్రాణాయామము మొదట అభ్యసించునపుడు ప్రాణవాయువు మీదికి వచ్చును. ఇది అతి లఘువు అయిన ప్రాణాయామము - అంతకన్న అధికముగా అభ్యాసము చేసిన యడల వాయువు ఇంకను మీదికి వచ్చును - ఇది మొదటిదాని కన్న శ్రేష్టము - ఈ రెండు విధములగు ప్రాణాయామములు కనిష్ట ప్రాణాయామమని చెప్పబడును - ఇంకను అధికముగా నభ్యాసము చేసిన యడల చిత్తము స్థిరముగ నుండునట్లు చేయునది మధ్యమ ప్రాణాయామము - మధ్యమ ప్రాణాయామముగూడ రెండు విధములు - సగర్భ ప్రాణాయామము, అగర్భప్రాణాయామము - సగర్భమనగా మంత్రము, జపముతో కూడినది. అగర్భమనగా మంత్ర జపములు లేనిది. ఇంకను బాగుగ నభ్యసించిన యడల, చిత్తమింకను స్థిరపడిన యడల ఆ ప్రాణాయామము ఉత్తమ ప్రాణాయామము. అది రెండు విధములు - సలక్ష్యము, అలక్ష్యము - లక్ష్యదేవతను ధ్యానించుటతో కూడినది సలక్ష్యము - అలక్ష్యమనగా లక్ష్య దేవతాధ్యానము లేనిది. ప్రాణాయామము త్రివర్ణాత్మకమైన ఓంకారాత్మకమైనందువలన అది పరమాత్మ రూపము).
పైన చెప్పబడినదే ఈ క్రిందవిధముగా కూడ చెప్పబడినది : -
“సధూమశ్చ విధూమశ్చ సగర్భశ్చా స్యగర్భకః |
లక్ష్యశ్చాప్య లక్ష్యశ్చ ప్రాణాయామస్తు షడ్విధః ||“.
రేచయేత్ తతో అన్యేన శనై రేవ న వేగతః ||
యథా సింహో, గజో, వ్యాఘ్రో భవేత్ వశ్యః శనైః శనైః |
తదైవ సేవితో వాయుః, అన్యథా హంతి సాధకం ||“.
(ముక్కు యొక్క ఏ రంధ్రముతో లోపలికి పీల్చిన గాలిని పైకి వదులుదురో, ఆ రంధ్రముతోనే లోపలికి గాలిని పీల్చి లోపల ధరించియుండవలెను -కుంభకము చేయవలయును. ఆ గాలిని రెండవ రంధ్రముతో పైకి వదలవలెను. సింహమును, ఏనుగును, పెద్దపులిని ఏ విధముగా మెల్ల మెల్లగా వశము చేసుకొనుదురో, అట్లే మెల్ల మెల్లగా గాలిని పై ప్రకారము పూరక, కుంభక, రేచకములను మెల్ల మెల్లగా చేయవలెయును. తొందరగా చేసిన యడల అట్టి ప్రాణాయామము సాధకుని మరణమునకు కారణమగును).
మరణం తస్య నిష్క్రాంతిః తతో వాయుం నిరోధయేత్ ||“.
(శరీరములో వాయువున్నంతవఱకే జీవించియుండుట. ఆ వాయువు శరీరమునుండి నిష్క్రమించుటయే మరణము. అందుచేత జీవించియుండుటకు వాయువును నిరోధించవలెను. అట్లు నిరోధించుటయే ప్రాణాయామము).
(ప్రాణాయామము చేయుటవలన నశించిన మనోమలము గలవానికిమనస్సు పరబ్రహ్మ యందు - (పరబ్రహ్మ ధ్యానమందు) నిలుచును - స్థిరమగును).
(ప్రాణాయామము చేయుటవలన నాడులు శుద్ధి యగును - అందువలన ఆరోగ్యము బాగుగ నుండును).
(ముక్కులోని కుడిరంధ్రముద్వారా పీల్చినగాలి వేడిమి కలుగచేయుననియు, ఎడమరంధ్రముద్వారా పీల్చినగాలి చల్లదనము కలుగచేయుననియు - ఈ రెండింటి గాలి పీల్చుటచే సమధాతువు అగుననియు చెప్పుదురు - శైత్యము చేయునపుడు పైదానినవలంభించి చూచిన దాని యదార్థము తెలియనగును).
prāṇavāyunu nirōdhiṃcuṭa.
rēcaka pūraka kuṃbhaka lakṣaṇāḥ prāṇanigrahōpāyāḥ prāṇāyāmāḥ
(rēcakamu, pūrakamu, kuṃbhakamu anu lakṣaṇamulu gala prāṇa nigrahaṇōpāyamulu - prāṇamunu tanavaśamulōnuṃcukonuṭaku upāyamulu - prāṇāyāmamulu).
(prāṇavāyuvu, apānavāyuvu, samamugā kaliyuṭa prāṇāyāmamu)
śvāsa praśvāsala gati nirōdhamu - nāsika mukhamula yaṃdu saṃcariṃceḍu vāyuvunu maṃtra pūrvakamugā nirōdhiṃcuṭa.
“ślō||. cittādi sarvabhāvēṣu brahma tvēnaiva bhāvanāt |
nirōdhiḥ sarvavṛttīnāṃ prāṇāyāmaḥ sa ucyatē ||“.
(cittamunaṃdu dāniki saṃbaṃdhiṃcina sarvabhāvamulaṃdu aṃtayu brahmamē yani nammi, samasta vṛttulanu - manōvṛttulanu, iṃdriyavṛttulanu - nirōdhiṃcuṭa prāṇāyāmamu).
(sthiramaina, sukhamaina āsanamulōnuṃḍi śvāsa praśvāsagatulanu nirōdhiṃcuṭa).
(padmāsanamu, vīrāsanamu, bhadrāsanamu modalagu āsanamulalō ēdō okaṭi vēsukoni niśvāsa praśvāsamulagatini - ūpiri lōniki pīlcuṭa, paiki vadaluṭa prāṇagatini nirōdhiṃcuṭa prāṇāyāmamu - āsanamulōnuṃḍi painunna vāyuvunu lōpaliki pīlcuṭa niśvāsamu. śarīramulōnunna vāyuvunu paiki vadaluṭa praśvāsamu. ī reṃḍiṃṭigatini āpucēyuṭa - jaragakuṃḍa cēyuṭa - prāṇāyāmamu).
triṃ parē dāyata prāṇaḥ prāṇāyāmassa ucyatē ||“. (amṛtanādōpaniṣattu)
(ōṃkāramutō kalipina gāyatrīmaṃtramunu śirōmaṃtramutō japiṃcucu mūḍu paryāyamulu prāṇamunu pīlcavalenu. idi prāṇāyāmamu).
(prāṇāyāmamu cēyunapuḍu ōṃkāramunu saptavyāhṛtulatō nuccariṃcucu lōpaliki gālini pīlcavalenu - ōṃkāramulatō gāyatri śirassunu (āpōjyōti rasōmṛtaṃ) uccariṃcunaṃtakālamu gālini pīlcavalenu).
(modaṭa nāḍī śuddhi cēsukonavalenu. ā tarvātanē prāṇāyāmamu naku adhikāri yagunu. nāḍī śuddhi kalavāḍē prāṇāyāmamu cēya narhuḍu. mukku kuḍi raṃdhramunu boṭanavrēlutō mūsi eḍama raṃdhramutō vāyuvunu śakti koladi lōniki pīlcavalenu - taruvāta kuḍi raṃdhramulōnuṃḍi paiki viḍicipeṭṭavalenu - taruvāta kuḍi raṃdhramutō vāyuvunu pīlci eḍama raṃdhramuguṃḍā paiki vadalivēyavalenu).
prāṇāyāmaṃ tatō gārgi jitāsana gatō(a)bhyasēt |
mṛdvāsanē kuśān samyak āstīryājina mēvaca |
laṃbōdaraṃ ca saṃ pūjya phalamōdaka bhakṣaṇaiḥ |
tadāsanē sukhāsīnaḥ savyēnyasyētaraṃkaṃ |
samagrīva śirāssamyak samhṛtāsyassu niścalaḥ |
prāṅmukhōdaṃ ṅmukhōvāpi nāsāgranyasta lōcanaḥ |
ati bhukta mabhuktaṃ ca varjayitvā prayatnataḥ |
nāḍī saṃśōdhanaṃ kuryāt uktamārgēṇa yatnataḥ |
vṛthā klēśō bhavēttasya tacchōdanaya kurvataḥ |
nāsāgrē śaśabhṛdbījaṃ caṃdrāva vitāsitaṃ |
sapta masyatu vargasya caturthaṃ biṃdu saṃ yutaṃ |
viśvamadhyastha mālōkya nāsāgrē cakṣuṣī ubhē |
iḍayā pūra yēt vāyuṃ bāhyaṃ dvādaśamātra kaiḥ |
tatōgniṃ pūrvavat dhyāyēt sphurajvālāvalīyutaṃ |
ruṣaṣṭaṃ (rēphaṃ ca) biṃdu saṃ yuktaṃ śikhimaṃḍala saṃsthitaṃ |
dhyāyēdvā rēcayēt vāyuṃ maṃdā piṃgaḷāyā punaḥpunaḥ |
piṃgaḷāyā pūrya ghrāṇaṃ dakṣitaḥ sudhīḥ |
tadvadvi rēcayē dvāyu miḍayātu śanaiḥ śanaiḥ |.
(tanakiṣṭamaina āsanamulanu vidhiprakāramabhyasiṃci āsana jayamu poṃdina tarvāta - okē āsanamaṃdu eṃtakālamainanu kūrcunuṭaku alavāṭu paḍina tarvātanē - prāṇāyāmamu nabhyasiṃcavalenu - phalamulatōnu uṃḍrāḷḷatōnu pūjiṃcavalenu. tarvāta āsanamulō kūrcuni, śirassu, meḍa ōkēlāguna nilipi, kadalakayuṃḍi, nāsāgramunu cūcucu, āhāramunu amitamugā sēviṃcaka, aṭlani tinaka yuṃḍaka alavāṭu cēsukōvalenu. iṭlu cēsina nāḍulu śuddhiyagunu. nāḍulu śuddhigānicō vāni prayatnamu vyarthamē. iḍānāḍitō vāyuvunu panneṃḍumātrala kālamu pūriṃcavalenu. tarvāta piṃgaḷanāḍitō vāyuvunu rēciṃcavalenu. ī prakāramugā iṭunuṃḍi aṭu, aṭunuṃḍi iṭu cēyucuṃḍavalenu).
varṇa trayātmakāḥ prōktāḥ rēca pūraka kuṃbhakāḥ |
sa ēṣa praṇavaḥ prōktaḥ prāṇāyāmastu tanmayaḥ |
iḍayā vāyu mākṛṣya pūrayitvōdara sthitaṃ |
śanai ṣṣōḍaśabhirmātraiḥ akāraṃ tatra saṃsmarēt |
pūritaṃ dhārayat paścāt cātuṣṣaṣṭā tu mātrāyā |
ukāramūrti matrāpi saṃsmaran praṇavaṃ japēt |
yāvadvā śakyatē tāvat dhārayē jjapavatparaḥ |
pūritaṃ rēcayēt paścāt makārēṇānilaṃ budhaḥ |
śanaiḥ piṃgaḷayātatra dvātriṃśanmātrayā punaḥ |
prāṇāyāmō bhavadēṣaḥ tataścaivaṃ samabhyasēt |
punaḥ piṃgaḷayā pūryamātraiḥ ṣōḍaśabhistathā |
akāramūrti mātrāpi smapādēkāgra mānasaḥ |
dhārayēt pūritaṃ vidvān - praṇavaṃ saṃjapan vaśī |
ukāramūrtiṃ saṃdhyāyan catuṣṭaṣṭyā ta mātrayā |
makāraṃ tu smaran paścāt rēcayē diḍayā nilaṃ |
ēvamēva punaḥ kuryāt iḍayā pūrva buddhimān |
ēvaṃ samabhyāsannityaṃ prāṇāyāmaṃ munīśvara |
- - - prasvēda janakō yastu prāṇāyāmēṣu sō(a)thamaḥ |
kaṃpanaṃ madhyamaṃ vidyāt uttānaṃ cōttamaṃ viduḥ ||“. - (darśanōpaniṣat)
(rēcaka pūraka kuṃbhakamulu cēyuṭa prāṇāyāmamani ceppabaḍinadi. rēcaka pūraka kuṃbhakamulu ōṃkāramulōni ‘a, u, ma’ anu mūḍakṣaramulu - prāṇāyāmamu ōṃkāramayamu. vāyuvunu iḍānāḍicē nākarṣiṃci padiyāru ōṃkāramātralakālamu lōpala pūriṃci ōṃkāramulōni ‘a’ kāramunu smariṃcavalenu. pūriṃcabaḍina (lōniki ākarṣiṃcabaḍina) vāyuvunu catuṣṣaṣṭi mātralakālamu lōna dhariṃci yuṃci ‘u’ kāramūrtini smariṃcucu praṇavamunu japiṃcavalenu. aṭlu vāyuvunu śakti koladi lōpala dhariṃcavalenu. aṭlu pūriṃcina vāyuvunu piṃgaḷanāḍi dvārā dvātriṃśanmātrala kālamu makāramunu smariṃcucu melligā rēciṃcavalenu - paiki vadalivēyavalenu. idiyē prāṇāyāmamu - ī prakāramu dīnini abhyāsamu cēyavalayunu. tirigi piṃgaḷanāḍi dvārā paivāyuvunu padiyāru mātralakālamu akāramūrtini smariṃcucu lōniki pīlcavalenu - ī prakāramu pūriṃcina vāyuvunu praṇavamunu japiṃcucu ‘u’ kāramūrtini dhyāniṃcucu catuṣṣaṣṭi mātralakālamu lōna dhariṃci yuṃcavalenu. tarvāta ‘ma’ kāramūrtini dhyāniṃcucu iḍānāḍi dvārā vāyuvunu paiki vadalivēya valenu.- rēciṃcavalenu - ī prakāramugā iḍānāḍi dvārā marala vāyuvunu pūriṃca valenu. ī prakāramugā iḍānāḍi dvārā vāyuvu pīlci niyatakālamulō staṃbhiṃciyuṃci piṃgaḷanāḍi dvārā paiki vadalucū cēyuṭa - aṭunuṃḍi iṭu - iṭunuṃḍi aṭu ellapuḍu cēyuṭa abhyāsamu cēsukōvalayunu. iṭlu ī prāṇāyāmamu nabhyāsamu cēsukonuṭalō cemaṭa paṭṭuṭa iṭlu ī prāṇāyāmamu nabhyāsamu cēsukonuṭalō cemaṭa paṭṭuṭakaligina yaḍala adi adhamamaniyu, kaṃpanamu kaligina yaḍala adi madhyamamaniyu, paiki lēpa kaligina yaḍala adi uttama prāṇāyāmamaniyu teliyavalenu).
gāyatrīṃ śirasāsārthaṃ sa turyapada saṃ yutāṃ |
dakṣiṇē rēcayē dvāyuṃ vāmēna pūritōdaraṃ |
kuṃbhēna dhārayē nnityaṃ prāṇāyāmaṃ vidurbudhāḥ |
pīḍayē ddakṣiṇāṃ nāḍīṃ aṃguṣṭē tadhōttarāṃ |
kaniṣṭā nāmikābhyāṃ tu madhyamāṃ tarjanīṃ tyajēt |
rēcakaḥ pūrakaścaiva prāṇāyāmō dha kuṃbhakaḥ |
prōcyatē sarva śāstrēṣu yōgibhiryatamānasaiḥ |
rējakassṛjatē vāyuṃ pūrakaḥ pūrayē ttutaṃ |
sāmyēna saṃstha tiryastatkuṃbhakaṃ parikīrtitaḥ |
nīlōtpaladaḷa śyāmaṃ nābhi madhyē pratiṣṭitaṃ |
caturbhujaṃ mahātmānaṃ pūrakē ciṃtayēt hariṃ |
kuṃbhakētu hṛdisthānē dhyāyēttu kamalāsanaṃ |
prajā patiṃ jagannādhaṃ caturvaktraṃ pitāmahaṃ |
rēcakē śaṃkaraṃ dhyāyēt lalāṭasthaṃ mahēśvaraṃ |
śuddha sphaṭika saṃkāśaṃ nirmalaṃ pāpanāśanaṃ |
pūrakē viṣṇu sāyujyaṃ kuṃbhakē brahmaṇō gatiṃ |
rēcakēna tṛtīyaṃ tu prāpnuyāt īśvaraṃ paraṃ ||“. (ḍēvī bhāgavataṃ)
(praṇavamunu smariṃcucu prāṇāyāmamu cēyavalenu - mukku eḍama raṃdhramulōnuṃḍu nāḍu dvārā lōniki vāyuvunu pīlci kuḍināḍitō paiki vadalipeṭṭavalenu - pīlcina gālini lōpala staṃbhiṃcavalenu. idiyē prāṇāyāmamu. vāyuvunu pūriṃcunapuḍu nīlōtpaladaḷamu vale śyāmavarṇamu galavāḍunnū, nālugu bhujamulugalavāḍū ayina śrīmahāviṣṇuvunu ciṃtiṃcavalenu. kamalāsanuḍu, prajāpati hṛdayamaṃduṃḍunaṭṭi caturmukha brahmanu kuṃbhakamu cēyunapuḍu hṛdayamaṃdu dhyāniṃcavalenu - śuddhasphaṭikavale tellanainavāḍu, nirmaluḍu pāpamulanu pōgoṭṭuvāḍu, lalāṭamaṃduṃḍuvāḍu, mahēśvaruḍu ayina śivuni rēcakamaṃdu dhyāniṃcavalenu. iṭlu cēsina pūrakamuna viṣṇu sāyujyamunu, kuṃbhakamuvalana brahma sāyujyamu., rēcakamuvalana śivasāyujyamunu poṃdunu).
dhārayēt pūritaṃ yōgī catuṣṣaṣṭyātu mātrayā |
suṣumnā madhyagaṃ samyak dvātriṃśanmātmayā śanaiḥ |
nāḍhyā piṃgaḷayācaiva rēcayēt yōgavittamaḥ |
prāṇāyāma mimaṃ prāhuḥ yōgaśāstra viśāradāḥ |
bhūyō bhūyaḥ kramāttasya bāhya mēvaṃ samācarēt |
mātrā vṛddhiḥ kramē caiva samyak dvādaśa ṣōḍaśa ||“. (śrī dēvī bhāgavataṃ)
(ṣōḍaśamātrayā = ṣōḍaśa praṇavōcchāraṇēna bāhyaṃ vāyuṃ ākarṣaya - catuṣṣaṣtisaṃkhya praṇavōccāraṇa paryaṃtaṃ kuṃbhakaṃ kuryāt. punaḥ dvā triṃśatpraṇavōccāraṇēna dakṣiṇa nāsā puṭēna virēcayēt ityarthaḥ. bhūyō bhūyō punaḥ punaḥ tasya iḍāpiṃgaḷā dēḥ - punaḥ iḍā piṃgaḷādēḥ punaḥ piṃgaḷēḍādēḥ kramāt bāhyaṃ vāyuḥ ēvaṃ samācarēt, gṛhṇīyāt, tyajēt ca ityarthaḥ. mātrāṇāṃ praṇavasaṃkhyānāṃ api uttarōttaraṃ vṛddhiḥ kartavyā. tathā prāṇāyāmānāmapi prathamataḥ dvādaśa, taduttaraṃ kati citkālā naṃtaraṃ, ṣōḍaśa ityēvaṃ kramēṇa vṛddhiṃ kartavyā ityarthaḥ).
(paina unna gālini iḍānāḍidvārā padiyārumātrala paryaṃtamu ākarṣiṃcavalenu - anagā, padiyāru mārlu praṇavamunuccariṃcucu, lōniki gālini pīlcavalenu - catuṣṣaṣṭi mātralanagā anni paryāyamulu praṇavamunuccāraṇa cēyunaṃtakālamu kuṃbhakamu cēyavalenu - dvātriṃśanmātralakālamu anagā anni mārlu praṇavamunu nuccariṃcu naṃtakālamu kuḍi mukku raṃdhramudvārā paiki vadalivēyavalayunu - ī prakāramugā okanāḍudvārā vāyuvunu pīlci yiṃkoka nāḍidvārā paiki vadalivēyucu, iṭunuṃḍu aṭu, aṭunuṃḍi iṭu mārcucu cēyavalayunu - mātralu, anagā praṇavamunuccariṃcusaṃkhya kramamugā vṛddhi cēyavalenu. mātralu dvādaśamātralunuṃḍi ṣōḍaśamātralavaraku ecciṃcavaccunu).
prāṇāyāmamu anēka vidhamulugā ceppabaḍinadi -
sa ēva dvividhō prōktaḥ sahitaḥ kēvalassadā |
yāvatkēvala siddhisyāt tāvatsa hitamabhyasēt ||“. (yōgakuṃḍalyupaniṣat)
(prāṇamanagā dēhamulōnuṃḍu vāyuvu, āyāmamanagā dānini kuṃbhiṃci yuṃcuṭa - paṭṭi yuṃcuṭa. prāṇa + āyāmamu = prāṇāyāmamu. prāṇāyāmamu reṃḍu vidhamulu -kēvala prāṇāyāmamu, kuṃbhakamutō kūḍina prāṇāyāmamu - prāṇamu tanavaśamulō nuṃcukonagaliginaṃtavaraku kuṃbhakamutō prāṇāyāmamu nabhyasiṃcavalenu).
(āmuktamālyada - aśvā -2)
(prāṇāyāmamu cēyunapuḍu modaṭa cemaṭa paṭṭunu. adi adhama prāṇāyāmamu, kaṃpamu kalugunapuḍu madhyama prāṇāyāmamu, bhūmityāgamu kalugacēyunadi uttama prāṇāyāmamani ceppabaḍunu - bhūmini vadali āsanamu mīdanē (gālilō) uṃḍuṭa bhūmityāgaprāṇā yāmamu ani sāṃpradāyamu).
(sagarbha prāṇāyāmu, vigarbhaprāṇāyāmamu ani prāṇāyāmamu reṃḍu vidhamulu - kuṃbhakamutō kalisinadi, kuṃbhakamu lēnidi ani reṃḍu vidhamulu (cūḍumu - 13 -1)
(1). svabhāvasiddhamuga - aprayatnamugā - cēyunadi prākṛtamu.
(2). prayatnamu valana cēyunadi vaikṛtamu - prāṇavāyuvulanu okadānitō nokaṭi layamu cēyuṭa.
(3). balātkāramugā vāyuvunu staṃbhiṃcuṭa kēvala kuṃbhakamu -.
(1) nāsikāyāḥ nāma chidrasta iḍākhya nāḍīdvārā vāyōraṃtara pūraṇaṃ kāryaṃ tadēva pūrakaṃ ityucyatē (“ahaṃ brahmasmi” iti bhāvanā pūrakaṃ)
(2) dakṣiṇa nāsikāstha piṃgaḷākhyanāḍī dvārā vāyōḥ bahiḥ nissaraṇaṃ kāryaṃ, tadēva rēcakaṃ ityucyatē (anātma prapaṃca niṣēdhō rēcakaḥ)
(3) suṣumnā dvārā vāyōrnirōdhanaṃ kāryaṃ, tadēva kuṃbhakaṃ ityucyatē. (akhaṃḍākāra vṛtyā calatā kuṃbhakaḥ) itthaṃ kriyāmāṇānāṃ pūraka rēcaka kuṃbhakānāṃ samudāyaḥ prāṇāyāmaḥ ityucyatē.
(prāṇāyāmamu anēka vidhamulugā nunnadi - ayinanu dāni lakṣaṇamu saṃgrahamugā ceppabaḍinadi : -
(1) mukkulōni eḍama raṃdhramulōnuṃḍu iḍā anu pērugala nāḍidvārā vāyuvunu lōpaliki pīlcuṭa – pūriṃcuṭa (‘nēnu ā brahmanu ayitini’) ani bhāviṃcuṭa pūrakamu.
(2). mukku yokka kuḍi raṃdhramulōnuṃḍu piṃgaḷayanu pērugalanāḍi dvārā vāyuvunu paiki vadalivēyuṭa. idi rēcakamani ceppabaḍucunnadi. (ātma kāni prapaṃcamunu niṣēdhiṃcuṭa rēcakamu
(3). suṣumnānāḍi dvārā vāyuvunu nirōdhiṃcuṭa kuṃbhakamu. ī rītiga pūraka rēcakakuṃbhakamulanu cēyucuṃḍuṭa prāṇāyāmamani ceppabaḍucunnadi).
(prāṇāyāmamu, uttamaprāṇāyāmamani modalagu āru bhēdamulu galadi : - prāṇāyāmamu modaṭa abhyasiṃcunapuḍu prāṇavāyuvu mīdiki vaccunu. idi ati laghuvu ayina prāṇāyāmamu - aṃtakanna adhikamugā abhyāsamu cēsina yaḍala vāyuvu iṃkanu mīdiki vaccunu - idi modaṭidāni kanna śrēṣṭamu - ī reṃḍu vidhamulagu prāṇāyāmamulu kaniṣṭa prāṇāyāmamani ceppabaḍunu - iṃkanu adhikamugā nabhyāsamu cēsina yaḍala cittamu sthiramuga nuṃḍunaṭlu cēyunadi madhyama prāṇāyāmamu - madhyama prāṇāyāmamugūḍa reṃḍu vidhamulu - sagarbha prāṇāyāmamu, agarbhaprāṇāyāmamu - sagarbhamanagā maṃtramu, japamutō kūḍinadi. agarbhamanagā maṃtra japamulu lēnidi. iṃkanu bāguga nabhyasiṃcina yaḍala, cittamiṃkanu sthirapaḍina yaḍala ā prāṇāyāmamu uttama prāṇāyāmamu. adi reṃḍu vidhamulu - salakṣyamu, alakṣyamu - lakṣyadēvatanu dhyāniṃcuṭatō kūḍinadi salakṣyamu - alakṣyamanagā lakṣya dēvatādhyānamu lēnidi. prāṇāyāmamu trivarṇātmakamaina ōṃkārātmakamainaṃduvalana adi paramātma rūpamu).
paina ceppabaḍinadē ī kriṃdavidhamugā kūḍa ceppabaḍinadi : -
“sadhūmaśca vidhūmaśca sagarbhaścā syagarbhakaḥ |
lakṣyaścāpya lakṣyaśca prāṇāyāmastu ṣaḍvidhaḥ ||“.
rēcayēt tatō anyēna śanai rēva na vēgataḥ ||
yathā siṃhō, gajō, vyāghrō bhavēt vaśyaḥ śanaiḥ śanaiḥ |
tadaiva sēvitō vāyuḥ, anyathā haṃti sādhakaṃ ||“.
(mukku yokka ē raṃdhramutō lōpaliki pīlcina gālini paiki vaduludurō, ā raṃdhramutōnē lōpaliki gālini pīlci lōpala dhariṃciyuṃḍavalenu -kuṃbhakamu cēyavalayunu. ā gālini reṃḍava raṃdhramutō paiki vadalavalenu. siṃhamunu, ēnugunu, peddapulini ē vidhamugā mella mellagā vaśamu cēsukonudurō, aṭlē mella mellagā gālini pai prakāramu pūraka, kuṃbhaka, rēcakamulanu mella mellagā cēyavaleyunu. toṃdaragā cēsina yaḍala aṭṭi prāṇāyāmamu sādhakuni maraṇamunaku kāraṇamagunu).
maraṇaṃ tasya niṣkrāṃtiḥ tatō vāyuṃ nirōdhayēt ||“.
(śarīramulō vāyuvunnaṃtavaṟakē jīviṃciyuṃḍuṭa. ā vāyuvu śarīramunuṃḍi niṣkramiṃcuṭayē maraṇamu. aṃducēta jīviṃciyuṃḍuṭaku vāyuvunu nirōdhiṃcavalenu. aṭlu nirōdhiṃcuṭayē prāṇāyāmamu).
(prāṇāyāmamu cēyuṭavalana naśiṃcina manōmalamu galavānikimanassu parabrahma yaṃdu - (parabrahma dhyānamaṃdu) nilucunu - sthiramagunu).
(prāṇāyāmamu cēyuṭavalana nāḍulu śuddhi yagunu - aṃduvalana ārōgyamu bāguga nuṃḍunu).
(mukkulōni kuḍiraṃdhramudvārā pīlcinagāli vēḍimi kalugacēyunaniyu, eḍamaraṃdhramudvārā pīlcinagāli calladanamu kalugacēyunaniyu - ī reṃḍiṃṭi gāli pīlcuṭacē samadhātuvu agunaniyu ceppuduru - śaityamu cēyunapuḍu paidāninavalaṃbhiṃci cūcina dāni yadārthamu teliyanagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.