ఉపక్రాంతం కర్మ. (ఫలమునిచ్చుటకు ఉపక్రమించిన - ప్రారంభించిన - కర్మ).
“కర్మ జన్మాంతరీయం యత్ ప్రారబ్దమితి కీర్తితం” (నాదబిందూపనిషత్)
(వెనుకటి జన్మలకు సంబంధించిన కర్మ - ఇప్పుడు ఈ జన్మలో ఫలమునిచ్చుటకు ఆరంభించినది).
(గడచిన జన్మలలో చేసినదియు, ఈ జన్మలో దాని ఫలము ననుభవింపచేయుటకు తగిన శరీరమును కలిగించుటకు కారణమైనదియు నగు కర్మ).
(పూర్వ జన్మలలో చేసిన కర్మ పరిపక్వమై - ఫలోన్ముఖమై (ఫలము నిచ్చుటకు సిద్ధమై) - ఇప్పటి కన్మలో ఆ కర్మ ఫలరూపముగా సుఖ దుఃఖములను కలుగచేయుటవలన అజ్ఞాన విక్షేపశక్తి గల కర్మప్రారబ్దకర్మ).
(కర్మలలో ఒక్కొక్కటి కాలక్రమమును బట్టి పరిపక్వమునొంది - ఫలించుటకు సిద్ధమై, ఫలముననుభవింప చేయుటకు సిద్ధమై - వేగమును కలవియగును. (నదులు సముద్రములో కలియుటకు వేగము కలిగి - ప్రేరేపించబడి - యుండునట్లు). అట్టి వేగము ఏ కర్మలకు కలుగునో - ఫలమునిచ్చు శక్తి ప్పూర్తిగ కలిగియుండునో - అట్టి కర్మ ప్రారబ్దమని చెప్పబడును. ఆ ప్రారబ్దకర్మకు వశుడై మనుజుడు ఈ జన్మలో పుణ్యముచేయునట్లే పాపముకూడ చేయును).
(1) సర్వదా ఆజన్మమరణం వైరాగ్య హేతు భూతం నివృత్తి ప్రథానం ప్రారబ్ద ఉత్తమం - యథా శుకవామదేవ సనకాది ప్రారబ్దం,
(2) ఆదౌ ప్రవృత్తి హేతు భూతమపి పశ్చాన్నివృత్తి హేతుభూతం ప్రారబ్దం మధ్యమం - యథా యాజ్ఞవల్క్యాది ప్రారబ్దం
(3) సదా ప్రవృత్తి హేతు భూతం ప్రారబ్దం కనిష్టం - యథా జనకాది ప్రారబ్దం
(4) ఆదౌ నివృత్తి భూతం సత్ పశ్చాత్ ప్రవృత్తి హేతుభూతం ప్రారబ్దం - అధమతరం - యథా శిఖి ధ్వజాలర్క రహూగణప్రియవ్రతాది ప్రారబ్దం
(5). కామ చార, కామవాద కామ భక్షాది హేతుభూతం ప్రారబ్దం అధమతమం యథా దత్తాత్రేయాది ప్రారబ్దం.
(ప్రారబ్ద కర్మ ఉత్తమ, మధ్యమ, కనిష్ట (అధమ), అధమతర, అధమతమములు అను అయిదు విధములు
(1) పుట్టిన దగ్గరనుండి చనిపోవువరకు ఎల్లపుడు వైరాగ్యమునకు కారణమైన ప్రవృత్తిమార్గము ప్రథానముగా గలది ఉత్తమము - ఉదాహరణకు - శుకుడు, వామదేవుడు, సనకసనందాదులు మొదలగువారి ప్రారబ్దములు
(2) మొదట ప్రవృత్తిమార్గమునకు కారణమైనను, తర్వాత నివృత్తి మార్గమునకు కారణమగునది మధ్యమము - యాజ్ఞవల్క్యుడు మొదలగువారి ప్రారబ్దము –
(3) ఎల్లపుడు ప్రవృత్తి మార్గములోనే నడుపునది కనిష్ట ప్రారబ్దము - అధమము - ఉదాహరణకు జనకుడు మొదలగువారిదివలె
(4) మొదట నివృత్తిమార్గములో నడిపి తర్వాత ప్రవృత్తి మార్గములోనికి దించునది - అధమతరము. ఉదాహరణకు - శిఖిద్వజుడు, అలర్కుడు, ప్రియవ్రతుడు మొదలగు వారిది
(5) కామచరము - ఇష్టము వచ్చినట్లు సంచరించునట్లు చేయునది - ఇష్టము వచ్చినట్లు వాదించునట్లు చేయునది, ఇష్టము వచ్చినట్లు తినునట్లు చేయునది - అధమతమము - ఉదాహరణకు దత్తాత్రేయుడు మొదలగువారిది).
కర్మ ఫలము కొన్ని కొన్ని పరిస్థితులలో లేకుండపోవును - కాని ప్రారబ్ద కర్మ అనుభవము వలననే క్షీణించును - ఫలమునిచ్చుటకు ఆరంభించిన కర్మ దాని ఫలమును అనుభవింపచేసియే క్షీణించును. అది యెట్లంటే -
భోగేనాస్య విపాకస్య భవితా సర్వధా క్షయః |
ప్రారబ్ద కర్మణాం భోగాత్ అన్యధాన క్షయో భవేత్ |
తస్మాత్ మయాత్ర భోక్తవ్యం కృతం కర్మ శుభా శుభం ||“.
(ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసినదే, ఈ కర్మ పరిపక్వమైన అనుభవింప చేసియే క్షీణించును - ప్రారబ్ద కర్మ ఇంకొక విధముగా క్షీణించదు - అందుచేత నేను చేసిన కర్మ మంచిదైనను చెడ్డదైనను - పుణ్యమైనను పాపమైనను నేను అనుభవింప వలసినదే).
(ప్రారబ్దకర్మలు - ఫలమునిచ్చుటకు ఆరంభించిన కర్మలు - అనుభవింప చేసియే క్షీణించును).
అదత్వా స్వఫలం లక్ష్యముదిశ్యోత్కుష్ట బాణవత్ |
వ్యాఘ్ర బుద్ధ్యా వినుర్ముక్తో చాణః పశ్చాత్తు గోమతౌ |
న తిష్టతి భినత్యేవ లక్ష్యం వేదేన నిర్భరం ||“. (అధ్యాత్మోపనిషత్)
(బ్రహ్మజ్ఞానము కలుగుటవలన కర్మలన్నియు క్షీణించును అని చెప్పబడినది. కాని, జ్ఞానోదయమునకు పూర్వము ఫలము నిచ్చుటకు ప్రారంభించిన కర్మ - ప్రారబ్ద కర్మ - దాని ఫలితము అనుభవింప చేయనిదే క్షీణించదు - వ్యాఘ్రమనుకొని దానిని లక్ష్యముగా చేసి దాని మీదకు వదలిన బాణము, అది పొరపాటు, అది వ్యాఘ్రముకాదు, ఆవు అని తెలిసినమీదట ఆవును చంపకూడదని తెలిసినను ఆ వదలిన బాణము దాని వేగము వలన అది వ్యాఘ్రమైనను, ఆవు అయినను దానికి తగిలి తీరును - చంపి తీరును. బాణమును వదలనంతవఱకే అది మన ఆధీనములో నుండును. ఒకమాటు వదలిన తర్వాత అది మనవశములో నుండదు. ఆ ప్రకారముగానే ప్రారబ్ద కర్మఫలమునిచ్చుటకు ప్రారంభించకమునుపే భగవత్ జ్ఞానము బ్రహ్మనామ స్మరణ కలిగిన ఆ కర్మ ఫలము నివ్వకుండునట్లు చేసుకొనగలము - కాని ఒకమాటు ఫలము నిచ్చుటకు ఆరంభించిన కర్మ దాని ఫలము అనుభవింపచేసియేకాని నశించదు.
“నను క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే” (ముండకోపనిషత్ - 3 - 8)
ఇత్యాది శ్రుత్యా,
“జ్ఞానాగ్నిః సర్వ కర్మాణిభస్మ సాత్కురుతే యథా ||”. (శ్రీమద్భగవద్గీత - 4 - 37)
ఇత్యాది స్మృత్యాచ జ్ఞానస్య సకల కర్మ క్షయ హేతుత్వ నిశ్చయేసతి ప్రారబ్ద కర్మావస్థానమనుప పన్నం ఇతి చేత్ న - “తస్య తాన దేవ చిరం యావన్న విమోక్ష్యే (అ)ధ సంపత్స్యతే (ఛాందోగ్యోపనిషత్ - 6 - 24 - 2)
ఇత్యాది శ్రుత్యా, “నా భుక్త క్షీయతే కర్మ” ఇత్యాది స్మృత్యా చోత్పాదిత కార్య కర్మ వ్యతిరిక్తానాం సంచిత కర్మణామేవ జ్ఞాన వినాశిత్వావగమాత్. (వేదాంత పరిభాషా)
(బ్రహ్మజ్ఞానము కలుగగనే - బ్రహ్మసాక్షాత్కారము కలుగగనే - కర్మలు అన్నియు క్షీణించుచున్నవి అని శ్రుతి చెప్పుచున్నది. మరియును - జ్ఞానమను అగ్ని (బ్రహ్మజ్ఞానమను అగ్ని) సమస్త కర్మలను భస్మము చేయును అని శ్రీమద్భగవద్గీత చెప్పుచున్నది - స్మృతి చెప్పుచున్నది. ఇట్లు శ్రుతి స్మృతులు కూడ చెప్పుటవలన (బ్రహ్మ) జ్ఞానము సకలకర్మలను క్షీణింప చేయును అనునదినిశ్చయమే యగునెడల ప్రారబ్ద కర్మ అనుభవింప చేయనిదే క్షీణించదు అనునది పొసగదు - కాని ఇట్లుకాదు - ఎందుచేతననగా స్మృతులలో కర్మ అనుభవించనిదే క్షీణించదు అని చెప్పబడుటవలన ప్రారబ్దకర్మతప్ప మిగిలిన కర్మలు జ్ఞానము వలన నశించునని, ప్రారబ్దకర్మ మాత్రము అనుభవించిన తర్వాతనే నశించును. శ్రుతి ప్రకారము కూడ ప్రారబ్ద కర్మను అనుభవించి దేహపతనానంతరమే మోక్షము కలుగును - అనగా, ప్రారబ్దకర్మ అనుభవించిన తర్వాతనే అట్లు అనుభవింప చేయబడిన శరీరము వదలిన తర్వాతనే జ్ఞానము (బ్రహ్మజ్ఞానము) మిగిలిన కర్మలను నశింప చేయుటవలన మోక్షము పొందును. “భోగేన త్వితరే క్షపయిత్వా సంపద్యతే” (బ్రహ్మ సూత్రములు - 4 - 1 - 19 -) (శ్రీశంకరః)
(అనుభవమువలను ఇతర కర్మలను - ప్రారబ్దకర్మలను - క్షీణింప చేసుకొని బ్రహ్మను పొందుచున్నాడు).
“అనారబ్ద కార్యయోః పుణ్యపాపయోర్విద్యా సామర్థ్యాత్ క్షయః ఉక్తః. ఇతరేత్వారబ్ధకార్యే పుణ్యపాపే ఉపభోగేన క్షపయిత్వా బ్రహ్మ సంపద్యతే”.
(ఫలమునిచ్చుటకు ఆరంభించని కర్మలయొక్క పాపపుణ్యములను బ్రహ్మజ్ఞానముచే క్షీణింపచేసుకొన వచ్చును - అని చెప్పబడినది - మిగిలిన వాటిని - ఫలమినిచ్చుటకు ఆరంభించిన పుణ్యపాప కర్మలను - అనుభవము వలన క్షీణింపచేసుకొని బ్రహ్మను పొందుచున్నాడు).
“ఇతరేత్వారబ్ధ పుణ్యపాపే భోగేన క్షపయిత్వా విద్వాన్ సంపద్యతే -” తస్య తావదేవ చిరం యావన్న విమోక్ష్యే (అ)ధ సంపత్స్యే : “ఇతి - ఇత్యాది శ్రుతిభ్యః దేహ పాతాత్పూర్వం ప్రారబ్ద కర్మణాం సత్వాత్ కులాలచక్రభ్రమణ న్యాయేన మిథ్యా జ్ఞాన కూప నిమిత్త నాశే (అ)ప్యను వృత్తిర్యుక్తాః, తద్భోగానంతరం కస్య చిదపి కర్మణః (అ)భావాత్ న సంసారాను వృత్తిః. తస్మాత్ భోగేన ప్రారబ్ద కర్మా నాశానంతరం విద్వాన్ స్వరూపానం దాత్మనావస్థాన లక్షణా కైవల్యం లభత ఇత్యతి శోభనం”. (బ్రహ్మ తత్వ ప్రకాశికా)
(ఫలమిచ్చుటకు ఆరంభించిన పుణ్యపాప కర్మల ఫలమనుభవించుటవలననే వాటిని క్షీణింపచేసుకొని తర్వాత బ్రహ్మజ్ఞాని బ్రహ్మమును పొందును జ్ఞాని యగువాడు మోక్షము పొందుటకు. జ్ఞాని యగువాడు మోక్షము పొందుటకు శరీర నాశనమే ఆలస్యమునకు కారణము - శరీరము ఆరబ్ద కర్మను అనుభవించిన తర్వాత కాని నశింపదు. అంతవరకు శరీరము (జన్మ) కలుగుచునే యుండును అని శ్రుతి చెప్పుచున్నందున ప్రారబ్దకర్మల శక్తివలన కులాల చక్రము వలె మరల మరల జన్మ ఎత్తుచుండుట మరణించుట కలుగుచుండును. ప్రారబ్ద కర్మానుభవమువలన జన్మము నెత్తుటకు మఱి కర్మఫలములు జ్ఞానికి మిగిలి యుండవు. అందుచేత ప్రారబ్దకర్మానుభవమైన తర్వాతనే జ్ఞానికైనను మోక్షము కలుగును).
(చీకటిలో చూచిన త్రాడు పాము అను భ్రాంతి, అది పాము కాదు త్రాడు అను జ్ఞానము కలిగిన తర్వాత పోవును. ఆ ప్రకారముగానే బ్రహ్మజ్ఞానము కలుగగానే ఇదంతా జగత్తు అను భ్రాంతి పోయి అంతయు బ్రహ్మముగానే తోచును. అయినను త్రాడు చూచి పాము అనుకున్నప్పుడు దాని వలన కలుగు భయము, వణుకు మొదలగునవి కొంతకాలముండి తర్వాత పోవును. ఆ ప్రకారముగానే ప్రారబ్ద కర్మ వలన కలిగిన భోగము ప్రారబ్ద కర్మ నశించిన తర్వాతనే పోవును. చిమ్మ చీకటిలో చూచిన త్రాడు మరల పాముగా కనబడునట్లు ప్రారబ్ద కర్మానుభవకాలమందు జ్ఞానికైనను ప్రపంచము ప్రపంచమువలెనే కనబడును; అహంకారముండును - దీనికి కారణమైన అజ్ఞానము తొలగిన తర్వాతనే ఇది ప్రపంచము కాదు అంతా బ్రహ్మమే అను జ్ఞానము కలుగును. అది యెట్లనగా - పులి అనుకొని దాని మీదకు వేసిన బాణము, తర్వాత అది పులికాదు గోవు అని తెలిసినప్పటికీ, దాని వేగమును బట్టి (శక్తిని బట్టి) వెళ్ళునే కాని, బాణము వదలినవానికి యీ జ్ఞానము కలిగినంత మాత్రమున ఆ బాణము దారిలో ఆగదు, దాని వేగము తగ్గిపోయిన తర్వాతనే ఆగును. ఆ ప్రకారము గానే విడిచిపెట్టిన బాణమువలె నున్న ప్రారబ్దకర్మ ఫలమునిచ్చుటకు ప్రారంభించినదై ఫలమును అనుభవింపచేసిన తర్వాతనే నశించును, ఇంకొక విధముగా ప్రారబ్దకర్మ నశించదు అందుచేత ఆ కాలములో బ్రహ్మజ్ఞానికైనను ఇది ప్రపంచమే యను భ్రాంతి కలుగును. ఆ ప్రారబ్ద కర్మానుభవము పూర్తి అయిన తర్వాతనే జ్ఞానికి యీ భ్రాంతి (అజ్ఞానము) పోయి బ్రహ్మజ్ఞానమువలన ఇతర కర్మల ఫలము అనుభవింపవలసిన అవసరము లేకుండుట వలన “జ్ఞానే నైవతు కైవల్యం” అని చెప్పియుండుటచేత ముక్తినొందును).
(నైష్కర్మ్యసిద్ధి - 1 -209, 211)
“తత్ర యాన్యనుప భుక్త ఫలాస్యనారబ్ద ఫలాని తానీశ్వరేణాపి కేన చిదపి న శక్యంతే పరిత్యక్తుం”. (నైష్కర్మ్యసిద్ధి - 1 - 211)
(ఫలమినిచ్చుటకారంభించిన ఫలములు ఆరబ్దకర్మలు - ఇవి వీటి ఫలముననుభవింపచేసిన తర్వాతనే తీరును. అనారబ్దకర్మ ఫలములు శాస్త్రములో చెప్పబడిన కృచ్ఛ్ర్హ చాంద్రాయణాది ప్రాయశ్చిత్తకర్మల వలననే నశించును).
వర్తనం తేన శాస్త్రార్థే భ్రమితవ్యం న పండితైః |
స్వ స్వ కర్మానుసారేణ వర్తంతాం తే తథా తథా |
అవిశిష్టః సర్వబోధః స మా ముక్తిరితిస్థితిః || (గీతాభావప్రకాశము - 3 - 310. 311)
(ప్రారబ్ద కర్మ అనెక విధములుగా నుండుటవలన జ్ఞానులు కూడా అనేకరీతులలో ప్రవర్తించుదురు - అందుచేత వారు శాస్త్రములోని అర్థముల యడల భ్రమపొందకూడదు - వారు కూడ వారి కర్మానుగుణముగనే వర్తించుదురు - ముక్తి అందఱికి సమానమే).
upakrāṃtaṃ karma. (phalamuniccuṭaku upakramiṃcina - prāraṃbhiṃcina - karma).
“karma janmāṃtarīyaṃ yat prārabdamiti kīrtitaṃ” (nādabiṃdūpaniṣat)
(venukaṭi janmalaku saṃbaṃdhiṃcina karma - ippuḍu ī janmalō phalamuniccuṭaku āraṃbhiṃcinadi).
(gaḍacina janmalalō cēsinadiyu, ī janmalō dāni phalamu nanubhaviṃpacēyuṭaku tagina śarīramunu kaligiṃcuṭaku kāraṇamainadiyu nagu karma).
(pūrva janmalalō cēsina karma paripakvamai - phalōnmukhamai (phalamu niccuṭaku siddhamai) - ippaṭi kanmalō ā karma phalarūpamugā sukha duḥkhamulanu kalugacēyuṭavalana ajñāna vikṣēpaśakti gala karmaprārabdakarma).
(karmalalō okkokkaṭi kālakramamunu baṭṭi paripakvamunoṃdi - phaliṃcuṭaku siddhamai, phalamunanubhaviṃpa cēyuṭaku siddhamai - vēgamunu kalaviyagunu. (nadulu samudramulō kaliyuṭaku vēgamu kaligi - prērēpiṃcabaḍi - yuṃḍunaṭlu). aṭṭi vēgamu ē karmalaku kalugunō - phalamuniccu śakti ppūrtiga kaligiyuṃḍunō - aṭṭi karma prārabdamani ceppabaḍunu. ā prārabdakarmaku vaśuḍai manujuḍu ī janmalō puṇyamucēyunaṭlē pāpamukūḍa cēyunu).
(1) sarvadā ājanmamaraṇaṃ vairāgya hētu bhūtaṃ nivṛtti prathānaṃ prārabda uttamaṃ - yathā śukavāmadēva sanakādi prārabdaṃ,
(2) ādau pravṛtti hētu bhūtamapi paścānnivṛtti hētubhūtaṃ prārabdaṃ madhyamaṃ - yathā yājñavalkyādi prārabdaṃ
(3) sadā pravṛtti hētu bhūtaṃ prārabdaṃ kaniṣṭaṃ - yathā janakādi prārabdaṃ
(4) ādau nivṛtti bhūtaṃ sat paścāt pravṛtti hētubhūtaṃ prārabdaṃ - adhamataraṃ - yathā śikhi dhvajālarka rahūgaṇapriyavratādi prārabdaṃ
(5). kāma cāra, kāmavāda kāma bhakṣādi hētubhūtaṃ prārabdaṃ adhamatamaṃ yathā dattātrēyādi prārabdaṃ.
(prārabda karma uttama, madhyama, kaniṣṭa (adhama), adhamatara, adhamatamamulu anu ayidu vidhamulu
(1) puṭṭina daggaranuṃḍi canipōvuvaraku ellapuḍu vairāgyamunaku kāraṇamaina pravṛttimārgamu prathānamugā galadi uttamamu - udāharaṇaku - śukuḍu, vāmadēvuḍu, sanakasanaṃdādulu modalaguvāri prārabdamulu
(2) modaṭa pravṛttimārgamunaku kāraṇamainanu, tarvāta nivṛtti mārgamunaku kāraṇamagunadi madhyamamu - yājñavalkyuḍu modalaguvāri prārabdamu –
(3) ellapuḍu pravṛtti mārgamulōnē naḍupunadi kaniṣṭa prārabdamu - adhamamu - udāharaṇaku janakuḍu modalaguvāridivale
(4) modaṭa nivṛttimārgamulō naḍipi tarvāta pravṛtti mārgamulōniki diṃcunadi - adhamataramu. udāharaṇaku - śikhidvajuḍu, alarkuḍu, priyavratuḍu modalagu vāridi
(5) kāmacaramu - iṣṭamu vaccinaṭlu saṃcariṃcunaṭlu cēyunadi - iṣṭamu vaccinaṭlu vādiṃcunaṭlu cēyunadi, iṣṭamu vaccinaṭlu tinunaṭlu cēyunadi - adhamatamamu - udāharaṇaku dattātrēyuḍu modalaguvāridi).
karma phalamu konni konni paristhitulalō lēkuṃḍapōvunu - kāni prārabda karma anubhavamu valananē kṣīṇiṃcunu - phalamuniccuṭaku āraṃbhiṃcina karma dāni phalamunu anubhaviṃpacēsiyē kṣīṇiṃcunu. adi yeṭlaṃṭē -
bhōgēnāsya vipākasya bhavitā sarvadhā kṣayaḥ |
prārabda karmaṇāṃ bhōgāt anyadhāna kṣayō bhavēt |
tasmāt mayātra bhōktavyaṃ kṛtaṃ karma śubhā śubhaṃ ||“.
(evaru cēsina karma vāru anubhaviṃcavalasinadē, ī karma paripakvamaina anubhaviṃpa cēsiyē kṣīṇiṃcunu - prārabda karma iṃkoka vidhamugā kṣīṇiṃcadu - aṃducēta nēnu cēsina karma maṃcidainanu ceḍḍadainanu - puṇyamainanu pāpamainanu nēnu anubhaviṃpa valasinadē).
(prārabdakarmalu - phalamuniccuṭaku āraṃbhiṃcina karmalu - anubhaviṃpa cēsiyē kṣīṇiṃcunu).
adatvā svaphalaṃ lakṣyamudiśyōtkuṣṭa bāṇavat |
vyāghra buddhyā vinurmuktō cāṇaḥ paścāttu gōmatau |
na tiṣṭati bhinatyēva lakṣyaṃ vēdēna nirbharaṃ ||“. (adhyātmōpaniṣat)
(brahmajñānamu kaluguṭavalana karmalanniyu kṣīṇiṃcunu ani ceppabaḍinadi. kāni, jñānōdayamunaku pūrvamu phalamu niccuṭaku prāraṃbhiṃcina karma - prārabda karma - dāni phalitamu anubhaviṃpa cēyanidē kṣīṇiṃcadu - vyāghramanukoni dānini lakṣyamugā cēsi dāni mīdaku vadalina bāṇamu, adi porapāṭu, adi vyāghramukādu, āvu ani telisinamīdaṭa āvunu caṃpakūḍadani telisinanu ā vadalina bāṇamu dāni vēgamu valana adi vyāghramainanu, āvu ayinanu dāniki tagili tīrunu - caṃpi tīrunu. bāṇamunu vadalanaṃtavaṟakē adi mana ādhīnamulō nuṃḍunu. okamāṭu vadalina tarvāta adi manavaśamulō nuṃḍadu. ā prakāramugānē prārabda karmaphalamuniccuṭaku prāraṃbhiṃcakamunupē bhagavat jñānamu brahmanāma smaraṇa kaligina ā karma phalamu nivvakuṃḍunaṭlu cēsukonagalamu - kāni okamāṭu phalamu niccuṭaku āraṃbhiṃcina karma dāni phalamu anubhaviṃpacēsiyēkāni naśiṃcadu.
“nanu kṣīyaṃtē cāsyakarmāṇi tasmin dṛṣṭē parāvarē” (muṃḍakōpaniṣat - 3 - 8)
ityādi śrutyā,
“jñānāgniḥ sarva karmāṇibhasma sātkurutē yathā ||”. (śrīmadbhagavadgīta - 4 - 37)
ityādi smṛtyāca jñānasya sakala karma kṣaya hētutva niścayēsati prārabda karmāvasthānamanupa pannaṃ iti cēt na - “tasya tāna dēva ciraṃ yāvanna vimōkṣyē (a)dha saṃpatsyatē (chāṃdōgyōpaniṣat - 6 - 24 - 2)
ityādi śrutyā, “nā bhukta kṣīyatē karma” ityādi smṛtyā cōtpādita kārya karma vyatiriktānāṃ saṃcita karmaṇāmēva jñāna vināśitvāvagamāt. (vēdāṃta paribhāṣā)
(brahmajñānamu kalugaganē - brahmasākṣātkāramu kalugaganē - karmalu anniyu kṣīṇiṃcucunnavi ani śruti ceppucunnadi. mariyunu - jñānamanu agni (brahmajñānamanu agni) samasta karmalanu bhasmamu cēyunu ani śrīmadbhagavadgīta ceppucunnadi - smṛti ceppucunnadi. iṭlu śruti smṛtulu kūḍa ceppuṭavalana (brahma) jñānamu sakalakarmalanu kṣīṇiṃpa cēyunu anunadiniścayamē yaguneḍala prārabda karma anubhaviṃpa cēyanidē kṣīṇiṃcadu anunadi posagadu - kāni iṭlukādu - eṃducētananagā smṛtulalō karma anubhaviṃcanidē kṣīṇiṃcadu ani ceppabaḍuṭavalana prārabdakarmatappa migilina karmalu jñānamu valana naśiṃcunani, prārabdakarma mātramu anubhaviṃcina tarvātanē naśiṃcunu. śruti prakāramu kūḍa prārabda karmanu anubhaviṃci dēhapatanānaṃtaramē mōkṣamu kalugunu - anagā, prārabdakarma anubhaviṃcina tarvātanē aṭlu anubhaviṃpa cēyabaḍina śarīramu vadalina tarvātanē jñānamu (brahmajñānamu) migilina karmalanu naśiṃpa cēyuṭavalana mōkṣamu poṃdunu. “bhōgēna tvitarē kṣapayitvā saṃpadyatē” (brahma sūtramulu - 4 - 1 - 19 -) (śrīśaṃkaraḥ)
(anubhavamuvalanu itara karmalanu - prārabdakarmalanu - kṣīṇiṃpa cēsukoni brahmanu poṃducunnāḍu).
“anārabda kāryayōḥ puṇyapāpayōrvidyā sāmarthyāt kṣayaḥ uktaḥ. itarētvārabdhakāryē puṇyapāpē upabhōgēna kṣapayitvā brahma saṃpadyatē”.
(phalamuniccuṭaku āraṃbhiṃcani karmalayokka pāpapuṇyamulanu brahmajñānamucē kṣīṇiṃpacēsukona vaccunu - ani ceppabaḍinadi - migilina vāṭini - phalaminiccuṭaku āraṃbhiṃcina puṇyapāpa karmalanu - anubhavamu valana kṣīṇiṃpacēsukoni brahmanu poṃducunnāḍu).
“itarētvārabdha puṇyapāpē bhōgēna kṣapayitvā vidvān saṃpadyatē -” tasya tāvadēva ciraṃ yāvanna vimōkṣyē (a)dha saṃpatsyē : “iti - ityādi śrutibhyaḥ dēha pātātpūrvaṃ prārabda karmaṇāṃ satvāt kulālacakrabhramaṇa nyāyēna mithyā jñāna kūpa nimitta nāśē (a)pyanu vṛttiryuktāḥ, tadbhōgānaṃtaraṃ kasya cidapi karmaṇaḥ (a)bhāvāt na saṃsārānu vṛttiḥ. tasmāt bhōgēna prārabda karmā nāśānaṃtaraṃ vidvān svarūpānaṃ dātmanāvasthāna lakṣaṇā kaivalyaṃ labhata ityati śōbhanaṃ”. (brahma tatva prakāśikā)
(phalamiccuṭaku āraṃbhiṃcina puṇyapāpa karmala phalamanubhaviṃcuṭavalananē vāṭini kṣīṇiṃpacēsukoni tarvāta brahmajñāni brahmamunu poṃdunu jñāni yaguvāḍu mōkṣamu poṃduṭaku. jñāni yaguvāḍu mōkṣamu poṃduṭaku śarīra nāśanamē ālasyamunaku kāraṇamu - śarīramu ārabda karmanu anubhaviṃcina tarvāta kāni naśiṃpadu. aṃtavaraku śarīramu (janma) kalugucunē yuṃḍunu ani śruti ceppucunnaṃduna prārabdakarmala śaktivalana kulāla cakramu vale marala marala janma ettucuṃḍuṭa maraṇiṃcuṭa kalugucuṃḍunu. prārabda karmānubhavamuvalana janmamu nettuṭaku maṟi karmaphalamulu jñāniki migili yuṃḍavu. aṃducēta prārabdakarmānubhavamaina tarvātanē jñānikainanu mōkṣamu kalugunu).
(cīkaṭilō cūcina trāḍu pāmu anu bhrāṃti, adi pāmu kādu trāḍu anu jñānamu kaligina tarvāta pōvunu. ā prakāramugānē brahmajñānamu kalugagānē idaṃtā jagattu anu bhrāṃti pōyi aṃtayu brahmamugānē tōcunu. ayinanu trāḍu cūci pāmu anukunnappuḍu dāni valana kalugu bhayamu, vaṇuku modalagunavi koṃtakālamuṃḍi tarvāta pōvunu. ā prakāramugānē prārabda karma valana kaligina bhōgamu prārabda karma naśiṃcina tarvātanē pōvunu. cimma cīkaṭilō cūcina trāḍu marala pāmugā kanabaḍunaṭlu prārabda karmānubhavakālamaṃdu jñānikainanu prapaṃcamu prapaṃcamuvalenē kanabaḍunu; ahaṃkāramuṃḍunu - dīniki kāraṇamaina ajñānamu tolagina tarvātanē idi prapaṃcamu kādu aṃtā brahmamē anu jñānamu kalugunu. adi yeṭlanagā - puli anukoni dāni mīdaku vēsina bāṇamu, tarvāta adi pulikādu gōvu ani telisinappaṭikī, dāni vēgamunu baṭṭi (śaktini baṭṭi) veḷḷunē kāni, bāṇamu vadalinavāniki yī jñānamu kaliginaṃta mātramuna ā bāṇamu dārilō āgadu, dāni vēgamu taggipōyina tarvātanē āgunu. ā prakāramu gānē viḍicipeṭṭina bāṇamuvale nunna prārabdakarma phalamuniccuṭaku prāraṃbhiṃcinadai phalamunu anubhaviṃpacēsina tarvātanē naśiṃcunu, iṃkoka vidhamugā prārabdakarma naśiṃcadu aṃducēta ā kālamulō brahmajñānikainanu idi prapaṃcamē yanu bhrāṃti kalugunu. ā prārabda karmānubhavamu pūrti ayina tarvātanē jñāniki yī bhrāṃti (ajñānamu) pōyi brahmajñānamuvalana itara karmala phalamu anubhaviṃpavalasina avasaramu lēkuṃḍuṭa valana “jñānē naivatu kaivalyaṃ” ani ceppiyuṃḍuṭacēta muktinoṃdunu).
(naiṣkarmyasiddhi - 1 -209, 211)
“tatra yānyanupa bhukta phalāsyanārabda phalāni tānīśvarēṇāpi kēna cidapi na śakyaṃtē parityaktuṃ”. (naiṣkarmyasiddhi - 1 - 211)
(phalaminiccuṭakāraṃbhiṃcina phalamulu ārabdakarmalu - ivi vīṭi phalamunanubhaviṃpacēsina tarvātanē tīrunu. anārabdakarma phalamulu śāstramulō ceppabaḍina kṛcchrha cāṃdrāyaṇādi prāyaścittakarmala valananē naśiṃcunu).
vartanaṃ tēna śāstrārthē bhramitavyaṃ na paṃḍitaiḥ |
sva sva karmānusārēṇa vartaṃtāṃ tē tathā tathā |
aviśiṣṭaḥ sarvabōdhaḥ sa mā muktiritisthitiḥ || (gītābhāvaprakāśamu - 3 - 310. 311)
(prārabda karma aneka vidhamulugā nuṃḍuṭavalana jñānulu kūḍā anēkarītulalō pravartiṃcuduru - aṃducēta vāru śāstramulōni arthamula yaḍala bhramapoṃdakūḍadu - vāru kūḍa vāri karmānuguṇamuganē vartiṃcuduru - mukti aṃdaṟiki samānamē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.