ప్రసీదతి అనేన ఇతి ప్రసాదః; సుఖం. (ప్రసన్నునిగా చేయునది, ప్రసన్నత).
అనుగ్రహః (అనుగ్రహించుట).
పురుషార్థరూపో అనుగ్రహః - (చతుర్విధ పురుషార్థములను కలుగచేయు అనుగ్రహము).
(ప్రసాదోనామ అనుగ్రహ బుద్ధిః). (అనుగ్రహించు బుద్ధి).
పారుష్యరాహిత్యం. (మాటలాడునపుడు కఠినముగా మాటలాడకుండుట).
మనోనైర్మల్యం - నైర్మల్యం సలిలస్య ఇవ స్వచ్ఛతా.
(మనస్సు నిర్మలముగా నుండుట - దోషబుద్ధి లేకుండుట, నీటిలో ఏ విధమైన దోషములు లేకుండి స్వచ్ఛముగ నున్నట్లు మనస్సు నిర్మలముగా నుండుట).
మనఃప్రసాదం - (అనుగ్రహించు మనస్సు కలిగియుండుట).
ప్రసన్నతా; స్వాస్థ్యం; మనసః స్వాస్థ్యం.
(మనస్సు స్వస్థత కలిగియుండుట - మనసులో ఏ విధమైన అలజడి లేకుండుట, మనస్సమాధానము).
(చిత్తము స్వచ్ఛముగా నుండుట, చిత్తము శుద్ధి కలిగియుండుట; చిత్తము పరమాత్మ సాక్షాత్కారమును పొందుటకు తగినట్లుండుట).
(ప్రసాదమనగా రాగద్వేషములు లేకుండి ఒకేదానియందు ధ్యానము (ఏకాగ్రత) కలిగియుండుట).
(స్వతః = ప్యత్నం వినా అపి; విషయాగతిః = విషయాన్ ప్రతి అప్రవృత్తిః).
(ప్రసాదమనగా ప్రయత్నము చేయకుండగనే మనస్సు విషయములందు ప్రవృత్తి లేకుండుట - భగవత్కటాక్షమువలన ఇట్లు కలుగును. కనుక ప్రసాదమనగా భగవంతుని కటాక్షము లేక అనుగ్రహము).
భగవంతుడు, మహాత్ములు మొదలగువారు భుజించి విడిచిన అన్నము మొదలగునవి - భగవంతునిభుక్తశేషము - భగవంతునికి నివేదించిన అన్నము మొదలగునవి - నైవేద్యము).
ప్రసాదే సతి బ్రహ్మ పరోక్షజ్ఞానం భవతి.
(భగవంతుని ప్రసాదము కలిగిన - అనుగ్రహము కలిగిన పరోక్షజ్ఞానము కలుగును).
పావనమౌను; నీ కృపకు పాత్రముగాక చరించు వేళనన్
కావగజాలరెవ్వరును - - - “. (శ్రీకృష్ణకర్ణామృతం - 1 - 29)
పత్రం పుష్పం ఫలం గంధం నైవేద్యం మత్పదోదకం |
దైవాద్యదంఘ్రి సంస్పర్శం అధవాప్యతి లంఘయేత్ |
సోపి పం గుత్వమాప్నోతి సత్యచేహ పరత్రవా ||“.
(తెలిసికాని, తెలియకకాని, నాకు - భగవంతునకు - అర్పించిన నిర్మాల్యము, ఆకు, పువ్వు, పండు, గంధము, నైవేద్యముకాని, నాపాదతీర్థముకాని ఎవని కాలికి తగులునో. లేక, ఎవడు వాటిని కాలుతో దాటునో అట్టివాడు ఈ లోకమునకాని, పరలోకమునకాని - ఈ జన్మలోకాని, దీని తర్వాత కలుగు జన్మలలోకాని కుంటివాడగును - సందేహములేదు).
ఆత్మవశ్యైర్విధే యాత్మా ప్రసాదమధిగచ్ఛతి |
ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతే ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 64. 65)
పై శ్లోకమునకు వ్యాఖ్యానము -
“వశీకృతమనాయస్తు స్వాధీనైరింద్రియైశ్చరన్ |
వియుక్తై రాగద్వేషాభ్యాం శబ్దాది విషయాం స్తధా |
చిత్తస్య స్వచ్ఛతాం బ్రహ్మ సాక్షాత్కారైక యోగ్యతాం |
స ప్రాప్నోతి తతశ్చిత్తం నిరోద్ధవ్యం ప్రయత్నతః |
చిత్తస్య స్వచ్ఛతాయాంతు భ్రాంతి జ్ఞానైక జన్మనాం |
ఆధ్యాత్మకాది దుఃఖానాం సర్వేషాం జాయతే క్షయః ||“. (గీతాభావప్రకాశము - 2 - 621, 622)
(రాగద్వేషములు లేక, ఇంద్రియములను విషయముల యడల పోనీయక తనవశములో నుంచుకొనినవాడు - మనో నిగ్రహము కలవాడు - బ్రహ్మ స్క్షాత్కారమునకు యోగ్యమైన చిత్తశాంతిని (చిత్త ప్రసాదమును) పొందును, ఈ చిత్తప్రసాదమువలన ఆధ్యాత్మికాది సమస్త దుఃఖములు క్షీణించును).
prasīdati anēna iti prasādaḥ; sukhaṃ. (prasannunigā cēyunadi, prasannata).
anugrahaḥ (anugrahiṃcuṭa).
puruṣārtharūpō anugrahaḥ - (caturvidha puruṣārthamulanu kalugacēyu anugrahamu).
(prasādōnāma anugraha buddhiḥ). (anugrahiṃcu buddhi).
pāruṣyarāhityaṃ. (māṭalāḍunapuḍu kaṭhinamugā māṭalāḍakuṃḍuṭa).
manōnairmalyaṃ - nairmalyaṃ salilasya iva svacchatā.
(manassu nirmalamugā nuṃḍuṭa - dōṣabuddhi lēkuṃḍuṭa, nīṭilō ē vidhamaina dōṣamulu lēkuṃḍi svacchamuga nunnaṭlu manassu nirmalamugā nuṃḍuṭa).
manaḥprasādaṃ - (anugrahiṃcu manassu kaligiyuṃḍuṭa).
prasannatā; svāsthyaṃ; manasaḥ svāsthyaṃ.
(manassu svasthata kaligiyuṃḍuṭa - manasulō ē vidhamaina alajaḍi lēkuṃḍuṭa, manassamādhānamu).
(cittamu svacchamugā nuṃḍuṭa, cittamu śuddhi kaligiyuṃḍuṭa; cittamu paramātma sākṣātkāramunu poṃduṭaku taginaṭluṃḍuṭa).
(prasādamanagā rāgadvēṣamulu lēkuṃḍi okēdāniyaṃdu dhyānamu (ēkāgrata) kaligiyuṃḍuṭa).
(svataḥ = pyatnaṃ vinā api; viṣayāgatiḥ = viṣayān prati apravṛttiḥ).
(prasādamanagā prayatnamu cēyakuṃḍaganē manassu viṣayamulaṃdu pravṛtti lēkuṃḍuṭa - bhagavatkaṭākṣamuvalana iṭlu kalugunu. kanuka prasādamanagā bhagavaṃtuni kaṭākṣamu lēka anugrahamu).
bhagavaṃtuḍu, mahātmulu modalaguvāru bhujiṃci viḍicina annamu modalagunavi - bhagavaṃtunibhuktaśēṣamu - bhagavaṃtuniki nivēdiṃcina annamu modalagunavi - naivēdyamu).
prasādē sati brahma parōkṣajñānaṃ bhavati.
(bhagavaṃtuni prasādamu kaligina - anugrahamu kaligina parōkṣajñānamu kalugunu).
pāvanamaunu; nī kṛpaku pātramugāka cariṃcu vēḷanan
kāvagajālarevvarunu - - - “. (śrīkṛṣṇakarṇāmṛtaṃ - 1 - 29)
patraṃ puṣpaṃ phalaṃ gaṃdhaṃ naivēdyaṃ matpadōdakaṃ |
daivādyadaṃghri saṃsparśaṃ adhavāpyati laṃghayēt |
sōpi paṃ gutvamāpnōti satyacēha paratravā ||“.
(telisikāni, teliyakakāni, nāku - bhagavaṃtunaku - arpiṃcina nirmālyamu, āku, puvvu, paṃḍu, gaṃdhamu, naivēdyamukāni, nāpādatīrthamukāni evani kāliki tagulunō. lēka, evaḍu vāṭini kālutō dāṭunō aṭṭivāḍu ī lōkamunakāni, paralōkamunakāni - ī janmalōkāni, dīni tarvāta kalugu janmalalōkāni kuṃṭivāḍagunu - saṃdēhamulēdu).
ātmavaśyairvidhē yātmā prasādamadhigacchati |
prasādē sarva duḥkhānāṃ hānirasyōpajāyatē |
prasanna cētasō hyāśu buddhiḥ paryavatiṣṭatē ||“. (śrīmadbhagavadgīta - 2 - 64. 65)
pai ślōkamunaku vyākhyānamu -
“vaśīkṛtamanāyastu svādhīnairiṃdriyaiścaran |
viyuktai rāgadvēṣābhyāṃ śabdādi viṣayāṃ stadhā |
cittasya svacchatāṃ brahma sākṣātkāraika yōgyatāṃ |
sa prāpnōti tataścittaṃ nirōddhavyaṃ prayatnataḥ |
cittasya svacchatāyāṃtu bhrāṃti jñānaika janmanāṃ |
ādhyātmakādi duḥkhānāṃ sarvēṣāṃ jāyatē kṣayaḥ ||“. (gītābhāvaprakāśamu - 2 - 621, 622)
(rāgadvēṣamulu lēka, iṃdriyamulanu viṣayamula yaḍala pōnīyaka tanavaśamulō nuṃcukoninavāḍu - manō nigrahamu kalavāḍu - brahma skṣātkāramunaku yōgyamaina cittaśāṃtini (citta prasādamunu) poṃdunu, ī cittaprasādamuvalana ādhyātmikādi samasta duḥkhamulu kṣīṇiṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.