← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాయోపవేశము prāyōpavēśamu

Original — తెలుగు
  1. అనశనావస్థా. (ఆహారము తినకుండుట).

  2. మృత్యుపర్యంతాన శనేన ఉపవిష్టం ఇతి పరమ వరాగ్యోక్తిః.

(చనిపోవుటకు సిద్ధపడి ఆహారపానములను విడిచిపెట్టి పరమవైరాగ్యమును పొందుట).

  1. “సమాయుక్తో భవేద్యస్తు పాతకైర్మహదాదిభిః |

దుశ్చికిత్సైః మహారోగైః పీడితోవా భవేత్తు యః |

స్యయందేహ వినాశస్యకాలే ప్రాప్తే మహామతిః |

అబ్రహ్మాణోవా స్వర్గాది మహాఫలజి గీషయా |

ప్రవిశేత్ జ్వలనం దీప్తం కుర్యాదనశనం తథా |

యే తేషా మధికారోస్తి నాన్యేషాం సర్వ జంతుషు |

నరాణా మధనారీణాం సర్వ వర్ణేషు సర్వదా ||”

ఇతి ఆదిత్య పురాణవచనం -

(మహాపాతకములు చేసినవాడున్నూ, గొప్ప రోగములచేత పీడింపబడినవాడున్నూ, అవసానకాలమందు బ్రాహ్మణేతరుడైనను, స్వర్గము మొదలగు గొప్ప ఫలములను కోరువాడును, ఆహారముమాని మండుచున్న అగ్నిలో ప్రవేశించవలెను. ఇట్లు చేయుటకు పైన చెప్పిన వారికే అధికారమున్నది. అన్ని వర్ణముల నరులకు, స్త్రీలకు, ఎప్పుడైనను పైన చెప్పినవారు అట్లు చేయవచ్చును - ఇతరులకు ఇట్లు చేయుటకు అర్హత లేదు. ఇతరులెవరూ ఇట్లు చేయకూడదు).

  1. “తక్షక వ్యాళ విషానల జ్వాలా జాలంబునం దనకు సప్తమ దినంబున మరణంబని యెఱింగినవాడు గావున భూపాలుండు భూలోక స్వర్గలోక భోగంబులు హేయంబులని తలంచి రాజ్యంబు విసర్జించి నిరశనత్వ దీక్ష చరణంబు సంకల్పించుకొని –

మ. - - - వియద్గంగా ప్రవాహంబులో

పలికింబోయి మరిష్యమాణుడగుచున్ బ్రాయోపవేశంబునన్ ||

క. చిత్తము గోవింద పదా

యత్తము గావించి మౌనియై తనలోనే

తత్తఱము లేక భూవర

సత్తముడు వసించె ముక్త సంగత్యమునన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 19 - 452; 458)

Transliteration
  1. anaśanāvasthā. (āhāramu tinakuṃḍuṭa).

  2. mṛtyuparyaṃtāna śanēna upaviṣṭaṃ iti parama varāgyōktiḥ.

(canipōvuṭaku siddhapaḍi āhārapānamulanu viḍicipeṭṭi paramavairāgyamunu poṃduṭa).

  1. “samāyuktō bhavēdyastu pātakairmahadādibhiḥ |

duścikitsaiḥ mahārōgaiḥ pīḍitōvā bhavēttu yaḥ |

syayaṃdēha vināśasyakālē prāptē mahāmatiḥ |

abrahmāṇōvā svargādi mahāphalaji gīṣayā |

praviśēt jvalanaṃ dīptaṃ kuryādanaśanaṃ tathā |

yē tēṣā madhikārōsti nānyēṣāṃ sarva jaṃtuṣu |

narāṇā madhanārīṇāṃ sarva varṇēṣu sarvadā ||”

iti āditya purāṇavacanaṃ -

(mahāpātakamulu cēsinavāḍunnū, goppa rōgamulacēta pīḍiṃpabaḍinavāḍunnū, avasānakālamaṃdu brāhmaṇētaruḍainanu, svargamu modalagu goppa phalamulanu kōruvāḍunu, āhāramumāni maṃḍucunna agnilō pravēśiṃcavalenu. iṭlu cēyuṭaku paina ceppina vārikē adhikāramunnadi. anni varṇamula narulaku, strīlaku, eppuḍainanu paina ceppinavāru aṭlu cēyavaccunu - itarulaku iṭlu cēyuṭaku arhata lēdu. itarulevarū iṭlu cēyakūḍadu).

  1. “takṣaka vyāḷa viṣānala jvālā jālaṃbunaṃ danaku saptama dinaṃbuna maraṇaṃbani yeṟiṃginavāḍu gāvuna bhūpāluṃḍu bhūlōka svargalōka bhōgaṃbulu hēyaṃbulani talaṃci rājyaṃbu visarjiṃci niraśanatva dīkṣa caraṇaṃbu saṃkalpiṃcukoni –

ma. - - - viyadgaṃgā pravāhaṃbulō

palikiṃbōyi mariṣyamāṇuḍagucun brāyōpavēśaṃbunan ||

ka. cittamu gōviṃda padā

yattamu gāviṃci mauniyai tanalōnē

tattaṟamu lēka bhūvara

sattamuḍu vasiṃce mukta saṃgatyamunan “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 19 - 452; 458)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.