(విస్తరించి యుండునది కనుక పృధివి).
(విస్తరించి యుండునది కనుక పృధివి)
(విస్తీర్ణము కలది - విస్తరించియుండునది; అనేకముగా విస్తరించునది; దట్తమైన అవయవములు కలది).
(అయిదువందల కోటి యోజనములు విస్తీర్ణము గలది).
(స్థూలరూపముతో కలుగు అవయవములకు స్థానమైనది, ఆధారమైనది).
(భోగ్య వస్తువులకు - భోగమునకు ఉపచరించు వస్తువులకు భోగస్థానమైనది. తనలోనుండి పుట్టిన వస్తువులను తిరిగి తనలోనికి తీసుకొనునది).
"పృధో రాజ్ఞః కన్యాత్వాత్, విస్తృతత్వాద్వా పృధివీ ఇత్యర్థః.”
(పృధు చక్రవర్తి యొక్క కన్య - కుమార్తె - అగుట వలనను, విస్తరించియుండునదగుట వలనను పృధివీ అని చెప్పబడుచున్నది).
(భూమి పృధుచక్రవర్తి యొక్క తనయ ఎట్లైనదనగా –
"తే.. సముచితానందమును బొంది సర్వ కామ
దుఘ యనందగు భూమిని దుహిత గాగ
గోరి గోరి కైకొని - - - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 18 - 504)
(భూమి నిస్సారమైపోయి సస్యములను పుట్టించకుండ నుండుటవలన పృధు చక్రవర్తి దానిని సంహ రించుటకుద్యమించగా -
"క. విను వాని నొకయుం
బున గ్రమ్మఱ బడయ వచ్చు భూవరచంద్రా
వినుమది యెఱిగించెద నీ
కును వత్సలురాలు నగుట గురుతర చరితా".
(నాలో ఇంకిపోయిన ఔషధులను మరల పుట్టించుటకు నుపాయము చెప్పెదను. నేను (భూదేవి) నీకు వత్సను అగుటవలన నిట్లు చెప్పుచున్నాను). (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 18 - 495)
ఆ ఉపాయమెట్లనగా –
"చ. మనువును దూడచేసి గరిమన్ నిజపాణితంబు లీల దో
హనముగ చేసి యందు సకలౌషధుల బితెకెం గ్రమంబునం
దనరగ దద్విధంబునను దత్పృధువత్సలయైన భూమియం
దనయము వారు వారును బ్రియంబగు కోర్కులు పొందిరున్నతిన్|". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 18 - 500)
(పృధు చక్రవర్తి చేత వాత్సల్యముచేత చంపబడక విడువబడుట చేత, అతని వత్స అయినందున భూమి పృధ్వి యని చెప్పబడుచున్నది).
(తనలోనుండి స్థూల రూపములతో వస్తువులను పుట్టించునది., వాటిని మరల తనలోనే లీనమగునట్లు నశింప చేయునది).
(ఈ పృధివి వలన ఓషధులు - సస్యములు మొదలగునవి - పుట్టుచున్నవి. ఓషధులవలన అన్నము కలుగుచున్నది - సకల జంతు జాలములకు కావలసిన వివిధమైన ఆహారము ఈ భూమినుండే కలుగుచున్నది).
ఈ పృధివి సృష్టిలో ఎట్లు పుట్టినదనగా : -
(ఆకాశమునుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలమునుండి పృధ్వి పుట్టినవి - ఇవి ఒకదానిలో నుండి ఒకటిగా పుట్టినవి).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)
(రసతన్మాత్రంబులోని పరమాత్మ యొక్క చిచ్ఛక్తి చేత ప్రేరేపింపబడి మార్పును చెంది అది జలంబుగా మారిన దానిలోనుండి గంధతన్మాత్రంబు పుట్టె. అది సూక్ష్మరూపము - దానిలోనుండి స్థూల రూపముగా పృధివి పుట్టెను).
(జలము గడ్ద కట్టగా పృధివిగా మారెను).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 202)
"వ. జలంబువలన గంధ రస రూప స్పర్శ శబ్దంబులనియెడి గుణంబులయిదింటితోడం బృధివి గలిగె"
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)
(పృధివి గధ గుణము కలది - అది రెండు విధములు - నిత్య పృధివీ, అనిత్య పృధివీ. నిత్య పృధివి పరమాణురూపమైనది. అనిత్య పృధివి కార్య రూపమైనది, సూక్ష్మరూపములైన పరమాణువులు ఒకటితో నొకటి కలిసి స్థూలరూపముగా మారినవి. అది మరల మూడు విధములు - శరీరము, ఇంద్రియములు, విషయములు, వీటిని బట్టి భేదము కలది - శరీరమనగా మన శరీరము వంటిది. ఇంద్రియము గంధమును గ్రహించునది. అది నాసిక యొక్క వృత్తి. విషయములనగా, మట్టి పాషాణము మొదలగునవి. (పృధివిలో కలిగినవి).
(పృధివి యొక్క లక్షణము గంధము కలిగి యుండుట. గంధము విషయమగు జ్ఞానము కలిగించునది - నాసికేంద్రియము. అందుచేత అది పృధివికి సంబంధించినది).
(ద్వ్యణుకము మొదలగువాటి రూపము కలిగి తనలోనుండి రూపములతో వస్తువును కలిగించి మరల లయకాలమందు తనలోనే లయము చేసుకొనునది స్థూలరూపమైన పృధివి - అనిత్య పృధివి).
పృధివికి ధారణంబు గుణము - యత్కఠినం సా పృధివీ (కఠినముగానున్నదిపృధివి యొక్క అంశ).
పృధివికి బ్రహ్మ అధి దేవత - "పృద్వ్యాం బ్రహ్మ, జలే విష్ణుస్తతో రుద్రో హుతాశనే, ఈశ్వరః పవనే(అ)స్మిన్ ఆకాశే సదాశివః".
(పృధివిలో నున్న గధము నేనే).
(vistariṃci yuṃḍunadi kanuka pṛdhivi).
(vistariṃci yuṃḍunadi kanuka pṛdhivi)
(vistīrṇamu kaladi - vistariṃciyuṃḍunadi; anēkamugā vistariṃcunadi; daṭtamaina avayavamulu kaladi).
(ayiduvaṃdala kōṭi yōjanamulu vistīrṇamu galadi).
(sthūlarūpamutō kalugu avayavamulaku sthānamainadi, ādhāramainadi).
(bhōgya vastuvulaku - bhōgamunaku upacariṃcu vastuvulaku bhōgasthānamainadi. tanalōnuṃḍi puṭṭina vastuvulanu tirigi tanalōniki tīsukonunadi).
"pṛdhō rājñaḥ kanyātvāt, vistṛtatvādvā pṛdhivī ityarthaḥ.”
(pṛdhu cakravarti yokka kanya - kumārte - aguṭa valananu, vistariṃciyuṃḍunadaguṭa valananu pṛdhivī ani ceppabaḍucunnadi).
(bhūmi pṛdhucakravarti yokka tanaya eṭlainadanagā –
"tē.. samucitānaṃdamunu boṃdi sarva kāma
dugha yanaṃdagu bhūmini duhita gāga
gōri gōri kaikoni - - - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 18 - 504)
(bhūmi nissāramaipōyi sasyamulanu puṭṭiṃcakuṃḍa nuṃḍuṭavalana pṛdhu cakravarti dānini saṃha riṃcuṭakudyamiṃcagā -
"ka. vinu vāni nokayuṃ
buna grammaṟa baḍaya vaccu bhūvaracaṃdrā
vinumadi yeṟigiṃceda nī
kunu vatsalurālu naguṭa gurutara caritā".
(nālō iṃkipōyina auṣadhulanu marala puṭṭiṃcuṭaku nupāyamu ceppedanu. nēnu (bhūdēvi) nīku vatsanu aguṭavalana niṭlu ceppucunnānu). (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 18 - 495)
ā upāyameṭlanagā –
"ca. manuvunu dūḍacēsi gariman nijapāṇitaṃbu līla dō
hanamuga cēsi yaṃdu sakalauṣadhula bitekeṃ gramaṃbunaṃ
danaraga dadvidhaṃbunanu datpṛdhuvatsalayaina bhūmiyaṃ
danayamu vāru vārunu briyaṃbagu kōrkulu poṃdirunnatin|". (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 18 - 500)
(pṛdhu cakravarti cēta vātsalyamucēta caṃpabaḍaka viḍuvabaḍuṭa cēta, atani vatsa ayinaṃduna bhūmi pṛdhvi yani ceppabaḍucunnadi).
(tanalōnuṃḍi sthūla rūpamulatō vastuvulanu puṭṭiṃcunadi., vāṭini marala tanalōnē līnamagunaṭlu naśiṃpa cēyunadi).
(ī pṛdhivi valana ōṣadhulu - sasyamulu modalagunavi - puṭṭucunnavi. ōṣadhulavalana annamu kalugucunnadi - sakala jaṃtu jālamulaku kāvalasina vividhamaina āhāramu ī bhūminuṃḍē kalugucunnadi).
ī pṛdhivi sṛṣṭilō eṭlu puṭṭinadanagā : -
(ākāśamunuṃḍi vāyuvu, vāyuvunuṃḍi agni, agni nuṃḍi jalamu, jalamunuṃḍi pṛdhvi puṭṭinavi - ivi okadānilō nuṃḍi okaṭigā puṭṭinavi).
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)
(rasatanmātraṃbulōni paramātma yokka cicchakti cēta prērēpiṃpabaḍi mārpunu ceṃdi adi jalaṃbugā mārina dānilōnuṃḍi gaṃdhatanmātraṃbu puṭṭe. adi sūkṣmarūpamu - dānilōnuṃḍi sthūla rūpamugā pṛdhivi puṭṭenu).
(jalamu gaḍda kaṭṭagā pṛdhivigā mārenu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 202)
"va. jalaṃbuvalana gaṃdha rasa rūpa sparśa śabdaṃbulaniyeḍi guṇaṃbulayidiṃṭitōḍaṃ bṛdhivi galige"
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)
(pṛdhivi gadha guṇamu kaladi - adi reṃḍu vidhamulu - nitya pṛdhivī, anitya pṛdhivī. nitya pṛdhivi paramāṇurūpamainadi. anitya pṛdhivi kārya rūpamainadi, sūkṣmarūpamulaina paramāṇuvulu okaṭitō nokaṭi kalisi sthūlarūpamugā mārinavi. adi marala mūḍu vidhamulu - śarīramu, iṃdriyamulu, viṣayamulu, vīṭini baṭṭi bhēdamu kaladi - śarīramanagā mana śarīramu vaṃṭidi. iṃdriyamu gaṃdhamunu grahiṃcunadi. adi nāsika yokka vṛtti. viṣayamulanagā, maṭṭi pāṣāṇamu modalagunavi. (pṛdhivilō kaliginavi).
(pṛdhivi yokka lakṣaṇamu gaṃdhamu kaligi yuṃḍuṭa. gaṃdhamu viṣayamagu jñānamu kaligiṃcunadi - nāsikēṃdriyamu. aṃducēta adi pṛdhiviki saṃbaṃdhiṃcinadi).
(dvyaṇukamu modalaguvāṭi rūpamu kaligi tanalōnuṃḍi rūpamulatō vastuvunu kaligiṃci marala layakālamaṃdu tanalōnē layamu cēsukonunadi sthūlarūpamaina pṛdhivi - anitya pṛdhivi).
pṛdhiviki dhāraṇaṃbu guṇamu - yatkaṭhinaṃ sā pṛdhivī (kaṭhinamugānunnadipṛdhivi yokka aṃśa).
pṛdhiviki brahma adhi dēvata - "pṛdvyāṃ brahma, jalē viṣṇustatō rudrō hutāśanē, īśvaraḥ pavanē(a)smin ākāśē sadāśivaḥ".
(pṛdhivilō nunna gadhamu nēnē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.