(అంతర్యామిగానుండుట వలన ప్రేరేపించువాడు,శరీరము లోపలనుండువాడు కనుక పనులలో ప్రేరేపించు వాడు).
(అంతర్యామి యగుటవలన - అన్నింటిలోపలనుండువాడు కనుక అన్నింటిని వాటివాటి పనులలో ప్రవర్తింపచేయువాడు)..
బుద్ధిస్త్వం సర్వలోకానాం అహంకారస్త్వమీశ్వర |
భూతానామింద్రియాణాం చ త్వమే వైకః ప్రవర్తకః ||". (లింగపురాణము)
(నీవు లోకములన్నింటిని సృష్టించినవాడివి, ప్రకృతిని ప్రవర్తింపచేయువాడవు, లోకములన్నింటికీ బుద్ధివి నీవు, అహంకారము నీవు. భూతములను, ఇంద్రియములను ప్రవర్తింప చేయువాడవు నీవొక్కడివే).
సంసారార్ణవమగ్నానాం సాక్షాత్ సంసార మోచకః |
సర్వేషాం తు మనస్తేన ప్రేరితం నియమేనతు |
విషయే గచ్ఛతి ప్రాణశ్చేష్టతే, వాగ్వదత్యపి |
చక్షుః పశ్యతి రూపాణి శ్రోత్రం శబ్దం శృణోత్యపి |
అన్యానిఖాని సర్వాణి తేనైవ ప్రేరితాని తు |
స్వం స్వం విషయముద్దిశ్య ప్రవర్తంతే నిరంతరం |
ప్రవర్తకం చాప్యస్య మాయయా న స్వభావతః ||". (బ్రహ్మగీతాయాం)
(స్వతసిద్ధుడైన దేవుడొకడున్నాడు. అతడే అన్నింటికీ ఎల్లపుడు సాక్షి అయినవాడు, సంసారమను సముద్రములో మునిగియున్నవారిని దానిలోనుండి విడిపించి మోక్షమిచ్చువాడు. అందఱి మనుసులో అతనే నియమముగానుండి విషయములందు ప్రేరేపించును. అతని నియమమువలననే ప్రాణము చేష్టించును, వాక్కు మాటలాడును, కండ్లు రూపములను చూచును, చెవి శబ్దమును వినును. మిగిలినవన్నియు అతని ప్రేరణవలననే వాటి వాటి విషయముల యడల ప్రవర్తించుచున్నవి. ఇట్లు అన్నింటినీ అతను ప్రవర్తింపచేయుట అతని మాయ వలననే - తనంతట తాను చేయుచుండుటలేదు).
క్షోభయామిచ సర్గాదౌ ప్రధానపురుషా వుభౌ |
తాభ్యాం సంజాయతే విశ్వం సం యతాభ్యాం పరస్పరం |
మహదాది క్రమేణైవ మమ తేజోవిజృంభితం |
యోహి సర్వ జగత్సాక్షీ కాలచక్ర ప్రవర్తకః |
హిరణ్యగర్భో మార్తాండః సోపి మద్దేహ సంభవః |
తస్మై దివ్యం స్వమైశ్వర్యం జ్ఞానం యోగం సనాతనం |
దత్తవానాత్మజాన్ వేదాన్ కల్పాదౌ చతురోద్విజాః |
స మన్నియోగతో దేవో బ్రహ్మ మద్భావ భావితః |
దివ్యం తన్నామ కైశ్వర్యం సర్వదా వహతి స్వయం |
స సర్వలోక నిర్మాతా మన్నియోగేన సర్వవిత్ |
భూత్వా చతుర్ముఖః సర్వం సృజత్యేవాత్మ సంభవః |
యోపి నారాయణో (అ)నంతో లోకానాం ప్రభురవ్యయః |
మమైవచ పరామూర్తిః కరోతి పరిపాలనం |
యో(అం)తక స్సర్వభూతానాం రుద్రః కాలాత్మికః ప్రభుః |
మదాజ్ఞయా (అ)సౌ సతతం సంహరిష్యతి మే తనుః |
హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాశినామపి |
పాకంచ కురుతే వహ్నిః సోపి మచ్ఛక్తి చోదితః |
భుక్తమాహారజాతం యత్ పచత్యంతరహర్నిశం |
వైశ్వానరో(అ)గ్ని ర్భగవానీశ్వరస్య నియోగతః |
యో (అ)పి సర్వాభసాం యోనిర్వరుణో దేవ పుంగవః |
సోపి సం జీవయేత్ కృత్స్ను మీశ్వరస్య నియోగతః |
యో (అ)oతస్తిష్టతి దేవానాం బహిర్దేవః ప్రభంజనః |
మదాజ్ఞయా (అ)సౌ భూతానాం శరీరాణి భిభర్తిహి |
యోపిసంజీవనో నృణాం దేవానామమృతా కరః |
సోమః స మన్ని యోగేన చోదితః కిలవర్తతే |
యః స్వభాసా జగత్కృస్నం ప్రకాశయతి సర్వదా |
సూర్యో దృష్టిం వితనుతే శాసనేన స్వయం భువః |
యో (అ)ప్య శేష జగచ్ఛాస్తా శక్రః సర్వామరేశ్వరః |
యజ్వానాం ఫలదో దేవో వర్తతే వై మదాజ్ఞయా |
యః ప్రశాస్తా హ్య సాధూనాం వర్తతే నియమాదిహ |
యమో వైవస్వతో దేవో దేవ దేవ నియోగతః |
యోపి సర్వ ధనాధ్యక్షో ధనానాం సంప్రదాయకః |
సోపీశ్వర నియోగేన కుబేరో వర్తతే సదా |
యః సర్వ రక్షసాం నాధస్తామసానాం ఫలప్రదః |
మన్ని యోగాదసౌ దేవో ని ఋతిర్వర్తతే సదా |
వేతాల గణభూతానాం స్వామీ భోగఫలప్రదః |
ఈశానః కిలభక్తా నాం సోపి తిష్టేన్మదాజ్ఞయా |
యశ్చ సర్వజగత్పూజ్యో వర్తతే విఘ్న కారకః |
వినాయకో ధర్మరతః సోపి మద్వచనాత్కిల |
యోపి బ్రహ్మవిదాం శ్రేష్టో దేవసేనాపతిః ప్రభుః |
స్కందో(అ)సౌ వర్తతే నిత్యం స్యయంభు వినియోగతః |
యే చ ప్రజానాం పత యో మరీచ్యాద్యాః మహర్షయః |
సృజంతి వివిధం లోకం పరస్య నియమాన్మయ |
యం చ శ్రీః సర్వభూతానాం దదాతి విపులాం శ్రియం |
పత్నీ నారాయణస్యేయం వర్తతే మదనుగ్రహాత్ |
వాచం దదాతి విపులాం యాచ దేవ సరస్వతీ |
సోపీశ్వర నియోగేన పూజితా సంప్రవర్తతే |
యో (అ)శేష పురుషాన్ పాపాన్ నరకాత్తారయిష్యతి |
సావిత్రీ సంస్కృతా సాపి దేవాజ్ఞాను విధాయినీ |
పార్వతీ పరమా దేవీ బ్రహ్మ విద్యా ప్రదాయినీ |
యా అభిధ్యాతా విశేషేణ సాపి మద్వచనానుగా ||".
"విధూయ మోహ కలిలం యయా పశ్యంతి తత్పరం |
సావిద్యా పి మహేశస్య నియోగ వశవర్తినీ |
బహునా(అ)త్ర కిముక్తేన మమ శక్త్యాత్మకం జగత్ |
మయైవ ప్రేర్యతే కృత్స్నం మయ్యేవ ప్రలయం వ్రజేత్ |
అహం హి భగవానీశః స్వయంజ్యోతిస్సనాతనః |
పరమాత్మాపరం బ్రహ్మ మత్తో హ్యన్యన్న విద్యతే ||". (ఈశ్వరగీతాయాం)
(ఆది మధ్యాంతములు లేని వాడున్నూ, మాయా తత్వమును ప్రవర్తింప చేయువాడున్నూ, అయిన నేను (భగవంతుడనైన నేను), సృష్టి ప్రారంభములో ప్రథానమును పురుషుని వర్తింప చేసితిని. అట్టి వారిద్దరిని ప్రవర్తింప చేయుటవలన ఈ విశ్వము - ప్రపంచము - పుట్టినది. మహత్తత్త్వము మొదలగునవన్నియు క్రమముగా నా తేజస్సు వలననే పుట్టినవి. నా తేజస్సు ప్రథానమును (ప్రకృతిని) పురుషుని ప్రేరేపించుటవలననే పుట్టినవి. నేను జగత్తు అంతటికీ సాక్షిని, కాలచక్రమును ప్రవర్తింపచేయువాడను. హిరణ్యగర్భుడు - చాతుర్ముఖ బ్రహ్మ-, సూర్యుడు నా దేహమునుండి పుట్టినవారే. (నాలోనుండి పుట్టినవారే). సృష్టి ప్రారంభములో ఆ హిరణ్యగర్భునకు దివ్యమైన నా సనాతనమైన ఐశ్వర్యమును, జ్ఞానమును, యోగమును ఇచ్చి యుంటిని. నా వలన పుట్టిన వేదములను కూడ ఇచ్చితిని. నా ఈశ్వరభావము కలిగియుండుటవలన ఆ చతుర్ముఖ బ్రహ్మ నా నియోగము వలననే నా దివ్యమైన ఐశ్వర్యము కలిగియున్నాడు - అతను నా నియోగము వలననే సర్వజ్ఞుడై సమస్త లోకములను సృష్టించు చున్నాడు. అనంతుడు లోకములకు ప్రభువు అవ్యయుడు అయిన నారాయణుడు నా పరామూర్తియే. నా రూపమే అయిన జగత్తును పరిపాలించుచున్నాడు. సమస్త భూతములకు అంతకుడు ప్రభువు, కాలాత్ముడు అయిన రుద్రుడు నా ఆజ్ఞ చేతనే సంహారము చేయు చున్నాడు. అగ్ని నా శక్తి కలిగియుండుట చేతనే దేవతులకు హవ్యమును అందచేయు చున్నాడు. ఈశ్వరుని నియోగము చేతనే వైశ్యానరుడు అను అగ్ని తినబడిన ఆహారమును పచనము చేసి శరీరమంతటికిని అందచేయు చున్నాడు. నీటికి నిధి అయిన వరుణుడు ఈశ్వరుని నియోగము ననుసరించియే జీవులను జీవమను ఉదకములనిచ్చి జీవింప చేయుచున్నాడు. సోముడు (చంద్రుడు) నా చేత నియోగింపబడియే (ప్రేరేపింపబడియే) ప్రవర్తించు చున్నాడు. జగత్తునంతటిని తనకాంతిచేత ప్రకాశింపచేయుచున్న సూర్యుడు నా అజ్ఞచేతనే దృష్టినిచ్చుచున్నాడు. జగత్తునంతటినీ శాసించువాడు దేవతులకు ఈశ్వరుడు (రాజు). యజ్ఞముల ఫలమునిచ్చువాడు అయిన ఇంద్రుడు నా ఆజ్ఞ ప్రకారామే ప్రవర్తించు చున్నాడు (తన పనిని తను చేయుచున్నాడు). సమస్త ధనములకు అధ్యక్షుడు, ధనమును సమకూర్చువాడు అయిన కుబేరుడు ఈశ్వరుని ఆజ్ఞచేతనే ప్రవర్తించుచున్నాడు. రాక్షసులకు ప్రభువు తామసులకు ఫలమునిచ్చువాడు అయిన ని ఋతి భగవంతుని నియోగముచేతనే (నిర్ణీతమైన) తన పనిలో ప్రవర్తించుచున్నాడు. భేతాళములకు భూతములకు ప్రభువైన ఈశానుడు నా ఆజ్ఞప్రకారమే ఫలమునిచ్చుచున్నాడు. విఘ్నకారకుడు వినాయకుడు, జగత్తు అంతటిచేత పూజింపబడువాడు అయిన విఘ్నేశ్వరుడు అట్లు విఘ్నములను నాశము చేయుట మొదలగు పనులు నా ఆజ్ఞ వలననే. బ్రహ్మజ్ఞానులలో శ్రేష్టుడైనవాడు, దేవతులకు సేనాపతి ప్రభువు అయిన స్కందుడు (కుమారస్వామి) స్వయంభవుడనైన నాచే నియోగింపబడియే పని చేయుచున్నాడు. ప్రజాపతులైన మరీచి మొదలగువారు పరుడనైన నాచ నియోగింపబడినవారై వివిధ లోకములను సృష్టించుచున్నారు. సమస్త భూతములకు విస్తారముగా ధనమును ఐశ్వర్యమును ఇచ్చునట్టి శ్రీమన్నారాయణుని పత్ని అయిన శ్రీలక్ష్మీదేవి నా అనుగ్రహమువలననే అట్లు ప్రవర్తించుచున్నది. వాక్కును కలుగచేయు వాగీశ్వరియైన శ్రీ సరస్వతీ దేవి ఈశ్వరుని (భగవంతుని) నియోగము చేతనే పూజింపబడుచున్నది. సమస్తమైన పురుషులను నరకమునుండి తరింప చేయు శ్రీ సావిత్రీదేవి పరమాత్మయొక్క ఆజ్ఞప్రకారమే చేయుచున్నది. పరదేవత, బ్రహ్మవిద్యా ప్రదాత అయిన శ్రీ పార్వతీ దేవి నా ఆజ్ఞచేతనే ప్రవర్తించుచున్నది).
(పైన చెప్పబడిన దాని నుండి పరమాత్మ పరబ్రహ్మ అయిన వాని వలననే ప్రపంచమంతయు జరుగుచున్నది. అన్ని విధములైన దేవతులలోను వాటి శక్తులలోను తానే యుండి, తన చైతన్య శక్తిని వాటికిచ్చి వాటి చేత వాటి నియమిత పనులలో ప్రేరేపించి చేయించుచున్నాడు - ప్రపంచమంతటిలోను - అందులో నున్న ప్రతి వస్తువునందును యే విధమైన చలనము కలిగినను - పని జరిగినను - దేనిద్వారా జరిగినను, ఎవనిద్వారా జరిగినను అది యంతయు ఒకడే అయిన భగవంతుని శక్తి వలననే అని గ్రహించ తగినది - ఆ విధముగా అతను వాటిని ప్రేరేపించుట వలననే ప్రపంచములోని పనులన్నియు జరుగుచున్నవి యనుట నిశ్చయము - ఇట్లు అన్నింటిని ప్రేరేపించుటచేతనే 'ప్రేరయితా' - అన్నింటిలోను ఉండి, అన్నింటికి తన శక్తి నిచ్చి, అన్నింటిచేత వాటి వాటి పనులను చేయించువాడు ఒక్కడే అయిన పరమాత్మ - పరబ్రహ్మ - ఒకే తత్వము - ఇదియే ప్రపంచమంతటిలోనుండు తత్వము - పరతత్వము - పరమాత్మ తత్వము, పరబ్రహ్మ తత్వము). (only one ENERGY pervades and permeats the whole creation).
(aṃtaryāmigānuṃḍuṭa valana prērēpiṃcuvāḍu,śarīramu lōpalanuṃḍuvāḍu kanuka panulalō prērēpiṃcu vāḍu).
(aṃtaryāmi yaguṭavalana - anniṃṭilōpalanuṃḍuvāḍu kanuka anniṃṭini vāṭivāṭi panulalō pravartiṃpacēyuvāḍu)..
buddhistvaṃ sarvalōkānāṃ ahaṃkārastvamīśvara |
bhūtānāmiṃdriyāṇāṃ ca tvamē vaikaḥ pravartakaḥ ||". (liṃgapurāṇamu)
(nīvu lōkamulanniṃṭini sṛṣṭiṃcinavāḍivi, prakṛtini pravartiṃpacēyuvāḍavu, lōkamulanniṃṭikī buddhivi nīvu, ahaṃkāramu nīvu. bhūtamulanu, iṃdriyamulanu pravartiṃpa cēyuvāḍavu nīvokkaḍivē).
saṃsārārṇavamagnānāṃ sākṣāt saṃsāra mōcakaḥ |
sarvēṣāṃ tu manastēna prēritaṃ niyamēnatu |
viṣayē gacchati prāṇaścēṣṭatē, vāgvadatyapi |
cakṣuḥ paśyati rūpāṇi śrōtraṃ śabdaṃ śṛṇōtyapi |
anyānikhāni sarvāṇi tēnaiva prēritāni tu |
svaṃ svaṃ viṣayamuddiśya pravartaṃtē niraṃtaraṃ |
pravartakaṃ cāpyasya māyayā na svabhāvataḥ ||". (brahmagītāyāṃ)
(svatasiddhuḍaina dēvuḍokaḍunnāḍu. ataḍē anniṃṭikī ellapuḍu sākṣi ayinavāḍu, saṃsāramanu samudramulō munigiyunnavārini dānilōnuṃḍi viḍipiṃci mōkṣamiccuvāḍu. aṃdaṟi manusulō atanē niyamamugānuṃḍi viṣayamulaṃdu prērēpiṃcunu. atani niyamamuvalananē prāṇamu cēṣṭiṃcunu, vākku māṭalāḍunu, kaṃḍlu rūpamulanu cūcunu, cevi śabdamunu vinunu. migilinavanniyu atani prēraṇavalananē vāṭi vāṭi viṣayamula yaḍala pravartiṃcucunnavi. iṭlu anniṃṭinī atanu pravartiṃpacēyuṭa atani māya valananē - tanaṃtaṭa tānu cēyucuṃḍuṭalēdu).
kṣōbhayāmica sargādau pradhānapuruṣā vubhau |
tābhyāṃ saṃjāyatē viśvaṃ saṃ yatābhyāṃ parasparaṃ |
mahadādi kramēṇaiva mama tējōvijṛṃbhitaṃ |
yōhi sarva jagatsākṣī kālacakra pravartakaḥ |
hiraṇyagarbhō mārtāṃḍaḥ sōpi maddēha saṃbhavaḥ |
tasmai divyaṃ svamaiśvaryaṃ jñānaṃ yōgaṃ sanātanaṃ |
dattavānātmajān vēdān kalpādau caturōdvijāḥ |
sa manniyōgatō dēvō brahma madbhāva bhāvitaḥ |
divyaṃ tannāma kaiśvaryaṃ sarvadā vahati svayaṃ |
sa sarvalōka nirmātā manniyōgēna sarvavit |
bhūtvā caturmukhaḥ sarvaṃ sṛjatyēvātma saṃbhavaḥ |
yōpi nārāyaṇō (a)naṃtō lōkānāṃ prabhuravyayaḥ |
mamaivaca parāmūrtiḥ karōti paripālanaṃ |
yō(aṃ)taka ssarvabhūtānāṃ rudraḥ kālātmikaḥ prabhuḥ |
madājñayā (a)sau satataṃ saṃhariṣyati mē tanuḥ |
havyaṃ vahati dēvānāṃ kavyaṃ kavyāśināmapi |
pākaṃca kurutē vahniḥ sōpi macchakti cōditaḥ |
bhuktamāhārajātaṃ yat pacatyaṃtaraharniśaṃ |
vaiśvānarō(a)gni rbhagavānīśvarasya niyōgataḥ |
yō (a)pi sarvābhasāṃ yōnirvaruṇō dēva puṃgavaḥ |
sōpi saṃ jīvayēt kṛtsnu mīśvarasya niyōgataḥ |
yō (a)otastiṣṭati dēvānāṃ bahirdēvaḥ prabhaṃjanaḥ |
madājñayā (a)sau bhūtānāṃ śarīrāṇi bhibhartihi |
yōpisaṃjīvanō nṛṇāṃ dēvānāmamṛtā karaḥ |
sōmaḥ sa manni yōgēna cōditaḥ kilavartatē |
yaḥ svabhāsā jagatkṛsnaṃ prakāśayati sarvadā |
sūryō dṛṣṭiṃ vitanutē śāsanēna svayaṃ bhuvaḥ |
yō (a)pya śēṣa jagacchāstā śakraḥ sarvāmarēśvaraḥ |
yajvānāṃ phaladō dēvō vartatē vai madājñayā |
yaḥ praśāstā hya sādhūnāṃ vartatē niyamādiha |
yamō vaivasvatō dēvō dēva dēva niyōgataḥ |
yōpi sarva dhanādhyakṣō dhanānāṃ saṃpradāyakaḥ |
sōpīśvara niyōgēna kubērō vartatē sadā |
yaḥ sarva rakṣasāṃ nādhastāmasānāṃ phalapradaḥ |
manni yōgādasau dēvō ni ṛtirvartatē sadā |
vētāla gaṇabhūtānāṃ svāmī bhōgaphalapradaḥ |
īśānaḥ kilabhaktā nāṃ sōpi tiṣṭēnmadājñayā |
yaśca sarvajagatpūjyō vartatē vighna kārakaḥ |
vināyakō dharmarataḥ sōpi madvacanātkila |
yōpi brahmavidāṃ śrēṣṭō dēvasēnāpatiḥ prabhuḥ |
skaṃdō(a)sau vartatē nityaṃ syayaṃbhu viniyōgataḥ |
yē ca prajānāṃ pata yō marīcyādyāḥ maharṣayaḥ |
sṛjaṃti vividhaṃ lōkaṃ parasya niyamānmaya |
yaṃ ca śrīḥ sarvabhūtānāṃ dadāti vipulāṃ śriyaṃ |
patnī nārāyaṇasyēyaṃ vartatē madanugrahāt |
vācaṃ dadāti vipulāṃ yāca dēva sarasvatī |
sōpīśvara niyōgēna pūjitā saṃpravartatē |
yō (a)śēṣa puruṣān pāpān narakāttārayiṣyati |
sāvitrī saṃskṛtā sāpi dēvājñānu vidhāyinī |
pārvatī paramā dēvī brahma vidyā pradāyinī |
yā abhidhyātā viśēṣēṇa sāpi madvacanānugā ||".
"vidhūya mōha kalilaṃ yayā paśyaṃti tatparaṃ |
sāvidyā pi mahēśasya niyōga vaśavartinī |
bahunā(a)tra kimuktēna mama śaktyātmakaṃ jagat |
mayaiva prēryatē kṛtsnaṃ mayyēva pralayaṃ vrajēt |
ahaṃ hi bhagavānīśaḥ svayaṃjyōtissanātanaḥ |
paramātmāparaṃ brahma mattō hyanyanna vidyatē ||". (īśvaragītāyāṃ)
(ādi madhyāṃtamulu lēni vāḍunnū, māyā tatvamunu pravartiṃpa cēyuvāḍunnū, ayina nēnu (bhagavaṃtuḍanaina nēnu), sṛṣṭi prāraṃbhamulō prathānamunu puruṣuni vartiṃpa cēsitini. aṭṭi vāriddarini pravartiṃpa cēyuṭavalana ī viśvamu - prapaṃcamu - puṭṭinadi. mahattattvamu modalagunavanniyu kramamugā nā tējassu valananē puṭṭinavi. nā tējassu prathānamunu (prakṛtini) puruṣuni prērēpiṃcuṭavalananē puṭṭinavi. nēnu jagattu aṃtaṭikī sākṣini, kālacakramunu pravartiṃpacēyuvāḍanu. hiraṇyagarbhuḍu - cāturmukha brahma-, sūryuḍu nā dēhamunuṃḍi puṭṭinavārē. (nālōnuṃḍi puṭṭinavārē). sṛṣṭi prāraṃbhamulō ā hiraṇyagarbhunaku divyamaina nā sanātanamaina aiśvaryamunu, jñānamunu, yōgamunu icci yuṃṭini. nā valana puṭṭina vēdamulanu kūḍa iccitini. nā īśvarabhāvamu kaligiyuṃḍuṭavalana ā caturmukha brahma nā niyōgamu valananē nā divyamaina aiśvaryamu kaligiyunnāḍu - atanu nā niyōgamu valananē sarvajñuḍai samasta lōkamulanu sṛṣṭiṃcu cunnāḍu. anaṃtuḍu lōkamulaku prabhuvu avyayuḍu ayina nārāyaṇuḍu nā parāmūrtiyē. nā rūpamē ayina jagattunu paripāliṃcucunnāḍu. samasta bhūtamulaku aṃtakuḍu prabhuvu, kālātmuḍu ayina rudruḍu nā ājña cētanē saṃhāramu cēyu cunnāḍu. agni nā śakti kaligiyuṃḍuṭa cētanē dēvatulaku havyamunu aṃdacēyu cunnāḍu. īśvaruni niyōgamu cētanē vaiśyānaruḍu anu agni tinabaḍina āhāramunu pacanamu cēsi śarīramaṃtaṭikini aṃdacēyu cunnāḍu. nīṭiki nidhi ayina varuṇuḍu īśvaruni niyōgamu nanusariṃciyē jīvulanu jīvamanu udakamulanicci jīviṃpa cēyucunnāḍu. sōmuḍu (caṃdruḍu) nā cēta niyōgiṃpabaḍiyē (prērēpiṃpabaḍiyē) pravartiṃcu cunnāḍu. jagattunaṃtaṭini tanakāṃticēta prakāśiṃpacēyucunna sūryuḍu nā ajñacētanē dṛṣṭiniccucunnāḍu. jagattunaṃtaṭinī śāsiṃcuvāḍu dēvatulaku īśvaruḍu (rāju). yajñamula phalamuniccuvāḍu ayina iṃdruḍu nā ājña prakārāmē pravartiṃcu cunnāḍu (tana panini tanu cēyucunnāḍu). samasta dhanamulaku adhyakṣuḍu, dhanamunu samakūrcuvāḍu ayina kubēruḍu īśvaruni ājñacētanē pravartiṃcucunnāḍu. rākṣasulaku prabhuvu tāmasulaku phalamuniccuvāḍu ayina ni ṛti bhagavaṃtuni niyōgamucētanē (nirṇītamaina) tana panilō pravartiṃcucunnāḍu. bhētāḷamulaku bhūtamulaku prabhuvaina īśānuḍu nā ājñaprakāramē phalamuniccucunnāḍu. vighnakārakuḍu vināyakuḍu, jagattu aṃtaṭicēta pūjiṃpabaḍuvāḍu ayina vighnēśvaruḍu aṭlu vighnamulanu nāśamu cēyuṭa modalagu panulu nā ājña valananē. brahmajñānulalō śrēṣṭuḍainavāḍu, dēvatulaku sēnāpati prabhuvu ayina skaṃduḍu (kumārasvāmi) svayaṃbhavuḍanaina nācē niyōgiṃpabaḍiyē pani cēyucunnāḍu. prajāpatulaina marīci modalaguvāru paruḍanaina nāca niyōgiṃpabaḍinavārai vividha lōkamulanu sṛṣṭiṃcucunnāru. samasta bhūtamulaku vistāramugā dhanamunu aiśvaryamunu iccunaṭṭi śrīmannārāyaṇuni patni ayina śrīlakṣmīdēvi nā anugrahamuvalananē aṭlu pravartiṃcucunnadi. vākkunu kalugacēyu vāgīśvariyaina śrī sarasvatī dēvi īśvaruni (bhagavaṃtuni) niyōgamu cētanē pūjiṃpabaḍucunnadi. samastamaina puruṣulanu narakamunuṃḍi tariṃpa cēyu śrī sāvitrīdēvi paramātmayokka ājñaprakāramē cēyucunnadi. paradēvata, brahmavidyā pradāta ayina śrī pārvatī dēvi nā ājñacētanē pravartiṃcucunnadi).
(paina ceppabaḍina dāni nuṃḍi paramātma parabrahma ayina vāni valananē prapaṃcamaṃtayu jarugucunnadi. anni vidhamulaina dēvatulalōnu vāṭi śaktulalōnu tānē yuṃḍi, tana caitanya śaktini vāṭikicci vāṭi cēta vāṭi niyamita panulalō prērēpiṃci cēyiṃcucunnāḍu - prapaṃcamaṃtaṭilōnu - aṃdulō nunna prati vastuvunaṃdunu yē vidhamaina calanamu kaliginanu - pani jariginanu - dēnidvārā jariginanu, evanidvārā jariginanu adi yaṃtayu okaḍē ayina bhagavaṃtuni śakti valananē ani grahiṃca taginadi - ā vidhamugā atanu vāṭini prērēpiṃcuṭa valananē prapaṃcamulōni panulanniyu jarugucunnavi yanuṭa niścayamu - iṭlu anniṃṭini prērēpiṃcuṭacētanē 'prērayitā' - anniṃṭilōnu uṃḍi, anniṃṭiki tana śakti nicci, anniṃṭicēta vāṭi vāṭi panulanu cēyiṃcuvāḍu okkaḍē ayina paramātma - parabrahma - okē tatvamu - idiyē prapaṃcamaṃtaṭilōnuṃḍu tatvamu - paratatvamu - paramātma tatvamu, parabrahma tatvamu). (only one ENERGY pervades and permeats the whole creation).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.