← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రియః priyaḥ

Original — తెలుగు
  1. “ప్రీతి దానాత్ ప్రియ స్స్మృతః” (దేవీభాగవతం)

(ప్రీతిని, ఇష్టమును, ఆనందమును కలుగచేయుటవలన ప్రియుడు).

  1. ఇష్టవస్తు దర్శనజన్యం ప్రియం.

(ఇష్టమైన వస్తువును చూచుటవలన కలుగునది ప్రియము ’ ప్రియం = ఇష్టం ’).

  1. “పరమానందత్వాత్ ప్రియః, నిరతిశయానందరూపః ఇత్యర్థః, ఆనంద ఏవ హి ఇష్టః స ఏవహి పురుషార్థ రూపః - ఇతి భావా.”

(పరమానందము - మోక్షరూపమైన ఆనందము - కలిగి యుండుటవలన ప్రియమైనవాడు - భగవంతుడు - అత్యంతానంద రూపము - ఆనందమే ఇష్టమైనది, అదే పురుషార్థరూపము - పరమపురుషార్థరూపమైన మోక్షము అని భావము).

  1. ప్రియోనాస్తి పుత్రాత్ పరః, పుత్రస్తు స్వామనశ్శుక్రాత్ జాయాతే, తేన స ప్రియః -

(పుత్రుని కంటె ప్రియమైనది లేదు. తండ్రి శుక్రమువలన పుట్టివాడు కనుక అత్యంత ప్రియుడు).

  1. విత్తా త్పుత్రః ప్రియః, పుత్రాత్ పిండః పిండాత్ తధేంద్రియం |

ఇంద్రియేభ్యః ప్రియః ప్రాణః ప్రాణదాతా పరః ప్రియః ||“.

(ధనముకంటె పుత్రుడు ప్రియుడు. పుత్రునికంటె శరీరము ప్రియమైనది; శరీరముకంటె ఇంద్రియములు, ఇంద్రియములకంటె అంతఃకరణము ప్రియమై నది.అంతఃకరణముకంటె ఆత్మ ప్రియమైనది).

  1. ఏకశ్మి అశ్చిత్ఘనే శుద్ధే భగవత్యేవ యస్యహి |

సదానిరక్తిరత్యంతా పరప్రేమాస్పదత్వతః |

విషయాంతర భాధాచ్ఛ నాస్త్యన్య విషయే రతిః |

నిరుపాధి పరప్రేమాస్పదత్వేన ప్రియో అస్య చ |

జ్ఞానినః పరమాత్మాహం ప్రత్యగభిన్న అంతరః |

తతో (అ)త్యర్థం స చ జ్ఞానీ ప్రియో భగవతో మమ |

ప్రియోహ్యాత్మాస్తి సర్వస్య లోకే వేదే ప్రసిద్ధతః ||“. (గీతాభావప్రకాశము - 7 - 108 to 110)

(నేను - భగవంతుడు - శుద్ధుడు, చైతన్య ఘనుడు, భగవంతుడు పరమప్రేమాస్పదుడు అగుటవలన నాయందు ఎల్లపుడు అసరక్తికలిగి, ఇతరవిషయములందనురక్తిలేక యుండు భక్తునికి నేను ప్రియుడను. అట్టి జ్ఞానికి నేను అంతరుడను - అందఱికి ఆత్మ ప్రియమైనదని లోకములోను, వేదములోను చెప్పబడుచున్నది).

  1. “ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి”.

(తనకొఱకే - తన కామముకొఱకే అన్నియు ప్రియమైన వస్తువులగుచున్నవి).

  1. “సమస్త జంతువులు నోలి ప్రియంబులుగావె నాకు” (భగవంతునికి) - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 984)
Transliteration
  1. “prīti dānāt priya ssmṛtaḥ” (dēvībhāgavataṃ)

(prītini, iṣṭamunu, ānaṃdamunu kalugacēyuṭavalana priyuḍu).

  1. iṣṭavastu darśanajanyaṃ priyaṃ.

(iṣṭamaina vastuvunu cūcuṭavalana kalugunadi priyamu ’ priyaṃ = iṣṭaṃ ’).

  1. “paramānaṃdatvāt priyaḥ, niratiśayānaṃdarūpaḥ ityarthaḥ, ānaṃda ēva hi iṣṭaḥ sa ēvahi puruṣārtha rūpaḥ - iti bhāvā.”

(paramānaṃdamu - mōkṣarūpamaina ānaṃdamu - kaligi yuṃḍuṭavalana priyamainavāḍu - bhagavaṃtuḍu - atyaṃtānaṃda rūpamu - ānaṃdamē iṣṭamainadi, adē puruṣārtharūpamu - paramapuruṣārtharūpamaina mōkṣamu ani bhāvamu).

  1. priyōnāsti putrāt paraḥ, putrastu svāmanaśśukrāt jāyātē, tēna sa priyaḥ -

(putruni kaṃṭe priyamainadi lēdu. taṃḍri śukramuvalana puṭṭivāḍu kanuka atyaṃta priyuḍu).

  1. vittā tputraḥ priyaḥ, putrāt piṃḍaḥ piṃḍāt tadhēṃdriyaṃ |

iṃdriyēbhyaḥ priyaḥ prāṇaḥ prāṇadātā paraḥ priyaḥ ||“.

(dhanamukaṃṭe putruḍu priyuḍu. putrunikaṃṭe śarīramu priyamainadi; śarīramukaṃṭe iṃdriyamulu, iṃdriyamulakaṃṭe aṃtaḥkaraṇamu priyamai nadi.aṃtaḥkaraṇamukaṃṭe ātma priyamainadi).

  1. ēkaśmi aścitghanē śuddhē bhagavatyēva yasyahi |

sadāniraktiratyaṃtā paraprēmāspadatvataḥ |

viṣayāṃtara bhādhāccha nāstyanya viṣayē ratiḥ |

nirupādhi paraprēmāspadatvēna priyō asya ca |

jñāninaḥ paramātmāhaṃ pratyagabhinna aṃtaraḥ |

tatō (a)tyarthaṃ sa ca jñānī priyō bhagavatō mama |

priyōhyātmāsti sarvasya lōkē vēdē prasiddhataḥ ||“. (gītābhāvaprakāśamu - 7 - 108 to 110)

(nēnu - bhagavaṃtuḍu - śuddhuḍu, caitanya ghanuḍu, bhagavaṃtuḍu paramaprēmāspaduḍu aguṭavalana nāyaṃdu ellapuḍu asaraktikaligi, itaraviṣayamulaṃdanuraktilēka yuṃḍu bhaktuniki nēnu priyuḍanu. aṭṭi jñāniki nēnu aṃtaruḍanu - aṃdaṟiki ātma priyamainadani lōkamulōnu, vēdamulōnu ceppabaḍucunnadi).

  1. “ātmanastu kāmāya sarvaṃ priyaṃ bhavati”.

(tanakoṟakē - tana kāmamukoṟakē anniyu priyamaina vastuvulagucunnavi).

  1. “samasta jaṃtuvulu nōli priyaṃbulugāve nāku” (bhagavaṃtuniki) - (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 984)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.