← Back to శ · Booklets 41–50 (digitized file 5)

దేవీ పీఠములు dēvī pīṭhamulu

Original — తెలుగు
  1. దేవ ఋషులు, దేవతలు చేసిన ప్రార్థన వలన వారి భయమును పోగొట్టుటకు దేవి ఈ లోకములో కొన్ని కొన్ని స్థానములలో నివసించుచున్నది. అట్టి స్థానములు - దేవీ పీఠములు - ముఖ్యముగా పదునెనిమిది చెప్పబడుచున్నవి.

  2. ఇయ మేకోపి నానాత్వం యాతి స్వగుణ కర్మభిః |

నామ భిశ్చ నటీవోర్వ్యాం భూమికా వైభవైర్న వైః ||“. (శ్రీశైలఖండము -13)

ఈ మహాశక్తి ఒక్కటే అయినను తనగుణములతోను, నామ రూపములతోను నటివలె - క్రొత్తవిగానగు వైభవములుగల నటివలె -అనేక నామరూపములు గలదిగా పొందినది. ఈమె ఉండు స్థానములు - పీఠములు - అనంతములు - అందులో ముఖ్యమైనవి పదినెనిమిది)

“అకుంఠిత గుణాస్యస్యాః పీఠాన్యష్టాదశ స్వయం |

లీలా పీఠాన్యనంతాని సంతి సర్వత్ర పార్వతి ||“.

(ఈ మహాశక్తి యొక్క పీఠములు అన్ని చోట్ల నున్నవి, అనంతములు. అకుంఠిత గుణములుగల పీఠములు పదునెనిమిది).

  1. అష్టాదశ పీఠములు, అచ్చట దేవి యొక్క నామములు -

“లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే |

ప్రద్యుమ్నే సింహళాదేవీ, చాముండీ కంస పట్టణే |

అలంపురే జోగులాంభా, శ్రీశైలే భ్రమరాంబికా |

కొళాపుర్యాం మహాలక్ష్మీ మహూర్యా మేక వేణికా |

ఉజ్యయిన్యాం మహాకాళీ పీఠాయాం పురుహూతికా |

ఓడ్యాణే గిరిజాదేవీ, మాణిక్య చిత్రకూటకే |

హరిక్షేత్రే కమరూపా, ప్రయాగే మాధవీశ్వరీ |

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయాయాం సర్వమంగళా |

వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరే చ సరస్వతి ||” ఇతి.

(లంకా పట్టణమందు శాంకరీదేవి, కాంచీపురమందు కామాక్షి, ప్రద్యుమ్నయందు సింహలాదేవి, క్రౌంచపట్టణమందు చాముండీదేవి, అలంపురియందు జోగులాంబ, శ్రీశైలమందు భ్రమరాంబ, కొళాపురియందు మహాలక్ష్మి, మాహూయందు ఏకవేణికా, ఉజ్జయనిలో మహాకాళీ, పిఠాపురము లో పురుహూతిక, ఉడ్యాణపట్టణమందు గిరిజాదేవి, చిత్రకూటమందు మాణిక్యా, హరిక్షేత్రమందు కామరూపిణీ | ప్రయాగయందు మాధవీశ్వరీ, జ్వాలాపట్టణమందు వైష్ణవీదేవీ - జ్వలాముఖి, గయలో సర్వమంగళా, వారణాసియందు (కాశీలో) విశాలాక్షీ, కాశ్మీరమందు సరస్వతి, జంబుకేశ్వరమందు అఖిలాండి, కన్యాకుమారియందు కౌమారి)

Transliteration
  1. dēva ṛṣulu, dēvatalu cēsina prārthana valana vāri bhayamunu pōgoṭṭuṭaku dēvi ī lōkamulō konni konni sthānamulalō nivasiṃcucunnadi. aṭṭi sthānamulu - dēvī pīṭhamulu - mukhyamugā padunenimidi ceppabaḍucunnavi.

  2. iya mēkōpi nānātvaṃ yāti svaguṇa karmabhiḥ |

nāma bhiśca naṭīvōrvyāṃ bhūmikā vaibhavairna vaiḥ ||“. (śrīśailakhaṃḍamu -13)

ī mahāśakti okkaṭē ayinanu tanaguṇamulatōnu, nāma rūpamulatōnu naṭivale - krottavigānagu vaibhavamulugala naṭivale -anēka nāmarūpamulu galadigā poṃdinadi. īme uṃḍu sthānamulu - pīṭhamulu - anaṃtamulu - aṃdulō mukhyamainavi padinenimidi)

“akuṃṭhita guṇāsyasyāḥ pīṭhānyaṣṭādaśa svayaṃ |

līlā pīṭhānyanaṃtāni saṃti sarvatra pārvati ||“.

(ī mahāśakti yokka pīṭhamulu anni cōṭla nunnavi, anaṃtamulu. akuṃṭhita guṇamulugala pīṭhamulu padunenimidi).

  1. aṣṭādaśa pīṭhamulu, accaṭa dēvi yokka nāmamulu -

“laṃkāyāṃ śāṃkarīdēvī, kāmākṣī kāṃcikāpurē |

pradyumnē siṃhaḷādēvī, cāmuṃḍī kaṃsa paṭṭaṇē |

alaṃpurē jōgulāṃbhā, śrīśailē bhramarāṃbikā |

koḷāpuryāṃ mahālakṣmī mahūryā mēka vēṇikā |

ujyayinyāṃ mahākāḷī pīṭhāyāṃ puruhūtikā |

ōḍyāṇē girijādēvī, māṇikya citrakūṭakē |

harikṣētrē kamarūpā, prayāgē mādhavīśvarī |

jvālāyāṃ vaiṣṇavīdēvī, gayāyāṃ sarvamaṃgaḷā |

vāraṇāśyāṃ viśālākṣī kāśmīrē ca sarasvati ||” iti.

(laṃkā paṭṭaṇamaṃdu śāṃkarīdēvi, kāṃcīpuramaṃdu kāmākṣi, pradyumnayaṃdu siṃhalādēvi, krauṃcapaṭṭaṇamaṃdu cāmuṃḍīdēvi, alaṃpuriyaṃdu jōgulāṃba, śrīśailamaṃdu bhramarāṃba, koḷāpuriyaṃdu mahālakṣmi, māhūyaṃdu ēkavēṇikā, ujjayanilō mahākāḷī, piṭhāpuramu lō puruhūtika, uḍyāṇapaṭṭaṇamaṃdu girijādēvi, citrakūṭamaṃdu māṇikyā, harikṣētramaṃdu kāmarūpiṇī | prayāgayaṃdu mādhavīśvarī, jvālāpaṭṭaṇamaṃdu vaiṣṇavīdēvī - jvalāmukhi, gayalō sarvamaṃgaḷā, vāraṇāsiyaṃdu (kāśīlō) viśālākṣī, kāśmīramaṃdu sarasvati, jaṃbukēśvaramaṃdu akhilāṃḍi, kanyākumāriyaṃdu kaumāri)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.