← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లక్షణ lakṣaṇa

Original — తెలుగు
  1. స్వరూపం, ప్రకారం, గతి.

(ఒక వస్తువు యొక్క లక్షణము; స్వరూపము; గతి)

  1. సాధారణ ధర్మో లక్షణం.

(ఒకదానియొక్క సాధారణ ధర్మము, నైజము).

  1. అసాధారణ గుణత్వం భూతలక్షణం, గుణం; వృత్తి.

(అసాధారణ గుణము (special characteristic) కలిగియుండుట. పంచభూతముల అసాధారణ లక్షణమేమనగా - ఆకాశమునకు శబ్దము, వాయువునకు స్పర్శ, అగ్నికి రూపము, జలమునకు రసము, భూమికి గంధము అసాధారణ లక్షణము)

  1. తెలియని వస్తువును తెలియచేయుటకు చెప్పినది లక్షణ.

  2. ముఖ్యార్థము చెప్పుటకు వీలు లేనపుడు లక్షణనుపయోగింతురు - “అయోదహతి” (ఇనుము కాలుచున్నది) ఇనుము కాలునుకాని కాల్చదు, అగ్నికాల్చును. ‘అయః’ అను మాటకు ముఖ్యార్థము ఇనుము. ఇనుముతో కలిసిన అగ్ని ఇనుమును దహించుచున్నది.

  3. లక్షణనామ ఆరోపిత శబ్దవ్యాపారమేవ -

(లక్షణ అనగా ఒక శబ్దమునకు ఇంకొక అర్థము నారోపించుట).

  1. “వాక్యములో ప్రయోగింపబడిన పదములను మాత్రమే అనుసరించి అర్థము చెప్పుట. తాత్పర్యమునకు విరోధము వచ్చినచో నప్పుడు ఆ పదములననుసరించియే తాత్పర్యానుకూలముగ అన్య పదార్థమును తెచ్చుకొనుట”.

  2. “లక్ష్యతే ఏభిః ఇతి లక్షణాని, చిహ్నాని, జ్ఞాపకాని.

(ఒక వస్తువును జ్ఞాపకము చేయు, చిహ్నములు).

  1. నిఖిల జగదుపానత్వం జగతో లక్షణం, ఉపాదానత్వంచ జగదధి ధ్యాసా ధిష్ఠానత్వం. జగదా కారేణ పరిణమ మాన మాయాధిష్ఠానం వా.

(ప్రపంచమంతటికి ఉపాదానమగుట జగత్తుయొక్క లక్షణము - ఉపాదానమగుట యనగా జగదధ్యాసాధిష్ఠానత్వము - జగత్తు యొక్క ఆకారముగామారు మాయాధిష్ఠానము).

  1. “లక్షణాపి శబ్ద వృత్తి శ్శక్య సంబంధో లక్షణా -” ” గంగాయాం ఘోషః” - ఇత్యత్ర గంగ పదవాచ్య ప్రవాహ సంబంధా దేవ తీరోపస్థితౌ తీరే అపి శక్తిర్న కల్ప్యతే. సైందవాదౌతు లవణా శ్వయోః పరస్పర సంభవాన్నానా శక్తి కల్పనం.’గంగానది యొక్క చప్పుడు’ అనిచెప్పునపుడు చప్పుడు ఆ గంగా ప్రవాహము యొక్క చప్పుడు - అంతే గాని - నది ఒడ్డున అయిన చప్పుడు కాదు అని అన్వయించుకోవలెను.

  2. లక్షణా త్రివిధం - జహల్లక్షణా, అజహల్లక్షణా, జహదకహ ల్లక్షణా చేతి - యస్య వాచ్యార్థ స్యానయా భావస్తత్ర జహతీ - యథా మంచాః క్రోశంతీతి“.. యస్య వాచ్యార్థ స్యా ప్యన్వయః, తత్ర అజహతీ - యథా ఛత్రిణో గచ్ఛంతీతి - యత్ర వాచ్యైక దేశ త్యాగేనైక దేశాన్న్వయః తత్ర జహద జహతీతి - యథా” తత్వమసీ“తి గౌణ్యపి లక్షణైవ లక్ష్యమాణగుణ సంబంధరూపా - యధాగ్నిర్మాణవక ఇతి.”(తర్క సంగ్రహ దీపికాయాం)

“మంచ పదం మంచస్థ పురుషే లాక్షిణికం, వాచ్యార్తహస్య క్రోశ న కర్తృత్వాన్వ యా సంభవా దిత్యర్థః” (నీలకంఠవ్యాఖ్య)

“యధా” సోయం దేవదత్తః ఇత్యస్మిన్ వాక్యే ‘స’ శబ్ద. ‘అయం’ శబ్దయోః, తదర్థయోర్వా విరుద్ధ తత్కాలై తత్కాల విశిష్టత్వ పరిత్యాగేన అవిరుద్ధ దేవదత్తేన సహ లక్ష్య లక్షణ భావః. తథా “తత్వమసి” ఇత్యస్మిన్ వాక్యే ‘తత్’ ‘త్వం’ పదయోః, తదర్థయోర్వా విరుద్ధ పరోక్ష త్వా పరోక్షత్వాది విశిష్టత్వ పరిత్యాగేన అవిరుద్ధ చైతన్యేన సహ లక్ష్య లక్షణ భావః-

(“సః అయం దేవదత్తః” అను వాక్యమందు ‘స’ అను మాటకును, ‘అయం’ అనుమాటకును వాటి అర్థమునందు - ‘వాడు’, ‘ఈ’ (ఆ దేవదత్తుడు, ఈ దేవదత్తుడు) అను అర్థములో భేదమున్నది.మాటలో భేదమున్నది, అంతేకాక కాలములో కూడ భేదమున్నది - (అప్పటి దేవదత్తుడు - ఇప్పటి దేవదత్తుడు - ఆ దేవదత్తుడు, ఈ దేవదత్తుడు -) అను భేదమున్నది - ఇప్పటి దేవదత్తుడు దగ్గరనున్నాడు - అందుచేత వర్తమానకాలములోనివాడు. ఆ దేవదత్తుడు అనునప్పుడు భూతకాలములో నున్న దేవదత్తుడు అను భేదమున్నది. ఇట్లు ఆ రెండు వాక్యములకు పదములో భేదము, కాలములోను భేదమున్నది - ఈ రెండు విధముల భేదమును వదలివేసిన భేదము లేనట్టిన్నీ, ఒకే చైతన్యముగల దేవదత్తుడు మిగులును - ఆ వాక్యమును - “సో అసౌ దేవదత్తః” అను వాక్యమును ఈ విధముగా బోధపఱచుకొనుట లక్షణ). వీటిని వేఱు వేఱుగా చూడుము). ఈ ప్రకారముగానే ‘తత్వమసి’ అను వాక్యములోని ‘తత్’, ‘త్వం’ అను రెండు పదములకును, వాటి అర్థములకును భేదమున్నది - ‘తత్’ అనగా ‘అది’ - అనగా పరోక్షమందున్న వస్తువు - కనబడనిది - ఇక్కడలేక, మరొకచోట నున్నది అని యర్థమగును. ‘త్వం’ నగా నీవు - ఇక్కడ నున్నవాడు - అపరోక్షమందున్నవాడు, ఎదుటనున్నవాడు అని యర్థము. ఈ రెండు పదములకు, పదములోను, వాటి యర్థములోను భేదమున్నది - ఒకడు పరోక్షముగా నున్నవాడు. ఇక్కడ, దగ్గరగా, ఎదురుగా లేనివాడు. రెండవవాడు దగ్గరగా నున్నవాడు, అపరోక్షముగా నున్నవాడు - ఈ రెండు విధముల భేదమును వదలివేసి, రెండింటిలోను భేదములేని చైతన్యమును తీసుకొనవలెను - ఇదియే లక్షణ)

  1. - లక్షణా ద్వివిధః -

(లక్షణ రెండు విధములు - స్వరూపలక్షణ, తటస్థలక్షణ)

Transliteration
  1. svarūpaṃ, prakāraṃ, gati.

(oka vastuvu yokka lakṣaṇamu; svarūpamu; gati)

  1. sādhāraṇa dharmō lakṣaṇaṃ.

(okadāniyokka sādhāraṇa dharmamu, naijamu).

  1. asādhāraṇa guṇatvaṃ bhūtalakṣaṇaṃ, guṇaṃ; vṛtti.

(asādhāraṇa guṇamu (special characteristic) kaligiyuṃḍuṭa. paṃcabhūtamula asādhāraṇa lakṣaṇamēmanagā - ākāśamunaku śabdamu, vāyuvunaku sparśa, agniki rūpamu, jalamunaku rasamu, bhūmiki gaṃdhamu asādhāraṇa lakṣaṇamu)

  1. teliyani vastuvunu teliyacēyuṭaku ceppinadi lakṣaṇa.

  2. mukhyārthamu ceppuṭaku vīlu lēnapuḍu lakṣaṇanupayōgiṃturu - “ayōdahati” (inumu kālucunnadi) inumu kālunukāni kālcadu, agnikālcunu. ‘ayaḥ’ anu māṭaku mukhyārthamu inumu. inumutō kalisina agni inumunu dahiṃcucunnadi.

  3. lakṣaṇanāma ārōpita śabdavyāpāramēva -

(lakṣaṇa anagā oka śabdamunaku iṃkoka arthamu nārōpiṃcuṭa).

  1. “vākyamulō prayōgiṃpabaḍina padamulanu mātramē anusariṃci arthamu ceppuṭa. tātparyamunaku virōdhamu vaccinacō nappuḍu ā padamulananusariṃciyē tātparyānukūlamuga anya padārthamunu teccukonuṭa”.

  2. “lakṣyatē ēbhiḥ iti lakṣaṇāni, cihnāni, jñāpakāni.

(oka vastuvunu jñāpakamu cēyu, cihnamulu).

  1. nikhila jagadupānatvaṃ jagatō lakṣaṇaṃ, upādānatvaṃca jagadadhi dhyāsā dhiṣṭhānatvaṃ. jagadā kārēṇa pariṇama māna māyādhiṣṭhānaṃ vā.

(prapaṃcamaṃtaṭiki upādānamaguṭa jagattuyokka lakṣaṇamu - upādānamaguṭa yanagā jagadadhyāsādhiṣṭhānatvamu - jagattu yokka ākāramugāmāru māyādhiṣṭhānamu).

  1. “lakṣaṇāpi śabda vṛtti śśakya saṃbaṃdhō lakṣaṇā -” ” gaṃgāyāṃ ghōṣaḥ” - ityatra gaṃga padavācya pravāha saṃbaṃdhā dēva tīrōpasthitau tīrē api śaktirna kalpyatē. saiṃdavādautu lavaṇā śvayōḥ paraspara saṃbhavānnānā śakti kalpanaṃ.’gaṃgānadi yokka cappuḍu’ aniceppunapuḍu cappuḍu ā gaṃgā pravāhamu yokka cappuḍu - aṃtē gāni - nadi oḍḍuna ayina cappuḍu kādu ani anvayiṃcukōvalenu.

  2. lakṣaṇā trividhaṃ - jahallakṣaṇā, ajahallakṣaṇā, jahadakaha llakṣaṇā cēti - yasya vācyārtha syānayā bhāvastatra jahatī - yathā maṃcāḥ krōśaṃtīti”.. yasya vācyārtha syā pyanvayaḥ, tatra ajahatī - yathā chatriṇō gacchaṃtīti - yatra vācyaika dēśa tyāgēnaika dēśānnvayaḥ tatra jahada jahatīti - yathā ” tatvamasī”ti gauṇyapi lakṣaṇaiva lakṣyamāṇaguṇa saṃbaṃdharūpā - yadhāgnirmāṇavaka iti. “(tarka saṃgraha dīpikāyāṃ)

“maṃca padaṃ maṃcastha puruṣē lākṣiṇikaṃ, vācyārtahasya krōśa na kartṛtvānva yā saṃbhavā dityarthaḥ” (nīlakaṃṭhavyākhya)

“yadhā” sōyaṃ dēvadattaḥ ityasmin vākyē ‘sa’ śabda. ‘ayaṃ’ śabdayōḥ, tadarthayōrvā viruddha tatkālai tatkāla viśiṣṭatva parityāgēna aviruddha dēvadattēna saha lakṣya lakṣaṇa bhāvaḥ. tathā “tatvamasi” ityasmin vākyē ‘tat’ ‘tvaṃ’ padayōḥ, tadarthayōrvā viruddha parōkṣa tvā parōkṣatvādi viśiṣṭatva parityāgēna aviruddha caitanyēna saha lakṣya lakṣaṇa bhāvaḥ-

(“saḥ ayaṃ dēvadattaḥ” anu vākyamaṃdu ‘sa’ anu māṭakunu, ‘ayaṃ’ anumāṭakunu vāṭi arthamunaṃdu - ‘vāḍu’, ‘ī’ (ā dēvadattuḍu, ī dēvadattuḍu) anu arthamulō bhēdamunnadi.māṭalō bhēdamunnadi, aṃtēkāka kālamulō kūḍa bhēdamunnadi - (appaṭi dēvadattuḍu - ippaṭi dēvadattuḍu - ā dēvadattuḍu, ī dēvadattuḍu -) anu bhēdamunnadi - ippaṭi dēvadattuḍu daggaranunnāḍu - aṃducēta vartamānakālamulōnivāḍu. ā dēvadattuḍu anunappuḍu bhūtakālamulō nunna dēvadattuḍu anu bhēdamunnadi. iṭlu ā reṃḍu vākyamulaku padamulō bhēdamu, kālamulōnu bhēdamunnadi - ī reṃḍu vidhamula bhēdamunu vadalivēsina bhēdamu lēnaṭṭinnī, okē caitanyamugala dēvadattuḍu migulunu - ā vākyamunu - “sō asau dēvadattaḥ” anu vākyamunu ī vidhamugā bōdhapaṟacukonuṭa lakṣaṇa). vīṭini vēṟu vēṟugā cūḍumu). ī prakāramugānē ‘tatvamasi’ anu vākyamulōni ‘tat’, ‘tvaṃ’ anu reṃḍu padamulakunu, vāṭi arthamulakunu bhēdamunnadi - ‘tat’ anagā ‘adi’ - anagā parōkṣamaṃdunna vastuvu - kanabaḍanidi - ikkaḍalēka, marokacōṭa nunnadi ani yarthamagunu. ‘tvaṃ’ nagā nīvu - ikkaḍa nunnavāḍu - aparōkṣamaṃdunnavāḍu, eduṭanunnavāḍu ani yarthamu. ī reṃḍu padamulaku, padamulōnu, vāṭi yarthamulōnu bhēdamunnadi - okaḍu parōkṣamugā nunnavāḍu. ikkaḍa, daggaragā, edurugā lēnivāḍu. reṃḍavavāḍu daggaragā nunnavāḍu, aparōkṣamugā nunnavāḍu - ī reṃḍu vidhamula bhēdamunu vadalivēsi, reṃḍiṃṭilōnu bhēdamulēni caitanyamunu tīsukonavalenu - idiyē lakṣaṇa)

  1. - lakṣaṇā dvividhaḥ -

(lakṣaṇa reṃḍu vidhamulu - svarūpalakṣaṇa, taṭasthalakṣaṇa)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.