← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లక్ష్యార్థము lakṣyārthamu

Original — తెలుగు
  1. “సాధారణ ద్రష్ట అనంగాను, ‘త్వం’ పదానకు ముఖ్యార్థమైన జీవుండు ఆ జీవత్వమును యెరుగుచున్నూ ఉండేది స్వాశ్రయాధిష్టాన చైతన్యమనెడిదే ‘త్వం’ పదలక్ష్యార్థము అయిన కూటస్థ చైతన్యము. సర్వద్రష్టు అనంగాను ‘తత్ప’ దానకు ముఖ్యార్థమైన యీశ్వరుడు. ఆ ఈశ్వరత్వమును యెఱిగియుండేటటువంటి సర్వాధిష్టాన చైతన్యమనియెడిదే ‘తత్ప’ దం యొక్క లక్ష్యార్థమైన బ్రహ్మము”

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 2)

  1. “విరాట్పురుషాదుల వేరు సేసిన నిరుపాధిక బ్రహ్మమే ‘తత్ప’ దంబునకు లక్ష్యార్థంబనియు, శోధిత ‘తత్ప’ దార్థంబనియును చెప్పబడును. మఱియు, నా విశ్వాదుల పృధిఃకరించిన నిరుపాధిక నిరుపాధిక ప్రత్యగాత్మ ‘త్వం’ పదానకు లక్ష్యార్థంబనియును, శోధిత ‘త్వం’ పదార్థంబనియు చెప్పబడును” (వివేకచింతామణి - 1)

  2. “యో అర్థః పదస్య శక్త్యా న బుధ్యతే, కింతు లక్షణయా బుద్ధ్యేతే స లక్ష్యార్థః ఇత్యుచ్యతే.”

(పదము యొక్క అర్థము పదము వలననే తెలియనప్పుడు, లక్షణవలన తెలిసినపుడు ఆ అర్థము లక్ష్యార్థము)

  1. శబ్దముకంటె మఱియొకదానిచేత సిద్ధించిన ఆ పదము యొక్క అర్థము లక్ష్యార్థము.
Transliteration
  1. “sādhāraṇa draṣṭa anaṃgānu, ‘tvaṃ’ padānaku mukhyārthamaina jīvuṃḍu ā jīvatvamunu yerugucunnū uṃḍēdi svāśrayādhiṣṭāna caitanyamaneḍidē ‘tvaṃ’ padalakṣyārthamu ayina kūṭastha caitanyamu. sarvadraṣṭu anaṃgānu ‘tatpa’ dānaku mukhyārthamaina yīśvaruḍu. ā īśvaratvamunu yeṟigiyuṃḍēṭaṭuvaṃṭi sarvādhiṣṭāna caitanyamaniyeḍidē ‘tatpa’ daṃ yokka lakṣyārthamaina brahmamu”

(brahmavidyāsudhārṇavamu - 2)

  1. “virāṭpuruṣādula vēru sēsina nirupādhika brahmamē ‘tatpa’ daṃbunaku lakṣyārthaṃbaniyu, śōdhita ‘tatpa’ dārthaṃbaniyunu ceppabaḍunu. maṟiyu, nā viśvādula pṛdhiḥkariṃcina nirupādhika nirupādhika pratyagātma ‘tvaṃ’ padānaku lakṣyārthaṃbaniyunu, śōdhita ‘tvaṃ’ padārthaṃbaniyu ceppabaḍunu” (vivēkaciṃtāmaṇi - 1)

  2. “yō arthaḥ padasya śaktyā na budhyatē, kiṃtu lakṣaṇayā buddhyētē sa lakṣyārthaḥ ityucyatē.”

(padamu yokka arthamu padamu valananē teliyanappuḍu, lakṣaṇavalana telisinapuḍu ā arthamu lakṣyārthamu)

  1. śabdamukaṃṭe maṟiyokadānicēta siddhiṃcina ā padamu yokka arthamu lakṣyārthamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.