← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లయము layamu

Original — తెలుగు
  1. నాశము; నశించుట, ఇంకొకదానిలో కలిసిపోవుట, సాయుజ్యము; మోక్షము.

  2. లీయంతే అస్మిన్ సర్వం ఇతి లయః, ప్రళయకాలః -

(అంతయు దేనియందు లీనమగునో, విలీనమగునో, అది లయము - ప్రళయకాలము)

  1. భగవంతుడు చేయు సృష్టిస్థితిలయములలో మూడవది.

  2. కార్యవస్తువు కారణవస్తువులో లీనమగుట - కలిసిపోవుట. మట్టితో చేసినకుండ - కార్యవస్తువు- పగిలిపోయిన దాని కారణవస్తువైన మట్టిలో కలియునట్లు -

  3. సమాధి విఘ్నః - ఆలస్యేన, నిద్రయా వా, వృత్త్యభావో లయః.

(ఆలస్యమగుటవలన, లేక, నిద్రచేత వృత్త్యభావము - వృత్తికలుగకపోవుట - సమాధి విఘ్నము, లయము.)

  1. లయః తావదఖండ వస్త్వనవలబనేన చిత్తవృత్తేః నిద్రా -

(అఖండ వస్తువగు బ్రహ్మమందు అవలంబనము - పట్టు - దొరకనందున చిత్తవృత్తి కలుగు నిద్ర)

  1. ఆత్మనః జీవస్య హరేః యోగనిద్రాం అనుపశ్చా చ్ఛక్తిభిః స్వోపాదిభిః సహ శయనం లయః.

(జీవుడు - జీవత్మ - భగవంతుడు - యోగనిద్రపొందియుండగా, తనశక్తులతోను, ఉపాధులతోను భగవంతుని యందు శయనించుట, వ్యక్తిత్వము లేకుండునట్లు లీనమగుట - లయము).

  1. “అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహ రాగమే |

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్త్రై వా వ్యక్త సంజ్ఞికే ||“. (శ్రీమద్భగవద్గీత - 8 -18)

“స్వప్నావస్థా విధేరస్య ప్రోక్తే హావ్యక్త శబ్దతః |

- - - స్వాపకాలే విధేరాత్ర్యాగమే తత్త్రైవ కారణే |

అవ్యక్త సంజ్ఞికేసర్వా లీయంతే వ్యక్త యస్తధా ||“. (గీతాభావప్రకాశము - 8 - 100, 108. 109)

(అవ్యక్తమనగా చతుర్ముఖయొక్క స్వపావస్థ; (నిదురించు అవస్థ - రాత్రి) అవ్యక్తమునుండి అన్నియు పుట్టినవి) (చతుర్ముఖబ్రహ్మ యొక్క పగటికాలమందు సృష్టి చేయబడును. అతనికి రాత్రికాలమందు ఇట్లు పుట్టినవన్నియు ఆ అవ్యక్తమందే లయమగుచున్నవి),

Transliteration
  1. nāśamu; naśiṃcuṭa, iṃkokadānilō kalisipōvuṭa, sāyujyamu; mōkṣamu.

  2. līyaṃtē asmin sarvaṃ iti layaḥ, praḷayakālaḥ -

(aṃtayu dēniyaṃdu līnamagunō, vilīnamagunō, adi layamu - praḷayakālamu)

  1. bhagavaṃtuḍu cēyu sṛṣṭisthitilayamulalō mūḍavadi.

  2. kāryavastuvu kāraṇavastuvulō līnamaguṭa - kalisipōvuṭa. maṭṭitō cēsinakuṃḍa - kāryavastuvu- pagilipōyina dāni kāraṇavastuvaina maṭṭilō kaliyunaṭlu -

  3. samādhi vighnaḥ - ālasyēna, nidrayā vā, vṛttyabhāvō layaḥ.

(ālasyamaguṭavalana, lēka, nidracēta vṛttyabhāvamu - vṛttikalugakapōvuṭa - samādhi vighnamu, layamu.)

  1. layaḥ tāvadakhaṃḍa vastvanavalabanēna cittavṛttēḥ nidrā -

(akhaṃḍa vastuvagu brahmamaṃdu avalaṃbanamu - paṭṭu - dorakanaṃduna cittavṛtti kalugu nidra)

  1. ātmanaḥ jīvasya harēḥ yōganidrāṃ anupaścā cchaktibhiḥ svōpādibhiḥ saha śayanaṃ layaḥ.

(jīvuḍu - jīvatma - bhagavaṃtuḍu - yōganidrapoṃdiyuṃḍagā, tanaśaktulatōnu, upādhulatōnu bhagavaṃtuni yaṃdu śayaniṃcuṭa, vyaktitvamu lēkuṃḍunaṭlu līnamaguṭa - layamu).

  1. “avyaktā dvyaktayaḥ sarvāḥ prabhavaṃtyaha rāgamē |

rātryāgamē pralīyaṃtē tattrai vā vyakta saṃjñikē ||“. (śrīmadbhagavadgīta - 8 -18)

“svapnāvasthā vidhērasya prōktē hāvyakta śabdataḥ |

- - - svāpakālē vidhērātryāgamē tattraiva kāraṇē |

avyakta saṃjñikēsarvā līyaṃtē vyakta yastadhā ||“. (gītābhāvaprakāśamu - 8 - 100, 108. 109)

(avyaktamanagā caturmukhayokka svapāvastha; (niduriṃcu avastha - rātri) avyaktamunuṃḍi anniyu puṭṭinavi) (caturmukhabrahma yokka pagaṭikālamaṃdu sṛṣṭi cēyabaḍunu. ataniki rātrikālamaṃdu iṭlu puṭṭinavanniyu ā avyaktamaṃdē layamagucunnavi),

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.