(స్థూలమైన కార్యవస్తువు లయమును పొందగా దానికి కారణమైన సూక్ష్మ వస్తువు మిగులును. అనగా కార్యవస్తువు దాని కారణవస్తువునందు లీనమగును - ఆ కారణవస్తువు - సూక్ష్మమవస్తువు - లయము పొందగా దానికంటె సూక్ష్మమైన దాని కారణవస్తువు మిగులును - ఇట్లు కార్యవస్తువు, దాని కారణవస్తువునందు లీనమవగా తుదకు అన్నింటికంటె సూక్ష్మమై ఎల్లకాలమునందుండు సత్పదార్థమొక్కటే - లయములేనిది ఒక్కటే మిగిలి యుండును, అదియే పరబ్రహ్మ).
(భూమిని జలమందు, జలమును అగ్నియందు, అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు లయింపజేసి ఆకాశమును అహంకారమందు, అహంకారమును మహత్తత్త్వమందు, మహత్తత్త్వమును ప్రకృతియందు, మాయయగు ప్రకృతిని ఆత్మయందు లయింపచేయవలయును - అని లయప్రకారము చెప్పబడియుండుటచేత ముందు చెప్పబడిన భూతములు వాటి తర్వాత చెప్పబడినవాటియందు లయమగును - కలిసిపోవును, విలీనమగును -
“జగత్ప్రవిష్టా దేవర్షే పృధిద్యప్సు ప్రలీయతే |
తేజస్యాపః ప్రలీయంతే, తేజోవాయే ప్రలీయతే |
వాయుశ్చ లీయతేవ్యోమ్ని తచ్చావ్యక్తే ప్రలీయతే |
అవ్యక్తం పురుషే బ్రహ్మన్ నిష్కలే ప్రలీయతే ||“.
(భూతములయొక్క, భౌతికములయొక్క అనగా, భూతములనుండి పరంపరగా పుట్టిన అన్నింటి యొక్క లయప్రకారము సృష్టిప్రకారమునకు విపరీతముగా నున్నది. అది యెట్లనగా భూమి జలములో లీనమగును - లయమగును, కలిసిపోవును, జలము తేజస్సులో (అగ్నిలో) లయమగును, తేజస్సు వాయువునందు, వాయువు ఆకాశమందు ఆకాశము జీవాహంకారమునందు, అది హిరణ్యగర్భాహంకారమునందు, అది అవిద్యయందు - ప్రకృతియందు లీనమగును. లయము పైవిధముగా జరుగునని శ్రీవిష్ణుపురాణములో చెప్పబడినది - “భూమి జలమందు, జలము అగ్నియందు, అగ్ని (తేజస్సు) వాయువునందు, వాయువు ఆకాశమునందు, ఆకాశము అవ్యక్తమందు (ప్రకృతియందు), అవ్యక్తము నిష్కల పరబ్రహ్మమందు లీనమగుచున్నది - పైన చెప్పబడిన లయప్రకారము తత్పదవాచ్యుడైన పరబ్రహ్మయొక్క తటస్థ లక్షణము -) మహానవ్యక్తేలీయతే, అవ్యక్తం అక్షరే లీయతే - అక్షరం తమసి లీయతే తమః పరే దేవతే ఏకీ భవతి - ప్రకృతిః వ్యక్తావ్యక్త స్వరూపిణీ, పురుషశ్చ ఏతే ఉభే లీయతే పరమాత్మని”.
(మహత్తత్వము అవ్యక్తమందు లీనమగును, అవ్యక్తము అక్షరమందు లయమగును)
“వాచం మనసిహుత్వా వాగ్వా పారాణాం, మనః పూర్వకత్వాత్ కారణీ భూతే మనసి వాగ్వ్యాపారాన్ హుత్వా. మనో వ్యాపారాణాం ప్రాణాదిసత్వేన, - మనోపి తస్యాపి కారణే ప్రాణేహుత్వా; తం ప్రాణం అపానే హుత్వా - ప్రాణ వాయోరూర్థ్వగమనే ఉచ్ఛ్వాస నిశ్వాసాది ప్రసంగే తన్నిరోదార్థం సోత్సర్గం సోచ్ఛ్వాస ప్రాణం అపానేహుత్వా; తం అపానం మృత్యౌ - తస్యా వ్యధిష్టానతయా కారణీ భూతే మృత్యౌ హుత్వా -, తం మృత్యుం పంచత్వే పంచభూతేషు తస్యాపి కారణేషు హుతవాన్ ఆసీత్ - నా క్ప్రభృతీని సర్వేంద్రియాణి ప్రాణాది వాయూంశ్చ కారణీభూత పంచభూతేషు హుతవాన్ ఇత్యర్థః. అనంతరం పంచత్వం త్రిత్వేకృత్వా పంచీకరణ త్యాగేన త్రివృత్కరణం సంపాద్య తచ్చ త్రివృత్త్వం, ఏకత్వే మూలకారణీభూత ప్రకృత్యవస్థాయాం అజుహోత్ - కార్యావస్థా త్యాగేన కేవల కారణావస్థాపన్న పృకృతి సంసృష్టో అభూత్ - ఇత్యర్థః. సర్వం ఆత్మని అజుహవత్. సర్వస్య అన్య ప్రకృతి సంబంధస్య ఆత్మనః కర్మపరవశత్వాత్ కర్మపారవశ్యా భావేన ప్రకృతిం విముచ్య శుద్ధాత్మ రూపతాం ఆపన్నః ఇత్యర్థః - తం ఆత్మానం అవ్యయే బ్రహ్మణి అజుహోత్ తదధీనత్వేన స్వాత్మానం కృతవానిత్యర్థః. ఆత్మనః జీవస్య బ్రహ్మధీనసత్తాకత్వాత్, తచ్చేష్టత్వాత్ - చ, తస్మిన్నాధారే శేషిణి చ అదేయత్వేన శేషత్వేన చ స్వాత్మానం సమర్పితవాన్ ఇత్యర్థః. స్వీయ శేషత్వాద్యపరిజ్ఞాన పూర్వక విపరీతానుష్ఠానా దేవ కిల అస్య సంసారః - - - అతః ఉత్పత్తిక్రమాత్ విపరీతక్రమేణైవ లయః క్రమః, స్వకారణే కార్యాణాం లయదర్శనాత్ ఉపపద్యతేచ వ్యుత్క్రమేణైవ లయక్రమః; ఇతరథాసతి కార్యే కారణస్య నాశః స్యాత్; తచ్చా నిష్టమిత్య్థర్థః.” (భాష్యార్థరత్నమాల)
“విపర్యయేణ తు ప్రళయక్రమో అతః ఉత్పత్తిక్రమాత్ భవి తుమర్హతి. తథాహి లోకే దృశ్యతే, యేనక్రమఏణ సోపానమారూఢః తతో విపరీతక్రమేణ అవరోహతీతి; అపిచ దృశ్యతే - మృదోజాతం ఘటశరా వాద్యస్యయకాలే మృద్భావమప్యేతి, అద్భ్యశ్చజాతం హిమ కరకాద్యచ్ఛావమప్యేతీతి. అతశ్చోపపద్యతే ఏత త్పృధివ్యద్భ్యో జాతానతీ స్థితి కాలవ్య తిక్రాంతావపో అపీయాత్. ఆపశ్చ తేజసో జాతాస్సత్యస్తేజ ఆపీయుః. ఏవం క్రమేణ సూక్ష్మం సూక్ష్మతరం చానంతరమనంతరం కారణం అపీత్య, సర్వంకార్యం జాతం పరమ కారణం పరమసూక్ష్మంచ బ్రహ్మప్యేతీతి వేది తవ్యం. నహి స్వకారణ వ్యతిక్రమేణ కారణ కారణే కార్యాప్యయో న్యాయ్యః. స్మృతావస్యుత్పతిక్రమ విపర్యయేణైవ అప్యయక్రమః. తత్ర దర్శితః –
“జగత్ప్రతిష్టా దేవర్షే పృధివ్యప్సు ప్రలీయతే |
జ్యోతిష్వాపః ప్రలీయంతే, జ్యోతిర్వాయే ప్రలీయతే ||”
ఇత్యేవమాదౌ - (శ్రీ శంకరః). (బ్రహ్మసూత్రభాష్యే)
(ఇత్యేవమాదౌ = వాయుశ్చలీయతే న్యోమ్ని తచ్చాన్యక్తే ప్రలీయతే” ఇతి స్మృతి శేషః” ఆది పదార్థః)
(ఇంద్రియములన్నియు మనసులో లయమగును, మనోవృత్తి ప్రాణవాయువుమీద ఆధారపడినదగుటచేత, మనసు ప్రాణమందు లయమగును. ప్రాణవాయువును అపానవాయువు క్రిందకి ఆకర్షించి శరీరములోనుండి పైకి నెట్టునది కనుక ప్రాణవాయువు అపానవాయువులో లీనమగును. అపానవాయువు దాని అధిష్టానదేవత యగు మృత్యువునందు లయమగును. దీనినిబట్టి వాక్కు మొదలగునవి వాటివాటి కర్మలతో కూడ లీనమగునని భావము - దేహమునకే మృత్యువు కలుగును, ఆత్మకు కాదు. పాంచభౌతికమైన దేహము సత్వరజస్తమములను త్రిగుణములందును, ఈ త్రిగుణములు ఒకటే అయిన అవిద్యయందును, అవిద్య జీవాత్మయందును, లీనమగును - ఇట్లు శుద్ధమైన జీవాత్మను అవ్యయుడు, కూటస్థుడు అయిన పరబ్రహ్మయందు లయమగును - ఈ పరబ్రహ్మ దేనిలోనుండి పుట్టలేదు కనుక - దానిని కారణవస్తువు లేదుకనుక - దేనిలోను లయముకాదు)
(పైన వ్రాసిన దానికి వ్యాఖ్యానము : - వాగ్వ్యాపారములకు కారణము మనస్సు కనుక వాగ్వ్యాపారములను మనసులో లయముచేసి, మనస్సును దానికి కారణమైన ప్రాణమందు లయముచేసి ప్రాణవాయువు శరీరములో మీదను సంచరించునదికావున ఆ వ్యాపారమును నిరోధించుటకు ప్రాణవాయువును అపానవాయువునందు హుతము చేసి (లయముచేసి), అపానమునకు కారణమైన మృత్యువునందు అపానమును లయించి, మృత్యువునకు, కారణమైన పంచభూతములందు మృత్యువును లీనముచేయవలయును - అనగా, వాక్కు మొదలగు ఇంద్రియములన్నింటినీ, ప్రాణము మొదలగు పంచవాయువులను వాటి అన్నింటికీ కారణమైన పంచభూతములందు లయింప చేయవలయును - ఇట్లు పంచభూతములందు లయముచేసిన పిదప వాటిని త్రిగుణములలో - సత్వరజస్తమోగుణములలో - కలిపి, మూలకారణమై ఒకటే అయిన ప్రకృతియందు లీనము చేయవలయును - ఇట్లు కార్యములన్నియు లీనమైపోయిన కేవల కారణవస్తువగు ప్రకృతిగానే యుండును. అన్నియు ఆత్మయందు లీనమగును - ఆత్మకు కర్మ వలననే ప్రకృతితో సంబంధమగుటచేత ఈ స్థితిలో కర్మవసము కాకుండుటచేత ప్రకృతిని విడిచి శుద్ధమైన ఆత్మస్థితిని పొందును. అట్టి శుద్ధాత్మరూపమును అవ్యయుడైన పరబ్రహ్మముందు లయింపచేయవలయును - పరమాత్మాధీనమే జీవాత్మ అయి యుండుటచేత - జీవాత్మ తన సత్తాకు (చైతన్యశక్తికి) పరమాత్మయందే ఆధీనపడియుండుటచేతను, పరమాత్మవలె చేష్టించుటచేతను, వ్యవహరించుటచేతను, పరమాత్మయే జీవాత్మకు ఆధారమై యుండుటచేతను, తనను, తన ఆత్మను - జీవాత్మను - పరమాత్మకు సమర్పించినట్లగును - ఇట్లు పరమాత్మ యొక్క ఆధేయమని శేషి శేష భావమును జీవాత్మ తెలియక పోవుటచేతనే జీవాత్మకు జననమరణరూపమైన సంసారము కలుగుచున్నది. జీవాత్మ పరమాత్మతో కలిసి ఐక్యమగుటయే లయము - ఈ లయప్రకారము పైన చెప్పబడినది)
(పైన చెప్పినదానినిబట్టి సృష్టిప్రకారమునకు విపరీతముగానే లయప్రకారముండును. ప్రపంచమందు ఈ విధము గానే జరుగుచున్నది - ఆ ప్రకారముగా, మేడమెట్లు ఎక్కడము జరుగుచున్నదో ఆ ప్రకారముగానే మెట్లు దిగుట యగుచున్నది. మట్టితో చేయబడిన కుండ, మూకుడు మొదలగు నవి కుండ పగిలిపోగా - నశించిపోగా - మట్టియే యగుచున్నవి. నీటినుండి పుట్టిన మంచు మొదలగునవి నీరే యగుచున్నది. అట్లే నీటిలోనుండి పుట్టిన భూమి అంతకాలమందు నీటిలోనే లీనమగుచున్నది; తేజస్సు - అగ్ని - వలన పుట్టిన నీరు అగ్నిలోనే లీనమగుచున్నది. ఈ ప్రకారముగానే స్థూలవస్తువు (కార్యవస్తువు) దానికంటె సూక్ష్మమై దాని కారణమైన వస్తువునందు లయమగుచున్నది. ఆ సూక్ష్మ వస్తువు దానికి కారణమైన వస్తువులో లీనమగుచున్నది. అన్నింటికంటెను సూక్ష్మమైనది, అన్నింటికి కారణమైనది అయిన పరబ్రహ్మమందు దానినుండి పుట్టిన కార్యవసువులన్నియు లీనమగుచున్నవి యని తెలియవచ్చుచున్నది. కారణమందుకాక దాని కార్యవస్తువు ఇంకెందును లీనమగుటలేదు).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 52)
“అవ్యక్తం మాయా తస్యాశ్చ సమ్యక్ ప్రలయోనామ ముక్తావిద నాత్యంతికో వినాశః, కింతు సుషుప్తే సతీనాం మాయగోచిరవృత్తీనామప్య భావాత్. స్వప్రతిష్ట పరమాత్మ ప్రకాశస్యాత్యంత నిర్వికల్పకతయా తద్బలాత్ భాసమానయాః అపి అత్యంతప్రతిభాన ప్రాయత్వం, న పునరనవ భాసమేవ, ప్రతిభామా అత్ర శరీరస్య హి మిధ్యా వస్తునః అనవభానే సతి అభావ ఏవ స్యాదితి. నచా భావ ఏవాస్తు, ఉత్తర సర్గాభావ ప్రసంగాదితి. అవశిష్టైః ప్రాణకర్మభిశ్చ తస్యాం మాయాయాం విలీయైవ క్రమేణప్రాప్త పరిపాకైః. స్వఫలప్రదానాయ పరమేశ్వరస్య సిసృక్షాత్మక మాయా వృత్తిర్జన్యతే. సైషామాయావస్థా ‘ఈక్షతి’, ‘కామ్యతి’, ‘తప’ అది శబ్దెరభిధీయతే - తదైక్షత బహుశ్యాం ప్రజాయాయేతి ఛాందోగ్యే;”తదైక్షత లోకాన్ను సృజా” ఇత్యైతరీయకే; సో(అ)కామయత బహుస్యాం ప్రజాయే యే “తి తైత్తిరీయకే” తపసా చీయతే బ్రహ్మే “తి ముండకే”.
(లయప్రకారము ఈ విధముగా చెప్పబడినది. - భూమి జలమందు, జలము అగ్నియందు, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమునందు, ఆకాశము అవ్యక్తమునందును, అవ్యక్తము నిష్కలుడు, పురుషుడు అయిన బ్రహ్మమందు లయమగును.)
(ప్రాణుల కర్మలు ఫలమునిచ్చుటకు కొంత నియమితమైన కాలము పట్టును. వాటిలో కొన్ని పండి ఫలానుభవమువలన క్షీణించియుండును - మిగిలినవి పరిపాకమునకు రానందున (ఫలమునిచ్చు స్థితికి రానందున అనుభవింపచేయుటకు సమయము ఇంకను రానందున సృష్టింపబడుటకు వీలుగాక - ఉపయోగములేక) ప్రాకృతప్రలయమందు (ప్రకృతిలో దానిలోనుండి పుట్టినవన్నియు లీనమైనప్పుడు) తనలో లీనమైన కార్యవస్తువులను కలిగి తన ప్రతిష్టానమైన (ఆశ్రయమైన, తనకు కారణమైన) పరబ్రహ్మమందు లీనముకాక. మిగిలిపోయిన ప్రాణుల కర్మ పరిపక్వమగువఱకు అట్లనే యుండును).
(అవ్యక్తమనగా మాయ, ప్రకృతి. ప్రాకృత ప్రలయమనగా ముక్తుడు, భగవంతునిలో పూర్తిగా ఐక్యమైపోయినట్లు పూర్తిగా నశించిపోవుటకాదు - - - ముక్తులు భగవంతునిలో లీనమైపోగా కర్మపరిపాకము చెందిన జీవులు జన్మించగా మిగిలిన ప్రాణులకర్మ కాలక్రమమున పరిపాకమునంది ఫలమునీయ ఉన్ముఖమైనపుడు పరమాత్మకు సృష్టి చేయవలెను (సృష్టి చేసెదను) అను కోరిక జన్మించుట యను (ప్రకృతి) మాయావృత్తి కలుగును - ఇటువంటి స్థిలోనును మాయావృత్తినే “తదైక్షత బహుస్యా ప్రజాయా యేతి” - (నేనే అనేకములుగా జన్మించెదను) అని భగవంతుడు ‘ఈ’ క్షణము చేసెను - అని ఛాందోగ్యోపనిషత్తులోను, “తదైక్షత లోకాన్ను సృజా” (లోకములను సృష్టించెదను అని భగవంతుడు కోరెను) అను తైత్తిరీయోపనిషత్తులోను, “నేనే అనేకములుగా అయ్యెదను అని భగవంతుడు కోరెను” అని తైత్తిరీయోపనిషత్తులోను; “బ్రహ్మ తపస్సు చేసెను” అని ముండకోపనిషత్తులోను చెప్పబడినది. ఇట్లు భగవంతుడు ఈక్షణము చేసెను, కోరెను తపస్సు చేసెను అని చెప్పబడినదాని యర్థము. ఈ ప్రకృతి ప్రాణులను వారివారి కర్మ పరిపాకకాలమున తిరిగి తనలోనుండి పైకి విరజిమ్ము స్థితియే యని తెలియవలెను).
(ప్రాణులన్నియు ప్రకృతిలో లయమైనపుడు అన్ని ప్రాణుల కర్మలు ఫలమినిచ్చుటకు ఒకే వేళయందు పరిపక్వము కావు - అందుచేత ప్రకృతి కర్మపరిక్వమైన ప్రాణులను పైకి పంపివేయుచు (సృష్టి చేయుచు) మిగిలినవారిని వారి కర్మ పరిపక్వమగువరకు తనలోనుంచి కాలక్రమమున వారి కర్మ పరిపక్వముకాగా వారిని వదలుచు - తిరిగి సృష్టించుచు) ఉండును. ఈ లోగా మరికొన్ని ప్రాణులు ప్రకృతిలో లీనమగుచు నుండును. ఈ ప్రకారముగా ప్రకృతి అనంతముగా ప్రాణులను సృష్టించుచు, తనలో లయించుచు ప్రవాహరూపముగా, భగవంతునివలె నిత్యమైనదను భావము కలిగించును).
“శతానందునకు శతాబ్దంబులు పరిపూర్ణంబైన ధాత్రి గంధింబునం దడంగు, నా గంధంబు దికంబునం గలియు, నా యుదకంబు రసంబున లీనంబగు, నారసంబు తేజో రూపంబగు, నాతేజంబు రూపంబున సంక్రమించు, నా రూపంబు వాయువునందుం గలయు, వాయువు స్పర్శగుణ సంగ్రాహ్యంబైన, నా స్పర్శగుణంబాకాశంబున లయంబగు, నా యాకాశంబు శబ్దతన్మాత్రచే గ్రసియింపబడిన నింద్రియంబులు మనోవైకారిక గుణంబులం గూడ నీశ్వరునిం బొంది ఈశ్వరరూపంబుదాల్చు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 113)
ఈశః పంచీకృతభూతానాం అపంచీకరణం కర్తుం సో (అ)కామయత, బ్రహ్మాండం తద్గతలోకాన్ కార్య రూపాంశ్చ కారణత్వం ప్రాపయిత్వా, తతః సూక్ష్మాంగం కర్మేంద్రియాణి ప్రాణాంశ్చ, జ్ఞానేంద్రియాణి, అంతఃకరణ చతుష్టయంచ ఏకీకృత్య, సర్వాణి భౌతికాని కారణే భూతపంచకే సం యోజ్య, భూమిం జలే, జలం వహ్నే, వహ్నిం వాయౌ, వాయుమాకాశే చ, ఆకాశమహంకారేచ, అహంకారం మహతి, మహదివ్యక్తే, అవ్యక్తం పురుషే క్రమేణ విలీయంతే. విరాట్ హిరణ్యగర్భేశ్వరాః ఉపాధిలయాత్ పరమాత్మని లీయంతే.
“పంచీకృత మహాభూత సంభవకర్మ సంచిత స్థూలదేహః, కర్మక్షయాత్ సత్కర్మ పరిపాకతః అపంచీకరణం ప్రాప్య సూక్ష్మేనైకీ భూత్వకారణ రూపత్వమాసాద్య, తత్కారణం కూటస్థే ప్రత్యగాత్మని విలీయతే. విశ్వతైజస ప్రాజ్ఞాః స్వస్వోపాధిలయాత్ ప్రత్యగాత్మని విలీయంతే” (పైంగలోపనిషత్).
(ఈశ్వరుడు పంచీకరింపబడిన భూతములను అపంచీకరించుటకు - పంచభూతముల అంశలతో కలిసియున్న ఒక్కొక్క స్థూలభూతమును, వాటిలోని అంశలను విడదీసి వేఱువేఱు సూక్ష్మభూతములుగా చేయుటకు, సంకల్పించెను - కార్యరూపములై యున్న బ్రహ్మాండములను, బ్రహ్మాండాంతర్గత లోకములను, కారణత్వంబును పొందించి పిమ్మట సూక్ష్మాంశములగు కర్మేంద్రియములగు, ప్రాణములను, జ్ఞానేంద్రియములను అంతఃకరణ చతుష్టయమును ఒక్కటిగా చేసి, భూతసంబంధులగు వాటినన్నింటినీ కారణమగు భూతపంచకమునందు కలిపి, భూమిని నీటియందు, ఆ నీటినగ్నియందును, అగ్నిని వాయువునందును, ఆ వాయువును ఆకాశమునందును, ఆకాశము నహంకారమునందును, అహంకారమును మహత్తునందును, మహత్తును అవ్యక్తమునందును, అవ్యక్తమును పురుషునియందును, క్రమముగా విలీనము చేయుచున్నాడు. (“విరాట్టు, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు ఉపాధులు నశించుటవలన - ఉపాధులవలన కల్పింపబడిన భేదములేకపోవుట వలన పరమాత్మయందు లయించుచున్నారు. పంచీకరింపబడిన స్థూలమహాభూతములవలన సంభవించిన కర్మచేత సంచితమగు (సంపాదింపబడినదియగు) స్థూలశరీరము కర్మక్షయమువలనను, సత్కర్మయొక్క పరిపాకమువలనను, అపంచీకరణము నొంది (సూక్ష్మభూతరూపము నొంది) సూక్ష్మముతో నేకీభవించి, తదుపరి కారణ రూపత్వమును (అవిద్యారూపమగు ఆనందమయ కోశత్వరూపమును) పొందును. పిమ్మట అవిద్యారూపమగు నా కారణము ప్రత్యగాత్మ యందు విలీనమగును.
(“స్థూలేంద్రియయుక్తమగు స్థూలశరీరముకంటెను, సూక్ష్మేంద్రియ యుక్తమును, మనోబుద్ధి చిత్తాహంకార రూపమును నగు అంతఃకరణముకంటెను, అంతఃకరణమునకు మూలమగు అవిద్యకంటెను వేరగునదియు, వాటిని ప్రకాశింపచేయునదియునగు జీవుని స్వాత్మయే ప్రత్యగాత్మయని చెప్పబడును. అది పరమాత్మకంటె వేఱుకాదు, కనుక పరమాత్మయందు విలీనమగునని చెప్పబడినవి.”).
“సన్యసించి, యాకాశంబునందు, శరీరరంధ్రంబులును, గాలియందు నిశ్వాసంబును, దేజంబు లోపల సూక్ష్మంబును, జలంబుల రసంబును, ధరణియందు శల్య, మాంస ప్రముఖంబులును, వహ్నియందు వ్యక్తంబుతోడ వాక్కును, నింద్రునియందు శిల్పంబుతోడ గరంబులును, విష్ణునియందు గతితోడ బదంబులును, బ్రజాపతి యందు రతితోడ నుపస్థంబును, మృత్యువందు విసర్గంబు తోడ చాయువును, దిక్కులందు శబ్దంబుతోడ శ్రోత్రంబును, వాయువందు స్పర్శంబుతోడ ద్వక్కును, సూర్యునందు రూపంబుతోడ జక్షువులును, సలిలంబు నందు బ్రచేత్సహిత యయిన జిహ్వయు, క్షితియందు గంధసహితంబయిన ఘ్రా ణంబును, జంద్రునియందు మనోరధంబులతోడ మనంబును, గనియైన బ్రహ్మయందు బోధంబుతోడ బుద్ధియు, రుద్రుని యందహంకారముతోడ మమత్వంబును, క్షేత్రజ్ఞునియందు సత్వంబుతోడ జిత్తంబును బరంబునందు గుణంబులతోడ వైకారికంబునుడిందించి, యటమీద బృధివిని జలంబునందు, జలంబును దేజంబునందు, దేజంబును వాయువునందు, వాయువును గగనంబునందును, గగనంబును నహంకారతత్వంబునందు, నహంకారంబును మహత్తత్వంబునందు, మహత్తత్వవంబును బ్రకృతియందు, బ్రకృతిని నక్షరుండైన పరమాత్మయందు లయంబునొందించి చిన్మాత్రావశేషితుండైన క్షేత్రజ్ఞుని నక్షరత్వంబున నెఱింగి ద్వయరహితుండై దగ్ధకాష్టుండైన వహ్ని చందంబున బరమాత్మయైన నిర్వికార బ్రహ్మంబునందు లీనుండుగావలయు.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 12 - 422).
“యధానద్యః స్యంచమానాః సముద్రాయణాః సముద్రం ప్రాప్య అస్తం గచ్ఛంతి భిద్యతే తాసాం నామరూపే సముద్ర ఇత్యేవ ప్రోచ్యతే. ఏవమేనాస్య ద్రష్టుః ఇమాః షోడశకలాః పురుషాయ మాణాః పురుషం ప్రాప్య అస్తం గచ్ఛంతి. భిద్యతే, తాసాం నామరూపే పురుష ఇత్యేవ ప్రోచ్యతే” (ప్రశ్నోపనిషత్)
“యథా నద్యః సముద్రం ప్రాప్య లీయంతే ఏవమేవాస్య పరిత స్సర్వత్ర బ్రహ్మ ద్రష్టు రిమాః ప్రాణ శబ్దాద్యాః పురుషాయణాః పురుషే కల్పితాః పురుషమేవ జ్ఞేయం ప్రాప్య లయం గచ్ఛం తీత్యర్థః” (భాష్యరత్నప్రభా - బ్రహ్మసూత్రభాష్యే - 4 - 2 - 15)
(నదులు సముద్రములో కలిసి - లీనమైపోయి - అస్తమించిపోవుచున్నవి, అనగా, కనబడకుండ అగుచున్నవి.వాటికి ఇదివఱకు ఉన్న గంగ మొదలగు పేర్లు, నదివలెనుండు రూపములు పోయి అవికూడ సముద్రమే - సముద్రములోని భాగము - అయి ఆ పేరుతోనే - సముద్రమని నామముతోనే చెప్పబడుచున్నవి. ఈ ప్రకారముగానే ఈ షోడశ కళలు (పదియారు కళలుగల జీవాత్మ - లేక, ప్రాణము మొదలగు 16 కళలు - పురుషునినుండి (పరబ్రహ్మనుండి) పుట్టినవే కనుక తిరిగి పురుషునిలోనే కలియుటకు ఉద్యమించినవై జ్ఞేయ వస్తువు, ధ్యేయవస్తువు, ప్రాప్యవస్తువు (పొందతగిన వస్తువు) అయిన పరబ్రహ్మ ను పొంది దానిలో లయమగుచున్నవి, అన్నింటిలోను ప్రత్యగాత్మ, జీవాత్మ బ్రహ్మ అంశయే యగుటచేత మరల బ్రహ్మలోనే లీనమగును. అన్ని వస్తువులు ఈ ప్రకారముగానే లయమగును).
(ప్రవహించుచున్న నదులు వాటివాటి నామరూపములను విడిచి సముద్రములో కలిసిపోవుచున్నవి. తేనెలో అనేక పుష్పముల రసము కలిసి యున్నపుడు, అందులో ఏ పువ్వు రసమేదో నిర్ణయించుటకు వీలు లేనట్లు అన్ని పూవుల రసము తేనెలో కలిసి (లయమై) ఒకటే రసముగా మారును. అట్లే ప్రాణులు ప్రళయకాలమందు పరమాత్మయగు నీయందు లీనమగుచున్నారు - నీనుండి విభక్తులై వేఱువేఱు నామరూపములు పోయి నీలో అవిభక్తమై ఏకమై పోవుదురు- విద్వాంసుడు (బ్రహ్మజ్ఞాని) నామరూపములు లేనివాడై పరాత్పరుడైన పురుషుని - పరమ పురుషుని - పొందును (పరమాత్మలో లీనమగును).
తథా తవామీ నరలోకభీతాః విశంతి వక్త్రాణ్యభి విజ్వలంతి ||
యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః |
తధైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ||“. (శ్రీమద్భగవద్గీత - 11 - 28, 29)
(నదులలోని జలప్రవాహము సముద్రము దిక్కుగానే ప్రవహించి సముద్రములోనే కలియుచున్నది. సముద్రములోని నీరే మేఘముగా మారి మరల అవి పుట్టినచోటు అయిన సముద్రములోనే కలియుచున్నది. ఆ ప్రకారముగానే ఈ వీరులందరు - కురుక్షేత్రయుద్దములో పాల్గొన్నవారు, నరలోకములో భయంకరులైనవారు, అతిరధమహారధులైనను, నీ (భగవంతుని) నోటిలో ప్రవేశించుచున్నారు లయమగుచున్నారు). బాగుగా కాంతి వహించిన - బాగుగా మండుచున్న - అగ్నిని, రెక్కపురుగులు వంటివి, గొప్ప వేగముతో వాటి నాశము కొఱకే ప్రవేశించుచున్నవి. ఆ ప్రకారముగానే లోకములన్నియు (లోకములోనున్న జీవులన్నియు) గొప్ప వేగముతో (ఆపరాని వేగముతో) (నదీ ప్రవాహ వేగముతో) నీ నోటిలో (శ్రీకృష్ణభగవానుని విశ్వరూపము నోటిలో) ప్రవేశించుచున్నవి. ఇట్లు భగవంతునిచే సృష్టించబడిన వస్తువులన్నియు భగవంతునిలోనే లీనమగును. ఇట్లు అవి యీ విధముగ లీనమగునట్లుచేయు భగవంతుని శక్తి అడ్డులేనిది - ఆపరానిది - (irresistable). ప్రాణులు దీనిని ప్రతిఘటించుటకు అశక్తులు. అందుచేత సృష్టించు శక్తిగలవాడే లయము చేయుచున్నాడు. ఎందులోనుండి సృష్టింపబడిన వస్తువు అందులోనే లీనమగును)
బున దిన నాయకుని వలన బొడమిన సలిలం
బనయము గ్రమ్మఱ గ్రీష్మం
బున సూర్యునియందు డిందు పోలిక మఱియున్
క. ధరణి చరాచరభూతము
లరయగ జనయించి యందె యడగిన పగిదిన్
హరిచే బుట్టిన విశ్వము
హరియందె లయంబునొందు నది యెట్లన్నన్
మ. అరుదౌ న భ్రతమః ప్రభల్ మును నభంబందొప్పగా దోచియున్
మరలం జూడగనందె లేనిగతి, బ్రహ్మంబందు నీ శక్తులుం
బరికింపం ద్రిగుణ ప్రవాహమున నుత్పన్నంబులై క్రమ్మఱన్
విరతిం బొందుచునుండు, గావున హరిన్ విష్ణున్ భజింపన్ దగున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 31 - 956, 957, 958)
నిర్గుణ బ్రహ్మోపాసకులకు ఈ క్రిందవిధముగా లయము చెప్పబడినది : -
(బాహ్య విషయములందును, లోపలి విషయములందును కోరిక లేక వైరాగ్యమును పొందినవాడు ఆత్మతోనే తృప్తి పొందుచు నున్నవాడు ఆత్మతోనే తృప్తి పొందుచునున్నవాడు - ఇట్టివాని ప్రాణములు ఉత్క్రమింపవు - శరీరమును విడిచి పోవు - అట్టివాడు బ్రహ్మమే అయియుండి బ్రహ్మను చెందును).
(బ్రహ్మవేత్తయగువాడు ఇచ్చటనే - ఈ లోకమునందే బ్రహ్మమగును - బ్రహ్మను పొందును)
(బ్రహ్మవేత్త యొక్క షోడశకళలు - అనగా, పదకొండు ఇంద్రియములు, పంచప్రాణములు కలసి పదహారు కళలు - పరబ్రహ్మమే ఆధారముగా గలవి, - పరమేశ్వరునందే ఆరోపింపబడినవి కాన - పరమేశ్వరునందే లీనమగును.)
సగుణోపాసకుల లయము ఈ క్రింద విధముగా చెప్పబడినది : -
(ఓ శాంతుడా! పురుషుడు చనిపోవుకాలమందు వాక్కు - వాగింద్రియము మనసులో లయించును, మనస్సు ప్రాణములో లీనమగును, ప్రాణము తేజస్సునందును, తేజస్సు పరమాత్మయందును లీనమగును.
(జీవుడు దేహమును విడుచిపెట్టునపుడు ప్రాణములన్నియు, రాజు కడకు భృత్తులు చేరునట్లు ముఖ్యప్రాణము వద్దకు చేరును. ముఖ్యప్రాణము జీవునితో కలిసి నిష్క్రమించును.)
(లయకాలమందు - మరణకాలమందు జీవుడు భూతేంద్రియముల గ్రహించి హృదయమును ప్రవేశించును, హృదయమును వికాశింపచేయును. ఆ హృదయమునుండి జీవుడు నిష్క్రమించును).
(జీవుడు కండ్లద్వారాగాని, శిరస్సుద్వారాగాని, శరీరములోని ఇతర భాగములనుండిగాని నిష్క్రమించును. అట్లు నిష్క్రమించు జీవుని ముఖ్యప్రాణము అనుసరించి నిష్క్రమించును. ముఖ్యప్రాణముతో పాటు మిగిలిన ప్రాణములన్నియు నిష్క్రమించును).
(హృదయములో నూరున్నొక్క (101) నాడులున్నవి. అందులో ఒకనాడి మాత్రము శిరస్సుకు పోవును. ఆ నాడి ద్వారా ఉత్క్రమించిన జీవుడు మోక్షమును పొందును, అర్చిరాదిమార్గము ద్వారా బ్రహ్మలోకము చేరి, కల్పాంతమున బ్రహ్మతో (చతుర్ముఖ బ్రహ్మతో) కలిసి మోక్షమును చెందును.
(ఇతర నాడులద్వారా ఉత్క్రమించిన మిగిలిన జీవులు, అజ్ఞానులగుటచేత - తిరిగి జన్మను పొందుదురు).
రాత్ర్యాగమే (అ)వశః పార్థ ప్రభవత్యహరాగమే || (శ్రీమద్భగవద్గీత - 8 - 19)
(భూతములన్నియు చతుర్ముఖబ్రహ్మకు రాత్రి అయినకాలమందు అతనియందు లయమందుచు, అతనికి పగలు అయిన కాలమందు తిరిగి పుట్టుచున్నవి. ఇట్లు అవే భూతములు పుట్టుచూ లయమొందుచుండును. దీనిని తప్పించుట వారి వశములో లేదు. కర్మఫలమువలన నిట్లు జరుగును)
(sthūlamaina kāryavastuvu layamunu poṃdagā dāniki kāraṇamaina sūkṣma vastuvu migulunu. anagā kāryavastuvu dāni kāraṇavastuvunaṃdu līnamagunu - ā kāraṇavastuvu - sūkṣmamavastuvu - layamu poṃdagā dānikaṃṭe sūkṣmamaina dāni kāraṇavastuvu migulunu - iṭlu kāryavastuvu, dāni kāraṇavastuvunaṃdu līnamavagā tudaku anniṃṭikaṃṭe sūkṣmamai ellakālamunaṃduṃḍu satpadārthamokkaṭē - layamulēnidi okkaṭē migili yuṃḍunu, adiyē parabrahma).
(bhūmini jalamaṃdu, jalamunu agniyaṃdu, agnini vāyuvunaṃdu, vāyuvunu ākāśamunaṃdu layiṃpajēsi ākāśamunu ahaṃkāramaṃdu, ahaṃkāramunu mahattattvamaṃdu, mahattattvamunu prakṛtiyaṃdu, māyayagu prakṛtini ātmayaṃdu layiṃpacēyavalayunu - ani layaprakāramu ceppabaḍiyuṃḍuṭacēta muṃdu ceppabaḍina bhūtamulu vāṭi tarvāta ceppabaḍinavāṭiyaṃdu layamagunu - kalisipōvunu, vilīnamagunu -
“jagatpraviṣṭā dēvarṣē pṛdhidyapsu pralīyatē |
tējasyāpaḥ pralīyaṃtē, tējōvāyē pralīyatē |
vāyuśca līyatēvyōmni taccāvyaktē pralīyatē |
avyaktaṃ puruṣē brahman niṣkalē pralīyatē ||“.
(bhūtamulayokka, bhautikamulayokka anagā, bhūtamulanuṃḍi paraṃparagā puṭṭina anniṃṭi yokka layaprakāramu sṛṣṭiprakāramunaku viparītamugā nunnadi. adi yeṭlanagā bhūmi jalamulō līnamagunu - layamagunu, kalisipōvunu, jalamu tējassulō (agnilō) layamagunu, tējassu vāyuvunaṃdu, vāyuvu ākāśamaṃdu ākāśamu jīvāhaṃkāramunaṃdu, adi hiraṇyagarbhāhaṃkāramunaṃdu, adi avidyayaṃdu - prakṛtiyaṃdu līnamagunu. layamu paividhamugā jarugunani śrīviṣṇupurāṇamulō ceppabaḍinadi - “bhūmi jalamaṃdu, jalamu agniyaṃdu, agni (tējassu) vāyuvunaṃdu, vāyuvu ākāśamunaṃdu, ākāśamu avyaktamaṃdu (prakṛtiyaṃdu), avyaktamu niṣkala parabrahmamaṃdu līnamagucunnadi - paina ceppabaḍina layaprakāramu tatpadavācyuḍaina parabrahmayokka taṭastha lakṣaṇamu -) mahānavyaktēlīyatē, avyaktaṃ akṣarē līyatē - akṣaraṃ tamasi līyatē tamaḥ parē dēvatē ēkī bhavati - prakṛtiḥ vyaktāvyakta svarūpiṇī, puruṣaśca ētē ubhē līyatē paramātmani”.
(mahattatvamu avyaktamaṃdu līnamagunu, avyaktamu akṣaramaṃdu layamagunu)
“vācaṃ manasihutvā vāgvā pārāṇāṃ, manaḥ pūrvakatvāt kāraṇī bhūtē manasi vāgvyāpārān hutvā. manō vyāpārāṇāṃ prāṇādisatvēna, - manōpi tasyāpi kāraṇē prāṇēhutvā; taṃ prāṇaṃ apānē hutvā - prāṇa vāyōrūrthvagamanē ucchvāsa niśvāsādi prasaṃgē tannirōdārthaṃ sōtsargaṃ sōcchvāsa prāṇaṃ apānēhutvā; taṃ apānaṃ mṛtyau - tasyā vyadhiṣṭānatayā kāraṇī bhūtē mṛtyau hutvā -, taṃ mṛtyuṃ paṃcatvē paṃcabhūtēṣu tasyāpi kāraṇēṣu hutavān āsīt - nā kprabhṛtīni sarvēṃdriyāṇi prāṇādi vāyūṃśca kāraṇībhūta paṃcabhūtēṣu hutavān ityarthaḥ. anaṃtaraṃ paṃcatvaṃ tritvēkṛtvā paṃcīkaraṇa tyāgēna trivṛtkaraṇaṃ saṃpādya tacca trivṛttvaṃ, ēkatvē mūlakāraṇībhūta prakṛtyavasthāyāṃ ajuhōt - kāryāvasthā tyāgēna kēvala kāraṇāvasthāpanna pṛkṛti saṃsṛṣṭō abhūt - ityarthaḥ. sarvaṃ ātmani ajuhavat. sarvasya anya prakṛti saṃbaṃdhasya ātmanaḥ karmaparavaśatvāt karmapāravaśyā bhāvēna prakṛtiṃ vimucya śuddhātma rūpatāṃ āpannaḥ ityarthaḥ - taṃ ātmānaṃ avyayē brahmaṇi ajuhōt tadadhīnatvēna svātmānaṃ kṛtavānityarthaḥ. ātmanaḥ jīvasya brahmadhīnasattākatvāt, taccēṣṭatvāt - ca, tasminnādhārē śēṣiṇi ca adēyatvēna śēṣatvēna ca svātmānaṃ samarpitavān ityarthaḥ. svīya śēṣatvādyaparijñāna pūrvaka viparītānuṣṭhānā dēva kila asya saṃsāraḥ - - - ataḥ utpattikramāt viparītakramēṇaiva layaḥ kramaḥ, svakāraṇē kāryāṇāṃ layadarśanāt upapadyatēca vyutkramēṇaiva layakramaḥ; itarathāsati kāryē kāraṇasya nāśaḥ syāt; taccā niṣṭamitytharthaḥ.” (bhāṣyārtharatnamāla)
“viparyayēṇa tu praḷayakramō ataḥ utpattikramāt bhavi tumarhati. tathāhi lōkē dṛśyatē, yēnakramaēṇa sōpānamārūḍhaḥ tatō viparītakramēṇa avarōhatīti; apica dṛśyatē - mṛdōjātaṃ ghaṭaśarā vādyasyayakālē mṛdbhāvamapyēti, adbhyaścajātaṃ hima karakādyacchāvamapyētīti. ataścōpapadyatē ēta tpṛdhivyadbhyō jātānatī sthiti kālavya tikrāṃtāvapō apīyāt. āpaśca tējasō jātāssatyastēja āpīyuḥ. ēvaṃ kramēṇa sūkṣmaṃ sūkṣmataraṃ cānaṃtaramanaṃtaraṃ kāraṇaṃ apītya, sarvaṃkāryaṃ jātaṃ parama kāraṇaṃ paramasūkṣmaṃca brahmapyētīti vēdi tavyaṃ. nahi svakāraṇa vyatikramēṇa kāraṇa kāraṇē kāryāpyayō nyāyyaḥ. smṛtāvasyutpatikrama viparyayēṇaiva apyayakramaḥ. tatra darśitaḥ –
“jagatpratiṣṭā dēvarṣē pṛdhivyapsu pralīyatē |
jyōtiṣvāpaḥ pralīyaṃtē, jyōtirvāyē pralīyatē ||”
ityēvamādau - (śrī śaṃkaraḥ). (brahmasūtrabhāṣyē)
(ityēvamādau = vāyuścalīyatē nyōmni taccānyaktē pralīyatē” iti smṛti śēṣaḥ” ādi padārthaḥ)
(iṃdriyamulanniyu manasulō layamagunu, manōvṛtti prāṇavāyuvumīda ādhārapaḍinadaguṭacēta, manasu prāṇamaṃdu layamagunu. prāṇavāyuvunu apānavāyuvu kriṃdaki ākarṣiṃci śarīramulōnuṃḍi paiki neṭṭunadi kanuka prāṇavāyuvu apānavāyuvulō līnamagunu. apānavāyuvu dāni adhiṣṭānadēvata yagu mṛtyuvunaṃdu layamagunu. dīninibaṭṭi vākku modalagunavi vāṭivāṭi karmalatō kūḍa līnamagunani bhāvamu - dēhamunakē mṛtyuvu kalugunu, ātmaku kādu. pāṃcabhautikamaina dēhamu satvarajastamamulanu triguṇamulaṃdunu, ī triguṇamulu okaṭē ayina avidyayaṃdunu, avidya jīvātmayaṃdunu, līnamagunu - iṭlu śuddhamaina jīvātmanu avyayuḍu, kūṭasthuḍu ayina parabrahmayaṃdu layamagunu - ī parabrahma dēnilōnuṃḍi puṭṭalēdu kanuka - dānini kāraṇavastuvu lēdukanuka - dēnilōnu layamukādu)
(paina vrāsina dāniki vyākhyānamu : - vāgvyāpāramulaku kāraṇamu manassu kanuka vāgvyāpāramulanu manasulō layamucēsi, manassunu dāniki kāraṇamaina prāṇamaṃdu layamucēsi prāṇavāyuvu śarīramulō mīdanu saṃcariṃcunadikāvuna ā vyāpāramunu nirōdhiṃcuṭaku prāṇavāyuvunu apānavāyuvunaṃdu hutamu cēsi (layamucēsi), apānamunaku kāraṇamaina mṛtyuvunaṃdu apānamunu layiṃci, mṛtyuvunaku, kāraṇamaina paṃcabhūtamulaṃdu mṛtyuvunu līnamucēyavalayunu - anagā, vākku modalagu iṃdriyamulanniṃṭinī, prāṇamu modalagu paṃcavāyuvulanu vāṭi anniṃṭikī kāraṇamaina paṃcabhūtamulaṃdu layiṃpa cēyavalayunu - iṭlu paṃcabhūtamulaṃdu layamucēsina pidapa vāṭini triguṇamulalō - satvarajastamōguṇamulalō - kalipi, mūlakāraṇamai okaṭē ayina prakṛtiyaṃdu līnamu cēyavalayunu - iṭlu kāryamulanniyu līnamaipōyina kēvala kāraṇavastuvagu prakṛtigānē yuṃḍunu. anniyu ātmayaṃdu līnamagunu - ātmaku karma valananē prakṛtitō saṃbaṃdhamaguṭacēta ī sthitilō karmavasamu kākuṃḍuṭacēta prakṛtini viḍici śuddhamaina ātmasthitini poṃdunu. aṭṭi śuddhātmarūpamunu avyayuḍaina parabrahmamuṃdu layiṃpacēyavalayunu - paramātmādhīnamē jīvātma ayi yuṃḍuṭacēta - jīvātma tana sattāku (caitanyaśaktiki) paramātmayaṃdē ādhīnapaḍiyuṃḍuṭacētanu, paramātmavale cēṣṭiṃcuṭacētanu, vyavahariṃcuṭacētanu, paramātmayē jīvātmaku ādhāramai yuṃḍuṭacētanu, tananu, tana ātmanu - jīvātmanu - paramātmaku samarpiṃcinaṭlagunu - iṭlu paramātma yokka ādhēyamani śēṣi śēṣa bhāvamunu jīvātma teliyaka pōvuṭacētanē jīvātmaku jananamaraṇarūpamaina saṃsāramu kalugucunnadi. jīvātma paramātmatō kalisi aikyamaguṭayē layamu - ī layaprakāramu paina ceppabaḍinadi)
(paina ceppinadāninibaṭṭi sṛṣṭiprakāramunaku viparītamugānē layaprakāramuṃḍunu. prapaṃcamaṃdu ī vidhamu gānē jarugucunnadi - ā prakāramugā, mēḍameṭlu ekkaḍamu jarugucunnadō ā prakāramugānē meṭlu diguṭa yagucunnadi. maṭṭitō cēyabaḍina kuṃḍa, mūkuḍu modalagu navi kuṃḍa pagilipōgā - naśiṃcipōgā - maṭṭiyē yagucunnavi. nīṭinuṃḍi puṭṭina maṃcu modalagunavi nīrē yagucunnadi. aṭlē nīṭilōnuṃḍi puṭṭina bhūmi aṃtakālamaṃdu nīṭilōnē līnamagucunnadi; tējassu - agni - valana puṭṭina nīru agnilōnē līnamagucunnadi. ī prakāramugānē sthūlavastuvu (kāryavastuvu) dānikaṃṭe sūkṣmamai dāni kāraṇamaina vastuvunaṃdu layamagucunnadi. ā sūkṣma vastuvu dāniki kāraṇamaina vastuvulō līnamagucunnadi. anniṃṭikaṃṭenu sūkṣmamainadi, anniṃṭiki kāraṇamainadi ayina parabrahmamaṃdu dāninuṃḍi puṭṭina kāryavasuvulanniyu līnamagucunnavi yani teliyavaccucunnadi. kāraṇamaṃdukāka dāni kāryavastuvu iṃkeṃdunu līnamaguṭalēdu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 52)
“avyaktaṃ māyā tasyāśca samyak pralayōnāma muktāvida nātyaṃtikō vināśaḥ, kiṃtu suṣuptē satīnāṃ māyagōciravṛttīnāmapya bhāvāt. svapratiṣṭa paramātma prakāśasyātyaṃta nirvikalpakatayā tadbalāt bhāsamānayāḥ api atyaṃtapratibhāna prāyatvaṃ, na punaranava bhāsamēva, pratibhāmā atra śarīrasya hi midhyā vastunaḥ anavabhānē sati abhāva ēva syāditi. nacā bhāva ēvāstu, uttara sargābhāva prasaṃgāditi. avaśiṣṭaiḥ prāṇakarmabhiśca tasyāṃ māyāyāṃ vilīyaiva kramēṇaprāpta paripākaiḥ. svaphalapradānāya paramēśvarasya sisṛkṣātmaka māyā vṛttirjanyatē. saiṣāmāyāvasthā ‘īkṣati’, ‘kāmyati’, ‘tapa’ adi śabderabhidhīyatē - tadaikṣata bahuśyāṃ prajāyāyēti chāṃdōgyē;”tadaikṣata lōkānnu sṛjā” ityaitarīyakē; sō(a)kāmayata bahusyāṃ prajāyē yē “ti taittirīyakē” tapasā cīyatē brahmē “ti muṃḍakē”.
(layaprakāramu ī vidhamugā ceppabaḍinadi. - bhūmi jalamaṃdu, jalamu agniyaṃdu, agni vāyuvunaṃdu, vāyuvu ākāśamunaṃdu, ākāśamu avyaktamunaṃdunu, avyaktamu niṣkaluḍu, puruṣuḍu ayina brahmamaṃdu layamagunu.)
(prāṇula karmalu phalamuniccuṭaku koṃta niyamitamaina kālamu paṭṭunu. vāṭilō konni paṃḍi phalānubhavamuvalana kṣīṇiṃciyuṃḍunu - migilinavi paripākamunaku rānaṃduna (phalamuniccu sthitiki rānaṃduna anubhaviṃpacēyuṭaku samayamu iṃkanu rānaṃduna sṛṣṭiṃpabaḍuṭaku vīlugāka - upayōgamulēka) prākṛtapralayamaṃdu (prakṛtilō dānilōnuṃḍi puṭṭinavanniyu līnamainappuḍu) tanalō līnamaina kāryavastuvulanu kaligi tana pratiṣṭānamaina (āśrayamaina, tanaku kāraṇamaina) parabrahmamaṃdu līnamukāka. migilipōyina prāṇula karma paripakvamaguvaṟaku aṭlanē yuṃḍunu).
(avyaktamanagā māya, prakṛti. prākṛta pralayamanagā muktuḍu, bhagavaṃtunilō pūrtigā aikyamaipōyinaṭlu pūrtigā naśiṃcipōvuṭakādu - - - muktulu bhagavaṃtunilō līnamaipōgā karmaparipākamu ceṃdina jīvulu janmiṃcagā migilina prāṇulakarma kālakramamuna paripākamunaṃdi phalamunīya unmukhamainapuḍu paramātmaku sṛṣṭi cēyavalenu (sṛṣṭi cēsedanu) anu kōrika janmiṃcuṭa yanu (prakṛti) māyāvṛtti kalugunu - iṭuvaṃṭi sthilōnunu māyāvṛttinē “tadaikṣata bahusyā prajāyā yēti” - (nēnē anēkamulugā janmiṃcedanu) ani bhagavaṃtuḍu ‘ī’ kṣaṇamu cēsenu - ani chāṃdōgyōpaniṣattulōnu, “tadaikṣata lōkānnu sṛjā” (lōkamulanu sṛṣṭiṃcedanu ani bhagavaṃtuḍu kōrenu) anu taittirīyōpaniṣattulōnu, “nēnē anēkamulugā ayyedanu ani bhagavaṃtuḍu kōrenu” ani taittirīyōpaniṣattulōnu; “brahma tapassu cēsenu” ani muṃḍakōpaniṣattulōnu ceppabaḍinadi. iṭlu bhagavaṃtuḍu īkṣaṇamu cēsenu, kōrenu tapassu cēsenu ani ceppabaḍinadāni yarthamu. ī prakṛti prāṇulanu vārivāri karma paripākakālamuna tirigi tanalōnuṃḍi paiki virajimmu sthitiyē yani teliyavalenu).
(prāṇulanniyu prakṛtilō layamainapuḍu anni prāṇula karmalu phalaminiccuṭaku okē vēḷayaṃdu paripakvamu kāvu - aṃducēta prakṛti karmaparikvamaina prāṇulanu paiki paṃpivēyucu (sṛṣṭi cēyucu) migilinavārini vāri karma paripakvamaguvaraku tanalōnuṃci kālakramamuna vāri karma paripakvamukāgā vārini vadalucu - tirigi sṛṣṭiṃcucu) uṃḍunu. ī lōgā marikonni prāṇulu prakṛtilō līnamagucu nuṃḍunu. ī prakāramugā prakṛti anaṃtamugā prāṇulanu sṛṣṭiṃcucu, tanalō layiṃcucu pravāharūpamugā, bhagavaṃtunivale nityamainadanu bhāvamu kaligiṃcunu).
“śatānaṃdunaku śatābdaṃbulu paripūrṇaṃbaina dhātri gaṃdhiṃbunaṃ daḍaṃgu, nā gaṃdhaṃbu dikaṃbunaṃ galiyu, nā yudakaṃbu rasaṃbuna līnaṃbagu, nārasaṃbu tējō rūpaṃbagu, nātējaṃbu rūpaṃbuna saṃkramiṃcu, nā rūpaṃbu vāyuvunaṃduṃ galayu, vāyuvu sparśaguṇa saṃgrāhyaṃbaina, nā sparśaguṇaṃbākāśaṃbuna layaṃbagu, nā yākāśaṃbu śabdatanmātracē grasiyiṃpabaḍina niṃdriyaṃbulu manōvaikārika guṇaṃbulaṃ gūḍa nīśvaruniṃ boṃdi īśvararūpaṃbudālcu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 113)
īśaḥ paṃcīkṛtabhūtānāṃ apaṃcīkaraṇaṃ kartuṃ sō (a)kāmayata, brahmāṃḍaṃ tadgatalōkān kārya rūpāṃśca kāraṇatvaṃ prāpayitvā, tataḥ sūkṣmāṃgaṃ karmēṃdriyāṇi prāṇāṃśca, jñānēṃdriyāṇi, aṃtaḥkaraṇa catuṣṭayaṃca ēkīkṛtya, sarvāṇi bhautikāni kāraṇē bhūtapaṃcakē saṃ yōjya, bhūmiṃ jalē, jalaṃ vahnē, vahniṃ vāyau, vāyumākāśē ca, ākāśamahaṃkārēca, ahaṃkāraṃ mahati, mahadivyaktē, avyaktaṃ puruṣē kramēṇa vilīyaṃtē. virāṭ hiraṇyagarbhēśvarāḥ upādhilayāt paramātmani līyaṃtē.
“paṃcīkṛta mahābhūta saṃbhavakarma saṃcita sthūladēhaḥ, karmakṣayāt satkarma paripākataḥ apaṃcīkaraṇaṃ prāpya sūkṣmēnaikī bhūtvakāraṇa rūpatvamāsādya, tatkāraṇaṃ kūṭasthē pratyagātmani vilīyatē. viśvataijasa prājñāḥ svasvōpādhilayāt pratyagātmani vilīyaṃtē” (paiṃgalōpaniṣat).
(īśvaruḍu paṃcīkariṃpabaḍina bhūtamulanu apaṃcīkariṃcuṭaku - paṃcabhūtamula aṃśalatō kalisiyunna okkokka sthūlabhūtamunu, vāṭilōni aṃśalanu viḍadīsi vēṟuvēṟu sūkṣmabhūtamulugā cēyuṭaku, saṃkalpiṃcenu - kāryarūpamulai yunna brahmāṃḍamulanu, brahmāṃḍāṃtargata lōkamulanu, kāraṇatvaṃbunu poṃdiṃci pimmaṭa sūkṣmāṃśamulagu karmēṃdriyamulagu, prāṇamulanu, jñānēṃdriyamulanu aṃtaḥkaraṇa catuṣṭayamunu okkaṭigā cēsi, bhūtasaṃbaṃdhulagu vāṭinanniṃṭinī kāraṇamagu bhūtapaṃcakamunaṃdu kalipi, bhūmini nīṭiyaṃdu, ā nīṭinagniyaṃdunu, agnini vāyuvunaṃdunu, ā vāyuvunu ākāśamunaṃdunu, ākāśamu nahaṃkāramunaṃdunu, ahaṃkāramunu mahattunaṃdunu, mahattunu avyaktamunaṃdunu, avyaktamunu puruṣuniyaṃdunu, kramamugā vilīnamu cēyucunnāḍu. (“virāṭṭu, hiraṇyagarbhuḍu, īśvaruḍu upādhulu naśiṃcuṭavalana - upādhulavalana kalpiṃpabaḍina bhēdamulēkapōvuṭa valana paramātmayaṃdu layiṃcucunnāru. paṃcīkariṃpabaḍina sthūlamahābhūtamulavalana saṃbhaviṃcina karmacēta saṃcitamagu (saṃpādiṃpabaḍinadiyagu) sthūlaśarīramu karmakṣayamuvalananu, satkarmayokka paripākamuvalananu, apaṃcīkaraṇamu noṃdi (sūkṣmabhūtarūpamu noṃdi) sūkṣmamutō nēkībhaviṃci, tadupari kāraṇa rūpatvamunu (avidyārūpamagu ānaṃdamaya kōśatvarūpamunu) poṃdunu. pimmaṭa avidyārūpamagu nā kāraṇamu pratyagātma yaṃdu vilīnamagunu.
(“sthūlēṃdriyayuktamagu sthūlaśarīramukaṃṭenu, sūkṣmēṃdriya yuktamunu, manōbuddhi cittāhaṃkāra rūpamunu nagu aṃtaḥkaraṇamukaṃṭenu, aṃtaḥkaraṇamunaku mūlamagu avidyakaṃṭenu vēragunadiyu, vāṭini prakāśiṃpacēyunadiyunagu jīvuni svātmayē pratyagātmayani ceppabaḍunu. adi paramātmakaṃṭe vēṟukādu, kanuka paramātmayaṃdu vilīnamagunani ceppabaḍinavi.”).
“sanyasiṃci, yākāśaṃbunaṃdu, śarīraraṃdhraṃbulunu, gāliyaṃdu niśvāsaṃbunu, dējaṃbu lōpala sūkṣmaṃbunu, jalaṃbula rasaṃbunu, dharaṇiyaṃdu śalya, māṃsa pramukhaṃbulunu, vahniyaṃdu vyaktaṃbutōḍa vākkunu, niṃdruniyaṃdu śilpaṃbutōḍa garaṃbulunu, viṣṇuniyaṃdu gatitōḍa badaṃbulunu, brajāpati yaṃdu ratitōḍa nupasthaṃbunu, mṛtyuvaṃdu visargaṃbu tōḍa cāyuvunu, dikkulaṃdu śabdaṃbutōḍa śrōtraṃbunu, vāyuvaṃdu sparśaṃbutōḍa dvakkunu, sūryunaṃdu rūpaṃbutōḍa jakṣuvulunu, salilaṃbu naṃdu bracētsahita yayina jihvayu, kṣitiyaṃdu gaṃdhasahitaṃbayina ghrā ṇaṃbunu, jaṃdruniyaṃdu manōradhaṃbulatōḍa manaṃbunu, ganiyaina brahmayaṃdu bōdhaṃbutōḍa buddhiyu, rudruni yaṃdahaṃkāramutōḍa mamatvaṃbunu, kṣētrajñuniyaṃdu satvaṃbutōḍa jittaṃbunu baraṃbunaṃdu guṇaṃbulatōḍa vaikārikaṃbunuḍiṃdiṃci, yaṭamīda bṛdhivini jalaṃbunaṃdu, jalaṃbunu dējaṃbunaṃdu, dējaṃbunu vāyuvunaṃdu, vāyuvunu gaganaṃbunaṃdunu, gaganaṃbunu nahaṃkāratatvaṃbunaṃdu, nahaṃkāraṃbunu mahattatvaṃbunaṃdu, mahattatvavaṃbunu brakṛtiyaṃdu, brakṛtini nakṣaruṃḍaina paramātmayaṃdu layaṃbunoṃdiṃci cinmātrāvaśēṣituṃḍaina kṣētrajñuni nakṣaratvaṃbuna neṟiṃgi dvayarahituṃḍai dagdhakāṣṭuṃḍaina vahni caṃdaṃbuna baramātmayaina nirvikāra brahmaṃbunaṃdu līnuṃḍugāvalayu.” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 12 - 422).
“yadhānadyaḥ syaṃcamānāḥ samudrāyaṇāḥ samudraṃ prāpya astaṃ gacchaṃti bhidyatē tāsāṃ nāmarūpē samudra ityēva prōcyatē. ēvamēnāsya draṣṭuḥ imāḥ ṣōḍaśakalāḥ puruṣāya māṇāḥ puruṣaṃ prāpya astaṃ gacchaṃti. bhidyatē, tāsāṃ nāmarūpē puruṣa ityēva prōcyatē” (praśnōpaniṣat)
“yathā nadyaḥ samudraṃ prāpya līyaṃtē ēvamēvāsya parita ssarvatra brahma draṣṭu rimāḥ prāṇa śabdādyāḥ puruṣāyaṇāḥ puruṣē kalpitāḥ puruṣamēva jñēyaṃ prāpya layaṃ gacchaṃ tītyarthaḥ” (bhāṣyaratnaprabhā - brahmasūtrabhāṣyē - 4 - 2 - 15)
(nadulu samudramulō kalisi - līnamaipōyi - astamiṃcipōvucunnavi, anagā, kanabaḍakuṃḍa agucunnavi.vāṭiki idivaṟaku unna gaṃga modalagu pērlu, nadivalenuṃḍu rūpamulu pōyi avikūḍa samudramē - samudramulōni bhāgamu - ayi ā pērutōnē - samudramani nāmamutōnē ceppabaḍucunnavi. ī prakāramugānē ī ṣōḍaśa kaḷalu (padiyāru kaḷalugala jīvātma - lēka, prāṇamu modalagu 16 kaḷalu - puruṣuninuṃḍi (parabrahmanuṃḍi) puṭṭinavē kanuka tirigi puruṣunilōnē kaliyuṭaku udyamiṃcinavai jñēya vastuvu, dhyēyavastuvu, prāpyavastuvu (poṃdatagina vastuvu) ayina parabrahma nu poṃdi dānilō layamagucunnavi, anniṃṭilōnu pratyagātma, jīvātma brahma aṃśayē yaguṭacēta marala brahmalōnē līnamagunu. anni vastuvulu ī prakāramugānē layamagunu).
(pravahiṃcucunna nadulu vāṭivāṭi nāmarūpamulanu viḍici samudramulō kalisipōvucunnavi. tēnelō anēka puṣpamula rasamu kalisi yunnapuḍu, aṃdulō ē puvvu rasamēdō nirṇayiṃcuṭaku vīlu lēnaṭlu anni pūvula rasamu tēnelō kalisi (layamai) okaṭē rasamugā mārunu. aṭlē prāṇulu praḷayakālamaṃdu paramātmayagu nīyaṃdu līnamagucunnāru - nīnuṃḍi vibhaktulai vēṟuvēṟu nāmarūpamulu pōyi nīlō avibhaktamai ēkamai pōvuduru- vidvāṃsuḍu (brahmajñāni) nāmarūpamulu lēnivāḍai parātparuḍaina puruṣuni - parama puruṣuni - poṃdunu (paramātmalō līnamagunu).
tathā tavāmī naralōkabhītāḥ viśaṃti vaktrāṇyabhi vijvalaṃti ||
yathā pradīptaṃ jvalanaṃ pataṃgāḥ viśaṃti nāśāya samṛddhavēgāḥ |
tadhaiva nāśāya viśaṃti lōkāḥ tavāpi vaktrāṇi samṛddhavēgāḥ ||“. (śrīmadbhagavadgīta - 11 - 28, 29)
(nadulalōni jalapravāhamu samudramu dikkugānē pravahiṃci samudramulōnē kaliyucunnadi. samudramulōni nīrē mēghamugā māri marala avi puṭṭinacōṭu ayina samudramulōnē kaliyucunnadi. ā prakāramugānē ī vīrulaṃdaru - kurukṣētrayuddamulō pālgonnavāru, naralōkamulō bhayaṃkarulainavāru, atiradhamahāradhulainanu, nī (bhagavaṃtuni) nōṭilō pravēśiṃcucunnāru layamagucunnāru). bāgugā kāṃti vahiṃcina - bāgugā maṃḍucunna - agnini, rekkapurugulu vaṃṭivi, goppa vēgamutō vāṭi nāśamu koṟakē pravēśiṃcucunnavi. ā prakāramugānē lōkamulanniyu (lōkamulōnunna jīvulanniyu) goppa vēgamutō (āparāni vēgamutō) (nadī pravāha vēgamutō) nī nōṭilō (śrīkṛṣṇabhagavānuni viśvarūpamu nōṭilō) pravēśiṃcucunnavi. iṭlu bhagavaṃtunicē sṛṣṭiṃcabaḍina vastuvulanniyu bhagavaṃtunilōnē līnamagunu. iṭlu avi yī vidhamuga līnamagunaṭlucēyu bhagavaṃtuni śakti aḍḍulēnidi - āparānidi - (irresistable). prāṇulu dīnini pratighaṭiṃcuṭaku aśaktulu. aṃducēta sṛṣṭiṃcu śaktigalavāḍē layamu cēyucunnāḍu. eṃdulōnuṃḍi sṛṣṭiṃpabaḍina vastuvu aṃdulōnē līnamagunu)
buna dina nāyakuni valana boḍamina salilaṃ
banayamu grammaṟa grīṣmaṃ
buna sūryuniyaṃdu ḍiṃdu pōlika maṟiyun
ka. dharaṇi carācarabhūtamu
larayaga janayiṃci yaṃde yaḍagina pagidin
haricē buṭṭina viśvamu
hariyaṃde layaṃbunoṃdu nadi yeṭlannan
ma. arudau na bhratamaḥ prabhal munu nabhaṃbaṃdoppagā dōciyun
maralaṃ jūḍaganaṃde lēnigati, brahmaṃbaṃdu nī śaktuluṃ
barikiṃpaṃ driguṇa pravāhamuna nutpannaṃbulai krammaṟan
viratiṃ boṃducunuṃḍu, gāvuna harin viṣṇun bhajiṃpan dagun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 31 - 956, 957, 958)
nirguṇa brahmōpāsakulaku ī kriṃdavidhamugā layamu ceppabaḍinadi : -
(bāhya viṣayamulaṃdunu, lōpali viṣayamulaṃdunu kōrika lēka vairāgyamunu poṃdinavāḍu ātmatōnē tṛpti poṃducu nunnavāḍu ātmatōnē tṛpti poṃducununnavāḍu - iṭṭivāni prāṇamulu utkramiṃpavu - śarīramunu viḍici pōvu - aṭṭivāḍu brahmamē ayiyuṃḍi brahmanu ceṃdunu).
(brahmavēttayaguvāḍu iccaṭanē - ī lōkamunaṃdē brahmamagunu - brahmanu poṃdunu)
(brahmavētta yokka ṣōḍaśakaḷalu - anagā, padakoṃḍu iṃdriyamulu, paṃcaprāṇamulu kalasi padahāru kaḷalu - parabrahmamē ādhāramugā galavi, - paramēśvarunaṃdē ārōpiṃpabaḍinavi kāna - paramēśvarunaṃdē līnamagunu.)
saguṇōpāsakula layamu ī kriṃda vidhamugā ceppabaḍinadi : -
(ō śāṃtuḍā! puruṣuḍu canipōvukālamaṃdu vākku - vāgiṃdriyamu manasulō layiṃcunu, manassu prāṇamulō līnamagunu, prāṇamu tējassunaṃdunu, tējassu paramātmayaṃdunu līnamagunu.
(jīvuḍu dēhamunu viḍucipeṭṭunapuḍu prāṇamulanniyu, rāju kaḍaku bhṛttulu cērunaṭlu mukhyaprāṇamu vaddaku cērunu. mukhyaprāṇamu jīvunitō kalisi niṣkramiṃcunu.)
(layakālamaṃdu - maraṇakālamaṃdu jīvuḍu bhūtēṃdriyamula grahiṃci hṛdayamunu pravēśiṃcunu, hṛdayamunu vikāśiṃpacēyunu. ā hṛdayamunuṃḍi jīvuḍu niṣkramiṃcunu).
(jīvuḍu kaṃḍladvārāgāni, śirassudvārāgāni, śarīramulōni itara bhāgamulanuṃḍigāni niṣkramiṃcunu. aṭlu niṣkramiṃcu jīvuni mukhyaprāṇamu anusariṃci niṣkramiṃcunu. mukhyaprāṇamutō pāṭu migilina prāṇamulanniyu niṣkramiṃcunu).
(hṛdayamulō nūrunnokka (101) nāḍulunnavi. aṃdulō okanāḍi mātramu śirassuku pōvunu. ā nāḍi dvārā utkramiṃcina jīvuḍu mōkṣamunu poṃdunu, arcirādimārgamu dvārā brahmalōkamu cēri, kalpāṃtamuna brahmatō (caturmukha brahmatō) kalisi mōkṣamunu ceṃdunu.
(itara nāḍuladvārā utkramiṃcina migilina jīvulu, ajñānulaguṭacēta - tirigi janmanu poṃduduru).
rātryāgamē (a)vaśaḥ pārtha prabhavatyaharāgamē || (śrīmadbhagavadgīta - 8 - 19)
(bhūtamulanniyu caturmukhabrahmaku rātri ayinakālamaṃdu ataniyaṃdu layamaṃducu, ataniki pagalu ayina kālamaṃdu tirigi puṭṭucunnavi. iṭlu avē bhūtamulu puṭṭucū layamoṃducuṃḍunu. dīnini tappiṃcuṭa vāri vaśamulō lēdu. karmaphalamuvalana niṭlu jarugunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.