క్రీడ, విలాసము, క్రియ.
అనాయాసముగా చేయుపని, విలాసార్థము చేయుపని.
లీలా శబ్దేన భగవతః పరిపూర్ణత్వానన్య ప్రేర్యత్వ స్వచ్ఛంద చేష్టిత త్వాదికమభిప్రేతం“.
(భగవంతుడు పరిపూర్ణుండై యుండుట (జగత్తు అంతా, జగత్తులోని వస్తువులన్నియు తానే అయి ఉండి వాటిలో తాను పూర్తిగా నిండియుండుట, ఇతరుల ప్రేరణ లేకయే తన ఇష్టప్రకారము చేష్టించుట (చేష్టలు చేయుట) ఇవి భగవంతునికి లీలయని యభిప్రాయము)
(బాలుడు ఆటవస్తువులతో ఆడునట్లు భగవంతుడు భూతములతో ఆడునట్లు భగవంతుడు భూతములతో - వాటిని పుట్టించుచు, పోషించుచు, అంతము నొందించుచు ఆటలాడునట్లు ప్రవర్తించుచు, సంతోషించును - ఇది అతనికి లీల).
“స అకామయత - బహుశ్యామితి”. భగవంతుడు తాను ఒక్కడే అయినను అనేకరూపములుగా అయ్యెదను అనికోరెను అని శ్రుతి చెప్పుచున్నది- సృష్టి చేసెదను అని కోరెను - ఆ ప్రకారముగా సృష్టిలోని వస్తువులన్నింటిని సృష్టించెను. ఇట్లు చేసిన సృష్టి భగవంతుని ఇచ్చానుసారము - అప్రయత్నముగా, అనాయాసముగా చేయబడుటచేత అది లీల అని చెప్పబడినది).
“అభవుడవయ్యును జగతిం బ్రభవించుట లీలగాక భవమందుటయే?” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. -652)
(జన్మలేని భగవంతుడు భూమిమీద అవతరించుట, పుట్టునట్లు నటించుట - అతని లీలయే. పుట్టుకే లేనివాడు పుట్టుటెట్లు?)
మేరుర్మృత్కణ తాం, తృణం కులిశతాం వజ్రం తృణప్రాయతాం |
వహ్నిః సీతలతాం, హిమం దహనతా మాయాతి యస్యేచ్ఛాయా |
లీలా దుర్లలి తా ద్భుత వ్యసనినే దేవాయ తస్మై నమః ||“. (భోజరాజ చరిత్ర)
(భగవంతుని ఇచ్చామాత్రమున - భగవంతుడు తలచినంతమాత్రమున సముద్రమును భూమిగాను, భూమిని జలముగాను, ధూళిరేణువులను కొండగాను, మేరువంత గొప్ప కొండనైనను మట్టిరేణువులుగాను, గడ్డిపోచను వజ్రాయుధముగాను, వజ్రాయుధమును గడ్డిపోచూగాను, అగ్నిని చల్లనిదిగను, చల్లనైన మంచును వేడిగను చేయగల శక్తిగలవాడు. ఇట్లు వ్యతిరేకముగా కార్యములు అద్భుతముగ చేయుటయే వ్యసనము లేక లీలగా గల దేవునకు - భగవంతునకు నమస్కారము)
పైన చెప్పిన ప్రకారము ప్రకృతి ప్రకారము అసంభవమైనవి. ప్రకృతికి వ్యతిరేకమైనవి, లోకదృష్టిలో అద్భుతమైనవి యగు భగవంతుని కార్యములు లీలలని చెప్పబడిన నీక్రింద నుదహరించబడినవి : -
కరి సరసిజముకుళమెత్తుగతి ద్రిభువనశం
కర కరుడై గోవర్ధన
గిరి యెత్తెం జక్కనిక్క కేలన్ లీలన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 916)
(వరహావతారములో భూమినంతటినీ వరాహరూపమున మూడు లోకములకు మంగళము కలుగచేయువాడై ఎత్తిన శ్రీహరి గోవర్థనమను నొక కొండను ఒక్క చేతితో లీలగా - అవలీలగా, సునాయాసముగా - ఎత్తెను, అతనికి ఇది యొక లీలగాక నొక్క పనియా?)
“ఉర్వ్యాం కోపి మహీధరో లఘుతరో దోర్భ్యాంధృతో లీలయా |
తేనత్వం దివిభూతరేవచ సతతం గోవర్థనోద్ధారకః | - - - ” (శ్రీకృష్ణకర్ణామృతం -)
(భూమిమీద నేదో యొక చిన్నది, తేలికయైనది యగు గోవర్థనమను కొండను రెండుచేతులతోను లీలగా - అవలీలగా నెత్తినంతమాత్రమున, భూమి, స్వర్గము అను రెండులోకములలోను ‘గోవర్థనధారి’ యని నీవు గొప్పగా పొగడబడుచున్నావు - - - ఇది భగవంతునికి యొక్క గొప్ప పనియా? యని యర్థము - అతని లీలలో నొలటి మాత్రమే).
సకలోపాసితులౌ చతుర్భుజులు నై సంప్రీతి నే గొల్వగా
బ్రకట శ్రీగలవాడవైతివి మఱిన్ బ్రహ్మాండముల్ చూపి యొ
ల్లకయిట్లొక్కడవైతి, నీ వివిధ లీలత్వంబ గంటింగదే “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - - 10 - పూ.భా. - 563)
(గొల్ల పిల్లల మధ్యను, ఆవు పెయ్యలమధ్యను నీవు ఒకడవై యుండి, నేను నిన్ను తెసుకొనగానే వాటి సావసములో చతుర్భుజ రూపములుగలవాడవైతివి - ఇంతేకాక బ్రహ్మాండములను చూపించి, తిరుగ ఒక్కడివి అయిన గోపాల రూపముతో నుంటివి - ఇట్లు అనేకమైన నీ రూపములు నేను కనుగొంటిని).
సకల జంతులందును సంచరించు
నా మహాత్మునకు బరాంగనలెవ్వరు?
సర్వమయుడు లీల సలిపే గాక “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1111)
(సమస్త వస్తువులందును, సమస్త ప్రాణులందును పూర్తిగా లోపల, పైన పూర్తిగా వ్యాపించియుండి అన్నియు అందఱూ తానే అయిన సర్వాత్ముడైన శ్రీ భగవంతునకు గోపకాంతలతో చెలిమి చేయుటలో దోషమేమి? వారి భర్తలు, పిల్లలు, తల్లులు, తండ్రులు తానే అయినందువలన - వారి రూపములన్నియు తనవే అయినందున గోపికలు పరాంగనలు కారు - అది భగవంతుని లీలయే.)
తరిగడవకు గుదురు నాగత్రాడట చేరుల్
దరిగవ్వంబును దానట
హరిహరి హరి చిత్రలీల హరియే యెఱుగున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కంద - 8 - 7 - 205)
(అమృతము కొఱకు దేవతలు, దైత్యులు పాలసముద్రమును తరచునపుడు, ఆ తరచువారిలో శ్రీమహావిష్ణువు ఒకడు. కవ్వమును త్రిప్పు త్రాడు వాసుకి (పాము), కవ్వము విష్ణువు, (కొండ), ఆ కొండ (కవ్వము) క్రిందికి పడిపోకుండ దానికి కుదురువలె తానే ఒక పెద్ద కూర్మముగా నుండెను, పాలసముద్రము పాలకుండ - ఇట్లు చేయుట భగవంతుని లీలయేగాని, ఇతరులకు తరముకాని పని.)
యోపరాత్మ!, భూమ ! యోగిరాజ!
యే తెఱంగులెన్ని యెంత యెచ్చోటనీ
హేల లెవ్వడెఱుగు నీశ్వరేశ. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా - 567)
(శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 2 - 1 - 33)
(లోకములో కొందఱు రాజులకు, లేక, వారి మంత్రులకు ఇష్టముకాని పనుకు కాకపోయినను వారి క్రీడావిహారములందు కేవలము విలాసార్థము లీలలు జరుగుచుండునో, మఱియు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు బాహ్య ప్రయోజనములు లేకపోయినను జరుగుచుండునో, అట్లే భగవంతుడు బాహ్యప్రయోజనము లేకపోయినను కొన్ని లీలలుగా పనులు చేయుచుండును - భగవంతునికి యీ విషయములో బాహ్య ప్రయోజనము ఏమియు ఉన్నట్లు శ్రుతులు కూడ చెప్పుటలేదు - అందుచేత భగవంతుని యొక్క అటివంటి చర్యలు లీలలు అనిపించుకొనును)
krīḍa, vilāsamu, kriya.
anāyāsamugā cēyupani, vilāsārthamu cēyupani.
līlā śabdēna bhagavataḥ paripūrṇatvānanya prēryatva svacchaṃda cēṣṭita tvādikamabhiprētaṃ”.
(bhagavaṃtuḍu paripūrṇuṃḍai yuṃḍuṭa (jagattu aṃtā, jagattulōni vastuvulanniyu tānē ayi uṃḍi vāṭilō tānu pūrtigā niṃḍiyuṃḍuṭa, itarula prēraṇa lēkayē tana iṣṭaprakāramu cēṣṭiṃcuṭa (cēṣṭalu cēyuṭa) ivi bhagavaṃtuniki līlayani yabhiprāyamu)
(bāluḍu āṭavastuvulatō āḍunaṭlu bhagavaṃtuḍu bhūtamulatō āḍunaṭlu bhagavaṃtuḍu bhūtamulatō - vāṭini puṭṭiṃcucu, pōṣiṃcucu, aṃtamu noṃdiṃcucu āṭalāḍunaṭlu pravartiṃcucu, saṃtōṣiṃcunu - idi ataniki līla).
“sa akāmayata - bahuśyāmiti”. bhagavaṃtuḍu tānu okkaḍē ayinanu anēkarūpamulugā ayyedanu anikōrenu ani śruti ceppucunnadi- sṛṣṭi cēsedanu ani kōrenu - ā prakāramugā sṛṣṭilōni vastuvulanniṃṭini sṛṣṭiṃcenu. iṭlu cēsina sṛṣṭi bhagavaṃtuni iccānusāramu - aprayatnamugā, anāyāsamugā cēyabaḍuṭacēta adi līla ani ceppabaḍinadi).
“abhavuḍavayyunu jagatiṃ brabhaviṃcuṭa līlagāka bhavamaṃduṭayē?” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. -652)
(janmalēni bhagavaṃtuḍu bhūmimīda avatariṃcuṭa, puṭṭunaṭlu naṭiṃcuṭa - atani līlayē. puṭṭukē lēnivāḍu puṭṭuṭeṭlu?)
mērurmṛtkaṇa tāṃ, tṛṇaṃ kuliśatāṃ vajraṃ tṛṇaprāyatāṃ |
vahniḥ sītalatāṃ, himaṃ dahanatā māyāti yasyēcchāyā |
līlā durlali tā dbhuta vyasaninē dēvāya tasmai namaḥ ||“. (bhōjarāja caritra)
(bhagavaṃtuni iccāmātramuna - bhagavaṃtuḍu talacinaṃtamātramuna samudramunu bhūmigānu, bhūmini jalamugānu, dhūḷirēṇuvulanu koṃḍagānu, mēruvaṃta goppa koṃḍanainanu maṭṭirēṇuvulugānu, gaḍḍipōcanu vajrāyudhamugānu, vajrāyudhamunu gaḍḍipōcūgānu, agnini callanidiganu, callanaina maṃcunu vēḍiganu cēyagala śaktigalavāḍu. iṭlu vyatirēkamugā kāryamulu adbhutamuga cēyuṭayē vyasanamu lēka līlagā gala dēvunaku - bhagavaṃtunaku namaskāramu)
paina ceppina prakāramu prakṛti prakāramu asaṃbhavamainavi. prakṛtiki vyatirēkamainavi, lōkadṛṣṭilō adbhutamainavi yagu bhagavaṃtuni kāryamulu līlalani ceppabaḍina nīkriṃda nudahariṃcabaḍinavi : -
kari sarasijamukuḷamettugati dribhuvanaśaṃ
kara karuḍai gōvardhana
giri yetteṃ jakkanikka kēlan līlan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 916)
(varahāvatāramulō bhūminaṃtaṭinī varāharūpamuna mūḍu lōkamulaku maṃgaḷamu kalugacēyuvāḍai ettina śrīhari gōvarthanamanu noka koṃḍanu okka cētitō līlagā - avalīlagā, sunāyāsamugā - ettenu, ataniki idi yoka līlagāka nokka paniyā?)
“urvyāṃ kōpi mahīdharō laghutarō dōrbhyāṃdhṛtō līlayā |
tēnatvaṃ divibhūtarēvaca satataṃ gōvarthanōddhārakaḥ | - - - ” (śrīkṛṣṇakarṇāmṛtaṃ -)
(bhūmimīda nēdō yoka cinnadi, tēlikayainadi yagu gōvarthanamanu koṃḍanu reṃḍucētulatōnu līlagā - avalīlagā nettinaṃtamātramuna, bhūmi, svargamu anu reṃḍulōkamulalōnu ‘gōvarthanadhāri’ yani nīvu goppagā pogaḍabaḍucunnāvu - - - idi bhagavaṃtuniki yokka goppa paniyā? yani yarthamu - atani līlalō nolaṭi mātramē).
sakalōpāsitulau caturbhujulu nai saṃprīti nē golvagā
brakaṭa śrīgalavāḍavaitivi maṟin brahmāṃḍamul cūpi yo
llakayiṭlokkaḍavaiti, nī vividha līlatvaṃba gaṃṭiṃgadē “. (śrīmadāṃdhramahābhāgavatamu - - 10 - pū.bhā. - 563)
(golla pillala madhyanu, āvu peyyalamadhyanu nīvu okaḍavai yuṃḍi, nēnu ninnu tesukonagānē vāṭi sāvasamulō caturbhuja rūpamulugalavāḍavaitivi - iṃtēkāka brahmāṃḍamulanu cūpiṃci, tiruga okkaḍivi ayina gōpāla rūpamutō nuṃṭivi - iṭlu anēkamaina nī rūpamulu nēnu kanugoṃṭini).
sakala jaṃtulaṃdunu saṃcariṃcu
nā mahātmunaku barāṃganalevvaru?
sarvamayuḍu līla salipē gāka “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1111)
(samasta vastuvulaṃdunu, samasta prāṇulaṃdunu pūrtigā lōpala, paina pūrtigā vyāpiṃciyuṃḍi anniyu aṃdaṟū tānē ayina sarvātmuḍaina śrī bhagavaṃtunaku gōpakāṃtalatō celimi cēyuṭalō dōṣamēmi? vāri bhartalu, pillalu, tallulu, taṃḍrulu tānē ayinaṃduvalana - vāri rūpamulanniyu tanavē ayinaṃduna gōpikalu parāṃganalu kāru - adi bhagavaṃtuni līlayē.)
tarigaḍavaku guduru nāgatrāḍaṭa cērul
darigavvaṃbunu dānaṭa
harihari hari citralīla hariyē yeṟugun”. (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃda - 8 - 7 - 205)
(amṛtamu koṟaku dēvatalu, daityulu pālasamudramunu taracunapuḍu, ā taracuvārilō śrīmahāviṣṇuvu okaḍu. kavvamunu trippu trāḍu vāsuki (pāmu), kavvamu viṣṇuvu, (koṃḍa), ā koṃḍa (kavvamu) kriṃdiki paḍipōkuṃḍa dāniki kuduruvale tānē oka pedda kūrmamugā nuṃḍenu, pālasamudramu pālakuṃḍa - iṭlu cēyuṭa bhagavaṃtuni līlayēgāni, itarulaku taramukāni pani.)
yōparātma!, bhūma ! yōgirāja!
yē teṟaṃgulenni yeṃta yeccōṭanī
hēla levvaḍeṟugu nīśvarēśa. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā - 567)
(śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 2 - 1 - 33)
(lōkamulō koṃdaṟu rājulaku, lēka, vāri maṃtrulaku iṣṭamukāni panuku kākapōyinanu vāri krīḍāvihāramulaṃdu kēvalamu vilāsārthamu līlalu jarugucuṃḍunō, maṟiyu, ucchvāsa niśvāsamulu bāhya prayōjanamulu lēkapōyinanu jarugucuṃḍunō, aṭlē bhagavaṃtuḍu bāhyaprayōjanamu lēkapōyinanu konni līlalugā panulu cēyucuṃḍunu - bhagavaṃtuniki yī viṣayamulō bāhya prayōjanamu ēmiyu unnaṭlu śrutulu kūḍa ceppuṭalēdu - aṃducēta bhagavaṃtuni yokka aṭivaṃṭi caryalu līlalu anipiṃcukonunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.