(ఆకారము, భగవంతుని విగ్రహము, లేక దేవతా విగ్రహము, బొమ్మ, శరీరము, కార్య వస్తువులకు కారణము, (కారణమైనది), చిహ్నము (గుఱుతు), ప్రతీకము, ప్రతిమ, గుఱుతు)
లింగం నామ శరీరం. (లింగమనగా శరీరము - లింగశరీరము)
లింగ్యతే యేన తల్లింగం, బుద్ధ్యాది. (తెలుసుకొనునది, - బుద్ధి మొదలగునవి)
లింగం తత్తు యతో బ్రహ్మన్ బ్రహ్మణః పరమం విపుః -” (కూర్మ పురాణము - అధ్యా - 26)
(లింగమనగా పరబ్రహ్మయొక్క ఉత్కృష్టమైన శరీరము)
(సూక్ష్మమై పరమాత్మను పొందింప చేయునది, పరమాత్మలో లీనము చేయునది, కలియునట్లు చేయునది).
(వాసనలకు - పూర్వ జన్మ వాసనలకు ఆశ్రయమైనది జీవుడు).
(పది ఇంద్రియములు, పంచ ప్రాణములు, మనస్సు, బుద్ధి - ఈ పదిహేను తత్వములు కలిసి పంచీకృతముకాని భూతముల సముదాయము లింగశరీరము. ఇది భోగ సాధనము - సుఖదుఃఖములననుభవించుటకు సాధనమైనది.)
“అపంచీకృత పంచభూతకార్యాత్మక సప్తదశ తత్వాని - ప్రాణాః పంచ, కర్మేంద్రియాణి పంచ, జ్ఞానేంద్రియాణి పంచ, మనః ఏకః, బుద్ధిశ్చ ఏక ఇతి సప్తదశ తత్వాని మిలిత్వా లింగం ఇత్యుచ్యతే.”
(పంచీకృతము కాని భూతముల సముదాయము లింగశరీరము. ఇది భోగసాధనము - సుఖదుఃఖముల ననుభవించుటకు సాధనమైనది)
(పంచీకరణము కాని పంచభూతముల కార్యములయిన పంచప్రాణములు, అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అను ఈ పదిహేను తత్వములు కలిసినది లింగము - లింగ శరీరమని చెప్పబడినది.)
జీవోపాధిః, సూక్ష్మ శరీరం - (జీవునకుపాధి అయిన సూక్ష్మ శరీరము.)
బిందువునందు ప్రతిబింబించు పరమేశ్వరుని ప్రకాశము.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మొదలగు దేవతుల ఆకృతి, గుఱుతు, ప్రతిమ మొదలగునవి - దేవతులకు ప్రతీకముగ వాడబడునవి.
పానవట్టము మీద శివుని మూర్తి
మనస్సు - చిత్తము - అహంకారము.
“శివస్య సన్నిధి, ర్లింగే సర్వకాలేషు సర్వదా |”
(సర్వకాలములందు, ఎల్లపుడు, లింగమందు శివుడుండును).
యత్రైవ విద్యతే లింగం సర్వతీర్థాని తత్రవై ||“.
(గ్రామమందుగాని, అడవిలోగాని, నీటిలోగాని, భూమిమీదగాని ఎక్కడైనను శివలింగమున్నచో అన్ని తీర్థములు అక్కడనే గలవు)
నతత్వ దృష్ట్యా పరమేశ్వరస్య స్వయం ప్రభస్యాస్య న చాస్తి లింగం |
వేదాంతవ్యాక్యోత్థ పరాత్మ విద్యాం శివస్య లింగం కథయంతి కేచిత్ |
విచార జన్యామపి సత్య విద్యాం బ్రువంతి చాన్యే పరమస్య లింగం |
స్మృతిజన్యా ఇతిహాసజామిమాం పరవిద్యామపి లింగమీశుతుః |
అతిశుద్ధా మపితాం పురాణజాం ప్రవష్టంతి శ్రుతి విత్తమోత్తమాః |
శివస్య లింగం కథయంతి మాయాం శివవస్తు నిష్టాం వదంతి |
కే చిజ్జనచిత్తమన్యే త్వహం కృతించాపి మనశ్చ బుద్ధిం |
ప్రాణంచ లింగం ప్రవదంతి కేచిత్ శరీరమన్యే ప్రవదంతి లింగం |
యదస్తి యన్నాస్తి మహేశ్వరస్య సమస్తమేతత్ ప్రవదంతి లింగం |
విశుద్ధ విద్యాః పరయోగినో (అ)స్య స్వయం ప్రభస్యైవ న లింగమూ చుః ||“.
తస్మాత్ పరమార్థ దృష్ట్యా స్వయం ప్రకాశస్య బ్రహ్మణః గమకాంతర నిరపేక్షత్వాత్ స్వయమేవ సర్వగమకత్వాచ్చ అలింగత్వ ముపపన్నం ||“.
(వ్యవహార దృష్టిలో కొందఱు శివుని లింగము అనేక ప్రకారములుగా చెప్పుచున్నారు. స్వయంప్రభయైన శివునికి తత్వ దృష్టిలో - యదార్ధానికి - లింగము లేదు. మఱికొందరు ఉపనిషద్వాక్యములవలన కలిగిన ఆత్మజ్ఞానము శివలింగమని చెప్పిరి. కొందఱు బ్రహ్మజ్ఞానము కలవారు దీనిని అవిద్య యనుచున్నారు - స్మృతులవలన, ఇతిహాసములవలనను కలిగిన పరవిద్య యనుచున్నారు - స్మృతులను బాగుగా తెలిసినవారు శివమాయ యని దానిని చెప్పుదురు. మరికొందఱు అది చిత్తమని, అహంకారమని, మనస్సు అని, బుద్ధియని, ప్రాణమని, శరీరమని యనుచున్నారు - ఉన్నది, లేనిది అంతయు ఈశ్వరుని లింగమే యని కొందఱి అభిప్రాయము. విశుద్ధమైన జ్ఞానముకల పరమ యోగీంద్రులు పరమశివునికి లింగము - ఆకారము, శరీరము - లేదందురు. అందుచేత పరమార్థ దృష్టిలో స్వయంప్రకాశుడైన పరబ్రహ్మకు అంతటను అతనే ఉండుటచేత ఒక రూపమని లేదు - లింగమనునది లేదు).
సర్వరూపం భవం జ్ఞాత్వా లింగే (అ)ర్చయతి తం ప్రభుం |
తస్మిన్నత్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్విజః ||“. (మహాభారతం)
(దేవదేవుడు - దేవతులకు దేవుడైనవాడు - అచింత్యాత్మా - ఊహించుటకు వీలుకానటువంటి రూపము గలవాడు - అజేయ్యుడు - జయించుటకు శక్యముకానివాడు - అవ్యయుడు - నాశములేనివాడు అయిన విష్ణువు అన్ని రూపములు శివుడే యని తెలుసుకొని శివుని లింగమునే పూజించెను - లింగముకూడ శివునిరూపమే యని నమ్మి పూజించెను - (రామేశ్వరములోని శ్రీరామలింగేశ్వరుడు).
“దేహంబునకు బీజంబు లింగంబనియు, లింగంబునకు మూలంబు గుణంబులనియు -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 15)
“సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునం |
ఉజ్జయిన్యాం మహాకాళిం, ఓంకార మమరేశ్వరే |
ప్రజ్వలా వైద్యనాధంచ, ఢాకిన్యాం భీమశంకరం |
సేతు బంధేతు రామేశం త్ర్యంబకం గౌతమీ తటే |
హిమాలయే తు కేదారం, నాగేశం దారుకావనే |
వారణాస్యాంతు విశ్వేశం, ఘృష్ణేశం తు శివాలయే. ||
(శివలింగములున్న స్థలములు - క్షేత్రములు - సౌరాష్ట్రమందు సోమనాధుడు, శ్రీశైలమందు మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళము, అమరేశ్వరములో ఓంకారము, వైధ్యనాధములో ప్రజ్వలా, ఢాకినీలో భీమశంకరము, రామేశ్వరములో రామేశ్వరలింగము, గౌతమీ తటమందు త్ర్యంబకము, హిమాలయమందు కేదారము, దారుకావనమందు నాగేశలింగము, వారణాసియందు (కాశీలో) విశ్వనాధుడు, శివాలయమందు ఘృష్ణేశుడు.)
లింగే(అ)ర్చితే(అ)ఖిలం విశ్వమర్చితం,స్యాన్న సంశయః |
మాయయా మోహితాత్మనో న జానంతి మహేశ్వరం |
పృధివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయ తనానిచ |
శివలింగేవ సంత్యేన తాని సర్వాణి నారద” (సౌరపురాణము - అధ్యా - 64)
(ఈ మూడులోకములలోను లింగమును అర్చించుటకన్న అధికమైన పుణ్యము లేదు. లింగమును అర్చించిన విశ్వమంతను అర్చించినట్లే యగును. ఇందుకు సందేహములేదు. మాయచేత మోహము చెందినవారు మహేశ్వరుని (శివుని) తెలియలేరు. భూమిమీద ఏ తీర్థములున్నవో, పుణ్యక్షేత్రములేవి కలవో, అవన్నియు శివలింగమందే యున్నవి)
కంటె గరిష్టంబుగావున నదియు భుక్తాన్నంబు జీర్ణంబునందచేయు
దీప్త జఠరాగ్నిగతి లింగ దేహనాసకంబు గావించు - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం - 3 - 25 - 877)
“జీవోపాధి భూతంబగు లింగ దేహంబుచే స్వావాస భూతలోకంబుననుండి లోకాంతరంబు నొందుచుం ప్రారబ్దకర్మ ఫలంబులననుభవించుచు మరలం కర్మాదులందాసక్తుడగుచు - - - జీవుండు భూతేంద్రియ మనోమయంబైన దేహంబు గలిగియుండు. అట్టి దేహ నిరోధింబె మరణంబు, నావిర్భావంబె జన్మంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 31 -)
“శివతత్వము సర్వ కార్యాచరణములందును శక్తి తత్వముతో కూడియే - కలిసియే యుండును. ఈ శక్తి తత్వము శివుని ఇచ్చా శక్తి ఇచ్ఛా శక్తికిని, జ్ఞాన శక్తికిని ప్రతినిధి (ప్రతీకము). సువర్ణమునందలి సువర్ణత్వమువలె శక్తి శివునితో అవినావసంబంధము కలది. వారిరువురకు పరస్పర వియోగము లేదు. శివుని శక్తియే పార్వతి, శివుని యొక్క శక్తి శివునినుండి విడదీయరానిది - వేరు చేయరానిది. శివుడు. శక్తియు భార్యా భర్తలుగా కొలువబడుట లోక సంగ్రహణార్థమే.”జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ“. మనిషి యొక్క శక్తి మనిషినుండి విడతీయరానిదని చెప్పినట్లే - శివుడు ప్రకృతితో కలిసియున్నాడు, ప్రకృతియే పార్వతి. ప్రకృతిలోని ప్రతి అణువులోను ఈ రెండు తత్వములు - పరబ్రహ్మతత్వము, ప్రకృతితత్వము - పురుషుడు, ప్రకృతి కలిసియే యున్నవి. అవి ఒకదానినుండి ఒకటి విడదీయరాని స్థితిలో నున్నవి. ఇందువలననే శివునకు సాంబుడు (సాంబశివుడు) - స + అంబ = సాంబ (అంబతో కూడియున్నవాడు) - పార్వతితో కలిసియున్నవాడు - శక్తితో కూడి యున్నవాడు - అని చెప్పబడుచున్నాడు. శివుని అర్థనారీశ్వర రూపముకూడ ఈ విషయమునే సూచించుచున్నది. లక్ష్మీ నారాయణుల అవినాభావసంబంధమువలెనే ఈ పార్వతీ పరమేశ్వరుల సంబంధము, ప్రకృతి పురుషుల సంబంధము కూడ ఈ ఈ విషయమునే సూచించుచున్నది - (combination of matter and Energy).
అనుమానప్రమాణములో వస్తువును నిరూపించుటకు కారణమైనది - సహాయపడునది - లింగము - పర్వతముమీద అగ్నియుండగా అది, చెట్లు మొదలగునవి అడ్డుగా నుండుటవలన దూరమునుండుటవలన దూరమునుండి కానరావు, కాని, ఆ అగ్ని యొక్క పొగ ఆకాశములోనికి పోవునపుడు అది దూరమునుండి, చెట్లు మొదలగు వాటిమీదనుండి కనబడును. ఆ పొగను బట్టి అక్కడ అగ్ని ఉన్నదని తెలియవచ్చును - ఆ పొగ అగ్నియున్నట్లు తెలియచేయును - అది లింగము - (అనుమానప్రమాణము).
(ākāramu, bhagavaṃtuni vigrahamu, lēka dēvatā vigrahamu, bomma, śarīramu, kārya vastuvulaku kāraṇamu, (kāraṇamainadi), cihnamu (guṟutu), pratīkamu, pratima, guṟutu)
liṃgaṃ nāma śarīraṃ. (liṃgamanagā śarīramu - liṃgaśarīramu)
liṃgyatē yēna talliṃgaṃ, buddhyādi. (telusukonunadi, - buddhi modalagunavi)
liṃgaṃ tattu yatō brahman brahmaṇaḥ paramaṃ vipuḥ -” (kūrma purāṇamu - adhyā - 26)
(liṃgamanagā parabrahmayokka utkṛṣṭamaina śarīramu)
(sūkṣmamai paramātmanu poṃdiṃpa cēyunadi, paramātmalō līnamu cēyunadi, kaliyunaṭlu cēyunadi).
(vāsanalaku - pūrva janma vāsanalaku āśrayamainadi jīvuḍu).
(padi iṃdriyamulu, paṃca prāṇamulu, manassu, buddhi - ī padihēnu tatvamulu kalisi paṃcīkṛtamukāni bhūtamula samudāyamu liṃgaśarīramu. idi bhōga sādhanamu - sukhaduḥkhamulananubhaviṃcuṭaku sādhanamainadi.)
“apaṃcīkṛta paṃcabhūtakāryātmaka saptadaśa tatvāni - prāṇāḥ paṃca, karmēṃdriyāṇi paṃca, jñānēṃdriyāṇi paṃca, manaḥ ēkaḥ, buddhiśca ēka iti saptadaśa tatvāni militvā liṃgaṃ ityucyatē.”
(paṃcīkṛtamu kāni bhūtamula samudāyamu liṃgaśarīramu. idi bhōgasādhanamu - sukhaduḥkhamula nanubhaviṃcuṭaku sādhanamainadi)
(paṃcīkaraṇamu kāni paṃcabhūtamula kāryamulayina paṃcaprāṇamulu, ayidu karmēṃdriyamulu, ayidu jñānēṃdriyamulu, manassu, buddhi, anu ī padihēnu tatvamulu kalisinadi liṃgamu - liṃga śarīramani ceppabaḍinadi.)
jīvōpādhiḥ, sūkṣma śarīraṃ - (jīvunakupādhi ayina sūkṣma śarīramu.)
biṃduvunaṃdu pratibiṃbiṃcu paramēśvaruni prakāśamu.
brahma, viṣṇu, mahēśvaruḍu modalagu dēvatula ākṛti, guṟutu, pratima modalagunavi - dēvatulaku pratīkamuga vāḍabaḍunavi.
pānavaṭṭamu mīda śivuni mūrti
manassu - cittamu - ahaṃkāramu.
“śivasya sannidhi, rliṃgē sarvakālēṣu sarvadā |”
(sarvakālamulaṃdu, ellapuḍu, liṃgamaṃdu śivuḍuṃḍunu).
yatraiva vidyatē liṃgaṃ sarvatīrthāni tatravai ||“.
(grāmamaṃdugāni, aḍavilōgāni, nīṭilōgāni, bhūmimīdagāni ekkaḍainanu śivaliṃgamunnacō anni tīrthamulu akkaḍanē galavu)
natatva dṛṣṭyā paramēśvarasya svayaṃ prabhasyāsya na cāsti liṃgaṃ |
vēdāṃtavyākyōttha parātma vidyāṃ śivasya liṃgaṃ kathayaṃti kēcit |
vicāra janyāmapi satya vidyāṃ bruvaṃti cānyē paramasya liṃgaṃ |
smṛtijanyā itihāsajāmimāṃ paravidyāmapi liṃgamīśutuḥ |
atiśuddhā mapitāṃ purāṇajāṃ pravaṣṭaṃti śruti vittamōttamāḥ |
śivasya liṃgaṃ kathayaṃti māyāṃ śivavastu niṣṭāṃ vadaṃti |
kē cijjanacittamanyē tvahaṃ kṛtiṃcāpi manaśca buddhiṃ |
prāṇaṃca liṃgaṃ pravadaṃti kēcit śarīramanyē pravadaṃti liṃgaṃ |
yadasti yannāsti mahēśvarasya samastamētat pravadaṃti liṃgaṃ |
viśuddha vidyāḥ parayōginō (a)sya svayaṃ prabhasyaiva na liṃgamū cuḥ ||“.
tasmāt paramārtha dṛṣṭyā svayaṃ prakāśasya brahmaṇaḥ gamakāṃtara nirapēkṣatvāt svayamēva sarvagamakatvācca aliṃgatva mupapannaṃ ||“.
(vyavahāra dṛṣṭilō koṃdaṟu śivuni liṃgamu anēka prakāramulugā ceppucunnāru. svayaṃprabhayaina śivuniki tatva dṛṣṭilō - yadārdhāniki - liṃgamu lēdu. maṟikoṃdaru upaniṣadvākyamulavalana kaligina ātmajñānamu śivaliṃgamani ceppiri. koṃdaṟu brahmajñānamu kalavāru dīnini avidya yanucunnāru - smṛtulavalana, itihāsamulavalananu kaligina paravidya yanucunnāru - smṛtulanu bāgugā telisinavāru śivamāya yani dānini ceppuduru. marikoṃdaṟu adi cittamani, ahaṃkāramani, manassu ani, buddhiyani, prāṇamani, śarīramani yanucunnāru - unnadi, lēnidi aṃtayu īśvaruni liṃgamē yani koṃdaṟi abhiprāyamu. viśuddhamaina jñānamukala parama yōgīṃdrulu paramaśivuniki liṃgamu - ākāramu, śarīramu - lēdaṃduru. aṃducēta paramārtha dṛṣṭilō svayaṃprakāśuḍaina parabrahmaku aṃtaṭanu atanē uṃḍuṭacēta oka rūpamani lēdu - liṃgamanunadi lēdu).
sarvarūpaṃ bhavaṃ jñātvā liṃgē (a)rcayati taṃ prabhuṃ |
tasminnatyadhikāṃ prītiṃ karōti vṛṣabhadhvijaḥ ||“. (mahābhārataṃ)
(dēvadēvuḍu - dēvatulaku dēvuḍainavāḍu - aciṃtyātmā - ūhiṃcuṭaku vīlukānaṭuvaṃṭi rūpamu galavāḍu - ajēyyuḍu - jayiṃcuṭaku śakyamukānivāḍu - avyayuḍu - nāśamulēnivāḍu ayina viṣṇuvu anni rūpamulu śivuḍē yani telusukoni śivuni liṃgamunē pūjiṃcenu - liṃgamukūḍa śivunirūpamē yani nammi pūjiṃcenu - (rāmēśvaramulōni śrīrāmaliṃgēśvaruḍu).
“dēhaṃbunaku bījaṃbu liṃgaṃbaniyu, liṃgaṃbunaku mūlaṃbu guṇaṃbulaniyu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 15)
“saurāṣṭrē sōmanādhaṃca śrīśailē mallikārjunaṃ |
ujjayinyāṃ mahākāḷiṃ, ōṃkāra mamarēśvarē |
prajvalā vaidyanādhaṃca, ḍhākinyāṃ bhīmaśaṃkaraṃ |
sētu baṃdhētu rāmēśaṃ tryaṃbakaṃ gautamī taṭē |
himālayē tu kēdāraṃ, nāgēśaṃ dārukāvanē |
vāraṇāsyāṃtu viśvēśaṃ, ghṛṣṇēśaṃ tu śivālayē. ||
(śivaliṃgamulunna sthalamulu - kṣētramulu - saurāṣṭramaṃdu sōmanādhuḍu, śrīśailamaṃdu mallikārjunuḍu, ujjayinilō mahākāḷamu, amarēśvaramulō ōṃkāramu, vaidhyanādhamulō prajvalā, ḍhākinīlō bhīmaśaṃkaramu, rāmēśvaramulō rāmēśvaraliṃgamu, gautamī taṭamaṃdu tryaṃbakamu, himālayamaṃdu kēdāramu, dārukāvanamaṃdu nāgēśaliṃgamu, vāraṇāsiyaṃdu (kāśīlō) viśvanādhuḍu, śivālayamaṃdu ghṛṣṇēśuḍu.)
liṃgē(a)rcitē(a)khilaṃ viśvamarcitaṃ,syānna saṃśayaḥ |
māyayā mōhitātmanō na jānaṃti mahēśvaraṃ |
pṛdhivyāṃ yāni tīrthāni puṇyānyāya tanānica |
śivaliṃgēva saṃtyēna tāni sarvāṇi nārada” (saurapurāṇamu - adhyā - 64)
(ī mūḍulōkamulalōnu liṃgamunu arciṃcuṭakanna adhikamaina puṇyamu lēdu. liṃgamunu arciṃcina viśvamaṃtanu arciṃcinaṭlē yagunu. iṃduku saṃdēhamulēdu. māyacēta mōhamu ceṃdinavāru mahēśvaruni (śivuni) teliyalēru. bhūmimīda ē tīrthamulunnavō, puṇyakṣētramulēvi kalavō, avanniyu śivaliṃgamaṃdē yunnavi)
kaṃṭe gariṣṭaṃbugāvuna nadiyu bhuktānnaṃbu jīrṇaṃbunaṃdacēyu
dīpta jaṭharāgnigati liṃga dēhanāsakaṃbu gāviṃcu - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ - 3 - 25 - 877)
“jīvōpādhi bhūtaṃbagu liṃga dēhaṃbucē svāvāsa bhūtalōkaṃbunanuṃḍi lōkāṃtaraṃbu noṃducuṃ prārabdakarma phalaṃbulananubhaviṃcucu maralaṃ karmādulaṃdāsaktuḍagucu - - - jīvuṃḍu bhūtēṃdriya manōmayaṃbaina dēhaṃbu galigiyuṃḍu. aṭṭi dēha nirōdhiṃbe maraṇaṃbu, nāvirbhāvaṃbe janmaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 31 -)
“śivatatvamu sarva kāryācaraṇamulaṃdunu śakti tatvamutō kūḍiyē - kalisiyē yuṃḍunu. ī śakti tatvamu śivuni iccā śakti icchā śaktikini, jñāna śaktikini pratinidhi (pratīkamu). suvarṇamunaṃdali suvarṇatvamuvale śakti śivunitō avināvasaṃbaṃdhamu kaladi. vāriruvuraku paraspara viyōgamu lēdu. śivuni śaktiyē pārvati, śivuni yokka śakti śivuninuṃḍi viḍadīyarānidi - vēru cēyarānidi. śivuḍu. śaktiyu bhāryā bhartalugā koluvabaḍuṭa lōka saṃgrahaṇārthamē.”jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau”. maniṣi yokka śakti maniṣinuṃḍi viḍatīyarānidani ceppinaṭlē - śivuḍu prakṛtitō kalisiyunnāḍu, prakṛtiyē pārvati. prakṛtilōni prati aṇuvulōnu ī reṃḍu tatvamulu - parabrahmatatvamu, prakṛtitatvamu - puruṣuḍu, prakṛti kalisiyē yunnavi. avi okadāninuṃḍi okaṭi viḍadīyarāni sthitilō nunnavi. iṃduvalananē śivunaku sāṃbuḍu (sāṃbaśivuḍu) - sa + aṃba = sāṃba (aṃbatō kūḍiyunnavāḍu) - pārvatitō kalisiyunnavāḍu - śaktitō kūḍi yunnavāḍu - ani ceppabaḍucunnāḍu. śivuni arthanārīśvara rūpamukūḍa ī viṣayamunē sūciṃcucunnadi. lakṣmī nārāyaṇula avinābhāvasaṃbaṃdhamuvalenē ī pārvatī paramēśvarula saṃbaṃdhamu, prakṛti puruṣula saṃbaṃdhamu kūḍa ī ī viṣayamunē sūciṃcucunnadi - (combination of matter and Energy).
anumānapramāṇamulō vastuvunu nirūpiṃcuṭaku kāraṇamainadi - sahāyapaḍunadi - liṃgamu - parvatamumīda agniyuṃḍagā adi, ceṭlu modalagunavi aḍḍugā nuṃḍuṭavalana dūramunuṃḍuṭavalana dūramunuṃḍi kānarāvu, kāni, ā agni yokka poga ākāśamulōniki pōvunapuḍu adi dūramunuṃḍi, ceṭlu modalagu vāṭimīdanuṃḍi kanabaḍunu. ā poganu baṭṭi akkaḍa agni unnadani teliyavaccunu - ā poga agniyunnaṭlu teliyacēyunu - adi liṃgamu - (anumānapramāṇamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.