← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకాలోక పర్వతము lōkālōka parvatamu

Original — తెలుగు
  1. లోకశ్చాసౌ అలోకశ్చ లోకాలోకః - చక్రవాళాచల ఇవ లోకా లోక్యోప్యంతః సూర్య సంపర్కాత్ బదాః తమో వ్యాప్యాచ ప్రకాశశ్చ ఇతి మంతవ్యం.

(లోకము, అలోకము - కనబడునది, కనబడకుండునది - ఉన్నట్లు ఉండనిది - ఉన్నట్లు, ఉండనట్లు తలంపు కలుగచేయునది - చక్రవాళపర్వతము వలె. లోకమునకు అలోకమునకు మధ్యనున్నది - సూర్య సంపర్కమునకు అవతలది - చీకటితో వ్యాపించి బడియున్నది, ప్రకాశముకలది - అను రెండు విధముల అభిప్రాయము కలుగచేయునది.)

  1. “లోకాలోక ఇతి సమాఖ్యాతో యదనే, నా చలేన లోకో(అ)లోకశ్చాంతర్వర్తినా వ్యవస్థాప్యత్యే |”.

(లోకం = లోక్యతే ఆలోక్యతే ఇతి లోకం = చూడబడుచున్నదంతయు లోకము - దృశ్యప్రపంచము - అలోకం = కంటికి కనపడనిది, మనము చూడలేనిది. మనకంటికి కనబడనంతమాత్రమున అవతల ప్రపంచము లేదనుటకు వీలులేదు - ఉన్నది, కాని, బహుదూరమున నుండుటచేత మనకు కనబడనిది. లోకములకు అలోకమునకు సరిహద్దువలె నున్నది లోకాలోక పర్వతము. ఆ పర్వతము అవతల ఏమియున్నదో మనకు తెలియదు కనుక అది అలోకము -)

  1. శుద్దోదాత్ పరస్తాత్ లోకః, సూర్యాద్యాలోకవాన్దేశః అలోకః తద్రహితః, తయోరంతరాళే మధ్యే, తయోర్విభాగార్థే యః కల్పితః సలోకాలోకా చలః.

(శుద్దోదిక సముద్రము వరకునున్నది లోకము, సూర్యుడు ప్రకాశించు దేశము - సూర్య కిరణములు ప్రవేశించు దేశము - లోకము - సూర్యకాంతి చొరని ప్రదేశము అలోకము - ఈ రెండింటికి మధ్యను - వాటిని విభాగించునట్లుగా - వేరు చేయునట్లుగా కల్పించబడినది లోకాలోకపర్వతము - సరిహద్దువంటిది.)

  1. చక్రవాళపర్వతము - ఇది సప్తసముద్రములకావలనున్న పర్వతపంక్తియని పౌరాధికులు చెప్పుదురు -

  2. “పుష్కరద్వీపంబు చతుష్షష్టి లక్షయోజన విస్తారంబైన శుద్ధోదక సముద్ర ముద్రితంబగుచుండు - - - అవ్వల లోకాలోకపర్వతంబుండు - - - లోకాలోకపర్వతం బెనిమిదికోట్ల యోజనంబులు సువర్ణభూమియు, సూర్యాది ధృవాంతంబులగు జ్యోతిర్గణంబుల మధ్యంబున నుండుటం జేసి లోకాలోక పర్వతంబనం దగియుండు - - - వివిధమంత్ర గోపనార్థంబా నగాగ్రంబున నున్న భగవంతుడు దక్క లోకాలోకపర్వతంబునకవ్వల నొరులకు సంచరింప నశక్యంబయి యుండు.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 17 - 71, 73)

  3. “సప్త లోకములైన భూర్లోకాది సత్యలోక పర్యంతమును గల ఏడు ఏడు లోకములన రెండు జతల త్రిలోకములుగా పురాణములలో భావించియున్నారు. భూలోక, భువర్లోక స్వర్గలోకములనునవి మూడును ఒక త్రిలోకి - ఇది స్థూల లోకి యందురు - జనలోక, తపోలోక, సత్యలోకములు మూడును ఒకత్రిలోకి - దీనిని సూక్ష్మ త్రిలోకి యందురు. స్థూల త్రిలోకిని, సూక్ష్మత్రిలోకిని ఒకటితో నొకటి కలిపి ఉంచునది మహర్లోకము - ఈ లోకమును పురాణములలో లోకాలోకమందురు - అనగా, దీనిని లోకము అనవచ్చును, అలోకము అనియు అనవచ్చును - అనగా, సూక్ష్మత్రిలోకి అయిన జన, తపస్సత్య లోకములవలె అంతసూక్ష్మముకాదు, భూలోకము, భువవర్లోకము, స్వర్గలోకము అను స్తూల త్రిలోకివలె అంతస్థూలమును కాదు. - స్థూలము, సూక్ష్మము రెండును కలిసియున్నవి - పగటికిని రాత్రికిని మధ్య సంధ్యాకాలమున్నట్లు - స్థూలత్రిలోకినికి సూక్ష్మత్రిలోకినికి మధ్యను లోకాలఓకమను మహర్లోకమున్నది”.

“క. లోకములు, లోకేశులు

లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్“. (భాగవతం -)

Transliteration
  1. lōkaścāsau alōkaśca lōkālōkaḥ - cakravāḷācala iva lōkā lōkyōpyaṃtaḥ sūrya saṃparkāt badāḥ tamō vyāpyāca prakāśaśca iti maṃtavyaṃ.

(lōkamu, alōkamu - kanabaḍunadi, kanabaḍakuṃḍunadi - unnaṭlu uṃḍanidi - unnaṭlu, uṃḍanaṭlu talaṃpu kalugacēyunadi - cakravāḷaparvatamu vale. lōkamunaku alōkamunaku madhyanunnadi - sūrya saṃparkamunaku avataladi - cīkaṭitō vyāpiṃci baḍiyunnadi, prakāśamukaladi - anu reṃḍu vidhamula abhiprāyamu kalugacēyunadi.)

  1. “lōkālōka iti samākhyātō yadanē, nā calēna lōkō(a)lōkaścāṃtarvartinā vyavasthāpyatyē |”.

(lōkaṃ = lōkyatē ālōkyatē iti lōkaṃ = cūḍabaḍucunnadaṃtayu lōkamu - dṛśyaprapaṃcamu - alōkaṃ = kaṃṭiki kanapaḍanidi, manamu cūḍalēnidi. manakaṃṭiki kanabaḍanaṃtamātramuna avatala prapaṃcamu lēdanuṭaku vīlulēdu - unnadi, kāni, bahudūramuna nuṃḍuṭacēta manaku kanabaḍanidi. lōkamulaku alōkamunaku sarihadduvale nunnadi lōkālōka parvatamu. ā parvatamu avatala ēmiyunnadō manaku teliyadu kanuka adi alōkamu -)

  1. śuddōdāt parastāt lōkaḥ, sūryādyālōkavāndēśaḥ alōkaḥ tadrahitaḥ, tayōraṃtarāḷē madhyē, tayōrvibhāgārthē yaḥ kalpitaḥ salōkālōkā calaḥ.

(śuddōdika samudramu varakununnadi lōkamu, sūryuḍu prakāśiṃcu dēśamu - sūrya kiraṇamulu pravēśiṃcu dēśamu - lōkamu - sūryakāṃti corani pradēśamu alōkamu - ī reṃḍiṃṭiki madhyanu - vāṭini vibhāgiṃcunaṭlugā - vēru cēyunaṭlugā kalpiṃcabaḍinadi lōkālōkaparvatamu - sarihadduvaṃṭidi.)

  1. cakravāḷaparvatamu - idi saptasamudramulakāvalanunna parvatapaṃktiyani paurādhikulu ceppuduru -

  2. “puṣkaradvīpaṃbu catuṣṣaṣṭi lakṣayōjana vistāraṃbaina śuddhōdaka samudra mudritaṃbagucuṃḍu - - - avvala lōkālōkaparvataṃbuṃḍu - - - lōkālōkaparvataṃ benimidikōṭla yōjanaṃbulu suvarṇabhūmiyu, sūryādi dhṛvāṃtaṃbulagu jyōtirgaṇaṃbula madhyaṃbuna nuṃḍuṭaṃ jēsi lōkālōka parvataṃbanaṃ dagiyuṃḍu - - - vividhamaṃtra gōpanārthaṃbā nagāgraṃbuna nunna bhagavaṃtuḍu dakka lōkālōkaparvataṃbunakavvala norulaku saṃcariṃpa naśakyaṃbayi yuṃḍu.” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 17 - 71, 73)

  3. “sapta lōkamulaina bhūrlōkādi satyalōka paryaṃtamunu gala ēḍu ēḍu lōkamulana reṃḍu jatala trilōkamulugā purāṇamulalō bhāviṃciyunnāru. bhūlōka, bhuvarlōka svargalōkamulanunavi mūḍunu oka trilōki - idi sthūla lōki yaṃduru - janalōka, tapōlōka, satyalōkamulu mūḍunu okatrilōki - dīnini sūkṣma trilōki yaṃduru. sthūla trilōkini, sūkṣmatrilōkini okaṭitō nokaṭi kalipi uṃcunadi maharlōkamu - ī lōkamunu purāṇamulalō lōkālōkamaṃduru - anagā, dīnini lōkamu anavaccunu, alōkamu aniyu anavaccunu - anagā, sūkṣmatrilōki ayina jana, tapassatya lōkamulavale aṃtasūkṣmamukādu, bhūlōkamu, bhuvavarlōkamu, svargalōkamu anu stūla trilōkivale aṃtasthūlamunu kādu. - sthūlamu, sūkṣmamu reṃḍunu kalisiyunnavi - pagaṭikini rātrikini madhya saṃdhyākālamunnaṭlu - sthūlatrilōkiniki sūkṣmatrilōkiniki madhyanu lōkālaōkamanu maharlōkamunnadi”.

“ka. lōkamulu, lōkēśulu

lōkasthulu tegina tudi nalōkaṃbagu peṃ

jīkaṭi kavvala nevvaṃ

ḍēkākṛti veluṃgu natani nē sēviṃtun”. (bhāgavataṃ -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.