← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకసాక్షి lōkasākṣi

Original — తెలుగు
  1. లోకానాః జనానాం అంతర్యామితయా సుకృత దుష్కృతి సాక్షీ.

(లోకములోని జనులకు అంతర్యామిగానుండి, వారు చేయు పుణ్యపాపములను కనిపెట్టుచు నుండువాడు - కనుక లోక సాక్షి).

  1. లోక్యతే ఇతి లోకః, దృశ్య ప్రపంచః, తస్య సాక్షీ, సాక్షాత్ ద్రష్టా - లోకానాం పాప పుణ్య కర్మసాక్షీ -

(లోకము - చూడబడుచున్నది - కనబడుచున్న ప్రపంచము - అట్టి ప్రపంచమునకు సాక్షి అయినవాడు - సాక్షాత్ కంటితో స్వయముగా దగ్గరగా నుండుటచేత చూచుచుండుటవలన ద్రష్ట - సాక్షి - అయినవాడు - లోకములయొక్క లోకములలోని జనులయొక్క - పాపపుణ్యకర్మలకు సాక్షి అయినవాడు).

  1. “ఆదిత్య చంద్రావనిలో(అ)నలశ్చద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ |

అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మోహి జానాతి నరస్య వృత్తిం“.

(సూర్యచంద్రులు, వాయువు, అగ్ని, ఆకాశము, భూమి, జలము, హృదయము, యముడు, పగలు, రాత్రి, రెండు సంధ్యలు, ధర్మము - ఇవి నరుని కర్మలను చూచుచుండును - వీటిలో నేదియైనను చూడకుండునట్లు నరుడు కర్మ చేయలేడు - ఏ కర్మకైనా వీరిలో నేదో యొకడు సాక్షిగానుండును - ఇవి యన్నియు భగవంతుని రూపములే యగుటవలన వాటిలో తానే అంతరాత్మరూపముగాను, అంతర్యామి రూపముగాను ఉండుటవలన భగవంతుడు ఈ చెప్పిన వాటిద్వారా నరుని యొక్క ప్రతికర్మ చూచుచునే యుండును - కనుక లోకశాక్షి.)

Transliteration
  1. lōkānāḥ janānāṃ aṃtaryāmitayā sukṛta duṣkṛti sākṣī.

(lōkamulōni janulaku aṃtaryāmigānuṃḍi, vāru cēyu puṇyapāpamulanu kanipeṭṭucu nuṃḍuvāḍu - kanuka lōka sākṣi).

  1. lōkyatē iti lōkaḥ, dṛśya prapaṃcaḥ, tasya sākṣī, sākṣāt draṣṭā - lōkānāṃ pāpa puṇya karmasākṣī -

(lōkamu - cūḍabaḍucunnadi - kanabaḍucunna prapaṃcamu - aṭṭi prapaṃcamunaku sākṣi ayinavāḍu - sākṣāt kaṃṭitō svayamugā daggaragā nuṃḍuṭacēta cūcucuṃḍuṭavalana draṣṭa - sākṣi - ayinavāḍu - lōkamulayokka lōkamulalōni janulayokka - pāpapuṇyakarmalaku sākṣi ayinavāḍu).

  1. “āditya caṃdrāvanilō(a)nalaścadyaurbhūmirāpō hṛdayaṃ yamaśca |

ahaśca rātriśca ubhēca saṃdhyē dharmōhi jānāti narasya vṛttiṃ”.

(sūryacaṃdrulu, vāyuvu, agni, ākāśamu, bhūmi, jalamu, hṛdayamu, yamuḍu, pagalu, rātri, reṃḍu saṃdhyalu, dharmamu - ivi naruni karmalanu cūcucuṃḍunu - vīṭilō nēdiyainanu cūḍakuṃḍunaṭlu naruḍu karma cēyalēḍu - ē karmakainā vīrilō nēdō yokaḍu sākṣigānuṃḍunu - ivi yanniyu bhagavaṃtuni rūpamulē yaguṭavalana vāṭilō tānē aṃtarātmarūpamugānu, aṃtaryāmi rūpamugānu uṃḍuṭavalana bhagavaṃtuḍu ī ceppina vāṭidvārā naruni yokka pratikarma cūcucunē yuṃḍunu - kanuka lōkaśākṣi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.