← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకత్రయం lōkatrayaṃ

Original — తెలుగు
  1. లోకానాం త్రయం (మూడు లోకములు)

  2. ఊర్థ్వ మధ్య అధో భేదేన త్రివిధాః లోకాః -

(లోకములు ఊర్థ్వలోకములు - భూమికి పైనున్న లోకములు, మధ్యలోకము, అధోలోకములు (భూమికి క్రిందనుండు లోకములు) అని మూడు విధములుగ నున్నవి)

  1. స్వర్గ, మర్త్య, పాతాళ లోకములు - మూడులోకములలో చతుర్దశ భువనములు (పదునాలుగు లోకములు) అని చెప్పబడుచున్నవి - ఎట్లనగా : - భూః, భువః, స్వః, మహిః, తపః, సత్యం - ఈ ఆరులోకములు భూమితో కలిపి ఏడులోకములు ఊర్థ్వలోకములు - పాతాళలోకములు ఏడు (అధోలోకములు) - మొత్తము పదునాలుగు లోకములు.

“భూర్భువ స్స్వరాఖ్యం లోకత్రయం” (శ్రీశంకరః)

(భూలోకము, భువర్లోకము, స్వర్లోకము అని లోకములు మూడు).

  1. “లోకత్రయ శబ్దేన అచేతనం, తత్సంసృష్ట శ్చేతనో ముక్తశ్చ ఇతి త్రయముచ్యతే”

(లోకములు మూడు కలిసి లోకత్రయము - అచేతనములు, వాటిలో కలిసియున్న చేతనములు, ముక్తులు - అని లోకములు మూడు).

  1. “సత్య లోకస్య మహః ప్రభృతి లోకానాం తద్వాసినాంచ త్రైలోకస్య కామ్య కర్మ ఫలత్వాత్ ప్రతికల్పం ఉత్పత్తి వినాశౌ భవతః మహః ప్రభృతీనాం తు ఉపాసనా సముదిత నిష్కామ ఫలత్వాత్ ద్విపదార్థ పర్యంతం న నాశాం తత్రస్థానంచ తతః ప్రాయేణ ముక్తిః, కాలభేదేన లోక సృష్టి భేదః”.

(భూః, భువః, స్వః అను మూడులోకములకు ఆ లోకములో నుండువారికి, కామ్యకర్మ ఫలము వలన ప్రతి కల్పమందు జననమరణములు కలుగుచుండును - మహర్లోకము మొదలు మూడు లోకములకు వాటిలోనుండు వారికి, నిష్కామఫలమువలన ద్విపరార్థపర్యంతము వినాశము లేదు -, ఆ తర్వాత ముక్తి కలుగును - కాలభేదమువలన లోకముల సృష్టిలో భేదము కలుగుచున్నది.)

Transliteration
  1. lōkānāṃ trayaṃ (mūḍu lōkamulu)

  2. ūrthva madhya adhō bhēdēna trividhāḥ lōkāḥ -

(lōkamulu ūrthvalōkamulu - bhūmiki painunna lōkamulu, madhyalōkamu, adhōlōkamulu (bhūmiki kriṃdanuṃḍu lōkamulu) ani mūḍu vidhamuluga nunnavi)

  1. svarga, martya, pātāḷa lōkamulu - mūḍulōkamulalō caturdaśa bhuvanamulu (padunālugu lōkamulu) ani ceppabaḍucunnavi - eṭlanagā : - bhūḥ, bhuvaḥ, svaḥ, mahiḥ, tapaḥ, satyaṃ - ī ārulōkamulu bhūmitō kalipi ēḍulōkamulu ūrthvalōkamulu - pātāḷalōkamulu ēḍu (adhōlōkamulu) - mottamu padunālugu lōkamulu.

“bhūrbhuva ssvarākhyaṃ lōkatrayaṃ” (śrīśaṃkaraḥ)

(bhūlōkamu, bhuvarlōkamu, svarlōkamu ani lōkamulu mūḍu).

  1. “lōkatraya śabdēna acētanaṃ, tatsaṃsṛṣṭa ścētanō muktaśca iti trayamucyatē”

(lōkamulu mūḍu kalisi lōkatrayamu - acētanamulu, vāṭilō kalisiyunna cētanamulu, muktulu - ani lōkamulu mūḍu).

  1. “satya lōkasya mahaḥ prabhṛti lōkānāṃ tadvāsināṃca trailōkasya kāmya karma phalatvāt pratikalpaṃ utpatti vināśau bhavataḥ mahaḥ prabhṛtīnāṃ tu upāsanā samudita niṣkāma phalatvāt dvipadārtha paryaṃtaṃ na nāśāṃ tatrasthānaṃca tataḥ prāyēṇa muktiḥ, kālabhēdēna lōka sṛṣṭi bhēdaḥ”.

(bhūḥ, bhuvaḥ, svaḥ anu mūḍulōkamulaku ā lōkamulō nuṃḍuvāriki, kāmyakarma phalamu valana prati kalpamaṃdu jananamaraṇamulu kalugucuṃḍunu - maharlōkamu modalu mūḍu lōkamulaku vāṭilōnuṃḍu vāriki, niṣkāmaphalamuvalana dviparārthaparyaṃtamu vināśamu lēdu -, ā tarvāta mukti kalugunu - kālabhēdamuvalana lōkamula sṛṣṭilō bhēdamu kalugucunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.