← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోహకలిలం mōhakalilaṃ

Original — తెలుగు
  1. అజ్ఞానమను మాలిన్యము, మురికి.

  2. అత్యల్ప ఫల సంఘహేతుభూతం మోహరూపం కలుషం -

(మిక్కిలి తక్కువ ఫలమునకు కారణమగు మోహమను కలుషము).

  1. “అవివేకాత్మకం కాలుష్యం - ‘అహం ఇదం, మమ ఇదం’ - ఇత్యద్యజ్ఞాన విలసితమతి గహనం”. (మధుసూదనీవ్యాఖ్య)

(అవివేకమను కాలుష్యము - ‘ఇది నేను, ఇదినాది’ అను మొదలగు అజ్ఞానమువలన కలుగునది, మిక్కిలి గూఢమైనది. తెలియ శక్యము కానిది).

  1. “మోహః ఇష్టానిష్ట వియోగ సం యోగ జ పరితాప జన్యం. విచిత్ర్యం; తదేవ కలిలమివ కలిలం కాలుష్యం”. (నీలకంఠవ్యాఖ్య)

(మోహమనగా ఇష్టానిష్టములు కలుగుట, కలుగకుండుటవలన కలుగు విచిత్రము, అదియే కలిలమువలె కలుషమైనది).

  1. “మోహాత్మకం, అవివేకరూపం కాలుష్యం, యేన ఆత్మానాత్మ వివేకబోధం కలుషీకృత్య విషయం ప్రీతి అంతఃకరణం ప్రవర్తతే”.

(శ్రీశంకరః)

(మోహత్మకము, అవివేకరూపము, అయిన కాలుష్యము అత్మయేదో అనాత్మయేదో అను వివేకజ్ఞానమును కలుషితముగాచేయు విషయము గుఱించి అంతఃకరణము ప్రవర్తించును).

Transliteration
  1. ajñānamanu mālinyamu, muriki.

  2. atyalpa phala saṃghahētubhūtaṃ mōharūpaṃ kaluṣaṃ -

(mikkili takkuva phalamunaku kāraṇamagu mōhamanu kaluṣamu).

  1. “avivēkātmakaṃ kāluṣyaṃ - ‘ahaṃ idaṃ, mama idaṃ’ - ityadyajñāna vilasitamati gahanaṃ”. (madhusūdanīvyākhya)

(avivēkamanu kāluṣyamu - ‘idi nēnu, idinādi’ anu modalagu ajñānamuvalana kalugunadi, mikkili gūḍhamainadi. teliya śakyamu kānidi).

  1. “mōhaḥ iṣṭāniṣṭa viyōga saṃ yōga ja paritāpa janyaṃ. vicitryaṃ; tadēva kalilamiva kalilaṃ kāluṣyaṃ”. (nīlakaṃṭhavyākhya)

(mōhamanagā iṣṭāniṣṭamulu kaluguṭa, kalugakuṃḍuṭavalana kalugu vicitramu, adiyē kalilamuvale kaluṣamainadi).

  1. “mōhātmakaṃ, avivēkarūpaṃ kāluṣyaṃ, yēna ātmānātma vivēkabōdhaṃ kaluṣīkṛtya viṣayaṃ prīti aṃtaḥkaraṇaṃ pravartatē”.

(śrīśaṃkaraḥ)

(mōhatmakamu, avivēkarūpamu, ayina kāluṣyamu atmayēdō anātmayēdō anu vivēkajñānamunu kaluṣitamugācēyu viṣayamu guṟiṃci aṃtaḥkaraṇamu pravartiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.