(విపరీతజ్ఞానము - విపరీత బుద్ధి).
వివేకా భావః;అవివేకబుద్ధిః. (వివేకము లేకుండుట; అవివేకము).
అజ్ఞానం. (జ్ఞానము లేకుండుట; మూఢత్వము) (వస్తువుయొక్క యాథాత్మ్యమును - నిజస్థితిని - యెఱుంగకుండుట).
అనాత్మని అహంబుధిః - అహంకారః.
(ఆత్మకానిదానియందు “నేను” అను బుద్ధి కలిగియుండుట అహంకారము).
దేహాత్మ భ్రమః. (దేహమే ఆత్మయను భ్రమ).
దేహాద్యాత్మాభిమానరూపం తత్కృతం మమతాద్యాస్పదం మోహం.
(దేహము మొదలగునవియే ఆత్మ అను అభిమానము, దానివలన కలుగు మమత - ఇది నాది యను అభిమానము - మొదలగు మోహము).
అహం, మమ ఇతి ప్రత్యయ జనకః భ్రమః. (నేను, నాది యను అభిమానమువలన కలుగు భ్రమ).
అహం ఏషాం హంతా, మయా ఏతే హన్యతే ఇత్యాది వివిద విపర్యాస లక్షణో మోహః.
(“నేను వీరిని చంపితిని, వీరు నా చేత చంపబడినారు” అను మొదలగు విపర్యాస లక్షణముగల మోహము).
అభినివేశం (అభినివేశము).
సంసారేచ్ఛ. (సంసారమందు ఇచ్ఛ కలిగియుండుట).
స్వస్వరూప విస్మృతిః.
(తనయొక్క నిజరూపమును - తానే పరమాత్మయగుట - మఱచియుండుట).
(పుత్రులు మిత్రులు మొదలగువారి యందాసక్తి కలిగించు అజ్ఞానము).
(అజ్ఞానమువలన కలుగు సమస్త సంసారానర్థములకు కారణము - సముద్రమువలె దాటుటకు కష్టమైనది).
(ఆత్మకాని ప్రకృతియందు ఆత్మయను అభిమానము కలిగియుండుట. చిదచిద్వస్తువులన్నియు భగవంతుని శరీరమే అయినను వాటియందు అతదాత్మాభిమానము కలిగుయుండుట, నిత్యనైమిత్తిక కర్మలు భగవంతుని ఆరాధనయే యగుటవలన భగవంతుని ప్రాప్తికి ఉపాయమైనదానిని బంధముగాను తలచుట).
ద్వైత వృత్తి (భగవంతుడుకాక రెండవ వస్తువు ఉన్నదని వ్యవహరించుట).
హితేషు అహితత్వబుద్ధి, అహితేషు హితత్వ బుద్ధిః.
(ఇష్టమైనవాటియందు ఇష్టముకాని బుద్ధికలిగియుండుట - మంచివారియందు చెడ్డబుద్ధి కలిగియుండుట, చెడ్డవారియందు మంచిబుద్ధి కలిగియుండుట).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. -)
“కర్మానుసారం వల్ల దోచిన సకల ప్రపంచమందున్నూ తాననిన్నీ, తనదనిన్నీ మోహము పుట్టిస్తున్నది కనుక మాయ మోహమనే పేరుగలదాయెను”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము -7)
“జగద్రూపంబై అన్యథా తోచేందులకు కారణంబగుటంజేసి మాయ యనంబడు. తోచిన జగత్తందు శుక్తికారజతాది విపరీత జ్ఞానంబుల బుట్టించుటం జేసి మోహమనంబడును”. (వివేకచింతామణి - పరమానందతీర్థ)
స్వప్రకాశే పరానందే శుద్ధే (అ)సంసారిణో స్వతః. |
శరీర త్రితయా సాత్సంసారే సత్యతామతిః |
అనాత్మని శరీరాదా వాత్మతా ధీర్భ్రమాత్మికా |
సర్వసాధారణో మోహ ఏకో (అ)సాధారణో పరః |
స్వధర్మే ధర్మతాబుద్ధిర్యుద్ధే పార్థస్య యా భవత్ |
దేహిత్రయా ద్వివిచ్యాత్మా తత్వం ప్రత్యంచ మాగతైః |
యో భోధః స్యాత్స ఆద్యస్య మోహస్య వినివర్తకః |
స్వధర్మత్వేన యుద్ధస్య హింసా దీనాం న దోషతా |
ఏవం బోధో ద్వితీయస్య సం మోహస్య నివర్తకః |
హేతునాశేన శోకస్య వినివృత్తిః స్వతో భవేత్ ||“. (గీతాభావప్రకాశము - 1 - 82 to 86)
(మోహద్వయమీ విధముగా నుండును - అందు సర్వసాధారణమైన మోహము మొదటిది. అది యిట్లుండును - ఆత్మ స్వప్రకాశము, పరమానందరూపము, శుద్ధము, అసంసారి, ఏ విధమైన సంసార ధర్మమయినను ఆత్మకు సంబంధించింది లేదు. శరీర త్రితయాధ్యాసమువలన ఆత్మకు సంసారమున సత్యతా మతి కలుగును - స్థూలశరీరము సూక్ష్మశరీరము - ఈ రెండింటికి కారణమైన అవిద్యాత్మకము మూడవ శరీరము - ఈ ఉపాధి త్రయా వివేకమున సంసారము మిథ్యాభూతమయినను సత్యమని, ఆత్మ ధర్మమని మోహము కలుగును - ఇది ప్రాతిభాసికము - అనాత్మయగు శరీరాదులందు ఆత్మతాబుద్ధి భ్రమాత్మకము - ఇది సర్వసాధారణమగు మోహము - ఇది మొదటిది. రెండవ మోహమీ విధముగా నుండును - పార్థునకు స్వధర్మమగు యుద్ధమున అధర్మతా బుద్ధి కలిగినది. ఇది అసాధారణమైన మోహము. సాధారణమగు మోహము నివర్తింపచేయు బోధము - ఉపాధిత్రయ వివేకమున శుద్ధాత్మస్వరూప బోధ కలిగిన నీ మోహము నశించును - శాస్త్రరీతి విథానమున దేహ త్రయమునుండి యాత్మ తత్వమును వేఱుగా వివేచింపగా ప్రథమ మోహము నశించును - రెండవదియైన యసాధారణమోహము ఈ విధముగా నశించదు. యుద్ధము స్వధర్మము; కావున హింసాదులు దోషములు కావు. ఇది బోధద్వితీయ మోహనివర్తకము - ఈ మోహము శోక హేతువు, హేతువు నశింపగా తనంతట నశించును.
(viparītajñānamu - viparīta buddhi).
vivēkā bhāvaḥ;avivēkabuddhiḥ. (vivēkamu lēkuṃḍuṭa; avivēkamu).
ajñānaṃ. (jñānamu lēkuṃḍuṭa; mūḍhatvamu) (vastuvuyokka yāthātmyamunu - nijasthitini - yeṟuṃgakuṃḍuṭa).
anātmani ahaṃbudhiḥ - ahaṃkāraḥ.
(ātmakānidāniyaṃdu “nēnu” anu buddhi kaligiyuṃḍuṭa ahaṃkāramu).
dēhātma bhramaḥ. (dēhamē ātmayanu bhrama).
dēhādyātmābhimānarūpaṃ tatkṛtaṃ mamatādyāspadaṃ mōhaṃ.
(dēhamu modalagunaviyē ātma anu abhimānamu, dānivalana kalugu mamata - idi nādi yanu abhimānamu - modalagu mōhamu).
ahaṃ, mama iti pratyaya janakaḥ bhramaḥ. (nēnu, nādi yanu abhimānamuvalana kalugu bhrama).
ahaṃ ēṣāṃ haṃtā, mayā ētē hanyatē ityādi vivida viparyāsa lakṣaṇō mōhaḥ.
(“nēnu vīrini caṃpitini, vīru nā cēta caṃpabaḍināru” anu modalagu viparyāsa lakṣaṇamugala mōhamu).
abhinivēśaṃ (abhinivēśamu).
saṃsārēccha. (saṃsāramaṃdu iccha kaligiyuṃḍuṭa).
svasvarūpa vismṛtiḥ.
(tanayokka nijarūpamunu - tānē paramātmayaguṭa - maṟaciyuṃḍuṭa).
(putrulu mitrulu modalaguvāri yaṃdāsakti kaligiṃcu ajñānamu).
(ajñānamuvalana kalugu samasta saṃsārānarthamulaku kāraṇamu - samudramuvale dāṭuṭaku kaṣṭamainadi).
(ātmakāni prakṛtiyaṃdu ātmayanu abhimānamu kaligiyuṃḍuṭa. cidacidvastuvulanniyu bhagavaṃtuni śarīramē ayinanu vāṭiyaṃdu atadātmābhimānamu kaliguyuṃḍuṭa, nityanaimittika karmalu bhagavaṃtuni ārādhanayē yaguṭavalana bhagavaṃtuni prāptiki upāyamainadānini baṃdhamugānu talacuṭa).
dvaita vṛtti (bhagavaṃtuḍukāka reṃḍava vastuvu unnadani vyavahariṃcuṭa).
hitēṣu ahitatvabuddhi, ahitēṣu hitatva buddhiḥ.
(iṣṭamainavāṭiyaṃdu iṣṭamukāni buddhikaligiyuṃḍuṭa - maṃcivāriyaṃdu ceḍḍabuddhi kaligiyuṃḍuṭa, ceḍḍavāriyaṃdu maṃcibuddhi kaligiyuṃḍuṭa).
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. -)
“karmānusāraṃ valla dōcina sakala prapaṃcamaṃdunnū tānaninnī, tanadaninnī mōhamu puṭṭistunnadi kanuka māya mōhamanē pērugaladāyenu”. (brahmavidyāsudhārṇavamu -7)
“jagadrūpaṃbai anyathā tōcēṃdulaku kāraṇaṃbaguṭaṃjēsi māya yanaṃbaḍu. tōcina jagattaṃdu śuktikārajatādi viparīta jñānaṃbula buṭṭiṃcuṭaṃ jēsi mōhamanaṃbaḍunu”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
svaprakāśē parānaṃdē śuddhē (a)saṃsāriṇō svataḥ. |
śarīra tritayā sātsaṃsārē satyatāmatiḥ |
anātmani śarīrādā vātmatā dhīrbhramātmikā |
sarvasādhāraṇō mōha ēkō (a)sādhāraṇō paraḥ |
svadharmē dharmatābuddhiryuddhē pārthasya yā bhavat |
dēhitrayā dvivicyātmā tatvaṃ pratyaṃca māgataiḥ |
yō bhōdhaḥ syātsa ādyasya mōhasya vinivartakaḥ |
svadharmatvēna yuddhasya hiṃsā dīnāṃ na dōṣatā |
ēvaṃ bōdhō dvitīyasya saṃ mōhasya nivartakaḥ |
hētunāśēna śōkasya vinivṛttiḥ svatō bhavēt ||“. (gītābhāvaprakāśamu - 1 - 82 to 86)
(mōhadvayamī vidhamugā nuṃḍunu - aṃdu sarvasādhāraṇamaina mōhamu modaṭidi. adi yiṭluṃḍunu - ātma svaprakāśamu, paramānaṃdarūpamu, śuddhamu, asaṃsāri, ē vidhamaina saṃsāra dharmamayinanu ātmaku saṃbaṃdhiṃciṃdi lēdu. śarīra tritayādhyāsamuvalana ātmaku saṃsāramuna satyatā mati kalugunu - sthūlaśarīramu sūkṣmaśarīramu - ī reṃḍiṃṭiki kāraṇamaina avidyātmakamu mūḍava śarīramu - ī upādhi trayā vivēkamuna saṃsāramu mithyābhūtamayinanu satyamani, ātma dharmamani mōhamu kalugunu - idi prātibhāsikamu - anātmayagu śarīrādulaṃdu ātmatābuddhi bhramātmakamu - idi sarvasādhāraṇamagu mōhamu - idi modaṭidi. reṃḍava mōhamī vidhamugā nuṃḍunu - pārthunaku svadharmamagu yuddhamuna adharmatā buddhi kaliginadi. idi asādhāraṇamaina mōhamu. sādhāraṇamagu mōhamu nivartiṃpacēyu bōdhamu - upādhitraya vivēkamuna śuddhātmasvarūpa bōdha kaligina nī mōhamu naśiṃcunu - śāstrarīti vithānamuna dēha trayamunuṃḍi yātma tatvamunu vēṟugā vivēciṃpagā prathama mōhamu naśiṃcunu - reṃḍavadiyaina yasādhāraṇamōhamu ī vidhamugā naśiṃcadu. yuddhamu svadharmamu; kāvuna hiṃsādulu dōṣamulu kāvu. idi bōdhadvitīya mōhanivartakamu - ī mōhamu śōka hētuvu, hētuvu naśiṃpagā tanaṃtaṭa naśiṃcunu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.