← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోక్షప్రదము mōkṣapradamu

Original — తెలుగు
  1. మోక్షము నిచ్చునది.

  2. “మోక్షమిచ్చేత్ జనార్థనాత్”

(జనార్దనునివలన - శ్రీమహావిష్ణునివలన మోక్షము కోరవలెను, లేక మోక్షము కొఱకు జనార్దనుపాసింపవలెను).

  1. శ్రీహరికి ముకుందుడు అను పేరు గలదు - ముకుందుడు అనగా - “ముకుం మోక్షం దదాతీతి ముకుందః” (మోక్షమునిచ్చువాడు కనుక ముకుందుడు) అని పేరు కలిగినది.

  2. “క. వరమిచ్చెదమర్థింపుము

ధరణీశ్వర!, మోక్షపదవి దక్కను, మేమె

వ్వరమును విభులముగామీ

శ్వరుడగు వారి దక్క మోక్ష సంగతిజేయన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 1647)

  1. “హరిభజనంబున మోక్షంబు సిద్ధించు”. (శ్రీమదాంధ్రమహా భాగవతము - 7 - 1 - 213). (చూడుము - మోక్షసాధనములు - 1 - 5)

  2. “మత్స్వరూపమేవ సర్వం, మామేవ ప్రాస్స్యసి, మద్వ్యతిరిక్తం అణుమాత్రం నవిద్యతే ఇతి పరమోపదేశేన స్వాతి రిక్త భ్రమ మోక్షం దదాతి ఇతి మోక్షదః పరమేశ్వరః పరతత్వస్వరూపత్వాత్”.

(ఈ సర్వప్రపంచము నా స్వరూపమే, నన్నే పొందెదవు. నేనుకానిది అణువంతదియు లేదు - పరబ్రహ్మ అయిన నా కంటె వ్యతిరిక్తమైనది కలదు అను మోహము లేకుండునట్లు చేయువాడు అట్టి భ్రమనుండి విముక్తి చేయువాడు కనుక మోక్షప్రదుడు - అనగా, మోక్షము నిచ్చువాడు - పరమేశ్వరుడు - పరతత్వము తనే కనుక).

  1. “బ్రహ్మాద్యాః స్థావరాంతాశ్చ ప శివః పరికీర్తితాః |

- - తేషాం పశూనాం సర్వేషాం మోచకో(అ)హం, సులోచనే |

మామేవ మోచకం ప్రాహ శ్రుతిః సాద్వీ, సనాతనీ |

సర్వేషామాత్మ భూతో(అ)హమేవ సంసార మోచకః |

మామృతే సాంబమీశానం మోచకో న విద్యతే |

అహమ ప్రాప్త సంసారః సర్వజ్ఞశ్య స్వభావతిః |

మదన్యేత్వాత్మ విజ్ఞాన విహీనా మయయా వృతాః |

సదాసంసారిణో మోచ్యాః ప్రకృతిః కేవలం జడం |

తస్మాత్ పశూనాం సర్వేషా మహం సంసారమోచకః |

న మత్తో (అ)న్యః పుమాన్ దక్ష ఇత్యేషా శాశ్వతీ శ్రుతిః ||“. (గర్భోపనిషత్)

(చతుర్ముఖబ్రహ్మ మొదలు స్థావరములవరకు వన్నియు పశువులని చెప్పబడుచున్నవి. ఈ పశువులన్నింటికీ - పశుప్రాయమై వాటన్నింటికీ నేను మోక్షమునిచ్చువాడను. శ్రుతులు కూడా నేనే మోక్షమునిచ్చువాడనని చెప్పినవి. అన్నింటికి ఆత్మ అయిన నేనే వాటిని సంసారమునుండి విడుదల చేయువాడను - మోక్షమిచ్చువాడను - పార్వతీ సహితుడనైన నేను తప్ప మోక్షమునిచ్చువాడు మఱియొకడు లేడు, నాకు సంసారములేదు - స్వభావమువలన నేను సర్వజ్ఞడను - అన్ని విషయములను తెలిసినవాడను - మిగిలినవారందరూ ఆత్మజ్ఞానము - బ్రహ్మజ్ఞానము - లేనివారు, మాయచేత కప్పబడినవారు, మాయ వశములోనుండువారు - ఎప్పుడూ సంసారములోపడి యుండువారు - సంసారములోనుండి మోక్షము కావలసినవారు - ప్రకృతి కేవలము జడవస్తువు - అందుచేత పశువులని చెప్పబడు అందఱికి (పశుప్రాయులందఱికి) నేను సంసారమునుండి మోక్షమునిచ్చువాడను - నేనుకాక ఇతరుడు మోక్షమునిచ్చుటకు శక్తిగలవాడు లేడు - ఇదియే శాశ్వతమైన శ్రుతి వాక్యము - ఎల్లకాలములకు సిద్ధాంతము చేయబడినది).

  1. “అయోధ్యా మధురా మాయా కాశీ కాంచిరవంతికా |

పురీద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికాః ||“.

(అయోధ్య, మధుర, కాశి, కంచి, అవంతి, ద్వారక, మాయా - ఈ ఏడును ముక్తినిచ్చునవి - పుణ్యక్షేత్రములు).

  1. “యత్పాదాంబుజ సంభవా త్రిపథిగా, భాగీరధీ ముక్తిదా - - - ||”. (శ్రీరామకర్ణామృతం -)

(శ్రీహరి పాదములందు పుట్టి మూడులోకముల ప్రవహించు గంగ ముక్తి నిచ్చునది). - చూడుము - ముక్తి సాధనములు - 3(17) etc.,

Transliteration
  1. mōkṣamu niccunadi.

  2. “mōkṣamiccēt janārthanāt”

(janārdanunivalana - śrīmahāviṣṇunivalana mōkṣamu kōravalenu, lēka mōkṣamu koṟaku janārdanupāsiṃpavalenu).

  1. śrīhariki mukuṃduḍu anu pēru galadu - mukuṃduḍu anagā - “mukuṃ mōkṣaṃ dadātīti mukuṃdaḥ” (mōkṣamuniccuvāḍu kanuka mukuṃduḍu) ani pēru kaliginadi.

  2. “ka. varamiccedamarthiṃpumu

dharaṇīśvara!, mōkṣapadavi dakkanu, mēme

vvaramunu vibhulamugāmī

śvaruḍagu vāri dakka mōkṣa saṃgatijēyan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 1647)

  1. “haribhajanaṃbuna mōkṣaṃbu siddhiṃcu”. (śrīmadāṃdhramahā bhāgavatamu - 7 - 1 - 213). (cūḍumu - mōkṣasādhanamulu - 1 - 5)

  2. “matsvarūpamēva sarvaṃ, māmēva prāssyasi, madvyatiriktaṃ aṇumātraṃ navidyatē iti paramōpadēśēna svāti rikta bhrama mōkṣaṃ dadāti iti mōkṣadaḥ paramēśvaraḥ paratatvasvarūpatvāt”.

(ī sarvaprapaṃcamu nā svarūpamē, nannē poṃdedavu. nēnukānidi aṇuvaṃtadiyu lēdu - parabrahma ayina nā kaṃṭe vyatiriktamainadi kaladu anu mōhamu lēkuṃḍunaṭlu cēyuvāḍu aṭṭi bhramanuṃḍi vimukti cēyuvāḍu kanuka mōkṣapraduḍu - anagā, mōkṣamu niccuvāḍu - paramēśvaruḍu - paratatvamu tanē kanuka).

  1. “brahmādyāḥ sthāvarāṃtāśca pa śivaḥ parikīrtitāḥ |

- - tēṣāṃ paśūnāṃ sarvēṣāṃ mōcakō(a)haṃ, sulōcanē |

māmēva mōcakaṃ prāha śrutiḥ sādvī, sanātanī |

sarvēṣāmātma bhūtō(a)hamēva saṃsāra mōcakaḥ |

māmṛtē sāṃbamīśānaṃ mōcakō na vidyatē |

ahama prāpta saṃsāraḥ sarvajñaśya svabhāvatiḥ |

madanyētvātma vijñāna vihīnā mayayā vṛtāḥ |

sadāsaṃsāriṇō mōcyāḥ prakṛtiḥ kēvalaṃ jaḍaṃ |

tasmāt paśūnāṃ sarvēṣā mahaṃ saṃsāramōcakaḥ |

na mattō (a)nyaḥ pumān dakṣa ityēṣā śāśvatī śrutiḥ ||“. (garbhōpaniṣat)

(caturmukhabrahma modalu sthāvaramulavaraku vanniyu paśuvulani ceppabaḍucunnavi. ī paśuvulanniṃṭikī - paśuprāyamai vāṭanniṃṭikī nēnu mōkṣamuniccuvāḍanu. śrutulu kūḍā nēnē mōkṣamuniccuvāḍanani ceppinavi. anniṃṭiki ātma ayina nēnē vāṭini saṃsāramunuṃḍi viḍudala cēyuvāḍanu - mōkṣamiccuvāḍanu - pārvatī sahituḍanaina nēnu tappa mōkṣamuniccuvāḍu maṟiyokaḍu lēḍu, nāku saṃsāramulēdu - svabhāvamuvalana nēnu sarvajñaḍanu - anni viṣayamulanu telisinavāḍanu - migilinavāraṃdarū ātmajñānamu - brahmajñānamu - lēnivāru, māyacēta kappabaḍinavāru, māya vaśamulōnuṃḍuvāru - eppuḍū saṃsāramulōpaḍi yuṃḍuvāru - saṃsāramulōnuṃḍi mōkṣamu kāvalasinavāru - prakṛti kēvalamu jaḍavastuvu - aṃducēta paśuvulani ceppabaḍu aṃdaṟiki (paśuprāyulaṃdaṟiki) nēnu saṃsāramunuṃḍi mōkṣamuniccuvāḍanu - nēnukāka itaruḍu mōkṣamuniccuṭaku śaktigalavāḍu lēḍu - idiyē śāśvatamaina śruti vākyamu - ellakālamulaku siddhāṃtamu cēyabaḍinadi).

  1. “ayōdhyā madhurā māyā kāśī kāṃciravaṃtikā |

purīdvāravati caiva saptaitē mōkṣadāyikāḥ ||“.

(ayōdhya, madhura, kāśi, kaṃci, avaṃti, dvāraka, māyā - ī ēḍunu muktiniccunavi - puṇyakṣētramulu).

  1. “yatpādāṃbuja saṃbhavā tripathigā, bhāgīradhī muktidā - - - ||”. (śrīrāmakarṇāmṛtaṃ -)

(śrīhari pādamulaṃdu puṭṭi mūḍulōkamula pravahiṃcu gaṃga mukti niccunadi). - cūḍumu - mukti sādhanamulu - 3(17) etc.,

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.