← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మోక్షప్రాప్తి mōkṣaprāpti

Original — తెలుగు
  1. "యధా నద్యః స్యంద మానాః సముద్రే అస్తం గచ్ఛంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపా ద్విముక్తః పరాత్పరం పురుష ముపైతి దివ్యమితి".

"యథా నద్యో గంగాద్యాః నామరూపే విహాయ సముద్రాత్మనా తిష్టంతి తథా బ్రహ్మాత్మవిదపి సంసారం విహాయ పరాత్ కారణాత్ అవ్యక్తాత్ పరం పూర్ణం స్వయం జ్యోతిరానందం ప్రత్యక్త్వేన ప్రాప్య తిష్టతి. ఇత్యర్థః".

(గంగ, యమున మొదలగు నదులు వాటివాటి నదుల రూపమును, పేర్లను విడిచిపెట్టి సముద్రములో కలిసి అంతా సముద్రమను పేరుతో ఉండిపోవునట్లే బ్రహ్మజ్ఞానము గలవాడు సంసారమును విడిచిపెట్టి పరాత్పరుడు (పరమనగా ఉత్కృష్టమైనది - అన్నింటికి కారణమైనది యగు అవ్యక్తము - ప్రకృతి -, దానికంటె ఉత్కృష్టమైనవాడు భగవంతుడు), స్వయంప్రకాశుడు, దివ్యపురుషుడగు భగవంతుని పొందును అని చెప్పబడియుండుటవలన ఆ పరబ్రహ్మ ప్రాప్తించుటకు పండితులైనవారు - జ్ఞానులు - ప్రయత్నము చేయవలయును).

  1. "క. నను వైరంబుననైనను

మనమున దలచుటను, నా సమక్షమున మదా

ననమీక్షించుచు నీల్గుట

ననఘాత్మకులై వసింతు రస్మత్పదవిన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 16 - 586)

  1. "క. అవిగాన, దనుజయోనిం

బదపడి జనియించి మద్విపక్షులరై మీ

మదినెపుడు నన్నె తలచుచు

వదలక నా చేత జచ్చి వచ్చెదరిటకున్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 16 - 593)

  1. "క. కోరినవారలకెల్లను

జేరువ కైవల్యపదము శ్రీవరుని మదిం

గోరనివారలకెల్లను

దూరము మోక్షప్రాప్తి యెన్ని త్రోవలనైనన్". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 2 - 159)

  1. "ఆ. బాంధవముననైన బగనైన వగనైన

ప్రీతినైన ప్రాణభీతినైన

భక్తినైన హరికి బరతంత్రుడైయుండు

జనులు మోక్షమునకు జనుదు రధిప". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - పూ.భా. - 975)

  1. “వ. జనుండు బాల్య కైశోర కౌమార వయో విశేషంబుల వెనుకనైననుం, బెద్దయైన వెనుకనైనను, నన్నెఱింగెనేని కృతకృత్యుండగు. సంపద్గర్వాంధుడైన నందకార రూపంబునంబడు వానిని దరిద్రునింగా జేసిన జ్ఞానియై యస్మత్పాదారవింద వందనాభిలాషియై ముక్తుండగు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 -
Transliteration
  1. "yadhā nadyaḥ syaṃda mānāḥ samudrē astaṃ gacchaṃti nāmarūpē vihāya tathā vidvān nāmarūpā dvimuktaḥ parātparaṃ puruṣa mupaiti divyamiti".

"yathā nadyō gaṃgādyāḥ nāmarūpē vihāya samudrātmanā tiṣṭaṃti tathā brahmātmavidapi saṃsāraṃ vihāya parāt kāraṇāt avyaktāt paraṃ pūrṇaṃ svayaṃ jyōtirānaṃdaṃ pratyaktvēna prāpya tiṣṭati. ityarthaḥ".

(gaṃga, yamuna modalagu nadulu vāṭivāṭi nadula rūpamunu, pērlanu viḍicipeṭṭi samudramulō kalisi aṃtā samudramanu pērutō uṃḍipōvunaṭlē brahmajñānamu galavāḍu saṃsāramunu viḍicipeṭṭi parātparuḍu (paramanagā utkṛṣṭamainadi - anniṃṭiki kāraṇamainadi yagu avyaktamu - prakṛti -, dānikaṃṭe utkṛṣṭamainavāḍu bhagavaṃtuḍu), svayaṃprakāśuḍu, divyapuruṣuḍagu bhagavaṃtuni poṃdunu ani ceppabaḍiyuṃḍuṭavalana ā parabrahma prāptiṃcuṭaku paṃḍitulainavāru - jñānulu - prayatnamu cēyavalayunu).

  1. "ka. nanu vairaṃbunanainanu

manamuna dalacuṭanu, nā samakṣamuna madā

nanamīkṣiṃcucu nīlguṭa

nanaghātmakulai vasiṃtu rasmatpadavin". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 16 - 586)

  1. "ka. avigāna, danujayōniṃ

badapaḍi janiyiṃci madvipakṣularai mī

madinepuḍu nanne talacucu

vadalaka nā cēta jacci vaccedariṭakun". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 16 - 593)

  1. "ka. kōrinavāralakellanu

jēruva kaivalyapadamu śrīvaruni madiṃ

gōranivāralakellanu

dūramu mōkṣaprāpti yenni trōvalanainan". (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 2 - 159)

  1. "ā. bāṃdhavamunanaina baganaina vaganaina

prītinaina prāṇabhītinaina

bhaktinaina hariki barataṃtruḍaiyuṃḍu

janulu mōkṣamunaku janudu radhipa". (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - pū.bhā. - 975)

  1. “va. januṃḍu bālya kaiśōra kaumāra vayō viśēṣaṃbula venukanainanuṃ, beddayaina venukanainanu, nanneṟiṃgenēni kṛtakṛtyuṃḍagu. saṃpadgarvāṃdhuḍaina naṃdakāra rūpaṃbunaṃbaḍu vānini daridruniṃgā jēsina jñāniyai yasmatpādāraviṃda vaṃdanābhilāṣiyai muktuṃḍagu". (śrīmadāṃdhramahābhāgavatamu - 11 -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.