మరణం; శరీరాది విచ్ఛేదః. (చనిపోవుట; శరీరము మొదలగునవి భేదించి పోవుట).
"సర్వ ప్రాణ హరః మృత్యుః" (శ్రీమాన్ రామానుజః)
(ప్రాణములన్నింటిని హరించునది మృత్యువు).
(అవయవములన్నియు - ఇంద్రియములన్నియు పనిచేయకుండుట).
(నాభియందు - బొడ్డుయందు - ప్రాణవాయువు, అపానవాయువు యొక్క విశ్లేషము మృత్యువు - ప్రాణవాయువు శరీరములో మీదనుండి నాభివరకు పనిచేయును - అపానవాయువు నాభినుండి క్రిందవరకు పనిచేయును - అట్లుగాక ప్రాణవాయువు పనిచేసి అపానవాయువు పనిచేయకపోయినయడల శరీరములో ఆటంకము కలిగి మృత్యువు కలుగును).
స్వరూపనాశనము.
అవిద్య - "మృత్యుర్వై తమః" ఇతి శ్రుతిః. శ్
(అవిద్య, తమస్సే మృత్యువు అని శ్రుతి చెప్పుచున్నది).
"దేహంబుననుండి దేహాంతరంబు జేరం గోరి పూర్వ కాయంబు విడుచుటకు సాధనంబగు నాభిద్వారంబు సంభవించె. అట్టి నాభియ ప్రాణాపాన బంధస్థానంబనంబడు తద్బంధ విశ్లేషంబై మృత్యువగు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 270)
స్వాతిరిక్తాస్తితా మోహం.
(తనుకానిది - తన స్వస్వరూపముకానిది - రెండవ వస్తువు ద్వైతము - ఉన్నదని యనుకొను మోహము).
(మృత్యువు అపానరూపముగా మారి నాభిని పొందెను)
(అన్నింటిని నశింపచేయు మృత్యువును నేనే).
(భగవంతుడు సౄష్టిస్థితిలయములు చేయువాడుకనుక లోకములను నశింపచేయువాడతనే - అందుచేతనే "హరి" - సమ్హారము చేయువాడు శ్రీమహావిష్ణువు - హరః అనినను ఇదే అర్థము - శివుడు - శ్రీమహావిష్ణువుయొక్క శక్తియే మృత్యురూపము - "కాలోస్మి లోక క్షయ కృత్" -
దెల్లంబు మృత్యువు - - - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. -29)
(పుట్టినవానికి చావు నిశ్చయము - (Man is mortal), చనిపోయినవానికి మరల జన్మ తప్పదు -(Death is the gateway to birth). ప్రాణులకు ఇప్పుడేకాని, కొన్ని సంవత్సరముల తర్వాతకాని మృత్యువు తప్పదు - (చూడుము - శ్రీమద్భగవద్గీత - 2 - 27).
(పుట్టునది గిట్టకమానదు - రాత్రిం బగలు వలె జనమరణములు ఒక దాని వెనుకనొకటి వచ్చుచునేయుండును).
ఈశ్వరేచ దరిద్రేచ మృత్యుః సర్వత్ర తుల్యతా ||" (భోజరాజు చరిత్ర)
(పండితులందూ, మూర్ఖులందూ, బలవంతులందు, దుర్బలులందు, ధనవంతులందు, నిర్ధనులందు - అందఱి విషయములోను మృత్యువు సమానముగనే వర్తించును - "Death the leveller" (James Shirley) - "The paths of glory lead but to the grave"). (Thomas Gray)
మానుము; సంభవమగు మానవ కోట్లకు జావె నిత్యమౌ - - - . (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 25)
"వ. మృణ్మయంబైన ఘటంబున జలంబులు జాలుగొను తెఱంగున దిన దినంబునకు నాయువు క్షయంబై మృత్యువు సన్నిహితంబై వచ్చు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)
"క. - - - కాలము డాసిన నేలను
కూలకపోవంగవశమె ఎట్టి గుణవంతులకున్"
అకాలే దుర్లభో మృత్యుః స్త్రియాయావా పురుషస్యచ ||".
(స్త్రీకిగాని, పురుషునకుగాని కాలము రానిదే మృత్యువు కలుగదు - ఇది లోకప్రఖ్యాతి - పండితులు చెప్పినది సత్యము -)
"పోకన్మానదు ప్రాణమెంత తనువున్ పోషించి రక్షించినన్"
"మృత్యుః ద్వివిధః - ధనహరిః, ప్రాణహరిశ్చ తత్రయః ప్రానహరః సర్వహరః స ఉచ్యతే” (శ్రీశంకరః)
(మృత్యువు రెండు విధములు - ధనమును హరించునది - ప్రాణము పోయినట్లే అనిపించునది; రెండవది ప్రాణమునపహరించునది - దానితో ఆశరీరమునకు అన్ని సంబంధములు హరించినట్లే.)
maraṇaṃ; śarīrādi vicchēdaḥ. (canipōvuṭa; śarīramu modalagunavi bhēdiṃci pōvuṭa).
"sarva prāṇa haraḥ mṛtyuḥ" (śrīmān rāmānujaḥ)
(prāṇamulanniṃṭini hariṃcunadi mṛtyuvu).
(avayavamulanniyu - iṃdriyamulanniyu panicēyakuṃḍuṭa).
(nābhiyaṃdu - boḍḍuyaṃdu - prāṇavāyuvu, apānavāyuvu yokka viślēṣamu mṛtyuvu - prāṇavāyuvu śarīramulō mīdanuṃḍi nābhivaraku panicēyunu - apānavāyuvu nābhinuṃḍi kriṃdavaraku panicēyunu - aṭlugāka prāṇavāyuvu panicēsi apānavāyuvu panicēyakapōyinayaḍala śarīramulō āṭaṃkamu kaligi mṛtyuvu kalugunu).
svarūpanāśanamu.
avidya - "mṛtyurvai tamaḥ" iti śrutiḥ. ś
(avidya, tamassē mṛtyuvu ani śruti ceppucunnadi).
"dēhaṃbunanuṃḍi dēhāṃtaraṃbu jēraṃ gōri pūrva kāyaṃbu viḍucuṭaku sādhanaṃbagu nābhidvāraṃbu saṃbhaviṃce. aṭṭi nābhiya prāṇāpāna baṃdhasthānaṃbanaṃbaḍu tadbaṃdha viślēṣaṃbai mṛtyuvagu". (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 270)
svātiriktāstitā mōhaṃ.
(tanukānidi - tana svasvarūpamukānidi - reṃḍava vastuvu dvaitamu - unnadani yanukonu mōhamu).
(mṛtyuvu apānarūpamugā māri nābhini poṃdenu)
(anniṃṭini naśiṃpacēyu mṛtyuvunu nēnē).
(bhagavaṃtuḍu sṝṣṭisthitilayamulu cēyuvāḍukanuka lōkamulanu naśiṃpacēyuvāḍatanē - aṃducētanē "hari" - samhāramu cēyuvāḍu śrīmahāviṣṇuvu - haraḥ aninanu idē arthamu - śivuḍu - śrīmahāviṣṇuvuyokka śaktiyē mṛtyurūpamu - "kālōsmi lōka kṣaya kṛt" -
dellaṃbu mṛtyuvu - - - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. -29)
(puṭṭinavāniki cāvu niścayamu - (Man is mortal), canipōyinavāniki marala janma tappadu -(Death is the gateway to birth). prāṇulaku ippuḍēkāni, konni saṃvatsaramula tarvātakāni mṛtyuvu tappadu - (cūḍumu - śrīmadbhagavadgīta - 2 - 27).
(puṭṭunadi giṭṭakamānadu - rātriṃ bagalu vale janamaraṇamulu oka dāni venukanokaṭi vaccucunēyuṃḍunu).
īśvarēca daridrēca mṛtyuḥ sarvatra tulyatā ||" (bhōjarāju caritra)
(paṃḍitulaṃdū, mūrkhulaṃdū, balavaṃtulaṃdu, durbalulaṃdu, dhanavaṃtulaṃdu, nirdhanulaṃdu - aṃdaṟi viṣayamulōnu mṛtyuvu samānamuganē vartiṃcunu - "Death the leveller" (James Shirley) - "The paths of glory lead but to the grave"). (Thomas Gray)
mānumu; saṃbhavamagu mānava kōṭlaku jāve nityamau - - - . (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 25)
"va. mṛṇmayaṃbaina ghaṭaṃbuna jalaṃbulu jālugonu teṟaṃguna dina dinaṃbunaku nāyuvu kṣayaṃbai mṛtyuvu sannihitaṃbai vaccu". (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)
"ka. - - - kālamu ḍāsina nēlanu
kūlakapōvaṃgavaśame eṭṭi guṇavaṃtulakun"
akālē durlabhō mṛtyuḥ striyāyāvā puruṣasyaca ||".
(strīkigāni, puruṣunakugāni kālamu rānidē mṛtyuvu kalugadu - idi lōkaprakhyāti - paṃḍitulu ceppinadi satyamu -)
"pōkanmānadu prāṇameṃta tanuvun pōṣiṃci rakṣiṃcinan"
"mṛtyuḥ dvividhaḥ - dhanahariḥ, prāṇahariśca tatrayaḥ prānaharaḥ sarvaharaḥ sa ucyatē” (śrīśaṃkaraḥ)
(mṛtyuvu reṃḍu vidhamulu - dhanamunu hariṃcunadi - prāṇamu pōyinaṭlē anipiṃcunadi; reṃḍavadi prāṇamunapahariṃcunadi - dānitō āśarīramunaku anni saṃbaṃdhamulu hariṃcinaṭlē.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.