← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మూఢః mūḍhaḥ

Original — తెలుగు
  1. మందమతిః; జ్ఞానహీనః; వివేక శూన్యః; మందః, అవివేకీ.

(జ్ఞానము లేనివాడు, మంచి, చెడు, ఆత్మ, అనాత్మ అను వివేకము లేనివాడు; మందుడు; (మందముగ పనిచేయువాడు) (చురుకుతనము లేనివాడు); స్తబ్దుడు; మందబుద్ధి గలవాడు, తెలివి లేనివాడు; అజ్ఞాని).

  1. కర్తవ్యాకర్తవ్య విచార శూన్యః.

(ఇది చేయవలసినది, ఇది చేయకూడనిది అను ఆలోచన లేనివాడు).

  1. కర్తవ్య నిశ్చయ విధురాః - (చేయవలసిన పనిని నిర్ణయించుకోలేనివాడు).

  2. మూర్ఖుడు.

  3. మోహః ప్రాప్తాః - (మోహము చెందినవాడు).

  4. విషయాశా వశీకృత మనోర్తథాః -

(విషయములందుగల ఆశచేత పరవశమైన మనోరధము - కోరిక - గలవారు) (తామసులు).

  1. తమనా ఆచ్ఛన్నాః. (తామసగుణముచేత ఆవరించబడినవారు - తామసులు).

  2. మూఢః, పర ప్రత్యయనేయ బుద్ధిః - (ఇతరులు చెప్పిన మాటలందు నమ్మకము గలవారు - స్వయముగా ఆలోచనచేసి, వివేకమునుపయోగించుకొని నిర్ణయించు జ్ఞానము లేనివాడు; మూఢుడు).

  3. మిథ్యాజ్ఞానీ (మిథ్యాజ్ఞానము కలవాడు).

  4. విపరీత జ్ఞానాః (విపరీత జ్ఞానము కలవారు).

    1. బ్రహ్మజ్ఞానము లేనివాడు, బాలుడు.
  5. “కర్తృత్వాద్యహంకార భావనా రూఢో మూఢః” (నిరాలంబనోపనిషత్)

(దేహమునందును, వర్ణాశ్రమములందును, కర్తృత్వ భోక్తృత్వములందును అహంకారము గలవాడు - ఈ దేహము నేనే, కర్తను నేనే, భోక్తను నేనే అను అహంకారము గలవాడు).

  1. “మత్స్వరూపా పరిజ్ఞానా న్మూఢాస్యుర్భోగ లంపటాః | తతః పాప సమాచారే ప్రవృత్తాః. (గీతాభావప్రకాశము - 7 - 92. 93)

(భగవత్తత్వజ్ఞానము లేకపోవుటవలన మూఢులు - భోగములందు నిత్యము మునిగియుండువారు, అందువలన పాపకర్మలను చేయువారు).

  1. “వ. అత్మవైన నిన్ను దేహాదికంబని తలంచియు, దేహాదికంబు నినుగా దలంచియు నాత్మ వెలినుండునంచు మూఢులు మూఢత్వంబున వెదుకుచుందురు - వారి మూఢత్వంబు జెప్పనేల ?”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ, భా. 569)

  2. “ఆ. ఆత్మవలన కలిగి యమరు దేహాదుల

నాత్మకంటె వేఱులవి యటంచు

దలచువాడు మూఢతముడు గావున, నీశి

విశ్వమెల్ల నీవ, వేఱులేదు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 121)

Transliteration
  1. maṃdamatiḥ; jñānahīnaḥ; vivēka śūnyaḥ; maṃdaḥ, avivēkī.

(jñānamu lēnivāḍu, maṃci, ceḍu, ātma, anātma anu vivēkamu lēnivāḍu; maṃduḍu; (maṃdamuga panicēyuvāḍu) (curukutanamu lēnivāḍu); stabduḍu; maṃdabuddhi galavāḍu, telivi lēnivāḍu; ajñāni).

  1. kartavyākartavya vicāra śūnyaḥ.

(idi cēyavalasinadi, idi cēyakūḍanidi anu ālōcana lēnivāḍu).

  1. kartavya niścaya vidhurāḥ - (cēyavalasina panini nirṇayiṃcukōlēnivāḍu).

  2. mūrkhuḍu.

  3. mōhaḥ prāptāḥ - (mōhamu ceṃdinavāḍu).

  4. viṣayāśā vaśīkṛta manōrtathāḥ -

(viṣayamulaṃdugala āśacēta paravaśamaina manōradhamu - kōrika - galavāru) (tāmasulu).

  1. tamanā ācchannāḥ. (tāmasaguṇamucēta āvariṃcabaḍinavāru - tāmasulu).

  2. mūḍhaḥ, para pratyayanēya buddhiḥ - (itarulu ceppina māṭalaṃdu nammakamu galavāru - svayamugā ālōcanacēsi, vivēkamunupayōgiṃcukoni nirṇayiṃcu jñānamu lēnivāḍu; mūḍhuḍu).

  3. mithyājñānī (mithyājñānamu kalavāḍu).

  4. viparīta jñānāḥ (viparīta jñānamu kalavāru).

    1. brahmajñānamu lēnivāḍu, bāluḍu.
  5. “kartṛtvādyahaṃkāra bhāvanā rūḍhō mūḍhaḥ” (nirālaṃbanōpaniṣat)

(dēhamunaṃdunu, varṇāśramamulaṃdunu, kartṛtva bhōktṛtvamulaṃdunu ahaṃkāramu galavāḍu - ī dēhamu nēnē, kartanu nēnē, bhōktanu nēnē anu ahaṃkāramu galavāḍu).

  1. “matsvarūpā parijñānā nmūḍhāsyurbhōga laṃpaṭāḥ | tataḥ pāpa samācārē pravṛttāḥ. (gītābhāvaprakāśamu - 7 - 92. 93)

(bhagavattatvajñānamu lēkapōvuṭavalana mūḍhulu - bhōgamulaṃdu nityamu munigiyuṃḍuvāru, aṃduvalana pāpakarmalanu cēyuvāru).

  1. “va. atmavaina ninnu dēhādikaṃbani talaṃciyu, dēhādikaṃbu ninugā dalaṃciyu nātma velinuṃḍunaṃcu mūḍhulu mūḍhatvaṃbuna vedukucuṃduru - vāri mūḍhatvaṃbu jeppanēla ?”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū, bhā. 569)

  2. “ā. ātmavalana kaligi yamaru dēhādula

nātmakaṃṭe vēṟulavi yaṭaṃcu

dalacuvāḍu mūḍhatamuḍu gāvuna, nīśi

viśvamella nīva, vēṟulēdu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 121)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.