(బ్రహ్మ యొక్క కల్యాణగుణములలో లోకమునకు విలక్షణమైన సృష్టి స్థితి లయములు చేయుట ప్రసిద్ధి చెందిన లక్షణములు కనుక అవి ముఖ్యార్థములని చెప్పబడినవి. వేలకి వేలు - వేనవేలు - శిరస్సులు, కండ్లు, పాదములు గల పురుషుడు (బ్రహ్మ) అని శ్రుతి చెప్పుచున్నది - (“నమోస్తు అనంతాయ సహస్ర మూర్తయే, సహస్ర పాదాక్షి శిరోరు బాహవే”) అనగా, సృష్టిలోని శరీరముగల జీవులన్నియు భగవంతుని రూపములేకనుక, వాటి శిరస్సులు, కండ్లు, పాదములు మొదలగు అవయవములన్నియు భగవంతునివే అని చెప్పబడినది -సృష్టిలోని వస్తువులన్నియు కలిసిన ప్రపంచము అంతా కలిసి భగవంతుడే అని చెప్పుట దీని ముఖ్యార్థము).
“స్థూలాది తనుత్రయ సమట్టిరూపంబులగు విరాట్ హిరణ్యగర్భ ఈశ్వరాలును, బ్రహ్మంబునం గూడి తప్తాయః పిండంబునుంబోలె నేకాకారంబై కాంచుటయే తత్పదంబునకు వాచ్యార్థంబనియు, ముఖ్యార్థంబనియును, అభిధార్థంబనియును చెప్పంబడును”. (వివేకచింతామణి -పరమానందతీర్థ)
“సర్వ ప్రపంచమున్నూ వేద్యంగాబట్టి ఘటం వలెనే విషయం, వాటిని యెఱింగేదే ఆత్మ. సాధారణ ద్రష్టగాను త్వం పదానకు ముఖ్యర్థమైన జీవుండు, ఆజీవత్వము నెఱుంగు చుండేది స్వాశ్రియాధిష్టాన చైతన్యమనెడిదే ‘త్వం’ పదం యొక్క లక్ష్యార్థము అయిన కూటస్థ చైతన్యము - సర్వద్రష్ట అనంగాను తత్పదానకు ముఖ్యార్థమైన ఈశ్వరుడు. ఆ ఈశ్వరత్వము నెఱింగి యుండేటటువంటి సర్వాధిష్ఠాన చైతన్యమనెడిదే తత్పదం యొక్క లక్ష్యార్థమైన బ్రహ్మము”. (బ్రహ్మవిద్యా సుధార్ణవము)
(brahma yokka kalyāṇaguṇamulalō lōkamunaku vilakṣaṇamaina sṛṣṭi sthiti layamulu cēyuṭa prasiddhi ceṃdina lakṣaṇamulu kanuka avi mukhyārthamulani ceppabaḍinavi. vēlaki vēlu - vēnavēlu - śirassulu, kaṃḍlu, pādamulu gala puruṣuḍu (brahma) ani śruti ceppucunnadi - (“namōstu anaṃtāya sahasra mūrtayē, sahasra pādākṣi śirōru bāhavē”) anagā, sṛṣṭilōni śarīramugala jīvulanniyu bhagavaṃtuni rūpamulēkanuka, vāṭi śirassulu, kaṃḍlu, pādamulu modalagu avayavamulanniyu bhagavaṃtunivē ani ceppabaḍinadi -sṛṣṭilōni vastuvulanniyu kalisina prapaṃcamu aṃtā kalisi bhagavaṃtuḍē ani ceppuṭa dīni mukhyārthamu).
“sthūlādi tanutraya samaṭṭirūpaṃbulagu virāṭ hiraṇyagarbha īśvarālunu, brahmaṃbunaṃ gūḍi taptāyaḥ piṃḍaṃbunuṃbōle nēkākāraṃbai kāṃcuṭayē tatpadaṃbunaku vācyārthaṃbaniyu, mukhyārthaṃbaniyunu, abhidhārthaṃbaniyunu ceppaṃbaḍunu”. (vivēkaciṃtāmaṇi -paramānaṃdatīrtha)
“sarva prapaṃcamunnū vēdyaṃgābaṭṭi ghaṭaṃ valenē viṣayaṃ, vāṭini yeṟiṃgēdē ātma. sādhāraṇa draṣṭagānu tvaṃ padānaku mukhyarthamaina jīvuṃḍu, ājīvatvamu neṟuṃgu cuṃḍēdi svāśriyādhiṣṭāna caitanyamaneḍidē ‘tvaṃ’ padaṃ yokka lakṣyārthamu ayina kūṭastha caitanyamu - sarvadraṣṭa anaṃgānu tatpadānaku mukhyārthamaina īśvaruḍu. ā īśvaratvamu neṟiṃgi yuṃḍēṭaṭuvaṃṭi sarvādhiṣṭhāna caitanyamaneḍidē tatpadaṃ yokka lakṣyārthamaina brahmamu”. (brahmavidyā sudhārṇavamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.