← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మూల భూతము mūla bhūtamu

Original — తెలుగు

“వ. --- శతహాయనంబులు ధారాధారంబులు మహా ఘోషంబుతోడం గరి కరోపమానంబులయిన నీరధారల నిఖిల జగంబును శంబరమయంబు (జలమయంబు) సేసిన బ్రహ్మాండంబెల్ల జలమయంబగుటంజేసి భూమి హృత గంధగుణంబులు కబంధంబున (జలములో) లీనంబగు; నన్నీరంబు జీర్ణరస గుణంబై తేజంబున నడంగు, నా తేజంబు వాయువందు నష్టరూపంబై కలయు, నా పవనుండు గతస్పర్శగుణుండై నభంబున సంక్రమించు, నాయాకాశంబు విగత శబ్దంబై భూతాదిం బ్రవేశించు, దైజసంబైన మహద్రూపంబ నహంకారంబును సత్వాది గుణంబులు గ్రసియించు, నవికాలచోదితంబైన ప్రకృతియందడంగు, నా ప్రకృతి యనాదియు, నిత్యంబు నవ్యక్తంబు, నవాఙ్మానస గోచరంబునై, సత్వరజస్తమోగుణ రహితంబయి, మహదాది సన్నివేశంబులేక, స్వప్నాద్యవస్థా రహితంబయి, పృధివ్యాధి హీనంబై యప్రతర్క్యంబగుదానిని మూలభూతంబని చెప్పుచుందురు -” (శ్రీమదాంధ్రమహభాగవతము - 12 - 24)

Transliteration

“va. --- śatahāyanaṃbulu dhārādhāraṃbulu mahā ghōṣaṃbutōḍaṃ gari karōpamānaṃbulayina nīradhārala nikhila jagaṃbunu śaṃbaramayaṃbu (jalamayaṃbu) sēsina brahmāṃḍaṃbella jalamayaṃbaguṭaṃjēsi bhūmi hṛta gaṃdhaguṇaṃbulu kabaṃdhaṃbuna (jalamulō) līnaṃbagu; nannīraṃbu jīrṇarasa guṇaṃbai tējaṃbuna naḍaṃgu, nā tējaṃbu vāyuvaṃdu naṣṭarūpaṃbai kalayu, nā pavanuṃḍu gatasparśaguṇuṃḍai nabhaṃbuna saṃkramiṃcu, nāyākāśaṃbu vigata śabdaṃbai bhūtādiṃ bravēśiṃcu, daijasaṃbaina mahadrūpaṃba nahaṃkāraṃbunu satvādi guṇaṃbulu grasiyiṃcu, navikālacōditaṃbaina prakṛtiyaṃdaḍaṃgu, nā prakṛti yanādiyu, nityaṃbu navyaktaṃbu, navāṅmānasa gōcaraṃbunai, satvarajastamōguṇa rahitaṃbayi, mahadādi sannivēśaṃbulēka, svapnādyavasthā rahitaṃbayi, pṛdhivyādhi hīnaṃbai yapratarkyaṃbagudānini mūlabhūtaṃbani ceppucuṃduru -” (śrīmadāṃdhramahabhāgavatamu - 12 - 24)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.