← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మూలకారణము mūlakāraṇamu

Original — తెలుగు
  1. “క. మది దలపోయగ జల బు

ద్బుదములు ధర బుట్టి పొలియు పోలికగల యీ

త్రిదశాది దేహములలో

వదలక వర్తించు నాత్మ వర్గము నోలిన్“.

ఆ. ప్రళయవేల నీవు భరియింతు వంతకు

గారణంబవగుట, గమలనాభ

- - - ||. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ. భా. 1224, 1225)

  1. భగవంతునిలోనుండి ప్రకృతి పుట్టినది - భగవంతుడు కారణము, ప్రకృతి కార్యము. ప్రకృతిలోనుండి మమహత్తత్త్వము పుట్టినది. ప్రకృతి కారణము, మహత్తత్వము కార్యము - మహత్తత్వములోనుండి అహంకారము పుట్టినది. మహత్తత్వము కారణము, అహంకారము కార్యము - అహంకారములోనుండి పంచతన్మాత్రలు పుట్టినవి - అహంకారము కారణము, తన్మాత్రలు కార్యము - తన్మాత్రలవలన స్థూలభూతములు కలిగినవి. తన్మాత్రలు కారణము, స్థూలభూతములు కార్యము. స్థూల పంచభూతముల సమ్మేళనమువలన సృష్టిలోని సమస్త వస్తువులు కలిగినవి. పంచభూతములలోను ఆకాశమునుండి వాయువు కలిగినది - అకాశము కారణము, వాయువు కార్యము - వాయువునుండి అగ్ని పుట్టినది - వాయువు కారణము, అగ్ని కార్యము. అగ్నినుండి జలము పుట్టినది - అగ్ని కారణము, జలము కార్యము. జలమునుండి పృధ్వి (భూమి) పుట్టినది - జలము కారణము, పృధ్వి కార్యము. ఈ పంచభూతముల సమ్మేళనమువలన సమస్త వస్తువులు కలిగినవి. పంచభూతములు కారణము - సమస్త వస్తువులు కార్యములు - ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుచున్నది. ఇట్లు పుట్టిన ప్రతి వస్తువునకు కారణవస్తువున్నది. అన్ని కారణ వస్తువులు వాటివాటి ముందు వస్తువునకు కార్యములు. అన్ని కారణవస్తువులకు, కార్యవస్తువులకు మొదటి కారణమైనది భగవంతుడే - అందుచేత భగవంతుడే అన్ని వస్తువులకు మూలకారణము - మొదటికారణము, కారణములకు కారణము - కారణకారణము).
Transliteration
  1. “ka. madi dalapōyaga jala bu

dbudamulu dhara buṭṭi poliyu pōlikagala yī

tridaśādi dēhamulalō

vadalaka vartiṃcu nātma vargamu nōlin”.

ā. praḷayavēla nīvu bhariyiṃtu vaṃtaku

gāraṇaṃbavaguṭa, gamalanābha

- - - ||. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u. bhā. 1224, 1225)

  1. bhagavaṃtunilōnuṃḍi prakṛti puṭṭinadi - bhagavaṃtuḍu kāraṇamu, prakṛti kāryamu. prakṛtilōnuṃḍi mamahattattvamu puṭṭinadi. prakṛti kāraṇamu, mahattatvamu kāryamu - mahattatvamulōnuṃḍi ahaṃkāramu puṭṭinadi. mahattatvamu kāraṇamu, ahaṃkāramu kāryamu - ahaṃkāramulōnuṃḍi paṃcatanmātralu puṭṭinavi - ahaṃkāramu kāraṇamu, tanmātralu kāryamu - tanmātralavalana sthūlabhūtamulu kaliginavi. tanmātralu kāraṇamu, sthūlabhūtamulu kāryamu. sthūla paṃcabhūtamula sammēḷanamuvalana sṛṣṭilōni samasta vastuvulu kaliginavi. paṃcabhūtamulalōnu ākāśamunuṃḍi vāyuvu kaliginadi - akāśamu kāraṇamu, vāyuvu kāryamu - vāyuvunuṃḍi agni puṭṭinadi - vāyuvu kāraṇamu, agni kāryamu. agninuṃḍi jalamu puṭṭinadi - agni kāraṇamu, jalamu kāryamu. jalamunuṃḍi pṛdhvi (bhūmi) puṭṭinadi - jalamu kāraṇamu, pṛdhvi kāryamu. ī paṃcabhūtamula sammēḷanamuvalana samasta vastuvulu kaliginavi. paṃcabhūtamulu kāraṇamu - samasta vastuvulu kāryamulu - oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭucunnadi. iṭlu puṭṭina prati vastuvunaku kāraṇavastuvunnadi. anni kāraṇa vastuvulu vāṭivāṭi muṃdu vastuvunaku kāryamulu. anni kāraṇavastuvulaku, kāryavastuvulaku modaṭi kāraṇamainadi bhagavaṃtuḍē - aṃducēta bhagavaṃtuḍē anni vastuvulaku mūlakāraṇamu - modaṭikāraṇamu, kāraṇamulaku kāraṇamu - kāraṇakāraṇamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.