(జగత్తునకు మూలమగుటవలన - పగత్తు పుట్టుటకు కారణమగుటవలన, జగత్తుకంటె ముందునుండి యుండుటవలన ప్రకృతి - ప్రకృతి = ప్రథమం కృతం - సృష్టిక్రమములో మొట్టమొదట సృష్టించబడినది. సత్వరజస్తమోగుణములుగల ప్రథానము అనాదియగుటవలన, ఎప్పటినుండి యున్నదో తెలియని దగుటవలన, ఏలాగున కలిగినదో పుట్టినదో తెలియనందువలన అవికృతి - అనగా, ఏ కారణవస్తువునకు కార్యవస్తువుకానిది - ఇంకొక వస్తువులోనుండి పుట్టినదికాదు).
(సమస్త భూతములకు కారణమైనది - పుట్టుచోటు అయినది) తనకు కారణవస్తువులేనిది (దేనిలోనుండియు పుట్టనది, దేనికిని కార్యవస్తువుకానిది), సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు లక్షణములుగా కలది, అష్టరూపములు గలది - ఎనిమిది రూపములతో తోచునది. –
“భూమిరాపో(అ)నలో వాయుః ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టథా ||”. (శ్రీమద్భగవద్గీత - 7 - 4) (పంచభూతములు అయిన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమున్నూ, మనస్సు, అహంకారము, బుద్ధియున్నూ, కలిసి ఎనిమిది రూపములుగా నా ప్రకృతియే ఎనిమిది విధములుగా తోచుచున్నది. అదియే మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతియే సమస్త జగత్తునకు - సృష్టికి - కారణమైన అవ్యక్తమని చెప్పబడుచున్నది. ముందు పుట్టబోవు సమస్త వస్తువులు వ్యక్తముగాక సూక్ష్మరూపములో ఇందులో నుండుటవలన ఇది అవ్యక్తమని చెప్పబడినది. సముద్రము ఉదకములకు అధిష్టానమైనట్లు అనేక క్షేత్రజ్ఞరూపములకు ఒకే అధిష్ఠానమైనది).
జగముల పుట్టింప బెంప సమయింపంగా
దగు మూల ప్రకృతియనే
నగుదు జుమీ, సత్యముగ మహాగుణశాలీ“. (శ్రీసీతారామాంజనేయ సంవాదము 1 -79)
(శ్రీ ఆంజనేయునకు శ్రీ సీతమ్మ తల్లి ఆధ్యాత్మిక తత్వము -శ్రీరామ తత్వము బోధపఱచునపుడు చెప్పిన వాక్యము - శ్రీరామచంద్రుడు పరబ్రహ్మమని అతని శక్తియే అయిన శ్రీ సీతామహాదేవి యే మూల ప్రకృతియని, ఆ పరబ్రహ్మ అతని శక్తి కలియుటవలననే ప్రపంచము కలుగుచున్నదని - “సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి” - పురుష ప్రకృతి సం యోగమువలన సృష్టి జరుగుచున్నదని - (creation is the result of the combination of Matter and Energy) చెప్పబడినది).
(మూలము అనగా కారణము - సృష్టికి కారణము - అయిన ప్రథానమునకు కూడ ముందునుండి యుండి దానికి కారణమైనది మూల ప్రకృతి).
(ఎండమావులు జలమువలె కనుపించినట్లు, ముచ్చెపు చిప్పలు వెండివలె కనబడినట్లు, చెట్టుమోడు చీకటిలో పురుషునివలె కనబడినట్లు పరబ్రహ్మముందు, సత్వరజస్తమములను త్రిగుణములు సమాన స్థితిలో నుండునవి, ఉన్నదనిగాని, లేనిదనిగాని చెప్పుటకు వీలులేనిదై - అనిర్వాచ్యమై - యుండు మూల ప్రకృతి తోచెను“.
“విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతమనెడి ఈశ్వరమాయోపాధి శరీరాలకు సాక్షి స్వరూపమైనదే మూల ప్రకృతి. అదే స్వరాట్, అదే అనాహతనాదం, అదే పంచబ్రహ్మము, అదే పంచభూతాలకున్నూ హేతువు” (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)
ప్రథమ సృష్టిరూపమైన ఇచ్ఛా శక్తియే మూల ప్రకృతిగా నున్నది. ముందు కలుగబోయెడి ప్రపంచమంతటికిని మూలము - (ముందు వ్యక్తమగు చెట్టునకు దంపవలె) కనుక మూల ప్రకృతి యని చెప్పబడినది.
“మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్పురుషః పరః”. పరమేశ్వరాధీన త్వియమ స్నాభిః ప్రాగవస్థో జగతో అభ్యుపగమ్యతే, న స్వతంత్రా, - - - నహి తయా వినా ప్రమేశరస్య స్రష్టృత్వం సిద్ధ్యతి - శక్తి రహితస్య తస్య ప్రవృత్త్యనుపపత్తేః, ముక్తానాం పునరుత్పత్తిః కుతః? - విద్యయా తస్యా బీజశక్తే ర్దాహాత్ | అవిద్యాత్మికాహిసా బీజశక్తి రవ్యక్త శబ్ద నిర్దేశ్యా పరమేశ్వరాశ్రయా మాయా మయీ, మహా సుషుప్తిః యస్యాం స్వరూప ప్రతిబాధ రహితాశ్శీరతే సంసారిణో జీవాః ||“. (శ్రీశంకరః - బ్రహ్మసూత్ర భాష్యే - 1 - 4 - 3)
(మహత్తత్వముకంటె అవ్యక్తమనునది - వ్యక్తముగాకుండనుండు ప్రకృతి ఉత్కృష్టమైనది. ఈ ఆవ్యక్తముకంటె ఉత్కృష్టమైనవాడు పురుషుడు - అని శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినది. ఇక్కడ చెప్పబడిన అవ్యక్తము - లేక మూల ప్రకృతి - మా అభిప్రాయములో పరమాత్మయొక్క ఆధీనములో నుండునది - ఇప్పటి ఈ జగత్తు యొక్క మొదటి అవస్థ - జగత్తుగా మారకముందు అది యుండు స్థితి. ఇది స్వతంత్రమైనదికాదు. ఇది లేనిదే పరమాత్మ సృష్టిచేయుట సిద్ధించదు. శక్తిలేని పరమాత్మ సృష్టి చేయలేడు - ముక్తులయినవారికి జన్మ బీజము వారి బ్రహ్మజ్ఞానమువలన దహింపబడుటచేత వారు తిరిగి జన్మించుట యెట్లు ” ఆ బీజశక్తి అవిద్య (అజ్ఞానము) అవ్యక్తమను పేరుగలది, పరమేశ్వరు నాశ్రయించియున్నది, మాయామయము - మహా సుషుప్త్యవస్థ).
(మూల ప్రకృతి వికృతికాదు - వికారము కాదు - మహత్తత్త్వము, అహంకారము, పంచతన్మాత్రలు - ఈ యేడును ప్రకృతి యొక్క వికృతులు - పృధివి మొదలగు పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు అను పదహారును ప్రకృతియొక్క వికారములు - 25వ తత్వమైన జీవుడు ప్రకృతియుకాదు, వికృతియుకాదు - వికారములేనిది మూల ప్రకృతి).
(jagattunaku mūlamaguṭavalana - pagattu puṭṭuṭaku kāraṇamaguṭavalana, jagattukaṃṭe muṃdunuṃḍi yuṃḍuṭavalana prakṛti - prakṛti = prathamaṃ kṛtaṃ - sṛṣṭikramamulō moṭṭamodaṭa sṛṣṭiṃcabaḍinadi. satvarajastamōguṇamulugala prathānamu anādiyaguṭavalana, eppaṭinuṃḍi yunnadō teliyani daguṭavalana, ēlāguna kaliginadō puṭṭinadō teliyanaṃduvalana avikṛti - anagā, ē kāraṇavastuvunaku kāryavastuvukānidi - iṃkoka vastuvulōnuṃḍi puṭṭinadikādu).
(samasta bhūtamulaku kāraṇamainadi - puṭṭucōṭu ayinadi) tanaku kāraṇavastuvulēnidi (dēnilōnuṃḍiyu puṭṭanadi, dēnikini kāryavastuvukānidi), satvamu, rajassu, tamassu anu mūḍu guṇamulu lakṣaṇamulugā kaladi, aṣṭarūpamulu galadi - enimidi rūpamulatō tōcunadi. –
“bhūmirāpō(a)nalō vāyuḥ khaṃ manō buddhirēvaca ahaṃkāra itīyaṃ mē bhinnā prakṛtiraṣṭathā ||”. (śrīmadbhagavadgīta - 7 - 4) (paṃcabhūtamulu ayina bhūmi, jalamu, agni, vāyuvu, ākāśamunnū, manassu, ahaṃkāramu, buddhiyunnū, kalisi enimidi rūpamulugā nā prakṛtiyē enimidi vidhamulugā tōcucunnadi. adiyē mūla prakṛti. ī mūla prakṛtiyē samasta jagattunaku - sṛṣṭiki - kāraṇamaina avyaktamani ceppabaḍucunnadi. muṃdu puṭṭabōvu samasta vastuvulu vyaktamugāka sūkṣmarūpamulō iṃdulō nuṃḍuṭavalana idi avyaktamani ceppabaḍinadi. samudramu udakamulaku adhiṣṭānamainaṭlu anēka kṣētrajñarūpamulaku okē adhiṣṭhānamainadi).
jagamula puṭṭiṃpa beṃpa samayiṃpaṃgā
dagu mūla prakṛtiyanē
nagudu jumī, satyamuga mahāguṇaśālī”. (śrīsītārāmāṃjanēya saṃvādamu 1 -79)
(śrī āṃjanēyunaku śrī sītamma talli ādhyātmika tatvamu -śrīrāma tatvamu bōdhapaṟacunapuḍu ceppina vākyamu - śrīrāmacaṃdruḍu parabrahmamani atani śaktiyē ayina śrī sītāmahādēvi yē mūla prakṛtiyani, ā parabrahma atani śakti kaliyuṭavalananē prapaṃcamu kalugucunnadani - “sītamma mā amma, śrīrāmuḍu māku taṃḍri” - puruṣa prakṛti saṃ yōgamuvalana sṛṣṭi jarugucunnadani - (creation is the result of the combination of Matter and Energy) ceppabaḍinadi).
(mūlamu anagā kāraṇamu - sṛṣṭiki kāraṇamu - ayina prathānamunaku kūḍa muṃdunuṃḍi yuṃḍi dāniki kāraṇamainadi mūla prakṛti).
(eṃḍamāvulu jalamuvale kanupiṃcinaṭlu, muccepu cippalu veṃḍivale kanabaḍinaṭlu, ceṭṭumōḍu cīkaṭilō puruṣunivale kanabaḍinaṭlu parabrahmamuṃdu, satvarajastamamulanu triguṇamulu samāna sthitilō nuṃḍunavi, unnadanigāni, lēnidanigāni ceppuṭaku vīlulēnidai - anirvācyamai - yuṃḍu mūla prakṛti tōcenu”.
“virāṭ hiraṇyagarbha avyākṛtamaneḍi īśvaramāyōpādhi śarīrālaku sākṣi svarūpamainadē mūla prakṛti. adē svarāṭ, adē anāhatanādaṃ, adē paṃcabrahmamu, adē paṃcabhūtālakunnū hētuvu” (brahmavidyāsudhārṇavamu - 6)
prathama sṛṣṭirūpamaina icchā śaktiyē mūla prakṛtigā nunnadi. muṃdu kalugabōyeḍi prapaṃcamaṃtaṭikini mūlamu - (muṃdu vyaktamagu ceṭṭunaku daṃpavale) kanuka mūla prakṛti yani ceppabaḍinadi.
“mahataḥ paramavyaktaṃ avyaktātpuruṣaḥ paraḥ”. paramēśvarādhīna tviyama snābhiḥ prāgavasthō jagatō abhyupagamyatē, na svataṃtrā, - - - nahi tayā vinā pramēśarasya sraṣṭṛtvaṃ siddhyati - śakti rahitasya tasya pravṛttyanupapattēḥ, muktānāṃ punarutpattiḥ kutaḥ? - vidyayā tasyā bījaśaktē rdāhāt | avidyātmikāhisā bījaśakti ravyakta śabda nirdēśyā paramēśvarāśrayā māyā mayī, mahā suṣuptiḥ yasyāṃ svarūpa pratibādha rahitāśśīratē saṃsāriṇō jīvāḥ ||“. (śrīśaṃkaraḥ - brahmasūtra bhāṣyē - 1 - 4 - 3)
(mahattatvamukaṃṭe avyaktamanunadi - vyaktamugākuṃḍanuṃḍu prakṛti utkṛṣṭamainadi. ī āvyaktamukaṃṭe utkṛṣṭamainavāḍu puruṣuḍu - ani śrīmadbhagavadgītalō ceppabaḍinadi. ikkaḍa ceppabaḍina avyaktamu - lēka mūla prakṛti - mā abhiprāyamulō paramātmayokka ādhīnamulō nuṃḍunadi - ippaṭi ī jagattu yokka modaṭi avastha - jagattugā mārakamuṃdu adi yuṃḍu sthiti. idi svataṃtramainadikādu. idi lēnidē paramātma sṛṣṭicēyuṭa siddhiṃcadu. śaktilēni paramātma sṛṣṭi cēyalēḍu - muktulayinavāriki janma bījamu vāri brahmajñānamuvalana dahiṃpabaḍuṭacēta vāru tirigi janmiṃcuṭa yeṭlu ” ā bījaśakti avidya (ajñānamu) avyaktamanu pērugaladi, paramēśvaru nāśrayiṃciyunnadi, māyāmayamu - mahā suṣuptyavastha).
(mūla prakṛti vikṛtikādu - vikāramu kādu - mahattattvamu, ahaṃkāramu, paṃcatanmātralu - ī yēḍunu prakṛti yokka vikṛtulu - pṛdhivi modalagu paṃcabhūtamulu, jñānēṃdriyamulu, karmēṃdriyamulu, manassu anu padahārunu prakṛtiyokka vikāramulu - 25va tatvamaina jīvuḍu prakṛtiyukādu, vikṛtiyukādu - vikāramulēnidi mūla prakṛti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.