(మననము చేయువాడు; మననము చేయు ఋషి - ఓంకారమునెఱిగి దానిని మననము చేయువాడు - మంత్రమును మననము చేయువాడు ముని).
(ఆత్మను, లేక, బ్రహ్మను మననము చేయు స్వభావము గలవాడు; కామక్రోధములు లేనివాడు).
(మౌనవ్రతము నాచరించువాడు - మాటలాడకుండ నుండువాడు - మౌనముగా జ్ఞానమును సమకూర్చు ధ్యానము చేయువాడు).
(ఆత్మతత్వమును మననము చేయువాడు, బ్రహ్మజ్ఞానము కలవాడు).
(మననము చేయుటచేత వస్తువుల యాధాత్మ్యమును - నిజస్థితిని - తెలుసుకొనినవాడు).
ఆత్మారామః (ఆత్మయందు రమించువాడు - ఎల్లపుడు ఆత్మయందే ధ్యానము చేయువాడు).
సర్వపదార్థజ్ఞః - (అన్నింటి గుఱించి తెలిసినవాడు - సర్వజ్ఞుడు).
నిధి ధ్యాసనకృత్. (నిధి ధ్యాసనము చేయువాడు).
“సాధనవశంబుగాని యాత్మారామత్వ ంబువలన ముని యయ్యును”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా.)
“నివృత్త సర్వ తత్వజ్ఞః; కామ క్రోధ వివర్జితః |
ధ్యానస్థో నిష్క్రియో దాంతః తుల్యమృత్కాంచనో మునిః ||”
ఇత్యుక్త లక్షణః కశిద్యోణీశ్వరః.
(నివృత్తిమార్గ లక్షణమును (తత్వమును) తెలిసినవాడు, కామము, క్రోధము లేనివాడు, ధ్యానము చేయువాడు, క్రియలు చేయనివాడు, దాంతుడు, మట్టిని బంగారమును ఒకే రీతిగ చూచువాడు, ఈ లక్షణములుగల యోగీశ్వరుడు - ముని).
మునీనాం సర్వ వేదార్థాభిజ్ఞానాం బాదరాయణః (గీతాభావప్రకాశము - 10 - 15)
(సమస్తమైన ఉపనిషత్తుల అంతరార్థమును బాగుగా తెలిసిన మునులలో వ్యాసమునిని నేను - వ్యాస ముని భగవంతుని అవతారములలో నొకటియని భాగవతములోనే చెప్పబడినది).
(mananamu cēyuvāḍu; mananamu cēyu ṛṣi - ōṃkāramuneṟigi dānini mananamu cēyuvāḍu - maṃtramunu mananamu cēyuvāḍu muni).
(ātmanu, lēka, brahmanu mananamu cēyu svabhāvamu galavāḍu; kāmakrōdhamulu lēnivāḍu).
(maunavratamu nācariṃcuvāḍu - māṭalāḍakuṃḍa nuṃḍuvāḍu - maunamugā jñānamunu samakūrcu dhyānamu cēyuvāḍu).
(ātmatatvamunu mananamu cēyuvāḍu, brahmajñānamu kalavāḍu).
(mananamu cēyuṭacēta vastuvula yādhātmyamunu - nijasthitini - telusukoninavāḍu).
ātmārāmaḥ (ātmayaṃdu ramiṃcuvāḍu - ellapuḍu ātmayaṃdē dhyānamu cēyuvāḍu).
sarvapadārthajñaḥ - (anniṃṭi guṟiṃci telisinavāḍu - sarvajñuḍu).
nidhi dhyāsanakṛt. (nidhi dhyāsanamu cēyuvāḍu).
“sādhanavaśaṃbugāni yātmārāmatva ṃbuvalana muni yayyunu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā.)
“nivṛtta sarva tatvajñaḥ; kāma krōdha vivarjitaḥ |
dhyānasthō niṣkriyō dāṃtaḥ tulyamṛtkāṃcanō muniḥ ||”
ityukta lakṣaṇaḥ kaśidyōṇīśvaraḥ.
(nivṛttimārga lakṣaṇamunu (tatvamunu) telisinavāḍu, kāmamu, krōdhamu lēnivāḍu, dhyānamu cēyuvāḍu, kriyalu cēyanivāḍu, dāṃtuḍu, maṭṭini baṃgāramunu okē rītiga cūcuvāḍu, ī lakṣaṇamulugala yōgīśvaruḍu - muni).
munīnāṃ sarva vēdārthābhijñānāṃ bādarāyaṇaḥ (gītābhāvaprakāśamu - 10 - 15)
(samastamaina upaniṣattula aṃtarārthamunu bāgugā telisina munulalō vyāsamunini nēnu - vyāsa muni bhagavaṃtuni avatāramulalō nokaṭiyani bhāgavatamulōnē ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.