← Back to మ · Booklets 41–50 (digitized file 5)

మూర్తము mūrtamu

Original — తెలుగు
  1. ఆకారము కలది; కఠినమైనది; దృగ్గోచరమైనదీ కంటికి కనబడునది; స్పష్టమైన రూపము గలది.

  2. పృధివ్యప్తేజో భూతత్రయం మూర్తం - (అగ్ని, జలము, పృధివి భూతములు)

  3. కేచిత్తు శ్రుతిముపలక్షణం కృత్వా పంచీకృతాని భూతాని మూర్తాని.

(పంచీకృతమైన పంచభూతములు అని కొందఱి అభిప్రాయము - (శ్రుతిని బట్టి),

(పంచ భూతములలోను కంటికి కనబడునవి అయిన పృధివి, జలము, అగ్ని రూపము గలవి - మిగిలిన రెండును - వాయువు, ఆకాశము రూపము లేనివి - కాని కొందరి అభిప్రాయములో పంచభూతములు పంచీకరణము చేయబడినవి - అనగా, ఒకదానితో ఒకటి కలుపబడినవి - అందుచేత అగ్ని = అగ్ని 1/2 + వాయువు 1/8 + ఆకాశము 1/8 + జలము 1/8 + పృధివి 1/8. ఆ ప్రకారముగానే ఒక్కొక్క భూతములో దాని వంతు సగము. మిగిలిన నాలుగు భూతములు కలిసి సగము - ఈ ప్రకారముగా పంచీకరణము చేయగా అన్ని అయిదు భూతములు స్థూల భూతములు అయినవి, అందుచేత అయిదు స్థూలభూతములు మూర్తములే అని కొందఱి అభిప్రాయము).

  1. “ఘనరూపం ధారణ సమర్థం చరాచర లక్షణం - శరీరధారణ సమర్థం ఇత్యర్థః”. (శ్రీశంకరః)

(కఠినమైన, స్థూలమైన - (సూక్ష్మముకాని) రూపమును ధరించు సామర్థ్యము గలది - చరాచర లక్షణము కలది).

  1. “బ్రహ్మణః రూపం కఠినం పరమాత్మనః రూపం వాయ్వంతరిక్ష వ్యతిరిక్తం, పృథివ్యప్తేజో లక్షణం యదస్తి తత్తత్ కఠినత్వేన మూర్తం. తథా మూర్తత్వేన ఉక్తం ఏతదేవ రూపం వినశ్వరత్వావ్యాపకత్వ చాక్షుష ప్రత్యక్షోపలభ్యత్వ రూప ధర్మయుక్తతయా మర్త్యస్థిత సచ్చబ్ద వాచ్యం ఇత్యర్థః ||”.

(బ్రహ్మయొక్క రూపము కఠినమైన రూపము - స్థూలరూపము - ఆకాశము, వాయువు సూక్ష్మమైనవి, వీటికంటె వ్యతిరిక్తమైనది, భూమి, జలము, అగ్ని కంటికి కనబడునవి; ఇవి స్థూలములు - అందుచేత మూర్తములు నశించుట, వ్యాపించకుండుట కంటికి కనబడుటచేత మూర్తము అని చెప్పబడుచున్నవి).

“వాయోశ్చ అంతరిక్షాచ్చ భూతద్వయాత్ అన్యత్ - పరిశేషాత్ పృధివ్యాది భూత త్రయం ఏతన్మర్త్యం. మరణధర్మ భూత త్రయస్య రసః సారః సవితా.

(ఆకాశము వాయువు అను రెండు భూతములకంటె వేరైనవి, అనగా, మిగిలిన భూమి మొదలగు మూడు భూతములు. ఇవి మరణ ధర్మములు కలవి (నశించునవి). భూమి, జలము, అగ్ని అను మూడు భూతముల రసము - సారము - సూర్యుడు - సవితా = చైతన్య శక్తినిచ్చునది).

  1. “ఆశ్రయశ్చేతసో బ్రహ్మ ద్విధా తచ్చ స్వరూపతా |

యామూర్తమ మూర్తంచ పరంచాపరమేవ చ ||“.

(మనస్సునకు ఆశ్రయమైన బ్రహ్మ రెండు విధములుగా నున్నది - మూర్త్తము, అమూర్తము - (రూపము కలది, రూపము లేనిది; పరము, అపరము - రూపము కలది, రూపము లేనిది; సాకారము, నిరాకారము; పరము, అపరము. ఉత్కృష్టమైనది - పరబ్రహ్మ నిర్గుణ నిరాకార బ్రహ్మ; రెండవది అపరబ్రహ్మ సగుణబ్రహ్మ, సాకార బ్రహ్మ - మూర్తి కలది, మూర్తి లేనిది).

(ప్రపంచములోని వస్తువులన్నియు భగవంతునిలోనుండి పుట్టినవే కనుక అవి అన్నియు అతని రూపములే, అతని మూర్తములే (మూర్తులే). భగవంతుడు అగోచరుడు కనుక నిరాకార రూపమును ధ్యానించుట కష్టము కనుక, అతను ప్రపంచములో ధరించిన రూపములన్నియు ధ్యేయవస్తువులే - వాటిలో దేనిని ధ్యానించినను అతనిని (అతని నిరాకార, నిర్గుణ పరబ్రహ్మ రూపమును ధ్యానించినట్లే. అట్టి స్థితిలో మొదట సృష్టిస్థితి సంహా రములు చేయుటకొఱకు అతను ధరించిన బ్రహ్మ. విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులను ధ్యానించిన ఉత్కృష్టము - నిర్గుణ నిరాకార బ్రహ్మ కారణబ్రహ్మమని, సగుణ సాకార బ్రహ్మ (త్రిమూర్తులు) మొదలగువారు కార్యబ్రహ్మ యని చెప్పబడుచున్నారు).

  1. “మమయోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం |

సంభవః సర్వభూతానాం తతో భవతి భారత |

సర్వయోనిషు కౌంతెయ మూర్తయః సంభవంతి యాః |

తాసాం బ్రహ్మ మహద్యోని హం బీజప్రదః పితా ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 3, 4)

(మహద్బ్రహ్మ అనగా చతుర్ముఖబ్రహ్మ, లేక ప్రకృతి. ఈ ప్రకృతి నా యోని (ప్రకృతిని నేను యోనిగా - గర్భము ధరించు దానినిగా) ఉపయోగించుకొనుచున్నాను. ఆ ప్రకృతి, లేక, మహత్తత్వమునుండి సమస్త భూతములు పుట్టుచున్నవి. ఇట్లే సృష్టిలో వస్తువులన్నియు యేదో యొక యోనినుండి - మరియొక వస్తువునుండి - పుట్టుచున్నవి - కారణవస్తువునుండి పుట్టుచున్నవి. అట్లు కారణవస్తువునుండి పుట్టిన - ఏ యోనినుండి పుట్టినవి అయినను - అవి కార్యవస్తువులు - అవన్నియు మూర్తములు - ఆకారముగలవి. వీటి అన్నింటికి మహత్ బ్రహ్మ - చతుర్ముఖబ్రహ్మ, లేక ప్రకృతి - మహద్యోని - మూలమైన యోని - అన్నింటిని కన్నతల్లి వంటిది. మూలమైన తల్లి, వాటి అన్నింటికి నేను బీజమునిచ్చిన తండ్రిని. అందుచేత ప్రపంచములోనున్న రూపములన్నింటికి - మూర్తములన్నింటికి - నేను బీజము నిచ్చుటవలన తండ్రిని, నా బీజమును ధరించి, ఆరూపములను పుట్టించుటవలన - కనుటవలన, ప్రకృతి తల్లి). (జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ).

  1. “నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి |

ప్రద్యుమ్నా నిరుద్ద్ధాయ నమః సంకర్షణాయచ |

ఇతిమూర్త్యాభిధానేన మంత్రమూర్తిమ మూర్తికం |

యజతే యజ్ఞపురుషం స సమ్యగ్దర్శనం ప్రమాన్ ||“. (శ్రీమద్భాగవతం -1 - 5 - 37,38)

“ప్రణవ పూర్వకంబులుగ వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణానిరుద్ధ మూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి నమస్కారంబు సేసి, మంత్రమూర్తియు, మూర్తిశూన్యుండు నయిన యజ్ఞపురుషుం పూజించు పురుషుండు సమ్యగ్దర్శనుండగు”.

(వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు అని నాలుగు వ్యూహములు - వీటిలో వాసుదేవుడు పరబ్రహ్మ. అతని రూపములే మిగిలిన మూడు వ్యూహములు - ఈ నాలుగు వ్యూహములు మూర్తములు. రూపము లేనటువంటి పరబ్రహ్మ యొక్క రూపములైన వాసుదేవ, ప్రద్యుమ్న,అనిరుద్ధ, సంకర్షణ రూపములలో మంత్ర మూలముగా నమస్కరించుచు యజ్ఞపురుషుడైన భగవంతుని పూజించవలెను).

Transliteration
  1. ākāramu kaladi; kaṭhinamainadi; dṛggōcaramainadī kaṃṭiki kanabaḍunadi; spaṣṭamaina rūpamu galadi.

  2. pṛdhivyaptējō bhūtatrayaṃ mūrtaṃ - (agni, jalamu, pṛdhivi bhūtamulu)

  3. kēcittu śrutimupalakṣaṇaṃ kṛtvā paṃcīkṛtāni bhūtāni mūrtāni.

(paṃcīkṛtamaina paṃcabhūtamulu ani koṃdaṟi abhiprāyamu - (śrutini baṭṭi),

(paṃca bhūtamulalōnu kaṃṭiki kanabaḍunavi ayina pṛdhivi, jalamu, agni rūpamu galavi - migilina reṃḍunu - vāyuvu, ākāśamu rūpamu lēnivi - kāni koṃdari abhiprāyamulō paṃcabhūtamulu paṃcīkaraṇamu cēyabaḍinavi - anagā, okadānitō okaṭi kalupabaḍinavi - aṃducēta agni = agni 1/2 + vāyuvu 1/8 + ākāśamu 1/8 + jalamu 1/8 + pṛdhivi 1/8. ā prakāramugānē okkokka bhūtamulō dāni vaṃtu sagamu. migilina nālugu bhūtamulu kalisi sagamu - ī prakāramugā paṃcīkaraṇamu cēyagā anni ayidu bhūtamulu sthūla bhūtamulu ayinavi, aṃducēta ayidu sthūlabhūtamulu mūrtamulē ani koṃdaṟi abhiprāyamu).

  1. “ghanarūpaṃ dhāraṇa samarthaṃ carācara lakṣaṇaṃ - śarīradhāraṇa samarthaṃ ityarthaḥ”. (śrīśaṃkaraḥ)

(kaṭhinamaina, sthūlamaina - (sūkṣmamukāni) rūpamunu dhariṃcu sāmarthyamu galadi - carācara lakṣaṇamu kaladi).

  1. “brahmaṇaḥ rūpaṃ kaṭhinaṃ paramātmanaḥ rūpaṃ vāyvaṃtarikṣa vyatiriktaṃ, pṛthivyaptējō lakṣaṇaṃ yadasti tattat kaṭhinatvēna mūrtaṃ. tathā mūrtatvēna uktaṃ ētadēva rūpaṃ vinaśvaratvāvyāpakatva cākṣuṣa pratyakṣōpalabhyatva rūpa dharmayuktatayā martyasthita saccabda vācyaṃ ityarthaḥ ||”.

(brahmayokka rūpamu kaṭhinamaina rūpamu - sthūlarūpamu - ākāśamu, vāyuvu sūkṣmamainavi, vīṭikaṃṭe vyatiriktamainadi, bhūmi, jalamu, agni kaṃṭiki kanabaḍunavi; ivi sthūlamulu - aṃducēta mūrtamulu naśiṃcuṭa, vyāpiṃcakuṃḍuṭa kaṃṭiki kanabaḍuṭacēta mūrtamu ani ceppabaḍucunnavi).

“vāyōśca aṃtarikṣācca bhūtadvayāt anyat - pariśēṣāt pṛdhivyādi bhūta trayaṃ ētanmartyaṃ. maraṇadharma bhūta trayasya rasaḥ sāraḥ savitā.

(ākāśamu vāyuvu anu reṃḍu bhūtamulakaṃṭe vērainavi, anagā, migilina bhūmi modalagu mūḍu bhūtamulu. ivi maraṇa dharmamulu kalavi (naśiṃcunavi). bhūmi, jalamu, agni anu mūḍu bhūtamula rasamu - sāramu - sūryuḍu - savitā = caitanya śaktiniccunadi).

  1. “āśrayaścētasō brahma dvidhā tacca svarūpatā |

yāmūrtama mūrtaṃca paraṃcāparamēva ca ||“.

(manassunaku āśrayamaina brahma reṃḍu vidhamulugā nunnadi - mūrttamu, amūrtamu - (rūpamu kaladi, rūpamu lēnidi; paramu, aparamu - rūpamu kaladi, rūpamu lēnidi; sākāramu, nirākāramu; paramu, aparamu. utkṛṣṭamainadi - parabrahma nirguṇa nirākāra brahma; reṃḍavadi aparabrahma saguṇabrahma, sākāra brahma - mūrti kaladi, mūrti lēnidi).

(prapaṃcamulōni vastuvulanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē kanuka avi anniyu atani rūpamulē, atani mūrtamulē (mūrtulē). bhagavaṃtuḍu agōcaruḍu kanuka nirākāra rūpamunu dhyāniṃcuṭa kaṣṭamu kanuka, atanu prapaṃcamulō dhariṃcina rūpamulanniyu dhyēyavastuvulē - vāṭilō dēnini dhyāniṃcinanu atanini (atani nirākāra, nirguṇa parabrahma rūpamunu dhyāniṃcinaṭlē. aṭṭi sthitilō modaṭa sṛṣṭisthiti saṃhā ramulu cēyuṭakoṟaku atanu dhariṃcina brahma. viṣṇu, mahēśvarulanu trimūrtulanu dhyāniṃcina utkṛṣṭamu - nirguṇa nirākāra brahma kāraṇabrahmamani, saguṇa sākāra brahma (trimūrtulu) modalaguvāru kāryabrahma yani ceppabaḍucunnāru).

  1. “mamayōnirmahadbrahma tasmin garbhaṃ dadāmyahaṃ |

saṃbhavaḥ sarvabhūtānāṃ tatō bhavati bhārata |

sarvayōniṣu kauṃteya mūrtayaḥ saṃbhavaṃti yāḥ |

tāsāṃ brahma mahadyōni haṃ bījapradaḥ pitā ||“. (śrīmadbhagavadgīta - 14 - 3, 4)

(mahadbrahma anagā caturmukhabrahma, lēka prakṛti. ī prakṛti nā yōni (prakṛtini nēnu yōnigā - garbhamu dhariṃcu dāninigā) upayōgiṃcukonucunnānu. ā prakṛti, lēka, mahattatvamunuṃḍi samasta bhūtamulu puṭṭucunnavi. iṭlē sṛṣṭilō vastuvulanniyu yēdō yoka yōninuṃḍi - mariyoka vastuvunuṃḍi - puṭṭucunnavi - kāraṇavastuvunuṃḍi puṭṭucunnavi. aṭlu kāraṇavastuvunuṃḍi puṭṭina - ē yōninuṃḍi puṭṭinavi ayinanu - avi kāryavastuvulu - avanniyu mūrtamulu - ākāramugalavi. vīṭi anniṃṭiki mahat brahma - caturmukhabrahma, lēka prakṛti - mahadyōni - mūlamaina yōni - anniṃṭini kannatalli vaṃṭidi. mūlamaina talli, vāṭi anniṃṭiki nēnu bījamuniccina taṃḍrini. aṃducēta prapaṃcamulōnunna rūpamulanniṃṭiki - mūrtamulanniṃṭiki - nēnu bījamu niccuṭavalana taṃḍrini, nā bījamunu dhariṃci, ārūpamulanu puṭṭiṃcuṭavalana - kanuṭavalana, prakṛti talli). (jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau).

  1. “namō bhagavatē tubhyaṃ vāsudēvāya dhīmahi |

pradyumnā nirudddhāya namaḥ saṃkarṣaṇāyaca |

itimūrtyābhidhānēna maṃtramūrtima mūrtikaṃ |

yajatē yajñapuruṣaṃ sa samyagdarśanaṃ pramān ||“. (śrīmadbhāgavataṃ -1 - 5 - 37,38)

“praṇava pūrvakaṃbuluga vāsudēva, pradyumna, saṃkarṣaṇāniruddha mūrti nāmaṃbulu nālugu bhaktiṃ baliki namaskāraṃbu sēsi, maṃtramūrtiyu, mūrtiśūnyuṃḍu nayina yajñapuruṣuṃ pūjiṃcu puruṣuṃḍu samyagdarśanuṃḍagu”.

(vāsudēvuḍu, pradyumnuḍu, aniruddhuḍu, saṃkarṣaṇuḍu ani nālugu vyūhamulu - vīṭilō vāsudēvuḍu parabrahma. atani rūpamulē migilina mūḍu vyūhamulu - ī nālugu vyūhamulu mūrtamulu. rūpamu lēnaṭuvaṃṭi parabrahma yokka rūpamulaina vāsudēva, pradyumna,aniruddha, saṃkarṣaṇa rūpamulalō maṃtra mūlamugā namaskariṃcucu yajñapuruṣuḍaina bhagavaṃtuni pūjiṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.