(రాజులుగానుండి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఋషులుగానుండువారు - జనకమహారాజు మొదలగువారు)
"రాజానః ఋషయశ్చ తే ప్రభుత్వే సతి సూక్ష్మార్థ నిరీక్షణ క్షమా నృపా ||". (గీతాభావప్రకాశము - 4 -13 -14)
ఐశ్వర్య సంపత్తీ రాజత్వం యేషాం తేషామేవ సూక్ష్మార్థనిరీక్షణ క్షమత్వం ఋషిత్వం (ఆనందగిరి)
(ఐశ్వర్యము కలిగియుండుట రాజత్వము; సూక్ష్మార్థములను చూచుటకు శక్తి కలిగియుండుట ఋషిత్వము - ఈ రెండును కలవారు రాజ ఋషులు).
(విస్తీర్ణమై అగాధమైన మనస్సు కలిగిన రాజులు అయి యుండి ఋషులు అగుటవలన ఇంద్రియశక్తికి మించిన వస్తువులను చూడగల శక్తి గలవారు).
యోగీశ్వర ప్రసాదంబువలన గృహస్థువై యుండియు బంధ నిర్ముక్తులై యాత్మజ్ఞానంబుకలిగి నిరంతర బ్రహ్మాను సంధానంబు సేయుచు నుండుదురు. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 -)
"రాజు ఆధ్యాత్మ విద్యయొక్క అనుభూతికలిగియుండినపుడు రాజర్షి యగును. రాజత్వము ఋషిత్వము రెండును గలవాడు రాజర్షి యగును".
"సీ. చిత్తంబు మధురిపు శ్రీపాదములయందు, పలుకులు హరిగుణ పఠనమందు
కరములు విష్ణుమందిరమార్జవములంద శ్రవములు మాధవ శ్రవణమంద
చూపులు గోవింద రూపరక్షణమంద, శిరము కేశవ నమస్కృతులయంద
పదము లీశ్వరగేహ పరిసర్పణములయంద, కామంబు చక్రి కైంకర్యమంద
తే. సంగమచ్యుత జన తను సంగమంద
ఘ్రాణము సురారి భక్తాంఘ్రి కమలమంద
రసన తులసీ దలములంద, రతులు పుణ్య
సంగతుల యంద యా రాజచందమునకు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 4 - 82)
(rājulugānuṃḍi, iṃdriya nigrahamu kaligina ṛṣulugānuṃḍuvāru - janakamahārāju modalaguvāru)
"rājānaḥ ṛṣayaśca tē prabhutvē sati sūkṣmārtha nirīkṣaṇa kṣamā nṛpā ||". (gītābhāvaprakāśamu - 4 -13 -14)
aiśvarya saṃpattī rājatvaṃ yēṣāṃ tēṣāmēva sūkṣmārthanirīkṣaṇa kṣamatvaṃ ṛṣitvaṃ (ānaṃdagiri)
(aiśvaryamu kaligiyuṃḍuṭa rājatvamu; sūkṣmārthamulanu cūcuṭaku śakti kaligiyuṃḍuṭa ṛṣitvamu - ī reṃḍunu kalavāru rāja ṛṣulu).
(vistīrṇamai agādhamaina manassu kaligina rājulu ayi yuṃḍi ṛṣulu aguṭavalana iṃdriyaśaktiki miṃcina vastuvulanu cūḍagala śakti galavāru).
yōgīśvara prasādaṃbuvalana gṛhasthuvai yuṃḍiyu baṃdha nirmuktulai yātmajñānaṃbukaligi niraṃtara brahmānu saṃdhānaṃbu sēyucu nuṃḍuduru. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 -)
"rāju ādhyātma vidyayokka anubhūtikaligiyuṃḍinapuḍu rājarṣi yagunu. rājatvamu ṛṣitvamu reṃḍunu galavāḍu rājarṣi yagunu".
"sī. cittaṃbu madhuripu śrīpādamulayaṃdu, palukulu hariguṇa paṭhanamaṃdu
karamulu viṣṇumaṃdiramārjavamulaṃda śravamulu mādhava śravaṇamaṃda
cūpulu gōviṃda rūparakṣaṇamaṃda, śiramu kēśava namaskṛtulayaṃda
padamu līśvaragēha parisarpaṇamulayaṃda, kāmaṃbu cakri kaiṃkaryamaṃda
tē. saṃgamacyuta jana tanu saṃgamaṃda
ghrāṇamu surāri bhaktāṃghri kamalamaṃda
rasana tulasī dalamulaṃda, ratulu puṇya
saṃgatula yaṃda yā rājacaṃdamunaku". (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 4 - 82)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.