← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజగుహ్యము rājaguhyamu

Original — తెలుగు
  1. "గుహ్యానాం రాజా, రాజ్ఞాంగుహ్యం, రాజానః హి విస్తీర్ణాగాధ మనసః, మహామనసః ఏవ గోపనీయ గోపన కుశలాః ఇతి తేషాం ఏవ గుహ్యం". (శ్రీమాన్ రామానుజః)

(రాజులకు గోపనీయమైనది, రాజులు రహస్యముగా నుంచతగినది. రాజులు అనగా విస్తీర్ణమైన అగాధమైన మనస్సు గలవారు. వారే రహస్యమును రహస్యముగా నుంచ తగినవారు).

  1. "రహస్యానాం సమస్తానాం రాజా గుహ్య శిరోమణిః |” (గీతాభావప్రకాసము - 9 - 17, 18)

(రహస్యముగా నుంచవలసిన విద్యలన్నింటిలోను ఇది అత్యంత రహస్యముగా నుంచవలసినది).

("గుహ్యానాం రాజా").

  1. రాజపదము శ్రేష్టత్వమును సూచించును - రాజ గుహ్యమనగా రహస్యములలో పరమ రహస్యమైనది.
Transliteration
  1. "guhyānāṃ rājā, rājñāṃguhyaṃ, rājānaḥ hi vistīrṇāgādha manasaḥ, mahāmanasaḥ ēva gōpanīya gōpana kuśalāḥ iti tēṣāṃ ēva guhyaṃ". (śrīmān rāmānujaḥ)

(rājulaku gōpanīyamainadi, rājulu rahasyamugā nuṃcataginadi. rājulu anagā vistīrṇamaina agādhamaina manassu galavāru. vārē rahasyamunu rahasyamugā nuṃca taginavāru).

  1. "rahasyānāṃ samastānāṃ rājā guhya śirōmaṇiḥ |” (gītābhāvaprakāsamu - 9 - 17, 18)

(rahasyamugā nuṃcavalasina vidyalanniṃṭilōnu idi atyaṃta rahasyamugā nuṃcavalasinadi).

("guhyānāṃ rājā").

  1. rājapadamu śrēṣṭatvamunu sūciṃcunu - rāja guhyamanagā rahasyamulalō parama rahasyamainadi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.