“రజస్తత్వంబులచే నుపబృమ్హితంబై వికారంబునొందిన మహత్తత్వంబు వలనం దమః ప్రథానంబై దివ్యజ్ఞానక్రియాత్మకంబగు నహంకారంబు గలిగె. అదియు రూపాంతరంబులొందుచు ద్రవ్యశక్తియైన రాజసంబును, గ్రియాశక్తియైన తామసంబును, జ్ఞానశక్తి అయిన సాత్వికంబును నన మూడు విధంబులయ్యె - - - తైజసంబయిన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంబైన శ్రవణేంద్రియంబును, వాయుదైవతంబైన త్వగింద్రియంబును, సూర్యదైవతంబైన నయనేంద్రియంబును, బ్రచేతో దైవతంబైన రసనేంద్రియంబును, నశ్వినీ దైవతంబైన ఘ్రాణేంద్రియంబును, వహ్ని దైవతంబైన వాగింద్రియంబును, నింద్రదైవతంబైన హస్తేంద్రియంబును, నుపేంద్రదైవతంబైన పాదేంద్రియంబును, మిత్రదైవతంబైన గుదేంద్రియంబును, బ్రజాపతి దైవతంబైన గుహ్యేంద్రియంబును, ననియెడి దశేంద్రియంబున్లును, బోధజనకాంతఃకరణైక భాగంబైన బుద్ధియు క్రియాజనకాంతః కరణంబైన బ్రాణంబునుం గలిగె.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 -)
“rajastatvaṃbulacē nupabṛmhitaṃbai vikāraṃbunoṃdina mahattatvaṃbu valanaṃ damaḥ prathānaṃbai divyajñānakriyātmakaṃbagu nahaṃkāraṃbu galige. adiyu rūpāṃtaraṃbuloṃducu dravyaśaktiyaina rājasaṃbunu, griyāśaktiyaina tāmasaṃbunu, jñānaśakti ayina sātvikaṃbunu nana mūḍu vidhaṃbulayye - - - taijasaṃbayina rājasāhaṃkāraṃbu valana digdaivataṃbaina śravaṇēṃdriyaṃbunu, vāyudaivataṃbaina tvagiṃdriyaṃbunu, sūryadaivataṃbaina nayanēṃdriyaṃbunu, bracētō daivataṃbaina rasanēṃdriyaṃbunu, naśvinī daivataṃbaina ghrāṇēṃdriyaṃbunu, vahni daivataṃbaina vāgiṃdriyaṃbunu, niṃdradaivataṃbaina hastēṃdriyaṃbunu, nupēṃdradaivataṃbaina pādēṃdriyaṃbunu, mitradaivataṃbaina gudēṃdriyaṃbunu, brajāpati daivataṃbaina guhyēṃdriyaṃbunu, naniyeḍi daśēṃdriyaṃbunlunu, bōdhajanakāṃtaḥkaraṇaika bhāgaṃbaina buddhiyu kriyājanakāṃtaḥ karaṇaṃbaina brāṇaṃbunuṃ galige.” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.