రక్షణ.
ఇష్ట ప్రాపణ పర్యంతా నిష్టా నివారణ లక్షణా రక్షా.
(ఇష్టమైన దానిని కలుగచేయువరకు అనిష్టములను నివారించు లక్షణముకలది రక్ష).
సా అన్య మన్యే పరా రక్షకో హి నస్త్యచ్యుతాశ్రయం ||".
(నిత్యము జనార్దనుని - శ్రీమహావిష్ణువును ఏకాగ్రచిత్తముతో ధ్యానింపవలెను. అదియే యీ జీవునకు పరమరక్ష - అచ్యుతుని ఆశ్రయించిన వానిని ఎవరును ఏమియు చేయలేరు).
రక్షితుడగు సమతజేసి రాయిడులందున్
రక్షణములు వేయి కలిగిన
శిక్షితుడగు ఖలుడు పాప చిత్తుండగుటన్". ( శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 277)
"శా. నేలం గూలినవాని పెన్నురముపై నిర్భీతి క్రీడించునో
బాలా రమ్మని మూపు జిమ్ముకొని సంస్పర్శించి యూరార్చుచున్
గోలాంగూలము ద్రిప్పి, గోవు రజమున్ గోమూత్రముం జల్లి త
ద్బాలాంగంబుల గోమయం బలది రా పండ్రెండు నామంబులన్".
వ. మఱియు నంతటం దనియక, గోపికలాచమనంబులు సేసి దక్షలయి మునుపుగా దమకు రక్షాకరంబగు బీజన్యాసంబు సేసికొని, "చిన్నియన్న నీ యడుగులజుండును, జానువుల నిలుండును, దొండలు యజ్ఞుండును, గటితలం బచ్యుతుండును, గడుపు హ యాస్యుండును, హృదయంబు గేశవుండును, నురమీశుండును, గంఠంబినుండును, భుజంబులు చతుర్ముఖుండును, ముఖంబు త్రివిక్రముండును, శిరంబీశ్వరుండును రక్షింతురు. ముందు చక్రియు, వెనుక గదాధరుండైన హరియు, బార్శ్వంబుల ధనుర్ధరుండైన మధు వైరియు, నసిధరుండగు నజనుండును, మీదుపేంద్రుండును, గ్రిందు తార్ క్ష్యుండును, నంతటకు హలధరుండగు పురుషుండును గాతురు - నీ ఇంద్రియంబుల హృషీకేశుండును, బ్రాణంబుల నారాయణుండును, జిత్తంబును శ్వేతద్వీప పతియును, మనంబును యోగీశ్వరుండైన కపిలుండును, బుద్ధిని బృశ్నిగర్భుండును, నహంకారంబును భగవంతుడైన నరుండును, బాలనంబు సేయుదురు - నీవు క్రీడించునెడ గోవిందుడును, శయనించుతఱి మాధవుండును, నడచువేళ వైకుంఠుడును, గూర్చున్న సమయంబున శ్రీపతియును, గుడుచు కాలంబున సర్వగ్రహ భయంకరుడైన యజ్ఞభుజుండును నేమఱకుండుదురు -నిన్ను చేర్కొనిన దుస్స్వప్న వృద్ధ, బాలగ్రహంబులును, గూశ్మాండ, ఢాకినీ యాతుదానులును, భూత ప్రేత యక్ష రాక్షస పిశాచ వినాయకులును, గోటరా దేవతులును, జ్యేష్టా పూతనలును, మాతృకాది గణంబులును, నశింతురు. నీయందు బ్రాణేంద్రియశ్రీర నిరోధంబులయిన యున్మాదంబులును, నపస్మారంబులును, మహోత్పాతంబులును బొందకుండుం గావు తమని రక్షసేసి దీవించిరి".
( శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 235, 236)
శ్రీమదాంధ్రమహాభాగవతములోని శ్రీమన్నారయణ కవచముకూడ నొకవిధమగు రక్షయే,
"నామ్మైవ భావ్యం ఖలు సర్వ ర్క్షణం |
మాయావినో విశ్వకుటుంబినస్తే |
స్థలేషు దుర్గేషు కేషు |
గర్భేష్చరణ్యేషు చ కైతవేషు ||". (శ్రీవేంకటేశమాహత్మ్యము - 4 - 49)
(అన్నిచోట్లను, దుర్గములందును - ఎవరును చేరరాని చోట్లందును -, జలప్రదేశములందును - నదులందు, సముద్రము మొదలగు వాటియందు, ఆకాశములోను, గర్భములందు, అరణ్యములందు మాయావియును, లోకమే కుటుంబముగా గలవాడవును, అయిన నీ యొక్క నామమే రక్షణ).
స్థలేషు మాయావటువామనో(అ)స్యాత్ |
త్రివిక్రమః ఖే అవతు విశ్వరూపః |
దుర్గేషట వ్యాజి మఖాధిషు ప్రభుః |
పాయానృసింహా(అ)సుర యూధపారిః ||".
(జలమందు మత్స్యావతారుడు, భూమిమీద మాయావటువు అయిన వామనావతారుడు, ఆకాశమందు విశ్వరూపుడు, రాక్షససైన్యమునుండి శ్రీనృసింహుడు నన్ను రక్షించుగాక).
rakṣaṇa.
iṣṭa prāpaṇa paryaṃtā niṣṭā nivāraṇa lakṣaṇā rakṣā.
(iṣṭamaina dānini kalugacēyuvaraku aniṣṭamulanu nivāriṃcu lakṣaṇamukaladi rakṣa).
sā anya manyē parā rakṣakō hi nastyacyutāśrayaṃ ||".
(nityamu janārdanuni - śrīmahāviṣṇuvunu ēkāgracittamutō dhyāniṃpavalenu. adiyē yī jīvunaku paramarakṣa - acyutuni āśrayiṃcina vānini evarunu ēmiyu cēyalēru).
rakṣituḍagu samatajēsi rāyiḍulaṃdun
rakṣaṇamulu vēyi kaligina
śikṣituḍagu khaluḍu pāpa cittuṃḍaguṭan". ( śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 277)
"śā. nēlaṃ gūlinavāni pennuramupai nirbhīti krīḍiṃcunō
bālā rammani mūpu jimmukoni saṃsparśiṃci yūrārcucun
gōlāṃgūlamu drippi, gōvu rajamun gōmūtramuṃ jalli ta
dbālāṃgaṃbula gōmayaṃ baladi rā paṃḍreṃḍu nāmaṃbulan".
va. maṟiyu naṃtaṭaṃ daniyaka, gōpikalācamanaṃbulu sēsi dakṣalayi munupugā damaku rakṣākaraṃbagu bījanyāsaṃbu sēsikoni, "cinniyanna nī yaḍugulajuṃḍunu, jānuvula niluṃḍunu, doṃḍalu yajñuṃḍunu, gaṭitalaṃ bacyutuṃḍunu, gaḍupu ha yāsyuṃḍunu, hṛdayaṃbu gēśavuṃḍunu, nuramīśuṃḍunu, gaṃṭhaṃbinuṃḍunu, bhujaṃbulu caturmukhuṃḍunu, mukhaṃbu trivikramuṃḍunu, śiraṃbīśvaruṃḍunu rakṣiṃturu. muṃdu cakriyu, venuka gadādharuṃḍaina hariyu, bārśvaṃbula dhanurdharuṃḍaina madhu vairiyu, nasidharuṃḍagu najanuṃḍunu, mīdupēṃdruṃḍunu, griṃdu tār kṣyuṃḍunu, naṃtaṭaku haladharuṃḍagu puruṣuṃḍunu gāturu - nī iṃdriyaṃbula hṛṣīkēśuṃḍunu, brāṇaṃbula nārāyaṇuṃḍunu, jittaṃbunu śvētadvīpa patiyunu, manaṃbunu yōgīśvaruṃḍaina kapiluṃḍunu, buddhini bṛśnigarbhuṃḍunu, nahaṃkāraṃbunu bhagavaṃtuḍaina naruṃḍunu, bālanaṃbu sēyuduru - nīvu krīḍiṃcuneḍa gōviṃduḍunu, śayaniṃcutaṟi mādhavuṃḍunu, naḍacuvēḷa vaikuṃṭhuḍunu, gūrcunna samayaṃbuna śrīpatiyunu, guḍucu kālaṃbuna sarvagraha bhayaṃkaruḍaina yajñabhujuṃḍunu nēmaṟakuṃḍuduru -ninnu cērkonina dussvapna vṛddha, bālagrahaṃbulunu, gūśmāṃḍa, ḍhākinī yātudānulunu, bhūta prēta yakṣa rākṣasa piśāca vināyakulunu, gōṭarā dēvatulunu, jyēṣṭā pūtanalunu, mātṛkādi gaṇaṃbulunu, naśiṃturu. nīyaṃdu brāṇēṃdriyaśrīra nirōdhaṃbulayina yunmādaṃbulunu, napasmāraṃbulunu, mahōtpātaṃbulunu boṃdakuṃḍuṃ gāvu tamani rakṣasēsi dīviṃciri".
( śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 235, 236)
śrīmadāṃdhramahābhāgavatamulōni śrīmannārayaṇa kavacamukūḍa nokavidhamagu rakṣayē,
"nāmmaiva bhāvyaṃ khalu sarva rkṣaṇaṃ |
māyāvinō viśvakuṭuṃbinastē |
sthalēṣu durgēṣu kēṣu |
garbhēṣcaraṇyēṣu ca kaitavēṣu ||". (śrīvēṃkaṭēśamāhatmyamu - 4 - 49)
(annicōṭlanu, durgamulaṃdunu - evarunu cērarāni cōṭlaṃdunu -, jalapradēśamulaṃdunu - nadulaṃdu, samudramu modalagu vāṭiyaṃdu, ākāśamulōnu, garbhamulaṃdu, araṇyamulaṃdu māyāviyunu, lōkamē kuṭuṃbamugā galavāḍavunu, ayina nī yokka nāmamē rakṣaṇa).
sthalēṣu māyāvaṭuvāmanō(a)syāt |
trivikramaḥ khē avatu viśvarūpaḥ |
durgēṣaṭa vyāji makhādhiṣu prabhuḥ |
pāyānṛsiṃhā(a)sura yūdhapāriḥ ||".
(jalamaṃdu matsyāvatāruḍu, bhūmimīda māyāvaṭuvu ayina vāmanāvatāruḍu, ākāśamaṃdu viśvarūpuḍu, rākṣasasainyamunuṃḍi śrīnṛsiṃhuḍu nannu rakṣiṃcugāka).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.