← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రామానుజమతం rāmānujamataṃ

Original — తెలుగు

శ్లో. “నిత్యం హేయ గుణావదూననపరా నైర్గుణ్య వాదా శ్రుతౌ |

ముఖ్యార్థాః సగుణోక్తయః శుభగుణ ప్రఖ్యాపనాద్ బ్రహ్మణః |

అద్వైతశ్రుతయే విశిష్ట విషయా నిష్కృష్ట రూపాశ్రయాః |

భేదోక్తిస్తదిహఖిల శ్రుతిహితం రామానుజేయం మతం ||” (విశ్వగుణాదర్శిచం పూః - వేంకటాధ్వరి)

“యేశ్రుతౌ ఈశ్వరస్య నిర్గుణత్వ భోధకాని వాక్యాని -” అనాది మధ్యాంత విహీనమేకం సద్రూప మస్యేహ తధోపలభ్యతే- ఇత్యాదీని హేయగుణానాం వినాశ ప్రతిపాదకాః సంతి. తథా, సగుణోక్తయః - “సర్వతః పాణిపాదం, తత్ సర్వతో(అ)క్షి శిరోముఖం”, “సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్” ఇత్యాదయః సంతి. తాః బ్రహ్మణః శుభగుణానాం లోకవిలక్షణ సృష్టి స్థితి లయ కర్తృత్వాదీనాం ప్రసిద్ధకరణాత్ ముఖ్యార్థాః శక్యార్థ ప్రతిభోధకాః అద్వైత శ్రుతయః “తత్వమసి” “అయమాత్మాబ్రహ్మ”, “అహం బ్రహ్మస్మి” ఇత్యాదయః జీవాత్మ పరమాత్మనోః అభేద ప్రతిపాదనపరాః. రామానుజమతం అఖిలానాం శృతీనాం హితం, సర్వ భేద నిరాకరణేన ఏకవాకృతా కరణాత్

(శ్రీమాన్ రామానుజలవారి మతము విశిష్టాద్వైతము - అద్వైతమును ఒప్పుకొని, విశిష్టాద్వైతమని విశేషము చెప్పిరి. భగవంతుడు అద్వయుడేగాని రెండురూపములున్నవాడు - నిర్గుణరూపము, సగుణరూపము అని చెప్పిరి. హేయ గుణములు లేనందువలన నిర్గుణపరబ్రహ్మము అని, కల్యాణగుణములు కలిగియుండుటవలన సగుణబ్రహ్మ అని బ్రహ్మకు రెండురూపములు కలవు. శ్రుతులు ఈ రెండురూపములను చెప్పుచున్నవి - ఆదిమధ్యాంతములు లేనివాడు అను మొదలగు శ్రుతి వాక్యములు నిర్గుణపరబ్రహ్మగుఱించి బోధించునవి - “అన్నింటిలోను చేతులు కాళ్ళు - అవయవములుగలవాడుగాను, వేలకొలది శిరస్సులు, వేలకొలది కండ్లు, పాదములు కలవాడుగాను సగుణబ్రహ్మపరమైన శ్రుతివాక్యములున్నవి. లోకములకు సృష్టిస్థితి లయములు చేయువాడుగను చెప్పచున్నవి.”ఆ పరబ్రహ్మ నీవే” అని “ఈ ఆత్మయే పరబ్రహ్మ” అనిన్నీ “నేనే బ్రహ్మను అయితిని” అనునవి అద్వైతశ్రుతులు - ఈ రండు విధముల శ్రుతులలోనున్నవి. అందుచేత శ్రీరామానుజులవారి మతము శ్రుతులన్నింటితోను ఏకీభవించినది - జీవాత్మలకు భేదములేదని శ్రుతులు ఏకీభవించినవి - కేవల అద్వైతము అవలంభించుటలో కష్టమున్నది. ఇప్పుడు సర్వసాధారణముగా విశిష్టాద్వైతమునే - సగుణబ్రహ్మోపాసనమే అవలంభించియున్నారు - ప్రతీకోపాసన ఆచరణలో కష్టములేనిది. అందుచేత సర్వాచరణీయమైయున్నది -

Transliteration

ślō. “nityaṃ hēya guṇāvadūnanaparā nairguṇya vādā śrutau |

mukhyārthāḥ saguṇōktayaḥ śubhaguṇa prakhyāpanād brahmaṇaḥ |

advaitaśrutayē viśiṣṭa viṣayā niṣkṛṣṭa rūpāśrayāḥ |

bhēdōktistadihakhila śrutihitaṃ rāmānujēyaṃ mataṃ ||” (viśvaguṇādarśicaṃ pūḥ - vēṃkaṭādhvari)

“yēśrutau īśvarasya nirguṇatva bhōdhakāni vākyāni -” anādi madhyāṃta vihīnamēkaṃ sadrūpa masyēha tadhōpalabhyatē- ityādīni hēyaguṇānāṃ vināśa pratipādakāḥ saṃti. tathā, saguṇōktayaḥ - “sarvataḥ pāṇipādaṃ, tat sarvatō(a)kṣi śirōmukhaṃ”, “sahasra śīrṣā puruṣaḥ sahasrākṣaḥ sahasrapāt” ityādayaḥ saṃti. tāḥ brahmaṇaḥ śubhaguṇānāṃ lōkavilakṣaṇa sṛṣṭi sthiti laya kartṛtvādīnāṃ prasiddhakaraṇāt mukhyārthāḥ śakyārtha pratibhōdhakāḥ advaita śrutayaḥ “tatvamasi” “ayamātmābrahma”, “ahaṃ brahmasmi” ityādayaḥ jīvātma paramātmanōḥ abhēda pratipādanaparāḥ. rāmānujamataṃ akhilānāṃ śṛtīnāṃ hitaṃ, sarva bhēda nirākaraṇēna ēkavākṛtā karaṇāt

(śrīmān rāmānujalavāri matamu viśiṣṭādvaitamu - advaitamunu oppukoni, viśiṣṭādvaitamani viśēṣamu ceppiri. bhagavaṃtuḍu advayuḍēgāni reṃḍurūpamulunnavāḍu - nirguṇarūpamu, saguṇarūpamu ani ceppiri. hēya guṇamulu lēnaṃduvalana nirguṇaparabrahmamu ani, kalyāṇaguṇamulu kaligiyuṃḍuṭavalana saguṇabrahma ani brahmaku reṃḍurūpamulu kalavu. śrutulu ī reṃḍurūpamulanu ceppucunnavi - ādimadhyāṃtamulu lēnivāḍu anu modalagu śruti vākyamulu nirguṇaparabrahmaguṟiṃci bōdhiṃcunavi - “anniṃṭilōnu cētulu kāḷḷu - avayavamulugalavāḍugānu, vēlakoladi śirassulu, vēlakoladi kaṃḍlu, pādamulu kalavāḍugānu saguṇabrahmaparamaina śrutivākyamulunnavi. lōkamulaku sṛṣṭisthiti layamulu cēyuvāḍuganu ceppacunnavi.”ā parabrahma nīvē” ani “ī ātmayē parabrahma” aninnī “nēnē brahmanu ayitini” anunavi advaitaśrutulu - ī raṃḍu vidhamula śrutulalōnunnavi. aṃducēta śrīrāmānujulavāri matamu śrutulanniṃṭitōnu ēkībhaviṃcinadi - jīvātmalaku bhēdamulēdani śrutulu ēkībhaviṃcinavi - kēvala advaitamu avalaṃbhiṃcuṭalō kaṣṭamunnadi. ippuḍu sarvasādhāraṇamugā viśiṣṭādvaitamunē - saguṇabrahmōpāsanamē avalaṃbhiṃciyunnāru - pratīkōpāsana ācaraṇalō kaṣṭamulēnidi. aṃducēta sarvācaraṇīyamaiyunnadi -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.